Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 058 (Sin is bondage)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

e) పాపము కట్టబడుట (యోహాను 8:30-36)


యోహాను 8:30-32
30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి. 31 కాబట్టి యేసు, తనను నమి్మన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; 32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

క్రీస్తు తగ్గింపు స్వభావము వినువారికి చాల మార్చినది. వారికి క్రీస్తు దేవుని నుంచి వచ్చినది ఇష్టములేక పోయెను క్రీస్తు వారి అంగీకారమును కోరుకొనెను. యేసు వారిని అతని మాటలు వినుతాను మాత్రమే ఇష్టపడక వాటి ప్రకారము నడుచునట్లు వారు ఉండుటకు ఇష్టపడి తీగలు కొమ్మకు ఏవిధముగా అయితే బంధము కలిగి ఉంటాయో అదేవిధముగా అతని తో కూడా బంధము కలిగి ఉండాలని కోరుకొనెను; అప్పుడు తన ఆత్మా వారి మీదికి వచ్చి వారిని తన వైపు ట్రిప్పునని భావించెను; అప్పుడు తన చిత్తమును వారు తెలుసుకొనునట్లు భావించెను. ఎవరైతే క్రీస్తు మాటలు నెరవేరుస్తారో వారు అతని సత్యమును తెలుసుకొంటారు. సత్యము అనునది మన అనుదిన జీవితములో ఎంతో ముఖ్యమైనదిగా ఉన్నది.

దేవుని సత్యము నిజమైనదిగా మరియు జ్ఞానము కలిగినది గా ఉండెను; మరియు దేవుడిని తండ్రిగా తెలుసుకొనుటయే, మరియు కుమారుడు , పరిశుద్ధాత్ముడు కూడా ఏకత్వము కలిగిన వారుగా ఉన్నారు. మను క్రీస్తులో ఉన్నాము కనుక పరిశుద్దాత్మును సత్యమును కూడా తెలుసుకొనెదము.

దేవుడు మన జీవితములను మార్చునట్లు మనము తెలుసుకొనినప్పుడు , ఇతరులను కూడా మనము ప్రేమ కలిగి ఉండడము. ఎవరైతే ప్రేమ కలిగి ఉండదో వాడు దేవుడిని తెలుసుకొనలేదని అర్థము. క్రీస్తు ద్వారా మనము దేవుడిని తెలుసుకొనినప్పుడు మన వ్యక్తిగతమును బట్టి ఆలోచనచేయువారుగా ఉండము. పశ్చాత్తాపమునుంచి మనము మన పాప బానిసనుంచి విముక్తి పొందినవారముగా ఉంటాము; కనుక దేవుని ప్రేమ, అతనిని అంగీకరించుట మరియు అతని ద్వారా స్ఖమాపణ ఇవన్నీ కూడా ఆత్మను మన జీవితములోనికి ఆహ్వానించుటకు ప్రారంభము.

యోహాను 8:33-36
33 వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 34 అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35 దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. 36 కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

యూదులు కలవరపడ్డారు; ఎందుకంటె వారి పితరులు కొన్ని వందల సంవత్సరములు ఫరో కాలములో జీవించియున్నారు. అందుకే వారు దేవుని మహిమతో సమానముగా చూడబడ్డారని అనుకొన్నారు (నిర్గమ 20:2). కనుకనే దేవుని మాటలు వారిని తొందరపెట్టాయి.

గర్వము కలిగిన వారికి యేసును నమ్ముటలో సంకోచము కలిగించినది. వారు పాపమునకు మరియు సాతానుకు బానిసలుగా ఉన్నారని చెప్పెను . మనము ఒకవేళ రక్షణను గురించి అర్థము చేసుకొనుటలో విఫలము చెందినట్లైతే మరణమునకు దగ్గరగా ఉంటాము. ఎవరైతే జ్ఞానము కలిగి నేను పాపిని అని తెలుసుకొనినట్లైతే అతను క్రీస్తును రక్షించుమని అడగవచ్చును. అందుకే మనము ఇక్కడ చాల మంది క్రీస్తును వెతకకుండుటకు కారణమును చూడవచ్చు. వారికి రక్షణ అవసరము లేదనేది మనము ఇక్కడ గమనించవచ్చు.

" ఎవరైతే పాపము చేస్తారో వాయు పాపమునకు బానిస. ఎందుకంటె యవనకాలమందు చాలా మంది అబద్ధముతో తమ జీవితములను ప్రారంభిస్తారు. వారు పాపముతో ఆటలాడి ఊహచేత జీవించువారుగా ఉండిరి; అయితే వారి భవిష్యత్తు మోసకారముగా ఉండునని తెలుసుకొనలేకపోయిరి. వారు అప్పుడప్పుడు కొన్ని కార్యములను బట్టి వారి దిన చర్యలుగా చేయుటకు ప్రయత్నించిరి అయితే వాటిని చేయకపోయిరి. ఎప్పుడైతే వాటి ప్రకారముగా జీవించాలని యోచించారో అప్పుడు సమయము వేల్లిపాయినదిగా ఉండెను; కనుక ఇప్పుడు వారు పాపమునకు బానిసలుగా ఉండిరి. అప్పుడు వారి చెడుతనమును బట్టి శపించువారుగా మార్చబడిరి. మనుషులు చేదు ఆలోచనలను బట్టి మార్చబడిరి. అయితే ప్రతి మనిషి క్రీస్తు లేకుండా పాపమునకు బానిసలైరి.

అప్పుడు దేవుని కుమారుడు, " ఇప్పుడు నేను మీ దగ్గర ఉండీ, మీ కట్టుబడులను తెలుసుకొని యున్నను. నేను మీ పాపములను బట్టి మిమ్ములను విమోచించుటకు నేను సమర్థుడను. నేను ఈ లోకానాడు సారము గా ఉండుటకు రాలేదు మరియు ధర్మశాస్త్రము ప్రకారము జీవిచుటకు రాలేదు. నీ గురి మీ పాప శక్తిని మరియు సాతాను నుంచి మీ మరణమును విడిపించుటకు వచ్చియున్నాను. నేను నిన్ను మర్చి నీలోనికి నా శక్తిని నింపి నీవు మరల పాపము చేయకుండునట్లు ఉండులాగున నేను మిమ్మలను ఉంచెదను. అయితే ఖశ్చితముగా సాతాను మిమ్ములను అనేక విధములుగా శోధించుటకు సిద్దపడును. అయితే మీరు మీ ప్రతి నిజమును తెలుసుకొనుటలో ఖచ్చితముగా ఉన్నారు."

" నీవు నిత్యమూ విడిపించబడినావు, నా రక్తముద్వారా కొనబడినావు, నీవు దేవునికి ముఖ్యమైన వాడివి. నీవు స్వతంత్రముగా ఉండునట్లు ఆయన పిల్లలుగా చేసియున్నాడు. కనుక నీవు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండునట్లు నేను నిన్ను మార్చుచున్నాను. నేను మాత్రమే నిన్ను బండి నుంచి విడుపించువాడను. నేను దేవుని స్వరమై దేవుని అధికారమును కలిగి ఉన్నాను."

ప్రార్థన: సాతాను నుంచి ఆ సిలువ రక్తము ద్వారా మమ్ములను మా పాపమునుంచి విడిపించి మా ఆరాధనకు పాత్రుడవైన యేసయ్య నీ మహిమను బట్టి మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీవు మా ప్రతి దోషములను క్షమించినావు. మేము పాపములకు తిరిగి బానిసలముగా ఉండనట్లుగా మమ్ములను పూర్తిగా కడుగుము. నిన్ను పూర్ణ హృదయముచేత సేవించునట్లు మమ్ములను మార్చుము.

ప్రశ్న:

  1. మనము ఏవిధముగా సత్యములో ఉండడము ?

క్విజ్ - 3

ప్రియా చదువరి మేము ఇచ్చిన 17 మరియు 19 వ ప్రశ్నలకు సమాధానములు పంపుము అప్పుడు మీకు కావలసిన పుస్తకములను పంపెదము.

  1. ఐదువేల మందికి ఆహారము పంచుటలో ఉన్న మర్మము ఏమిటి ?
  2. క్రీస్తు ఘనపరచబడుటకు ఎందుకు ఇష్టపడలేదు కారణము ఏమి ?
  3. యేసు ఏవిధముగా ఆశకలిగిన రొట్టెగా మరియు అతని యందు విశ్వాసముంచువాడుగా చేసెను ?
  4. “జీవాహారము” అనగా ఏమి ?
  5. ఆయన మాటలను విని సంగుచున్నవారిని బట్టి ఏవిధముగా స్పందించెను ?
  6. యేసు తనను వెంబడించువారికి తన శరీరమును మరియు తన రక్తమును తిని త్రాగమని ఎందుకు చెప్పెను ?
  7. జీవమిచ్చు ఆత్మ క్రీస్తు శరీరంలోనికి ఏ విధముగా వచ్చినది ?
  8. పేతురు సాక్షయమును బట్టి ఏవిధమైన మార్పు వచ్చినది ?
  9. ఈ లోకము యేసును ఎందుకు ద్వేషిస్తున్నది ?
  10. వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చినది అనుటకు సాక్ష్యము ఏమి ?
  11. ఎవరైతే నిజముగా దేవునిని తెలుసుకుంటారో వారికి యేసు ప్రాణ స్నేహితుడుగా ఎలా ఉంటాడు?
  12. యేసు తన భవిష్యత్తును గురించి ఏవిధముగా ప్రవచించెను ?
  13. " మీలో ఎవరైనా దప్పిగొనినట్లైతే నా యొద్దకు రండి " అని ఎందుకు అన్నాడు ?
  14. సామాన్య మనుషులను పరిసయ్యులు మరియు యాజకులు ఎందుకు తృణీకరించి ఉన్నారు?
  15. వ్యభిచారిణి పట్టుకున్నవారు క్రీస్తు నుంచి ఎందుకు దూరముగా వెళ్లిరి ?
  16. పరలోక తండ్రికి బంధము కలిగినట్లు క్రీస్తు ఈ లోకమునకు ఎలా వెలుగై ఉన్నాడు ?
  17. " నేను నేనే " అనే మాటకు ఉన్న విశ్వాసము ఏమిటి ?
  18. పరిశుద్ధ త్రిత్వమును బట్టి యేసు ఏ విధముగా ఐక్యతను చూపించాడు. ?
  19. మనము ఏవిధముగా సత్యములో ఉండడము ?

మీ చిరునామాను మరియు మీ సమాధానములను వ్రాయుట జ్ఞాపకము చేసుకొని. మీ సమాధానములను ఈ క్రింది చిరునామాకు వ్రాయండి.

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:14 AM | powered by PmWiki (pmwiki-2.3.3)