Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 052 (Disparate views on Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)


యోహాను 7:37-38
37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

పండుగ దినమందు యేసు మరల దేవాలయములో బోధించుట ప్రారంభించెను. వారు యాజకుడు వచ్చి బలిపీఠము పైన నీరు పోయుటకు ఎదురుచూసిరి. అప్పుడు యాజకుడు వచ్చి సంతోషముగా ఆ బలిపీఠము పైన దేవుని ఎదుట నీరు పోసి. దేవునికి కృతజ్ఞత చెప్పి , వారు మరి సంవత్సరమున దేవుని ఆశీర్వాదములను పొందుటకు ఆశకలిగి ఉండిరి. వారు ఈ పద్దతిని యెషయా మాదిరి కలిగి ఉండిరి, " వారు రక్షణ నుంచి ఆనందకరమైన నీటిని తోడుకొనెదరు."

యేసు రక్షణను గూర్చిన దాహము కలిగిన ప్రాణములను చూసి. వారిని బట్టి, " నా దగ్గరకు వచ్చి జీవమును ఇచ్చు నీటిని త్రాగుడి. దాహము కలిగిన ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిత్యజీవపు నీటిని త్రాగుడి ."

ఎవరైతే నిత్యజీవమును అవసరము లేదని చెప్పెదరో వారు యేసు దగ్గరకు రారు. అయితే యేసు దగ్గరకు వచ్చువారికి అతను ఈ విధముగా చెప్పెను, " ఎవరతే నా యందు విససముంచి నాతో సహవాసము కలిగి ఉంటారో వారు ఇతరులకు ఆశీర్వాదము కలిగి ఉంటారు. వాక్యము చెప్పినట్లు నా యందు విశ్వాసము కలిగి ఉండు, మరియు దేవుడు కూడా నా దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించి నా యందు ఆనందకరమైన జీవితము పూనుకో అని చెప్పెను. " ఎవరైతే యేసు దగ్గరకు వచ్చి అతని వాక్యములను విని అతని ఆత్మను పొందుకుంటారో వారు సంపూణముగా మార్చబడుతారు. దాహముగొను వాడు నీతూ ఊతగా మారును; చెడ్డ వాడు నమ్మకమైన సేవకుడిగా మారును.

నీవు క్రీస్తు సంరక్షణను అనుభవించావా ? అతను నిన్ను స్వచ్ఛమైన జలముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక నీ హృదయమునుండి చేదు ఆలోచనలను తీసివేసి, క్రీస్తు యేసు యొక్క హృదయము కలిగి అనేకులకు ఆశీర్వాదము ఇచ్చు వాడుగా జీవించు.

యేసు ఉద్దేశము కేవలము నే మనసు మరియు ప్రాణము మాత్రమే మార్చబడాలని కాదు అయితే నీ శరీరము కూడా మార్చబడాలని ఉద్దేశించువాడుగా ఉన్నాడు. అప్పుడు నీవు జీవము కలిగిన త్యాగమునైన దేవుని బిడ్డగా ఉండీ నశించిన వారిని రక్షించాలాగున ఉండు. నీవు నీకొరకు జీవించువాడుగా ఉండక నీ శక్తిని ఇతరుల కొరకు ఉపయోగించునట్లు ఉండుము. ఎవరైతే నియమములు లేక యేసుదగ్గరకు వస్తారో వారు అనేకులకు ఆశీర్వాదముగా ఉండెదరు.

యోహాను 7:39
39 తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

ఎవరైతే యేసును విశ్వసిస్తారో వారు పరిశుద్దాత్మ యొక్క బహుమానములను పొందుకుంటారు. ఈ కాలములో పరిశుద్దాత్మ వచ్చునది ఒక అద్భుతముగా ఉన్నది. మరియు మనము ఇంకా పరిశుద్దాత్మ సమయములోనే జీవిస్తున్నాము, అతను దూత మాత్రమే కాదు అయితే దేవుని కుమారుడై సంపూర్ణ ప్రేమ కలిగి ఉన్నాడు. ఆత్మ అనునది ఒక శక్తివంతమైన విద్యుత్తూ మాదిరిగా ఉన్నది. అదేవిధముగా అతను ఒక గొప్ప జాలికలిగిన వాడుగా కూడా ఉన్నాడు. ప్రతి నమ్మకమైన క్రైస్తవుడు దేవుని ఆలయమై ఉంటాడు.

ఈ విధమైన ఆత్మా యేసు ఉన్న సమయములో వచ్చేది కాదు. ఎందుకంటె పాపములు మనిషిని దేవుని నుంచి వేరుపరచెను కనుక. పాపములు ఒక పర్వతములుగా ఉండీ ఆత్మకు అడ్డుగా ఉండెను. అయితే క్రీస్తు మనకొరకు వచ్చి మృతిపొంది పునరుత్థానుడై తిరిగిలేచి తన తండ్రి కుడిపార్శ్యమున కూర్చుంది మనకొరకు తన పరిశుద్ధాత్మను పంపిన తరువాత మనమందరము కూడా క్రీస్తు ప్రేమలో ఐక్యముకలిగి ఉండుటకు తండ్రి అందరి పట్ల తన ఆత్మను కుమ్మరించెను. దేవుడు ఆత్మ గనుక అన్ని చోట్ల ఉండువాడుగా ఉన్నాడు. అతను ఏ విశ్వాసి అయితే తన పాపములను ఒప్పుకొని తన నుంచి క్షమాపను పందికొనిఉంటాడో వారిలో కూడా ఉండును. కనుక సహోదరుడా నీవు యేసు ఆత్మను పందికొని ఉన్నావా ? క్రీస్తు శక్తి నీ మీదకు వచ్చియున్నదా ? యేసు దగ్గరకు రా. " ఎవరైతే తన దగ్గరకు వచ్చి, అతనిని విశాసించి ఉంటారో వారు ఎన్నటికీ దాహముకలిగి ఉండరు. " కనుక ఎవరైతే విశ్వసిస్తారో వాక్యము చెప్పినట్లు, అతని కడుపు నుంచి ఇతరుల కొరకు జీవజలము పొర్లును.

యోహాను 7:40-44
40 జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; 41 మరికొందరుఈయన క్రీస్తే అనిరి;మరికొందరుఏమి?క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? 42 క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 43 కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. 44 వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.

వింటున్న కొందరు యేసు మాటలలో సత్యమును గ్రహించి, ఆ శక్తికి తమను సమర్పించుకొనిరి. వారు బహిరంగముగానే అతను ప్రవక్త అని నమ్మి, దేవుని చిత్తము యేసు ద్వారా మనిషికి వచ్చినదని హృదయమందు తెలుసుకొనిరి. మోషే ద్వారా చెప్పబడినట్లు ఇతను అభిషేకించబడిన ప్రవక అని పాత నిబంధనలో విజయమును దయచేసి దేవునితో సహవాసము కలిగి ఉన్నాడని అంగీకరించిరి. ఈ విధముగా అక్కడున్న వారు ధైర్యముగా ఈయనే నజరేయుడైన వాగ్దాన మెస్సయ్య అని తమను యేసుకు సమర్పించుకొనిరి.

ఏదేమైనా అక్కడున్న వారు దృఢముగా, " లేడు, ఇతను నజరేతు నుంచి వచ్చాడు, అయితే మెస్సయ్య దావీదు పట్టణము నుంచి మరియు అతని సంతతి నుంచి వచ్చును . " ఈ వాక్యము నిజమైయున్నది అనిరి. అయితే యేసు బేత్లెహేములో జన్మిచాడని వారికి ఎందుకు చెప్పలేదు ? అయితే దీనికి సంబంధించి కొన్ని కారణాలు ఉన్నాయి : మొదటిది , హేరోదు యొక్క కుటుంబము క్రొత్త రాజును వారి అధికారమునుంచి ఒప్పుకోడు. వారు కొన్ని పదుల వేలమందిని అధికారము కొరకు చంపాలి. రెండవది, యేసుకు పరీక్ష ద్వారా మనుషులను గెలవాలని అనుకొనలేదు. అయితే వారి జీవితములు ప్రేమ ద్వారా మార్చబడి వారు విశ్వాసము కలిగి ఉండాలని ఉద్దేశించెను. కనుకనే అతను తనను చూడక అంమ్మినవారికి సమీపముగా వచ్చినాడు.

అక్కడున్న వారికి ఇది అర్థము కాలేదు, కనుక వారు గుంపులుగా చేయబడిరి. వారిలో కొందరు ఈయనను మెస్సయ్య అని మరికొందరు కాదు అని చెప్పిరి. అయితే అక్కడ ఉన్న దేవాలయపు దగ్గర యేసును పట్టుకొనుటకు కొందరు ఎదురుచూస్తున్నారు; అయితే అతని శక్తి కలిగిన మాటలను బట్టి అతని దగ్గరకు వారు రాలేకపోయిరి.

ప్రార్థన: ప్రభువా నీ ప్రేమను బట్టి నీ ఘనతను బట్టి మేము నిన్ను ఘనపరచుచున్నాము. నీవు జీవమార్గమునకు మార్గము. విశ్వాసము ద్వారా నీవు మాతో బంధము కలిగి ఉన్నావు. నీ ఆత్మను మా మీదికి కుమ్మరించి ఉన్నావు. మేము నిత్యమూ నిలిచునట్లు నీ రక్తముద్వారా మమ్ములను కడిగినందుకు నీకు కృతఙ్ఞతలు.

ప్రశ్న:

  1. "మీలో ఎవరైనా దాహము కలిగి ఉంటె అతను నాదగ్గకు రావాలి " అని ఎందుకు చెప్పెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:07 AM | powered by PmWiki (pmwiki-2.3.3)