Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 066 (Sheep hear the voice of the true shepherd; Jesus is the authentic door)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
3. యేసు మంచి కాపరి (యోహాను 10:1-39)

a) గొర్రె తన నిజమైన కాపరి స్వరము వినును ( యోహాను10:1-6)


7 మరియూ 8 వ అధ్యాయములో క్రీస్తు ఆ ప్రజల నిజమైన పరిస్థితులను చూపియున్నాడు , మరియు 9 వ అధ్యాయములో దేవుని జ్ఞానమును తెలుసుకొనుటలో వారు గ్రుడ్డితనమును మరియు అతని కుమారుని తెలుసుకొని యున్నాడు. 10 వ అధ్యాయములో తనను వెంబడించువారిని తన నుంచి వేరుపరచెను, వారిని తిరిగి తన కొరకు పిలిచియున్నాడు. అతను మాత్రమే దేవునికి ద్వారమై మరియు ఒక మంచి కాపరి అయి ఉన్నాడు.

యోహాను10:1-6
1 గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. 2 ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి. 3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును. 4 మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును. 5 అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

కొన్ని గ్రామాలలో గొర్రెలన్నిటినీ ఒక చోట ఉంచి కావలి వారు రాత్రి సమయములో కాపు కాచెదరు. మరియు ఉదయము అయినప్పుడు కాపరులు వచ్చి తమ గొర్రెలను పిలిచి తమతో తీసుకొని వెళ్ళెదరు. కావలి వారు ఆ కాపరులు వచ్చుటకు అనుమతిస్తారు కనుక వారు వచ్చి తమ గొర్రెలను తీసుకొని వెళ్ళెదరు: అయితే ఆ కాపరులు తమ గొర్రెలను లాగుకొనరు అయితే తమ ప్రత్యేకమైన స్వరము ద్వారా పిలిచినప్పుడు అవి వారి స్వరమును విని అనుసరించును. అప్పుడు ఒక గొర్రె ఆ స్వరమును ఇతర గొర్రెలకు చెప్పి తమ స్వంత కాపరిని వెంబడించును. ఒకవేళ తమ కాపరి వేరే విధమైన బట్టలు ధరించిననూ అవి వాని స్వరము విని వెంబడించును. అయితే ఒక వేళా వేరే మోస పూరితమైన కాపరి తమ సొంత కాపరివలె బట్టలు ధరించి వచ్చిననూ అవి వానిని వెంబడించవు. అయితే ఆ గొర్రెలు నిజమైన స్వరమునే వెంబడించును. కనుక ఆ నిజమైన కాపరి తన గొర్రెలను పచ్చిక మరియు నీరు దొరుకు స్థలమునకు తీసుకొని వెళ్ళును. అతని గొర్రెలు అతని వెనక ఉండును కానీ అవి మాత్రమూ అతని ముందు వుండవు వారి కాపరిని అవి వెంబడించును.

యేసు దీనిని తనను వెంబడించువారికి ఒక సాదృశ్యముగా చూపియున్నాడు, అనగా తన స్వరమును వినువారు ఈ విధముగా ఉండాలని అనుకొనును, కనుక వారికి క్రీసు ఒక నిజమైన కాపరి అయి ఉన్నాడు. అతను పాత నిబంధన ప్రకారముగా చెదరగొట్టుటకు లేదా దొంగతనము చేయుటకు రాలేదు, అయితే వారందరిలో అతను కొంతమందిని ఎన్నుకొని తన కొరకు పిలిచును. వారిని విడిపించి వారికి ఆత్మీయ ఆహారమును దయచేసెను. వేరే " కాపరులు" గొర్రెల చుట్టూ తోడేలు మాదిరి ఉన్నారు. వారు ఇతరుల సహాయము చేత ప్రవేశించి మోసముచేసెదరు. మరియు గొర్రెలను పట్టుకొని వారికొరకు తీసుకొని వెళ్ళెదరు. ఎందుకంటె వారు వారికొరకు జీవించి వారిని వారే ఘనపరచుకొనెదరు. వారు నిజమైన కాపరిగా ఉండరు. ఎప్పుడైతే సంఘములలో సేవకులు మరియు పరిచారకులు దేవుని పిలుపుతో పిలువబడకున్నప్పుడు ఇలాంటి దొంగలు సంఘములలో ప్రవేశించి చెదరగొట్టెదరు. వారు సహాయము చేయక హాని చేయుదురు.

అందుకు యేసు తన నిజమైన సంఘ కాపరులు తమ సంగములను కాపాడుకొని హాని చేయు వారినుంచి జాగ్రత్తగా ఉందురు. మరియు దావీదు కీర్తన 23 లో చెప్పినట్టు వారు నిజమైన కాపరి సంరక్షణలో ఉండెదరు.

ప్రజలు యేసు మాటలను వినక వారి కాపరులు నమ్మకస్తులు కాదని ఎరుగక ఉండిరి (యిర్మీయా 2:8; 10:21; హెఙ్కేల్ 34:1-10; జెకర్యా 11:4-6). idi కాక దేవుడు వారికి నిజమైన కాపరి అగుటకు సిద్ధముగా ఉన్నాడు, వారిని నమ్మకమైన సేవకుల దగ్గరికి పంపుటకు అనగా మోషే మరియు దావీదు దగ్గరకు పంపినట్లు సిద్ధముగా ఉన్నాడు. అందుకే బైబిల్ " కాపరి" మరియు " గొర్రెల మంద " మరియు " దేవుని గొర్రెపిల్ల " మరియు " రక్తము ద్వారా విడుదల " , ఇవన్నివ్యూ సేవకుల కార్యములలో వచ్చునవి. దేవుడు తన కుమారుని ద్వారా మంచి కాపరి అని పిలువబడుచున్నాడు, ఎందుకంటె మనకు ఒక సంరక్షణను దయచేయుటకు.


b) యేసు ద్వారమై ఉన్నాడు (యోహాను 10:7-10)


యోహాను 10:7-10
7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను 8 గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు. 9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. 10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యేసు తనను తాను దేవుని దగ్గరకు వేళ్ళు ద్వారముగా చెప్పెను. దేవునితో సంబంధము కలిగి ఉండుటకు క్రీస్తు ద్వారా తప్ప మరి ఏ విధమైన మార్గము లేదు. ఎవరైతే క్రీస్తు లేకుండా ఒక మతమును చేయగలడో వాడు దేవుని గొర్రెల గుంపును పాడు చేయువాడుగా ఉండును. పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు దగ్గరకు వెళ్ళుటకు విశాలమైన మార్గములో నడిపించాడు అయితే ఇరుకైన మార్గములో మనలను నడిపించును. ఎవరైతే ఈ విధమైన మార్గములో ప్రయాణించాక, అతని శరీరములో పాలుపంచుకొనక, అతని రక్తములో చేయి ముంచక ఉండిన యెడల వారు దేవుని పిల్లలగుటలో ఏవిధమైనటువంటి అధికారము లేదు. మనము దేవుని గుంపులో చేరిఉండాలంటే , మనలను మనము ఖచ్చితముగా చంపుకోవాలి; అప్పుడు మనము అతని మందలో ఉండగలం.

ఎవరైతే క్రీస్తు ముందర పరిశుద్ధాత్మను పొందుకున్న ముందు మరియు తరువాత ఒకవేళ భ్రమింపజేసే అద్భుతము కలిగిన యెడల వారు ప్రఖ్యాత చెందిన వారుగా ఉంటారు. యేసు చెప్పినట్టు ప్రతి ఒక్కరు అనగా విగ్రహారాధికులు, జ్ఞానులు మరియు జాతీయ నాయకులు అందరు కూడా ఒకవేళ క్రీస్తును నమ్మక మరియు సమర్పించని యెడల వారు దొంగలుగా ఉంటారని చెప్పెను; వారు వారి బోధచేత అందరిని చెడగొడతారు. అయితే నిజమైన ప్రవక్తలు క్రీస్తు ఆత్మీయతతో ఉంది వారిని క్రీస్తు నలిగినా హృదయముగా పిలువబడగలేరు, వారు దేవుని దగ్గరకు నేరుగా ద్వారా ప్రకారంజ్ వచ్చెదరు. కనుక యేసు వారిని నమ్మకమైన వారినిగా మరియు అతని గొర్రెల మండలానికి పాముపుటకు వారిని సిద్ధముచేసెను.

ఎవ్వరు కూడా తమను తాము చనిపోక క్రీస్తు దగ్గరకు మరియు అతని గుంపులోనికి ఎవ్వరు కూడా ప్రవేశించలేరు. యేసు తగ్గింపు కలిగిన వారిని రాజులుగా మరియు యాజకులుగా చేయును. నిజమైన సేవకుడు నేరుగా తన ద్వారంగుండా లోకములోనికి వెళ్లి నశించిపోతున్నవారిని రక్షించుటకు వెళ్ళును. అప్పుడు అతను తిరిగి క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించును, అప్పుడు వారు క్రీస్తులో మరియు క్రీస్తు వారిలో నిలిచియుండును. అలాంటి సేవకులు గొర్రెలకంటే ఉన్నతమైనవారని చెప్పారు, ఎందుకంటె వారందరు క్రీస్తులోనికి ప్రవేశిస్తారు కనుక. ఎవరైతే తగ్గింపు కలిగి బ్రభువును కనుగొని ఉన్నట్లయితే వారు పూర్ణ శక్తి కలిగి మరియు జ్ఞానము కలిగి ఉండెదరు. కనుక తగ్గింపుకలిగినవారు ఎల్లప్పుడూ పచ్చికలో ఉందురు.

యేసు తన శిష్యులను పరిసయ్యులనుంచి మరియు యాజకులనుంచి గద్దించెను, ఎందుకంటె వారు తమ హృదయములలో వారే ఘనత కలిగిన వారుగా అనుకొనిరి కనుక .

అదేసమయములో క్రీస్తు ప్రతి ఒక్కరిని నిజమైన మంచి జీవితము కొరకు మరియు ఆశీర్వాదమునకు కారకులుఅగునట్లు పిలిచియున్నాడు. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో వారు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. కాపరులు ఎప్పుడు కూడా తమ కొరకు జీవించక , వారు జీవితములను గొఱ్ఱెలకొరకు త్యాగము చేస్తారు. దేవుని ఆత్మ మనకు పరలోక జీవితమును మనము వ్యక్తిగతమైన రక్షణ కలిగి ఉన్నామని ఇవ్వదు, అయితే మనలను మనము విడిచిపెట్టి ఇతరుల కొరకు సేవకులుగా మరియు దాసులుగా ఉండుటకు నియమించెను, కనుక అప్పుడు మనము ఇతరులను ప్రేమించువారుగా ఉంటాము . ప్రేమ ఎప్పుడైతే అధికమవుతుందో అప్పుడు ఆశీర్వాదము కూడా అధికమవుతుంది. క్రీస్తు సేవ కంటే ఎక్కువైనది ఏది కూడా లేదు! అందుకే ," వారికి ఆశీర్వాదకరమైన జీవితము ఉండును"!

ప్రార్థన: ప్రభువైన యేసు , దేవుని దగ్గరకు చేరుటకు మాకు నీవు ద్వారమైనందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను నీ సహవాసములోనికి పిలిచినందుకు నీకు మేము ఆరాధన చెల్లిస్తున్నాము, నిన్ను మరియు మనుషులకు సేవచేయుటకు పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. నిజమైన జీవితము కలిగి ఉండులాగున మాకు నీ సహాయము దయచేయుము. నీ ఆత్మ చేత నింపబడి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు నీ కృపను దయచేయుము, మరియు నీ కృపను మేము పొందినట్లు మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్ములను దీవించు.

ప్రశ్న:

  1. యేసు తన గొర్రెలకు ఏవిధమైన ఆశీర్వాదమును కుమ్మరించును ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:21 AM | powered by PmWiki (pmwiki-2.3.3)