Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 065 (Do not be Proud)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

2. తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను (రోమీయులకు 12:3-8)


రోమీయులకు 12:3-8
3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. 4 ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, 5 ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. 6 మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, 7 ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను, 8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను. 

పౌలు గొర్రెలకు ఒక కాపరి సూచనలనుఇచ్చునట్లు ఇవ్వలేదు, అయితే ఈ లోకములో ఉండు సంఘమునకు కావలసిన చివరి ఆదేశాలను ఇచ్చెను.

నీ స్థితికంటె ఎక్కువగా నిన్ను నీవు ఆలోచనచేయకు, అయితే నీకు నీవు ఏమిలేనివాడివని అనుకొనుము, అప్పుడు నీవు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండెదవు. క్రీస్తు పిలుపును బట్టి అతని పరిచర్యచేయుటలో నీ ఆత్మీయ బహుమానములను తెలుసుకో. నీ ఆలోచనల ప్రకారముగా కాక దేవుని చిత్తానుసారముగా కార్యములను చేయుము అప్పుడు ఆత్మీయముగా ఎదిగిన వారి యెడల నీవు నడిపింపుకలిగి ఉండెదవు.

నీ యొక్క పరిచర్య అనునది నీ యొక్క బహుమానము కాదు, అయితే నిజమునకు ఇది క్రీస్తు యెడల నీకు కలిగిన విశ్వాసము ద్వారా అతని పరిచర్యలో నీవు నెరవేర్చబడుతున్నావు. అతని యొక్క శక్తి నీ రహస్య కార్యములను చేయగలదు. కనుక యేసులో నీ ప్రతి ఆలోచన, మాట, మరియు సమస్తము చేయుము, అప్పుడు నీవు అతని ప్రేమ కలిగిన ఫలములను నీవు నీ జీవితములో చూడగలవు.

ఒక ఆత్మీయమైన ఫలము కలిగినదంటే అది కేవలము క్రైస్తవులలో నీకు ఉన్న శక్యతే కారణము. ఈ ఐక్యత లోకానుసారముగా లేదు అయితే క్రీస్తులో ఆత్మీయముగా ఉన్నది. వారు విమోచకుని కొరకు ఒక ఆత్మీయ శరీరము కలిగి ఉన్నారు; కనుక క్రీస్తు వారి కార్యములను చేయును. వారిలో ఎవ్వరు కూడా ఒంటరిగా కార్యములు చేయరు అయితే ప్రతి ఒక్కరు కూడా సమాధానపరచబడిన వానియందు ఐక్యత కలిగి ఉందురు. క్రీస్తు నీ శక్తి అయి ఉన్నాడు కనుక నీవు అతని యందు ఉన్నావు. ఎవ్వరికీ అన్ని బహుమతులు ఉండవు. క్రీస్తు యొక్క శరీరములో, కాలుకు హృదయము అవసరము, చేతికి తల, కంటికి ఇష్టము, మరియు వ్రేలుకు మెదడు అవసరము. కనుక ఒక సంఘములో ఉన్న ప్రతి సభ్యులకు కూడా ఇతరుల దగ్గర సరి అయినా ఐక్యత ఉండాలి, అప్పుడు వారు కలిసి క్రీస్తును సేవించెదరు.

నీ చేయి ఒక వేళా నీ మెదడుకు వ్యతిరేకముగా కార్యము చేస్తున్నట్లైతే అది బుద్ది హీనము, లేదా నీ కన్నుల ద్వారా నీవు ఒక గుంతను చూస్తున్నప్పటికీ అంటూనే నీవు నడుచుకుంటూ వెళ్తుంటే అది నీకు ఎంత బుద్ది హీనత? ఎవరైతే ఇతర సభ్యులతో సఖ్యతగా ఉండక ఉందురో వారందరూ కూడా స్వలాభముగా, బీదవారిగా, చిన్నగా మరియు బుద్ధిలేని వారీగా ఉందురు.

పౌలు ఆత్మీయ బహుమానముల గురించి కొన్ని సంఘములలో జ్ఞాపకము చేసుకొన్నాడు. ఎవరైతే నిద్ర నుంచి లేచి ఉన్నారో వారు కేవలము మానవత్వముతో అనగా పరిశుద్ధ గ్రంధమును ప్రక్కకు పెట్టి మాట్లాడక, అయితే దేవుని వాక్యాను సారముగా ఉంది, ప్రతి ఒక్కరినీ కూడా యేసు దగ్గరకు నడిపించాలి.

ఒక వేళా మీలో ఎవరికైన ధనము, సమయము అను సామర్థ్యము ఉన్నట్లయితే అతడు సంఘములో ఉన్న అవసరంలో ఉన్నవారికి సహాయము చేయవలయును. అతను గంభీరంగా మాట్లాడక మౌనముగా ఉంది తన కార్యములను రహస్యముగా చేయవలెను, మరియు ఆవి దేవుని జ్ఞానముకలిగి చేయాలి. ఆత్మీయమైన గురువు దేవుని సువార్తను ఆత్మీయముగానే బోధించాలి, మరియు వినువారికి మంచిగా అర్థము అగునట్లుగా చెప్పి దేవుని వాక్యమును ఉంచుకొనునట్లుగా చేయాలి. ఎన్నో అంశములను బట్టి బోధించుట అనునది ముఖ్యము కాదు అయితే ఎలా చెప్పాము అన్నదే ప్రాముఖ్యము; అయితే వినువారికి అర్థము కాకుండునట్లు చెప్పి అది ముగిసిన తరువాత చివరకు ఒక పెద్ద ప్రశ్నలు వేసి వదిలివేయకూడదు.

ఎవరికైన ఆత్మీయ సంరక్షణ, నడిపింపు అను బహుమానములు ఉన్నట్లయితే అతను మౌనముగా ఉండాలి, అప్పుడు ఇతరుల సమస్యలను విని వారి ఆత్మీయ స్థితిని అర్థము చేసుకోవాలి. అప్పుడు అతను తన సొంత ఆలోచనల ప్రకారము మాట్లాడక అతను ఆత్మీయమైన మాటలు పొందుటకు ప్రభువును ప్రార్థించాలి. ఎవరికైతే రక్షణ అనునది అవసరంగా ఉన్నదో వారిని బట్టి ఆలోచనకలిగి ఉండుట మంచిది, వారు క్రీస్తుకు స్నేహితులగువరకు వారిని బట్టి ప్రార్థించుట మరియు వారిని గురించి ఆలోచించుట ఎంతో అవసరము.

పౌలు చెప్పినట్లు ఎవరైతే ఇతరులకు సహాయము చేయాలనుకుంటారో వారు బహిరంగముగా అందరికీ కనబడునట్లు కాక రహస్యముగా సహాయము చేయాలి, అందుకే యేసు చెప్పినట్లు: "నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి తెలియబడనియ్యకుడి" అని. కనుక నీ ఘనత కొరకు పరిచర్య చేయకు అయితే క్రీస్తు ఘనత కొరకు పరిచారము చేయుము.

ఎవరైతే సంఘములో కానీ లేదా సమాజములో కానీ నాయకునిగా ఉండాలనుకుంటే అతను ఇతరుల ద్వారా వెక్కిరించబడక, వ్యతిరేకించబడక, నిదానముగా ఉండక, అయితే అతను యేసు యొక్క శక్తి కలిగి తన కార్యములను చేయాలి, మరియు అవన్నీ కూడా క్రీస్ట్ ప్రేమ కలిగి చేయక ఉండినట్లైతే అవన్నీ కూడా వ్యర్థమే.

"కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి". అని యేసు చెప్పినట్లు మనము ఉండాలి (లూకా 6:36)

"నీవు ఏమి చేయాలనుకున్నా అది హృదయ పూర్వకముగా చేయుము, అది ప్రభువుకు చేయునట్లు మనుషులకు కాక" అని పౌలు ఈ విధమైన ఆలోచనలను మనకు పరిచయము చేస్తున్నాడు. ప్రేమ అనునది క్రైస్తవుల సిద్ధాంతముగా ఉండాలి.

ప్రార్థన: ప్రియమైన యేసు ప్రేమను బట్టి మేము ప్రారంభకులము, కనుక మేము ఇతరుల ద్వారా కనికరమును కోరుకుంటున్నాము. మేము నిన్ను మా బహుమానములచేత నిన్ను సేవించునట్లు మా మనసులను మార్చుము; అప్పుడు మేము సహనంతో, విశ్వాసముతో, పట్టుదలతో, మరియు ఖచ్చితత్వముతో నిన్ను సేవించెదము, అయితే వాటి ద్వారా నీ చిత్తమునే మేము నెరవేర్చవలెను. మేము శోధనలో పడకుండాఆ మమ్ములను గర్వము నుంచి కాపాడు.

ప్రశ్నలు:

  1. ఈ దినము ఏ పరిచర్యను నీవు ప్రాముఖ్యముగా భావించుచున్నావు?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:37 AM | powered by PmWiki (pmwiki-2.3.3)