Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 007 (Matthias Chosen)
This page in: -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

4. పాపాత్మకమైన యూదా నుంచి మత్తీయను ఎన్నుకొనుట (అపొస్తలుల 1:15-26)


అపొస్తలుల 1:15-20
15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను 16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. 17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. 18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. 19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా 20 అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది. 

జీవము కలిగిన యేసు సమాజములో శిష్యులు రెండు ఘోరాలను బట్టి కదిలించబడిరి. శిష్యులు వారి బోధకుని సిలువ మరణమును బట్టి కదిలించబడిరి, అతను అందరిని విమోచించుటకు చనిపోయెను. అతని మరణము వారికి చాల నొప్పిని కలిగించినది. అదే సమయములో యూదా క్రీస్తును అప్పగించిన తరువాత చేసుకున్న ఆత్మ హత్యను బట్టి కూడా కదిలించబడిరి. మొదటిది దేవుని యొక్క సంపూర్ణ చిట్టా ప్రకారముగా ఒక మానవ శరీరములో జరిగినది; రెండవది, సాతాను నుంచి ప్రేరేపితమైనది. కనుక ప్రియా సహోదరుడా నీ మార్గమును ఎన్నుకో. దేవుని ఆత్మ కొరకు నీ జీవితమును ఎంతో మంది పాపుల కొరకు త్యాగము చేయాలనుకొన్నావా, లేక దేవుని తీర్పు వచ్చునట్లు పాపముతో, నిరీక్షణ లేక, భయము కలిగి చనిపోవాలనుకున్నావా?

యూదా పాపము శిష్యులలో ఒక ఖాళీని చేసి వెళ్లెను. పన్నెండు మంది కూడా ప్రభువు కొరకు పన్నెండు గోత్రములకు ప్రకటించుటకు అభిషేకించబడిరి, వారిని దేవుడు ఒకవేళ రక్షింపబడకుండునట్లైతే చివరి దినమున తీర్పులోనికి తెచ్చును. అందువలన యేసును వెంబడించువారిలో ఉన్న నమ్మకమైన వారిని ఎన్నుకొని, యూదా విషయములో చూసిన వారిని అతని స్థానములో ఉంచిరి. దగ్గర దగ్గర నూట ఇరవై మంది నమ్మకమైన వారు ఒకరికి ఒకరు తెలుసుకొన్న వారు కలుసుకొనిరి. వారందరు కలిసి ప్రార్థన చేసి తండ్రి వాగ్దానముకొరకు ఎదురు చూసిరి. అది నిజముగా ఒక అద్భుతమైన సమావేశముగా ఉన్నది!

పేతురు నిలువబడి ఆ సమావేశమునకు అధ్యక్షత వహించెను. అతను క్రీస్తును తిరస్కరించినవాడని అందరికీ తెలుసు, మరియు అతను తిరస్కరించుట ఈ నాలుగు సువార్తలలో క్లుప్తముగా చూపబడినది. మరియు పాపము చేయబడినటువంటి ఈ శిష్యుడిని కూడా యేసు క్షమించెను. క్రీస్తు అతనిని వారిని ఒక నాయకునిగా అతని పునరుత్తనమునకు నియమించెను. కనుక ప్రారంభము సంఘములో ఇది ఒక ప్రత్యేకించబడిన అంశముగా ఉండెను. అతిశయముగా చెప్పుకొను వానిని బట్టి తిరస్కరించక, మరియు దీనిని దాటివెళ్లి ఉండిరి. అదేసమయములో ప్రేమ కలిగిన ఆత్మ కూడా వారిలో ఎక్కువాయెను. పేతురును యేసు తన గొర్రెలను కాయుమని చెప్పెనని అంగీకరించిరి. ఆ సమావేశములో నిలబడుట ఎంత విచిత్రముగా ఉన్నది, సంక్లిష్టము లేకుండా ఈ మాట చెప్పెను: " క్రీస్తు నన్ను అంగీకరించి ఉన్నాడని నాకు తెలుసు, ఒక గొప్ప పాపిగా ఉన్నప్పటికీ, నా పాపములన్నిటినీ క్షమించి అతనిని సేవించుటకు ఎన్నుకొన్నారు ". పేతురు తనను తాను గొప్ప చేసుకొనుటకు తన పేరును వాడుకొనలేదు. అయితే అతను మాట్లాడిన ప్రతి మాట ద్వారా మరియు కార్యము ద్వారా జీవము కలిగిన ప్రభువునకు మహిమ కలుగునట్లుగా చేసెను.

పేతురు బిషప్ మాదిరి లేదా పొప్ మాదిరి లేదా ఇతరుల మాదిరి ఆధిపత్యము కొరకు మాట్లాడలేదు. దానికి బదులు ఒక పెద్ద మనిషి లేచి నిలబడి మాట్లాడినట్లు మాట్లాడేను. దేవుడు వారికి తండ్రి అయి ఉన్నాడు కనుక వారిని సహోదరులారా అని పిలిచెను. "సహోదరుడు" అను పేరుకు ఇక ఈ భూమి మీద కానీ పరలోకమందు కానీ వేరే ఏ పేరుకూడా లేదు. ఎందుకంటె ఇది దేవుని కుటుంబములో ఒక ప్రేమ కలిగిన బంధమై ఉన్నది

ప్రార్థన చేస్తున్న మరియు వాక్యమును ధ్యానించుచున్న శిష్యులకు యూదా అనగా క్రీస్తును అన్యాయముగా పట్టించిన వాని యెడల ఆలోచన ఉండవచ్చు. ఎందుకంటె యేసుతో అందరూ కూడా ఉన్న సందర్భములో అతని స్వభావమును వారికి తెలిసి ఉండవచ్చు. యూదా దేవుని రాజ్యములో అంతరంగ సభ్యుడై ఉండవచ్చు. ఎందుకంటె అతను తన ప్రభువు నుంచి అధికారమును మరియు పిలుపును పండుకొని ఉన్నాడు కనుక. మరియు అందరి శిష్యుల వాలే అతను కూడా చాల సమయము యేసుకు పరిచర్య చేసి ఉన్నాడు.

లూకా సువార్త ప్రకారముగా యూదా ధనమును ప్రేమించి ఉన్నాడు కనుక యేసును పట్టించుటకు అతను వెనకాడలేదు. ఎందుకంటె ఇబ్బంది పడిన తన ప్రాణమునకు ఒక భద్రత ఇవ్వాలనుకున్నాడు, కనుకనే పట్టణము వెలుపలకు అతను తీసికొనివచ్చెను. అయితే దేవుని దెబ్బలను బట్టి ఆలోచనచేయుటకు అతనికి విశ్రాంతి లేకపోయెను. తనను వెక్కిరించుచున్న సాతాను ఆలోచనలలో ఉండెను. కనుకనే అతను పరుగెత్తికొని వెళ్లి తనను తాను ఉరి వేసుకొని మరణించెను. కనుకనే అతను బిగుంచుకున్న తాడు కూడా ప్రత్యేకముగా చినిగెను, మరియు అతని శరీరము ఆ చెట్టునుంచి బండమీద పడిపోయెను, దానికి అతని కడుపు పగిలిపోయెను. అప్పుడు పేగులు అన్ని బయటికి వచ్చెను. లూకా ఒక వైద్యునిగా ఈ సంఘటన ఎంత భయంకరముగా ఉండెనో అని వ్రాసి ఉన్నాడు.

అప్పుడు యెరూషలేములో ఉండు జనులందరు ఈ విషయమును బట్టి వినినప్పుడు దేవుని ఉగ్రత వీడిమీద వచ్చేనని భావించిరి. కనుక ఆ స్థలమును వారు ఇతర స్థలములతో పోల్చలేదు ఎందుకంటె అక్కడ అతని రక్తం చేత నిండెను కనుక.

అయితే క్రీస్తుకు యూదా యొక్క పాపము మరియు అతను చేయు తిరస్కరణ ముందుగానే తెలుసు, కనుకనే అనేకసార్లు ఉపమాణముల ద్వారా మరియు కార్యముల ద్వారా చెప్పి ఉన్నాడు, అయితే యూదా ధనమును ప్రేమించెను కనుక శక్తి కలిగిన ప్రభువు కంటే ఎక్కువగా ధనమును ప్రేమించెను. కనుక అతను పరలోక భాగమును మరియు ఈ లోక స్థలమును రెంటిని పోగొట్టుకొనెను. దేవునితో అతనికి ఉన్న స్థలము ఇతరులకు కేటాయించడము జరిగినది కనుక అతని ఇల్లు ఏకాంతముగా ఆయెను. దాని గోడలన్నీ బ్రద్దలై అందులో గబ్బిలాలు చేరుకొనెను.

శిష్యులకు ఇది తీవ్రంగా భయపెట్టినది, ఎందుకతనే చివరి సారి వారు క్రీస్తుతో భోజనము చేయునప్పుడు మీలో ఒకరు నన్ను అప్పగిస్తారని చెప్పినప్పుడు ఆ విషయము బయటికి వచ్చెను. అప్పుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఈ విషయములో మేము కాదు అని అనుకొనిరి. అంతే కాక వారి ప్రార్థనలో దేవుని ఆత్మ జరుగు సంగతులు తెలుసా ఉన్నాడని అంగీకరించిరి. అయినప్పటికీ దేశద్రోహికి పాపము చేయునట్లు పరిశుద్దును నడిపించలేదు, మరియు పాపము చేయునట్లు ఎవ్వరు కూడా బలవంత పెట్టలేదు. యూదా హృదయమునందు క్రీస్తు ప్రేమను బట్టి ఖఠినము చేసుకొనెను కనుక పాపమును బట్టి దేవుని ఉగ్రత ద్వారా చనిపోయెను. దీనినే పరిశుద్దాత్మ దేవుడు వెయ్యి సంవత్సరాల క్రిందట దావీదు ద్వారా చెప్పబడెను (కీర్తన 69:26; 109:8).

ప్రియా సహోదరుడా దేవుని ఆత్మ నీ యొద్దకు వచ్చునప్పుడు నీ హృదయమును కఠిన ప్రచు కొనవద్దు, అయితే నిన్ను ధనము నుండి రక్షించుటకు మరియు దేవునిని త్యాగముతో సేవించునట్లు ఆత్మను అంగీకరించు. నిన్ను నీవు ధనవంతునిగా, సంపద కలిగినవానిగా, గౌరవంగా మరియు అధికారిగా ఎంచుకొనవద్దు, అయితే వినయమును, సరళత్వమును, సాత్వికమును కలిగి ఉండు, ఎందుకంటే ఈ లాగుననే క్రీస్తు కూడా కలిగి జీవించి, ఆత్మ యందు ధనికుడైనప్పటికీ ధనముతో బీదవాడై ఉండెను.

ప్రార్థన: ఓ ప్రభువా నా ధన ప్రేమను బట్టి మరియు నా దురాశను బట్టి నన్ను క్షమించు. నీ నామమును బట్టి మరియు నీ దయను బట్టి నిన్ను ఘనపరచుటకు నన్ను సమాధాన పరచు. మేము ఏవిధమైన శాపములోనికి వెళ్లకుండా ఉండునట్లు మమ్ములను మరియు మా సహోదరులను నీ ఆత్మచేత నింపుము.

ప్రశ్న:

  1. యూదా మరణమును బట్టి నీవు ఏమి నేర్చుకున్నావు?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:41 PM | powered by PmWiki (pmwiki-2.2.109)