Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 035 (God works with His Son)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

2. దేవుడు తన కుమారునియందు కార్యము చేయును (యోహాను 5:17-20)


యోహాను 5:17-18
17 అయితే యేసునాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు,నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక,దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

బేతెస్థ దగ్గర జరిగిన స్వస్థతను వ్యతిరేకస్తులు యేసును ఒకచిన్నదిగా యెంచినారు. అయితే ఇది జరిగిన తరువాత అతని శత్రువులు తనను చంపడానికి ప్రయత్నించారు. అయితే అద్భుతము అప్పుడు ఒక అవకాశముగా యూదులకు సంబంధముకలిగి ఉండెను. అప్పుడు క్రీస్తు శ్రమపొంది వారి యెడల వ్యతిరేకమైన వాడుగా ఉండెను. ఇది జరుగుటకు గల కారణము ఏమిటి?

అక్కడ క్రీస్తు ప్రేమకు మరియు ధర్మశాస్త్రమునకు ఒక చిన్న ఎదురు జరిగినది. పాత నిబందహన కాలములో ప్రజలు బందీలుగా ఉన్నట్లు జీవించిరి. వారికి ఎన్నో విధములైన తీర్పులు చేసి వారి మంచి కార్యములకు నీతికలిగి ఉన్నట్లుగా చేసిరి. భక్తిపరులు వారి దోషములను బట్టి జాగ్రత్తకలిగి ఉండలేదు, అయితే ధర్మశాస్త్రము వారికి ప్రేమకలిగి ఉండెను. ఎందుకంటె దేశము దేవునితో నిబంధనకలిగి ఉండెను కనుక. అయితే ఎక్కడున్నా అనేకులు వాటికి ఉన్న రూల్స్ ని పాటించువారైరి. ఎక్కువగా సబ్బాతు టబూ వారి ముఖ్య పనియై ఉండెను. దేవుడు తన సృష్టిలో ఎదవా దినమున విశ్రాంతి పొందియున్నారు కనుక అందరు కూడా ఆ దినమున ఏ పని చేయకూడదని దేవునికి మాత్రమే ఆరాధన చేయుటకు ఆ దినమును ఉపయోగించాలని చెప్పెను లేనిచో అది ఒక మరణమునకరమైనదిగా ఎంచెను.

కనుక సబ్బాతు అనునది యూదులకు దేవునికి ఒక సూచనగా కనబడెను. ఎందుకంటె వారు దీని ద్వారా దేవుని సన్నిధిని పండుకొని పాపము చేయక అందరు దేవునితో మంచి సంబంధము కలిగి ఉండుటకు వారిని ప్రోత్సహించెను.

సబ్బాతు గురించి పరిసయ్యలకు ఉన్న వ్యతిరేకతను యేసు సమాధానము చెప్పెను. 'దేవుడు కార్యము చేయును" అనునది "పని" అనేది ఏడుమారులు పనిచేయుట అని యేసు తన మాటలలో పరిసయ్యలకు చెప్పాడు. ఇది దేవుని ప్రేమతో చేసే కార్యము. అయితే దేవుడు ఇప్పటివరకు తన పనిని ఏవిధముగా సృష్టించి కార్యము చేయగలడు ? పాపము ఈ లోకములోనికి ప్రవేశించెను కనుక మరణము అందరికి వచ్చినది. అయితే దేవుడు వ్యతిరేకస్తులను, బండలాంటి హృదయము కలిగిన వారిని తిరిగి రాప్ప్పించి వారు నిజమైన ఆరాధన చేసేవారిగా మార్చెను.

సబ్బాతు దినమందు దేవుని స్వస్థత అనునది దేవుని కార్యమునకు ఒక సాదృశ్యమై ఉన్నది. క్రీస్తు కృపను గూర్చి ప్రకటించి ప్రేమ కలిగిన కారయములను చేసెను, ఆయన కార్యం ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా కనబడినను ఆయన కార్యములు ప్రేమతో కృపలో జరిగెను. సబ్బాతు దినమందు చేసిన కార్యము ప్రేమతో చేసినది.

అప్పుడు యూదులు ,"యేసు సబ్బాతును వ్యతిరేకిస్తున్నారు! సహాయము చేయండి! నిబంధన గోడలు కదులుతున్నాయి. ధర్మశాస్త్ర శత్రువు వెక్కిరించబడుతున్నాడు,తనకు తానూ క్రొత్త ధర్మశాస్త్రమును ఇచ్చి మన దేశమునకు అపాయము తెచ్చును".

అక్కడున్న ఎవ్వరు కూడా యేసు ప్రేమకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అలాగే అయన విజయమును కూడా చూడలేదు.అయితే వారు గ్రుడ్డితనములోనే ఉండిరి. ఈ దినాలలో క్రీస్తును ఒక రక్షకునిగా తెలుసుకోలేకపోతే.

యూదులు యేసును వ్యతిరేకించిరి,ఎందుకంటె దేవుడు తన తండ్రి అని ఆటను చెప్పుకొనుట వారికి ఇష్టము లేకపోయెను. ఇది వారికి మంచిగా అనిపియ్యలేదు . అందుకే వారు, " దేవుడు ఒక్కడే ; అతనికి కుమారులు లేరు. కనుక యేసు దేవుడిని తండ్రి అని ఎలా పిలువగలడు ?

వారు అక్కడ ఆత్మీయసారముగా జీవించలేడు,లేదా వాక్యానుసారముగా జీవించలేదు. ఎందుకంటె వారిలో పితృత్వమును బట్టి అబద్దమైన ప్రవచనములు కలిగి ఉన్నారు. దేవుడు తన నిబంధన ద్వారా "నా కుమారుడా" అని పిలిచాడు, (నిర్గమ 4:22; హోసయ 11:1). అయితే దేశములు ఆయనను "తండ్రి" అని పిలుచుచున్నారు (ద్వితీయోప 32:6; కీర్త 103:13; యెషయా 63:16; జెర్మాయ 3:4, 19; మరియు 31:9). దేవుడు తాను నమ్మిన రాజును" నా కుమారుడు" (2 సాము 7:14). అయితే వ్యక్తిగతముగా దేవునితో నిబంధన కలిగిన వారు "తండ్రి" అని పిలువలేరు. ఇది యూదుల మసస్సుకు అసాధ్యముగా ఉన్నది. అయితే యూదులకు వాగ్దానము చేసినట్లు యేసు, మెస్సయ్య నిజమైన వాడు అని. నిత్యజీవమును తెచ్చువాడని. కనుక వారి యొక్క ద్వేషము యేసు పట్ల మెస్సయ్యనుగూర్చిన అప నమ్మకముగా ఉన్నది.

యేసు వారితో మాట్లాడుతో నేను నా తండ్రి ఏదైతే చేయగలడో దానినే నేను కూడా ప్రేమతో చేస్తాను అని. మరియి అతను అన్ని కార్యాలు చేయుటకు సమర్థుడు అని మరియి ఆయన దేవునితో సమానమని చెప్పెను. అయితే ఈ మాటలు యూదులకు రుచించలేదు. ఎవరైతే దేవుని ఉన్నతిని సమానముగా ఎంచుకొంటే వారు దూరము చేయబడతారు. అందుకే యూదులు యేసును ద్వేషించారు.

యోహాను 5:19-20
19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు;ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. 20 తండ్రి,కుమారుని ప్రేమించుచు,తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.

యేసు వారికి ప్రేమతో సమాధానము చెప్పెను, మరియు వారి ద్వేషమును దేవుని ప్రేమచేత చేయబడిన కార్యము ద్వారా చూపించెను. అవును తండ్రి ఏమి చేయగలడో కుమారుడు కూడా చేయగలడు. యేసు తన పనిని దేవుని ఆజ్ఞలేనిదే చేయదు ఎందుకంటె అతను దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడు కాబట్టి, పిల్లలు తమ తండ్రితో ఏవిధమైన సంబంధము కలిగి ఉంటారో ఆలాగుననే క్రీస్తు కూడా తన తండ్రితో సంబంధము కలిగి ఉన్నాడు. తండ్రి ఏదైతే ఆఙ్ఞాపించాడో దానినే క్రీస్తు చేసుకు కనుక తండ్రి తన కుమారుడు చేసిన పనిని చూచి సంతోషించెను. అందుకే క్రీస్తు తన తండ్రికి లోబడి ఆయనను మహిమపరచెను. కనుక మనము కూడా క్రీస్తు లాగ మన పితరులకు లోబడి యేసుకు నిజమైన సేవకులుగా ఉండాలి.

యేసు తన తగ్గింపును బట్టి తన కార్యములను ఒక అధికారముచేత చేసియున్నాడు. కనుక తండ్రి చేసిన ప్రతి కార్యము కూడా యేసుకు కూడా సంబంధముగా ఉండెను. అతను నిజమైన దేవుడు,నిత్యమైన వాడు, సమర్థుడు, ప్రేమకలిగిన వాడు మరియు మహిమకలిగిన వాడు. దేవునితో అతని బంధము సంపూర్ణమైనది.

తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ప్రేమించి అయన నుంచి ఏదియు దాచిపెట్టలేదు. అతని ప్రణాళికలు అధికారములు తన కుమారునితో పంచుకొనెను. కనుక మనము ఇందులో త్రిత్వము యొక్క ఏకత్వమును చాల క్లుప్తముగా చూడగలము. వారి ఐక్యత ప్రేమతో ఉన్నది. తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలలో కలిసి ఉండునట్లు, మనము కూడా పరిశుద్ధ జ్ఞానముకలిగి అన్ని విషయాలలో మంచిగా ఉండాలి. కనుక ప్రేమలో ఐక్యత అనునది ఎంత గొప్పది.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, నీ కుమారుడిని పంపినందుకు నీకు కృతఙ్ఞతలు, అతని కార్యముల ద్వారా నీ పనులను నీ ప్రేమను మాకు చూపించావు. నీ ప్రేమ కలిగి మా కార్యములను చేయుటకు మమ్ములను స్వతంత్రులుగా చేయుము. ఎవరైతే ఆత్మీయ గ్రుడ్డితనములో ఉన్నారో వారి హృదయ నేత్రములను తెరచి నీ ప్రేమచేత వారిని నింపు,మరియు వారు మీకు సంపూర్ణముగా సమర్పించబడులాగున సహాయమును దయచేయుము.

ప్రశ్న:

  1. ఎందుకు , ఎలా దేవుడు తన కుమారునిలో కార్యము జరిగిస్తాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:41 AM | powered by PmWiki (pmwiki-2.3.3)