Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 023 (Peter and John Imprisoned)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

11. పేతురు మరియు యోహాను మొదటిసారిగా బంధించబడి కోర్టుకు కొనిపోబడుట (అపొస్తలుల 4:1-22)


అపొస్తలుల 4:12-18
12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. 14 స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. 15 అప్పుడు సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి 16 ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయ బడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారి కందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజ 17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకైఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడ కూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి. 18 అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి. 

పేతురు కృంటి వాడిని యేసు నామములో స్వస్థతపరచినాడు. ఈ కార్యము చూసినప్పుడు యేసు క్రీస్తు అందరినీ నిత్యజీవమును ఇవ్వాలనే ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక పేతురు ద్వారా ఈ గొప్ప కార్యమును చేసెనని అపొస్తలులకు తెలియవచ్చెను.ప్రభువు విశ్వాసుల విషయములో కొన్ని భాగములకు మాత్రమే సహాయము చేయదు, అయితే శరీరమందును, ఆత్మ యందును, ప్రాణమందును రక్షించును. దేవుని ప్రేమ మన నమ్మకమును మరియు అర్థము చేసుకోనువిధానమును అధికమించును. " రక్షణ ఎవ్వరిలో కూడా దొరకదు" అని పాత అపొస్తలులు చెప్పిరి. కనుక రక్షణ అనునది చదువు ద్వారా వచ్చునది కాదు, లేదా మత సంబంధమైన కార్యములు లేదా పుస్తకాలు చుడితే వచ్చునది కాదు. అయితే జీవము కలిగిన వాడు, మనుషులందరి పాపముల కొరకు చనిపోయినవారు మరియు పరిశుద్దాత్మ నివాసము కలిగిన వారికి రక్షణను దేవుడు దయచేయును.

రక్షణ అనగా ఏమి? ఇది దేవుని ఉగ్రత నుంచి విమోచించడము, మరియు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు సమాధానము పొందుకొనుట. రక్షణ అనునది మరణం మీద జయము పొందునట్లు చేయును మరియు ఇది నిత్యజీవములోనికి నడిపించును. క్రీస్తు రక్షణ అనునది మంచి కార్యములను చేసి పాపము నుంచి విముక్తిని పొందునట్లు చేయును. కనుక నిజమైన రక్షణ అనునది, గొప్పది, లోతైనది, వెడల్పయినది, మరియు మనుషులకంటే బలమైనది. కనుక ఎవరైతే యేసును విశ్వసిస్తారో వారి మీద సాతానుకు ఏవిధమైన శక్తి లేదు. కనుక ఎవరైతే రక్షకుని సమర్పించుకొని ఉంటారో వారు అతనిలో జయము కలిగి ఉంటారు.

క్రీస్తు ఈ రక్షణను ఎప్పుడైతే ఆ కలువారి సిలువలో అందరి కొరకు చనిపోయాడా అప్పుడే దీని పనిని ముగించాడు. ప్రభవువు మన పాపములను తీసివేసి, మనలను పరిశుద్ధపరచును, ఎందుకంటె ఎవ్వరు కూడా మనలను రక్షించలేరు కనుక. మనుషుల కుమారులు దేవుని కుమారులుగా మారుటకు దేవుని కుమారుడు మహిషి కుమారునిగా మారినాడు. కనుక మనము అతని పిల్లలుగా చేయుటకు క్రీస్తు మనలను విమోచించియున్నాడు. క్రీస్తు తన మరణముతో పరిశుద్ధాత్మను కొని మన హృదయములంజు దేవుని ప్రేమతో నింపాడు.

రక్షణ అనునది ఎవ్వరిలో కనపడనిది కనుక అందరు కూడా క్రీస్తు రక్షణను పొందుకొనుటకు ఆహ్వానించాడు. మతసంబంధమైన, జ్ఞానులు, మానవ జ్ఞానము కలిగినవారు, మరియు మంచి కార్యములు చేయువారు అర్హులు. క్రీస్తు రక్తములోనే మనకు విమోచన కలుగును. కనుక ఇది లేకపోతే మనము నశించిపోతాము. కనుక క్రీస్తు సయోధ్యకు పొందుట అనునది మన బాధ్యత,మరియు అతని నిబంధనలోనికి చేర్చుట. కనుక ఎవరైతే యేసును తిరస్కరిస్తారో వారు దేవుని ప్రేమను మరియు అతని రక్షణను పొందుకొనలేరు. కనుక యేసు ద్వారా తప్ప దేవుని యొద్దకు మార్గము లేదు.

పేతురు ఈ సత్యమును బట్టి ప్రధాన యాజకులకు, దైవసంబంధ పఠనము చేసినవారికి, జ్ఞానులకు చెప్పి యున్నాడు. అతను ఎక్కువగా మాట్లాడక ఈ సువార్తను వారికి ఒకే సమాచారంనాడు వివరించెను. అతను అర్థమగు భాషలో మాట్లాడినందుకు న్యాయాధిపతులు అతనివైపు నవ్వుతో చూసిరి. అతనితో పాటు ఉన్నటువంటి యవ్వనస్తుడు చదువులేని వాడని చూసిరి. అయితే దేవుని శక్తి ఆ ఇద్దరినుంచి వెళ్ళినది వారు తిరస్కరించలేదు. అయితే దేవుని శక్తి తిరిగి పేతురు మాటలలో కనపడినది, కనుక ఇది హంతకులను గూర్చి మాట్లాడినది. అదేసమయములో దేవుని రక్షణ దోషులకు కూడా యిచ్చియున్నాడు.

న్యాయాధి పతులు అపొస్తలుల ఫిర్యాదును ఎక్కువగా పట్టించుకొనలేదు, లేదా వారికి అతను ఇచ్చు రక్షణను బట్టి. అతని గురించి తెలుసుకొనుటకు వారు ఇష్టపడలేదు. అయితే యేసు నామమును వారు మరచిపోవాలి ప్రయత్నించినను అది జారగకపోయెను. మరియు తిరిగి వినలేదు. కృంటివాని స్వస్థతను బట్టి వారు పట్టించుకొనలేదు. కనుక ఈ లాంటి మనుషులకు ప్రేమ అనునది కొంచెము గానే ఉండును. కనుక వారి మనసంతా వారి పుస్తకములమీద, మరియు వారి మతానుసారమైన బోధనలచేత నింపబడెను.

శిక్షను కూడా భయపడునటువంటి ఇద్దరి అపొస్తలుల ధైర్యాము వారిని ఉత్తేజపరిచేను. మరియు స్వస్థత చెందిన మనిషి అక్కడ వారితో ఉండుట కూడా న్యాయాధిపతులను ఖండించుటకు వారికి వీలు లేకపోయెను.

చివరిగా, క్రీస్తు నామములో వారి ప్రసంఘములను నిరోధించడము తప్ప మరియు ఏమి చేయుటకు కూడా నిర్ణయము చేసుకొనలేకపోయిరి. ఈ నామము అతనిని వెంబడించువారిలో శక్తిని ఇచ్చేనని జ్ఞాపకము చేసుకొనిరి, అది వారి దేశములో ఒక అపాయముగా ఉండెను. కనుక భయములేక వణుకు లేక ఈ నామములో ప్రకటించినట్లైతే యేసు ముందుకు ఎన్నో గొప్ప అద్భుతములు చేయును. ఈ విధముగా సాతాను రూపకల్పన జరిగెను. దేవుడు మనుషులను రక్షించి హృదయములను కాపాడునట్లు యేసు నామములో శక్తి కలిగిన ప్రసంఘములు చేయించెను, అయితే సాతాను వీటినన్నిటిని చెడగొట్టాలని ఆశించెను. కనుక ప్రియా విశ్వాసి, నీవు కూడా క్రీస్తు నామమున మాటలాడుటకు ఇష్టపడవ? లేక అతనికొరకు సాక్ష్యము చెప్పెదవ? ఎందుకంటె రక్షణ ఎవ్వరిలో దొరకదు. ఇతరులు రక్షించబడుటకు ఈ నామములో మాటలాడుటకు నీవు బాధ్యుడవు. కనుక సాక్ష్యము చెప్పకనే రక్షణ లేదు.

ప్రార్థన: ఓ ప్రభువా నశించిపోతున్న మమ్ములను నీవు రక్షించినావు, మా పాపములను క్షమించి మమ్ములను నిత్యజీవములోనికి నడిపించు. నీ మరణము ద్వారా మాకు జీవము మరియు నీ శ్రమలద్వారా మాకు ఆనందము వచ్చెను. ఎవ్వరికీ భయపడకండి నీ నామమును బట్టి సాక్ష్యమిచ్చునట్లు చేయుము, మరియు ఇతరులు కూడా వారి పాపములను ఒప్పుకొని నీ రక్షణను పొందునట్లు చేయుము.

ప్రశ్న:

  1. యేసు నామములోనే ఈ రోకమంతటికీ రక్షణ ఉన్నది?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:51 PM | powered by PmWiki (pmwiki-2.3.3)