Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 072 (Jesus meets Martha and Mary)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
4. లాజరును లేపుట (యోహాను 10:40 - 11:54)

b) మార్తను మరియు మరియను క్రీస్తు కలుసుకొనుట ( యోహాను 11:17-33)


యోహాను 11:17-19
17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. 18 బేతనియ యెరూష లేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము 19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

అప్పటికే లాజరు చనిపోయి నాలుగు రోజులాయి పాతిపెట్టబడినాడు; ఎప్పుడైతే అతను చనిపోయాడా అప్పుడే అతను పాతిపెట్టబడినాడు, కనుక ఈ వార్త యేసుకు చేరింది. అయితే క్రీస్తు అక్కడికి వచ్చుటకు ఏ విషయము లేదు ఎందుకంటె అప్పటికే అతను చనిపోయాడు కనుక. కనుక మరణము అనునది అనుమానంగా లేదు.

బేథాని అను ప్రదేశము ఒలీవ పర్వతమునకు తూర్పుదిక్కున ఉన్న యొర్దాను నది దగ్గర 1000 మీటర్ల క్రింద ఉన్నది. దానివెనుక మృత సముద్రము ఉన్నది. మరియు పడమరకు మూడు కిలోమీటర్ల దూరమున యెరూషలేము ఉన్నది .

అతని ఇంటిదగ్గరకు రోగము కలిగిన వారు అనేకులు వచ్చిరి, ఏడ్చుకుంటూ మరియు వారి రొమ్ములను కొట్టుకుంతూ వచ్చిరి. మరియు లాజరు వారి కుటుంబములో ఆహారవిషయములో జయము కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఇది జరిగెను. కనుక మరణము వారి కలుసుకొనుటలో ఒక నేడవలె ఉండెను.

యోహాను 11:20-24
20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను. 21 మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. 22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. 23 యేసు నీ సహో దరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా 24 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

ఎప్పుడైతే యేసు వారి ఇంటికి దగ్గరలో వస్తున్నదని మార్తా తెలుసుకొనినప్పుడు, అతని దగ్గరకు ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్లెను' ఎందుకంటె ఒక వేళా అతను నిన్నటిదినమందే వచ్చినట్లైతే ఆమె సహోదరుడు మరణించలేక ఉండెను అనుకొనెను. ఎప్పుడైతే ఆమె అతని దగ్గరకు వచ్చెను అప్పుడు విశ్వాసమునకు ఆమె ప్రాధాన్యత ఇచ్చి అతని శక్తికి గౌరవము ఇచ్చెను. ఆమె అనవసరమైన మాటలు మాట్లాడక ఒకవేళ నీవు ఉన్నట్లయితే అతను చనిపోయి ఉండలేదు అని చెప్పెను ; అయితే అది ఎలాగో ఆమె కు తెలియక పోయెను, అయితే ఆమె అతని సంపూర్ణ అధికారమును నమ్మెను, మరియు తన కుమారుని ప్రార్థన వినునని సంపూర్ణముగా విస్వసించెను.

యేసు ఆమె విశ్వాసమును బట్టి స్పందించి గొప్ప వాగ్దానమును ఇచ్చెను, " మీ సహోదరుడు లేచును. " ఆమె అతని మాటలను తీసుకోలేదు అయితే వాటిని పునరుతనా దినమందు వాగ్దానములుగా తీసుకొనెను. ఇప్పుడు ఆమె నిరీక్షణ కలిగినదిగా ఉన్నది, ఎందుకంటె మరణము ఒక అంటాము కాదని తెలిసికొనెను. విశ్వాసులు జీవమునకు పునరుత్థానమును కోరుకొని ఉంటారు.

యోహాను 11:25-27
25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; 26 బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. 27 ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

క్రీస్తు శిష్యుల నుంచి మార్తా వినినట్లుగా అతని గురించి గొప్పగా చెప్పినది, " పునరుత్థానము ఖచ్చితముగా వస్తున్నది. అనగా అతని పునరుత్థాన దినమందు లేపుట కాదు కానీ అతని సన్నిధి ద్వారా లేపును, అయితే ఈరోజే అతను నా సన్నిధిలో లేపును. నేను సృష్టికర్తను కనుక నా యందె మీకు పరిశుద్ధాత్ముడు వచ్చును. నేను మీకు బదులుగా మరణించెదను కనుక మీ పాపములను తీసివేసెదను, అప్పుడు మీకు మంచి జీవితమును ఇచ్చెదను. మరణమునకు నీపైన అధికారము ఉండదు, తొందరలో మిమ్ములను నాలో లేపుదును అప్పుడు మీరు పాతి పెట్టబడి తిరిగి విశ్వాసముద్వారా లేచుదురు. నా మరణము నీకోసమే , నా జీవము నీకోసమే. నేను నీలో ఉండి, నీవు నాలో ఉండెదవు."

క్రీస్తు జీవమును పొందుకొనుటలో మనకు ఒక నిబంధన యేసుతో కలదు. అతని జీవితమునకు సంబంధించిన విషయము నీవు నీ జీవితములో కలిగిఉండాలంటే నీవు క్రీస్తతో బంధముకలిగి ఉండాలి. మన విశ్వాసము క్రీస్తునందు నిర్య జీవము వరకు వచ్చును. అతని ప్రేమ మనకు ఆనందమును, సమాధానమును మరియు ప్రేమను కురిపించును. ఎవరైతే క్రీస్తు ప్రేమచేత నింపబడతారో వారు మరణము పొందారు. ఎందుకంటె దేవుని ఆత్మ నిత్యజీవమును ఇచ్చును. ఆత్మా అనునది ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారిలో ఉండును.

యేసు లాజరును మరణము నుంచి లేపి తన మాటలను జయకారముగా చెప్పలేదు. అయితే ఎవరైతే ఆత్మయందు జీవముకలిగి ఉంటారో వారు మరణము మీద అధికారము కలిగి ఉంటారని చెప్పెను, మరియు అతని పునరుత్థానమును చేప్పేను . నీవు అతని మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే నీవు మరణము కలిగి ఉండవు. మరణమునకు దగ్గరగా ఉన్నవని లేదా సమాధికి దగ్గరగా ఉన్నవని అనుకొనవద్దు; అయితే దానికి బదులు క్రీస్తు వైపు ఈ దృష్టిని నిలుపు. ఈ బంధము కలిగి నిత్యా జీవమును క్రీస్తుతో కలిగి ఉండు.

ప్రియా సహోదరుడా, జీవము ఇచ్చు యేసును విశ్వసిస్తున్నావా ? అతను నిన్ను మృతినుంచి తప్పించాడని అనుభవించావా, మరియు నిన్ను పాపమునుంచి లేపెనని అనుకున్నావా ? ఒకవేళ నీవు ఈ విధమైన అనుభవమును కలిగివుందని యెడల క్రీస్తు హస్తము నీపైన ఉన్నాడని నమ్ము . అతని ప్రేమను మరియు అతని శక్తిని నమ్ము. అతని హస్తము పట్టుకొనినట్లైతే నీ పాపములను క్షమించి మరియు నీకు నిత్యజీవమును దయచేయును. అతను నీ ఏకైక నమ్మకమైన రక్షకుడై ఉన్నాడు.

మార్తా క్రీస్తు వాగ్దానమును అంగీకరించెను. ఆమె కేవలము నిత్యజీవమును మాత్రమే అనుభవించలేదు అయితే జీవమునిచ్చు వాడిని కూడా అనుభవించెను. ఆమె యేసును వాగ్దాన మెస్సయా అని కూడా నమ్మి మృతిని జయించువాడని నమ్మినది. చివరి తీర్పును కూడా తీర్చుటకు అతనికి అధికారము ఉన్నది. అతని శక్తిని ఆమెలో ప్రవహించెను, మరియు ఆమెను తిరిగి లేపెను. ఆమె తన సాక్ష్యమును గూర్చి చెప్పుటలో ఎంతో ధైర్యము కలిగినదిగా ఉన్నది. యూదులు క్రీస్తును దేవుని కుమారుడని చెప్పినందున రాళ్లతో కొట్టేదారని తెలిసికూడా ధైర్యము కలిగి ఉన్నది. ఆమె మరణమును గూర్చి భయపడలేదు అయితే రక్షకుడిని గూర్చి అతిశయించినది. ఆమె ధైర్యము మగాడిని సిగ్గుపరచునట్లుగా మరియు తన ప్రేమలో బలము కలదిగా ఉన్నది.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు నిత్యమూ ఘనపరచదగిన వాడవు. మరణమునకు నీపైన అధికారము లేదు. నీవు మాకొరకు మృతిపొంది మమ్ములను నీ పునరుత్థానములో లేపియున్నావు. కనుక మేము నిన్ను ఆరాధించి నీకు కృతజ్ఞతకలిగి ఉందుము. నీవు నీ జీవితమును మాతో పంచుకొన్నావు కనుక మరణమునకు ఏవిధమైన అధికారము లేదు. మమ్ములను మరణమునుంచి మరియు దోషమునుంచి తప్పించినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్న:

  1. మనము ఈ దినాలలో ఏవిధముగా మృతి నుంచి లేచెదము ?

యోహాను 11:28-31
28 ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియనురహస్యముగాపిలిచెను. 29 ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. 30 యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను 31 గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

యేసు మర్థకు మరియను కూడా తన మాటలను వినుటకు తీసుకొనిరమ్మని చెప్పెను ఎందుకంటె ఆమెకు కూడా ఆదరణ అవసము మరియు అక్కడున్నవారు ఆమెను సణుగుకొనుచున్నారు కనుక. అందుకు ఆమె తన విశ్వాసముతో క్రీస్తు ప్రేమను తెలియపరచినది. యేసు ధైర్యము కలిగిన విశ్వాసమును ఎల్లప్పుడూ కోరుకుంటాడు కానీ ఎప్పుడు బలహీనములో ఉండే విశ్వాసమును కోరుకోడు. అందుకే అతను ఏడుస్తున్న మరియను దేవుని వెలుగులోనికి నడిపించెను, అప్పుడు ఆమె ఆత్మీయమైన వెలుగులో ఉండునట్లు.

మరియా యేసు యొక్క రాకడను బట్టి వినలేదు ఎందుకంటె ఆమె బాధలో ఉన్నది కాబట్టి. అయినప్పటికీ, ఎప్పుడైతే మార్తా ఆమె దగ్గరకు వచ్చి యేసు నిన్ను అడుగుతున్నది చెప్పినప్పుడు ఎంతో ఆశకలిగి లేచి అతనిని కలుసుకొనుటకు బయలువెళ్లెను. అప్పుడు ఆమెను చూసిన అనేకులు ఒకవేళ ఆమె ఏడుస్తూ ఆ సమాధి దగ్గరకు వెళ్తుందేమో అని అనుకొనిరి. అందుకు వారందరు కూడా లేచి ఆమెను ఆ సమాధి దగ్గరవరకు వెంబడించిరి. కనుక క్రైస్తవ జీవితములో సమస్యకు ఒకవేళ పరిస్కారం దొరకని పక్షంలో మరణమునకు మరణము మరియు జీవమునకు జీవము ఇవ్వలేవు అయితే నిరీక్షణ మాత్రమే వారికి దొరుకును.

యోహాను 11:32-33
32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. 33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,

మరియ యేసును చూసి చాల ఉప్పొంగిపోయి పగిలిన హృదయము కలిగి అతని పాదములమీద పడెను. మరియు అతని మీద ఒక నమ్మకము అనగా ఖచ్చితముగా అతను ఒక అద్బుతమును చేయగలదని నమ్మెను. ఒకవేళ అతను ఇక్కడికి ముందే వచ్చిఉన్నట్లైతే అతని సహోదరుడు చనిపోకుండా ఉండును అనుకొనెను. ఈ విధమైన నిలకడకలిగిన విశ్వాసము దేవుడు క్రీస్తులో ఉన్నాడని అనుటకు ఒక సాదృశ్యముగా ఉన్నది. అయితే మరణము అనునది వారి విశ్వాసములను వణికించెను.

ఎప్పుడైతే క్రీస్తు ఈ విధమైన విశ్వాసము అతనిని వెంబడించిన వారిలో చూసినప్పుడు అతని ఆత్మ కంగారు పడెను. ఎందుకంటె వారందరు మరణమును గురించి ఏ విధముగా ఓడిపోయారో అని. మరియు వారు మరణమును గురించి యేడ్చుట అతనికి బాధకలిగించెను ఎందుకంటె ఈ లోకములో పూర్తి చేదు ఉన్నది కనుక. మరియు ఈ లోక పాపము అతని భుజములకు తగిలెను ; మరియు ఆత్మ అనునది సిలువకు అవసరమని మరియు సమాధి ఏడుచుటకు ద్వారమని . కనుక పునరుత్థానమును గూర్చి అతను మార్చిబడియున్నాడు.

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:26 AM | powered by PmWiki (pmwiki-2.3.3)