Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 013 (Peter’s Sermon at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

6. పెంతేకొస్తు దినమందు పేతురు యొక్క ప్రసంగము (అపొస్తలుల 2:14-36)


అపొస్తలుల 2:24-28
24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. 25 ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. 26 కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. 27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. 28 నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు 

మరణము మీద దేవుని విజయము క్రైస్తవులకు ఒక ధ్వజముగా ఉన్నది. దీనికి సూచన క్రీస్తు, ఎందుకంటే అతను మరణము నుండి తిరిగి లేచెను కనుక. కనుక అతను జీవముగల వాడు కనుక ఎన్నటికీ మరణించడు. అతను మన పునరుత్తనమునకు ఒక హామీగా ఉన్నాడు, మరియు మన నిత్యా జీవమునకు ఒక భద్రత అయి ఉన్నాడు.

యూదులు దేవునికి వ్యతిరేకముగా ఉండుట పేతురు బహిరంగముగానే చెప్పెను. ఎవరైతే తృణీకరించబడినారో వారిని దేవుడు అంగీకరించాడు, మరియు యవ్వనస్తుడైన నజరేయుడిని పైకి లేపాడు. అతనే మరణ కరమైన కట్టలను తీసివేసి ఉన్నాడు (కీర్తన), ఎందుకంటె సమాధి కూడా అతనిని ఉంచుకొనుటకు సాధ్యపడలేదు. ఎందుకంటె అతని మరణము పరిశుద్ధమై ఉన్నది కనుక అతని మీద శక్తి లేకపోయెను. క్రీస్తు మన నేరాలను బట్టి మరణించి, మరియు మన సమర్థతను బట్టి తిరిగి లేచెను. క్రీస్తు లేచుట అనునది యూదులు అతనిని పొడిచినందుకు తగిన తీర్పుగా ఉన్నది. అదే సమయములో క్రైస్తవులకు ఇది ఒక గొప్ప ఓదార్పుగా ఉన్నది.

దీనికి కొనసాగింపుగా పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పినది ఏమనగా, రాజైన దావీదు కూడా పరిశుద్ధ త్రిత్వము యొక్క రహస్యమును క్రీస్తు అంతర్దృష్టిలో చూసాడు. కుమారుడు తన తండ్రిని అందరికంటే ముందుగానే చూసేనని మరియు అతని మహిమను కూడా చూసేనని చెప్పెను. యేసు దేవుని స్వరూపమందుండు చివరి ఆదాముగా ఉండెను. అతను సంపూర్ణ శక్తి చేత, అందము చేత, మహిమచేత, మరియు దేవునితో ఐక్యత కలిగి తండ్రి చిత్తమును చేయువాడుగా ఉండెను.

సిలువవేయబడక మునుపే, కుమారుడు తన తండ్రిని తన కుడి హస్తములో చూసేను. మరియు అతను పరలోకమునకు వెళ్ళినతరువాత తన తండ్రి కుడి పార్శ్యమున కూర్చున్నాడని మనకు తెలుసు. మరొక్కసారి మనము చూసినట్లయితే త్రిత్వములో ఉండు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు మహిమకరముగా ఉన్నారు. ప్రవచనమునకు కొనసాగింపుగా క్రీస్తు చెప్పినట్లు అతను ఏవిధమైన ఇబ్బంది పడకుండా దేవుని విజయములో ముందుకు వెళ్లాడని చెప్పెను. కనుక మనము కూడా శోధనలో పడకుండా ఉండునట్లు ఎల్లప్పుడూ తండ్రి వైపు చూడాలి.

తండ్రికి మరియు కుమారుని ఉన్నస్థిరమైన బంధములో పాపము కానీ గర్వము కానీ చెదరగొట్టారు, అయితే ఆనందముతో, ప్రేమతో మరియు సంతోషముతో ఉండెదరు. దేవుడే తనను తాను దేవుడని చెప్పెను: "నీవు నా ప్రియమైన కుమారునివి; నీయందు నేను మహిమపరచుచున్నాను. బాధపడొద్దు, ఆనందకరమైన ప్రభువు నీ బలమై ఉన్నాడు."

క్రీస్తు సిలువవేయబడక మునుపే దేవుని గొర్రెపిల్ల అతని మరణమును వచ్చుట చూసేను. ఏదేమైనా అతని అంతర్దృష్టి మరణము నిత్యా రాజ్యములో ఉండెను. అతను అనవసరముగా ఆ సిలువలో చనిపోలేదు, అయితే నిరీక్షణ యందు ఇబ్బంది లేకుండా ఉన్నాడు. అతని ప్రాణము మరియు ఆత్మ మరణము అను బందీలో లేదని అతనికి తెలుసు, ఎందుకంటె అతను తనను తాను దేవుని హస్తములకు సమర్పించుకున్నాడు. దావీదు ముందుగానే చెప్పినట్లు యేసు శరీరము అవినీతిలో లేదు, ఎందుకంటె అతను పరిశుద్ధుడు కాబట్టి. క్రైస్తవులకు ఇది ఒక నిరీక్షణగా ఉన్నది, ఎందుకంటె ఒకరోజు వారు శరీరములు కూడా పరిశుద్ధపరచబడి తిరిగి లేస్తాయని. వారు క్షమించబడతారు కనుక వారి శరీరములు పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధపరచబడడము అనునది దేవుని యొక్క బహుమానము. క్రీస్తు పునరుత్తనము మనకు ఆనందమును, శక్తిని, మరియు కృతజ్ఞతను ఇచ్చియున్నది. క్రీస్తుకు రహస్యములు మరియు నిత్యజీవమునకు మార్గములు తెలిసున్నాయి, అందుకే అతను చెప్పినట్లు: "పునరుత్తనమును జీవమును నేనే. ఎవరు నాయందు విశ్వాసముంచుదురో వారు చనిపోయినను బ్రతికెదరు. మరియు ఎవరైతే నా యందు విశ్వాసముంచుదురో వారు చనిపోరు." క్రీస్తులో మనము విశ్వాసులందరి పునరుత్తనమును చూడవచ్చు. తనను వెంబడించువారందరికీ అతను జీవమును ఇచ్చును. కనుక అతను లేకుండా మనకు నిజమైన జీవితము లేదు.

చివరి దినమున క్రీస్తుకు సంపూర్ణ ఆనందము కలుగును, ఎందుకతనే అప్పుడే అతని మరణము ద్వారా కొన్ని కోట్ల మంది విమోచనము పండుకొని ఉంటారు కనుక. అతని మరణము అందరికీ జీవమును మరియు కృప కలిగిన సింహాసనముతో ఐక్యతను ఇచ్చియున్నది. మరియు పరిశుద్దాత్మదేవుడు వారిని అతని పరిశుద్ధ శరీరములో సభ్యులుగా చేసెను. మన విశ్వాసము గొప్పది కనుక, ఇది ఆనందముతో, సంతోషముతో మరియు నిరీక్షణ మీద పునాది వేయబడెను.

అపొస్తలుల 2:29-32
29 సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; 30 అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తన 31 క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. 32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి3 మేమందరము సాక్షులము. 

పేతురు తన ప్రసంఘములో వినువారిని సహోదరులను సంభోధించెను, వారు అప్పుడు ఇంకా దేవుని కుటుంబములో చేరకపోయినను. వారి హృదయములో పరిశుద్ధాత్ముడు కార్యము చేయుట అతను చూసాడు. వారికి రాజైన దావీదు (అపొస్తలుల 2:25-28) ప్రవచించినది జ్ఞాపకము చేసెను, తనను తాను చెప్పలేదు, ఎందుకంటె దావీదు ఎంతో మందికి సంతానమై చనిపోయాడు. అతను సమాధి ఖాళీగా ఉంచబడలేదు. అతను నిజమైన ప్రవక్త కనుక పరిశుద్దటంచేత నింపబడినాడు, మరియు ఏ రాజు కానీ, ప్రవక్త కానీ మరియు యాజకుడుకానీ ఈ లాంటి వాగ్దానమును పొందుకొనలేదు. ఈ ప్రవచనము ప్రకారముగా అతని సంతతిలో కూడా ఒకరు దేవుని కుమారులగుతారు అని, కనుక అతని రాజ్యము నాశనము కాదు (2 సమూయేలు 7:12-14). యూదులందరికీ ఈ క్రీస్తు వాగ్దానము తెలుసున్నది, కనుక ఈ మనుష్య కుమారుడు దేవుని కుమారుడే అని అనే కార్యమును బట్టి వారి ఆశతో ఎదురు చూచిరి. లేఖనాలు క్రీస్తు రాకడను బట్టి ఎక్కువగా చెప్పెను. కనుక వారు ఈ అభిషేకము కలిగిన వాడు మృతిని జయించెను అని మరియు పరిశుద్దాత్మ వలన జన్మించెను అని చెప్పే లేఖనములను వెతికిరి. కనుకనే అతని శరీరము చెడిపోలేదు, మరియు అతని ప్రాణము మరణ అధీనములో లేదు. అతను మరణమును జయించెను కనుక అతని రాజ్యము నిర్య రాజ్యము. ఆయన నైతిక పాలన చేయలేదు, ఎందుకంటె అతని నిత్యమైన రాజులకు రాజు మరియు తండ్రి అయినా దేవునితో ఉన్నవాడు.

అప్పుడు, పరిశుద్దాత్మును ద్వారా కోరినది, యేసు ఎవరైతే తిరస్కరించబడి, సిలువవేయబడినవాడు దావీదు వాగ్దాన పుత్రుడు అని పేతురు చెప్పెను, మరియు అతనిని దేవుడు తిరిగి లేపెను అని. పేతురు తన శత్రువులను బట్టి భయపడలేదు, మరియు వారితో అన్ని విషయాలను బట్టి చర్చించలేదు. అయితే దేవుని శక్తి యందు ఈ సత్యము నెరవేర్చాడుట చూసేను. అతను దేవుని విజయమును కన్నులారా చూసి జీవము కలిగిన క్రీస్తు ద్వారా తన పాపములు క్షమించబడివుండుట చూసేను. క్రీస్తు మృతినుంచి లేచిన తరువాత శిష్యులతో కలిసి భోజనము చేసెను. వారికి తన పునరుత్తానా శరీరమందు కనపడి, వారికి మేకులు కొట్టబడిన చేతులను చూపెను. కనుక దేవుని కుమారుడు మరణము కలిగి లేదు, అయితే తిరిగి లేచి ఉన్నాడు. కనుక విశ్వాసులైన మనము అతనికి సాక్షులుగా ఉన్నామా?

ఈ సమాచారంతో, పేతురు యొక్క పెరిశుద్ధాత్మా యొక్క మూడవ ప్రసంగ భాగము ముగిసెను. మొదటిగా, యవేలు ప్రవచించినట్లు పరిశుద్దాత్మ ద్వారా నింపబడడం. రెండవది, సిలువ వేసి చమినా యూదులను పిలుచుట. మూడవది, క్రీస్తు నిజముగా మరణము నుంచి పునరుత్తానుడై లేచెనని లేఖనముల ద్వారా రుజువు చేయుట.

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు నీవు జీవమునకు రాజువు. నిన్ను మేము ఆరాధించి నీ పునరుత్తనమును విశ్వసించేదము. నీవు మా రాజువు మరియు జీవమును ఇచ్చువాడవు. నీవు మాత్రమే మా నిరీక్షణ. అనేకమంది జీవించునట్లు నీ ఆత్మ చేత నింపి నీ వైపు త్రిప్పుము.

ప్రశ్న:

  1. దావీదు ప్రవచనమును జ్ఞాపకము చేయడము ద్వారా పేతురు వినువారికి ఏమి చూపాలను కున్నాడు?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:45 PM | powered by PmWiki (pmwiki-2.3.3)