Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 046 (God’s Plan of Salvation)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
E - మన విశ్వాసము నిరంతరము ఉండును (రోమీయులకు 8:28-39)

1. రానున్న మహిమను బట్టి రక్షణను బట్టి దేవుని రక్షణ ప్రణాళిక స్లాగించును (రోమీయులకు 8:28-30)


రోమీయులకు 8:28-29
28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 

ఎవరైతే దేవుని గురించి తెలుసుకుంటారో వారు అతను సర్వశక్తి గలవాడని అనుకొనును. అతని చిత్తము లేనిది మరియు అతని జ్ఞానము లేనిది ఈ లోకములో ఏది కూడా జరగదు. అతను సర్వశక్తి కలిగిన దేవుడు. కొన్ని మతాలు నమ్మునట్లు మనము విధి దైవ సంకల్పమును నమ్మము, ఎందుకంటె మన గొప్ప దేవుడు మన కనికరము గలవాడని మనకు తెలిసి, అతను మనలను సంరక్షించి మనలను ఎన్నటికీ బాధపెట్టక నిర్లక్ష్యము చేయక మరియు విడువక ఉండును. కనుక మనము అతని ప్రేమయందు శక్తికలిగిన వారముగా ఉండుటకు బలపరచుమని, అప్పుడు మన ప్రతి శ్రమయందును మన విశ్వాసమునందు బలహీనంగా లేకుండా కాపాడును. కనుకనే పౌలు వ్రాసినట్లు మన రక్షణ యందు మనకు సంపూర్ణ విశ్వాసము ఉండాలి అని.

దేవుడు నీ యందు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుక నీవు పుట్టాక మునుపే నిన్ను ఎన్నుకొన్నారు. ఈ జగత్తు పునాది వేయబడకమునుపే అతను నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక నీ ప్రతి అంతరంగమును అతనికి తెలిసి, నీ ప్రవర్తన మరియు నీ ఆలోచనలు అతనికి మరుగై ఉండలేదు. నీ ఆలోచనలకంటే దేవునితో నీ బంధము ఎంతో లోతుగా ఉన్నది. నీవు దూరపు వాడవు కావు అయితే అతనికి దగ్గరకలిగినవాడవు. ఒక తండ్రి తప్పిపోయిన కుమారుని యెడల ఏవిధముగా అయితే ఎదురుచూచునో అదేవిధముగా అతను నీకొరకు ఎదురుచూచును. నీవు అతని గురించి ఆశకలిగి ఉండుటకంటె అతనే నీ గురించి ఆశకలిగి ఉన్నాడు.

గత జన్మములనుంచి నీ నిత్యుడగు తండ్రి నిన్ను యెరిగి ఉన్నాడు. నీ భవిష్యత్తును బట్టి అతను మహిమ కరమైన గమ్యమును పెట్టాడు, ఎందుకంటె నిన్ను క్రీస్తులో తన కుమారునిగా ముందుగానే ఏర్పరచుకొని, నీ పాపములను ఆ సిలువలో మోసుకొన్నాడు. అతనితోనే నీ ఉత్తమమైనది దొరికినది. ఎవరైతే కుమారుని యొక్క సమాధానమును కలిగి ఉంటారో వారు కదిలించబడరు, ఎందుకంటె పరిశుద్ధుడు నమ్మతగిన వాడు. కనుక నీకు దేవుడు ఒక గమ్యమును ఇచ్చాడని జ్ఞాపకము చేసుకో, మరియు క్రీస్తు రూపములో నీవు ఉండులాగున ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు, అనగా దేవుని కుడిపార్శ్యమున కూర్చున్నవాడు ఏర్పాటు చేసుకొన్నాడు. కనుక దేవునికి అందరు సమానులే కనుక ప్రతి ఒక్కరు సాత్వికము కలిగి ఉండునట్లు ప్రతి ఒక్కరు క్రీస్తు మార్గములలో నడువుమని చెప్పెను.

రోమీయులకు 8:30
30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. 

దేవుడు అతని ప్రేమ కలిగిన ఆలోచనలను నీతో పంచుకొని ఉన్నాడు.

నీవు అతని స్వరమును లోతుగా విన్నావా? నీ అంతరంగములోనికి అతని పిలుపు వచ్చినదా? నీవు ఇంకనూ పాపిగా ఉన్నపుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, మరియు నీవు అతని బిడ్డగా ఉండుటకు అతను ముందుగానే ఏర్పరచుకున్నాడు. అతను నిన్ను నీ గర్వమునుంచి, కామమునుంచి, మరియు నీవు పరిశుద్ధత యందు వెలిగించబడులాగున నిన్ను మార్చుటకు ఆలోచనకలిగి ఉన్నాడు. నీవు పరిశుద్ధ జీవితము కలిగి ఉండుటకు నీలో ఏ శక్తి కూడా లేదు అయితే అది కేవలము దేవుని వాక్యము ద్వారానే నీకు కలుగును. కనుక నీవు అనుదినము దేవుని పరిశుద్ధ గ్రంధము చదివినట్లయితే అప్పుడు దేవుడు నీతో నేరుగా మాట్లాడును.

దేవుడు నీ రక్షణను మరియు నీ పునాదిని అతని నీతికలిగిన స్థలములో వేసాడు కనుక సాతానుడు నీ విశ్వాసమును ఎత్తికొని పోడు. మన నీతి కలిగిన దేవుడు తన కుమారుని మరణము ద్వారా పరిశుద్ధపరచి, నీ పాపములను ఒక్కరికే తుడిచిపెట్టాడు. కనుక నీవు ఇప్పుడు క్రీస్తు సమాధానంలో నీతి కలిగి ఉన్నావు, మరియు అతని పరిశుద్ధతలో విమోచనకలిగి ఉన్నావు. కనుక ప్రభువు నీలో ఉంచిన తన ప్రేమను బట్టి ఎప్పుడు అతనికి కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎప్పుడు అతని కాపుదలను మరియు అతని నమ్మకమైన కృపను ఘనపరచెదవు?

దేవుడు తన శక్తిలో నిన్ను నిర్ణయించుకున్నాడు. అతను తన పరిశుద్ధాత్మను నీకు ఒక మహిమ కరమైన జీవితముగా ఇచ్చి ఉన్నాడు. కనుక, దేవుని యొక్క మహిమ నీలో దాగుకొని ఉన్నది. క్రీస్తు ఏవిధముగా అయితే విశ్వాసుల కన్నులకు కనపరచుకొన్నాడో అదేవిధముగా తన ప్రేమను, సత్యమును మరియు ఓర్పుకలిగిన కార్యములను నీలో ఉంచాడు. దేవుని ఆత్మ నీలో ఫలములను ఫలించును, ఒకవేళ నీవు రక్షకుని యందు నిలిచి ఉన్నట్లయితే. పౌలు నీయందు దేవుడు భవిష్యత్తులో మహిమపరచబడతాడని చెప్పలేదు, అయితే విశ్వాసమందు గతములో నీయందు అతను మహిమపరచబడెను అని చెప్పినాడు, ఎందుకంటె క్రీస్తు విశ్వాసమునకు కర్త మరియు ముగించువాడని చెప్పెను. అతను నీకు తన శక్తి చేత నేర్పిస్తున్నాడు.

నీకు జీవితములో సమస్యలు ఉన్నాయా? నీవు ఆకలిగొన్నవా లేక రోగము కలిగి ఉన్నావా? నీవు ఉద్యోగమూ కొరకు ఎదురుచూస్తున్నావా? నీవు పాఠశాలలో తప్పవా? ఇవన్నీ కూడా నీకు అవసరము లేనివి ఎందుకంటె దేవుడు నీతో ఉన్నాడు. అతను నిన్ను ప్రేమించి, సంరక్షించి మరియు నిన్ను తన కనురెప్పవలె కాచును. అతను నిన్ను సంపూర్ణముగా మరచి పోక నిన్ను చివరివరకు కాయును. పరిశుద్ధుడు నిన్నుదత్తత తీసుకొనును. కనుక నిన్ను నీవు ఖండించి, నీ సిలువను తీసుకొని, దేవుని కుమారుడైన యేసు సిలువను వెంబడించు, ఎందుకంటె అన్ని కార్యములు దేవుని మహిమ కొరకు జరిగించబడును. నిన్ను మొదటగా ప్రేమించిన వాడిని నీవు ప్రేమిస్తున్నావా?

ప్రార్థన: ఓ పరిశుద్దుడైన దేవా, త్రిత్వము కలిగిన వడ, నీవు మమ్ములను ఎన్నుకొన్నందుకు నిన్ను ఆరాధిస్తున్నాము, మమ్ములను క్రీస్తు మహిమను కలిగి అతని ప్రేమలో ఉంచావు. నీవు మమ్ములను ఎన్నుకొనుటకు మేము ఎవరము? నీ సమాధానమును మరియు నీ పిలుపును బైబిల్ ద్వారా అంగీకరించుటకు మా హృదయములను మా చెవులను తెరువుము. ఎందుకంటె మేము క్రీస్తు రక్తములో సమాధానపరచబడినాము, నీ నమ్మదగిన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ చెడు దినాలలో మేము చెడిపోక నీ పరిశుద్ధాత్మలో ఉండునట్లు నీవు మమ్ములను నడిపించు.

ప్రశ్నలు:

  1. దేవునిని ప్రేమించు వారికి సమస్తము మంచి జరుగునట్లు కార్యములు ఎందుకు జరుగును?

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి,
మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. 
(రోమా 8:28)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:10 AM | powered by PmWiki (pmwiki-2.3.3)