Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 003 (The word before incarnation)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

1. శరీరధారి కాకమునుపు దేవుని వాక్యము యొక్క పని (యోహాను 1:1-5)


యోహాను 1:2-4
2 ఆదియందు దేవుని యొద్ద అదే ఉన్నది. 3 అన్ని అతని వలన చేయబడినవి. ఆయన లేకుండా ఏదియు చేయబడలేదు 4 అతనిలో జీవముండెను ఆ జీవము వెలుగై ఉండెను.

క్రీస్తు తనకొరకు ఎప్పుడు జీవించకుండా దేవుని కొరకు జీవించువాడుగా ఉన్నాడు. క్రీస్తు తన తండ్రినుంచి ఎప్పుడు వేరుగా ఉండక ఆయన నడిపింపులో ఉంది, ఆయనలో ఉంది, ఆయనకొరకు ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకే యోహాను తన సువార్తలో "తన తండ్రికి" అని ముందు వాక్యాలలో క్లుప్తముగా చెప్పియున్నాడు. ఈ రహస్యమైన క్రీస్తు మరియు తండ్రియైన దేవుని బంధము పరిశుద్ధాత్మలో నాటబడినదిగా ఉన్నది. మనము ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను నమ్మక త్రియేక దావుడైన వాడిని మరియు ప్రేమ కలిగిన క్రీస్తును మనము నమ్ముతున్నాము. నిత్యుడగు దేవుడు ఒంటరిగా లేక తన కుమారుడైన యేసు ద్వారా అందరి హృదయాలలో ఉండి మంచి ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరైనా దేవుని ప్రేమను అనుభవించకుండా ఉన్నట్లయితే వారు దేవుని సత్యమును ఎరిగిన వారుగా ఉండరు. కనుక ప్రేమ అనునది తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్ముడై ఉన్నాడు.

దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మౌనముగా దీనిని ఒంటరిగా చేయలేదు, అయితే ఆటను దీనిని తన మాటచేత చేసియున్నాడు. క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నట్లుగా దేవుడు ఈ లోకమును చేసియున్నాడు. అందుకే క్రీస్తు కేవలము రక్షకుడు, మధ్యవర్తి మాత్రమే కాక ఆటను ఒక సృష్టికర్త అయి కూడా ఉన్నాడు. ఎదుకంటే ఆటను లేక ఈ సృష్టి లో ఏది కూడా చేయబడలేదు కనుక. అందుకే ప్రతిదీ అతని స్వాధీనములో ఉన్నది. అందుకే మన హృదయము క్రీస్తుని తెలుసుకొనుటకు గొప్ప భాగ్యము చేసియున్నది. ఈ లోకములో ఉండు ప్రతి మనిషి మరియు అన్ని జాతుల జంతువులూ కూడా క్రీస్తు శక్తికి మరియు ఆయన మహిమలో ఉన్నవి.నీ లో ఉండు ప్రతి అవయవము ఆ క్రీస్తు చేసినదే కాబట్టి నీవు ఆయనను ఎప్పుడు కృతజ్ఞత చెప్పగలవు ?

ప్రతిదీ ఆయన ద్వారానే కలిగినది కేవలము దేవుడిని మరియు ఆయన వాక్యమును మరియు ఆయన ఆత్మను మాత్రము సృష్టించబడలేదు. తనకు తానె ఒక నిత్యజీవమై పరిశుద్దుడుగా ఉన్నాడు. దేవునికి ఏ విధముగా జీవము ఉన్నదో అదేవిధముగా క్రీస్తు కూడా జీవముకలిగి ఉన్నాడు, ఎందుకంటె ప్రతి ఒక్కరి పాపముల కొరకు తన రక్తమును ధారపోసి మనకు నిత్యా జీవమును దయచేసియున్నాడు కనుక. కనుకనే తన శక్తిచేత మరణమును మరియు సమాధిని జయించాడు. క్రీస్తు సృష్టికర్త మాత్రమే కాక తనలో జీవము ఉన్నాడని తెలియపరచియున్నాడు. దేవునిలో పాపము లేదు కాబట్టి క్రీస్తు లో కూడా ఎలాంటి పాపము లేదు అయితే ఆయనలో నిత్యజీవము ఉన్నది. మనము వాక్యమును ధ్యానించినట్లైతే క్రీస్తు యొక్క ఆలోచనలను మనయెడల అర్థము చేసుకోవచ్చు. కనుకనే తన జీవముతో మనకు ఒక నిరీక్షణ ఉండి మనము ఆయనలో జీవము పొందగోరువారముగా ఉన్నాము, కనుకనే క్రీస్తు యొక్క పునరుత్థానములో మన ప్రతి మరణకరమైన పరిస్థితి వెళ్లి క్రీస్తులో జీవమును పొందగోరువారిగా ఉన్నాము.

ఈ లోకము చీకటి అనే పాపములో ఉండగా క్రీస్తు ప్రేమ కలిగిన వెలుగుగా ఉన్నాడు. ఆయనలో ఏ విధమైన చీకటి, చెడ్డది ఏదియు లేదు. అందుకే క్రీస్తు సంపూర్ణ మహిమతో కనబడుచున్నాడు. కనుకనే వెలుగుకంటే ఎక్కువగా ఆయన ప్రకాశించువాడుగా ఉన్నాడు, అయితే యోహాను ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క వెలుగును గూర్చి చెప్పా ఆయన మహిమ గురించి మాత్రమే చెప్పిన వాడుగా ఉన్నాడు. కనుకనే ఆటను మన బలహీనతతో మనలను బలపరచువాడుగా ఉన్నాడు. అందుకే తన జ్ఞానముతో మనలను పరిశుద్ధపరచి మనలను జీవింపచేసియున్నాడు.

మనుస్యులకు క్రీస్తు ఒక వెలుగుగా ఉన్నాడు. తన కొరకు ప్రకాశించువాడుగా లేక ఇతరులకొరకు ప్రకాశించి వారి ద్వారా తన నామమును ఘనపరచువాడుగా ఉన్నాడు. కనుక మనము చీకటి సంబంధులము కాక వెలుగు సంబంధులము అయి ఉన్నాము. మనలో ఉండు ప్రతి మనిషి చీకటిలో ఉండు వారముగా ఉన్నప్పుడు క్రీస్తు మనలను తన వెలుగులోనికి నడిపించి మనకు నిత్యజీవమును దయచేసియున్నాడు. సువార్త ద్వారా మనము మరణమును జయించి తన నిత్యజీవితములోనికి ప్రవేశించెదము. కనుక మన జీవితములను క్రీస్తు మార్చి తన చిత్తానుసారముగా వారినిగా చేయాలనీ తలంచియున్నాడు.

ప్రార్థన: ప్రభువైన యేసు క్రీస్తు మేము మీ ముందర మా శిరస్సు వంచి మీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము, ఎందుకంటె మీరు అన్ని వంశముల కంటే ముందుగా ఉన్నవాడు. మేము స్వతంత్రులుగా ఉండకుండా ఎప్పుడు మీకు సమర్పించి మీ ప్రేమలో నిలిచియున్నట్లు మమ్మును నడిపించు. మీ వాక్యము ద్వారా మీరు మాతో వచ్చినందుకు మరియు మీ అధికారమును మీ వాక్యముద్వారా తెలుసుకొనుటకు సహాయము చేసినందుకు మీకు వందనాలు.

ప్రశ్న:

  1. క్రీస్తుని గురించి యోహాను తన సువార్తలో వ్రాసిన ఆరు వ్యక్తిత్వములు ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:09 AM | powered by PmWiki (pmwiki-2.3.3)