Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 018 (Healing of a Cripple)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

9. కుంటివాడు స్వస్థత పొందుట (అపొస్తలుల 3:1-10)


అపొస్తలుల 3:1-10
1 పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, 2 పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. 3 పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా 4 పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి. 5 వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. 6 అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి 7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. 8 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను. 9 వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి 10 శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 

అపోసోతాలులు మరియు సంఘ సభ్యులు ప్రార్థన చేసినతరువాత దేవాలయములోనికి ప్రవేశించిరి. వారు పరలోక తండ్రి స్థలమును బట్టి ద్వేషించలేదు, వారికి వారు పరిశుద్దాత్మునికి దేవాలయమై ఉన్నప్పటికీ. వారి యెడతెగక ప్రార్థ వాళ్ళ మరియు దేవునికి నిజమైన కృతజ్ఞత కలిగి ఉండగా వారిని దేవుడు శక్తికలిగిన వస్త్రములతో కప్పెను. బైబిల్ ఫాఠనము ద్వారా మరియు ప్రార్థన ద్వారా తప్ప ఎవ్వరు కూడా ఆత్మీయ శక్తిని పొందుకొనలేరు. అపొస్తలుల హృదయములు సంపూర్ణ ప్రేమచేత నింపబడిఉన్నాయి, కనుక వారు బీదలను బట్టి సహాయము చేయువారుగా ఉండిరి. వారు అవసరంలో ఉన్నవారిని మరియు బీదవారిని చూడక దాటిపోలేదు, అయితే దేవుని ప్రేమచేత అందని యెడల ప్రేమ కలిగి ఉండిరి.

ఎప్పుడైతే పేతురు మరియు యోహాను శబ్దముతో నిండి ఉన్నదేవాలయములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గుంపు ప్రార్థనలో ఉండుట చూసినప్పుడు ఒక తీయ్యని స్వరము మాట్లాడుట వినిరి. అప్పుడు వారు పక్కకు తిరిగి చూడగా ఒక పుట్టుకతో కృంటి వానిని చూసిరి అతను, ఇతరుల సహాయము లేనిదే తన జీవితములో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. దేవుని పరిచారకులు అతని యెడల ప్రేమ కలిగి ఉండిరి కనుక అతనికి సహాయము చేయాలని ఆశపడిరి. పరిశుద్ధాత్ముడు యేసు శక్తిని నమ్ముమని వారికి చెప్పెను, మరియు వారి విశ్వాసమును రక్షకుని మీద ఉంచుమని చెప్పెను. అప్పుడు పేతురు యోహాను దేవుడు ఈ మనిషి ద్వారా మహిమపరచబడాలని ఉద్దేశించెనని అనుకొనిరి.

ప్రారంభ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నదంతటిని పోగుచేసి అందరు కలిగి బ్రతికిరి కనుక పేతురు అతనికి నేను ధనికుడిని కాను అని చెప్పెను. పేతురు ఈ విధమైన సూత్రాలను ప్రతి జీవము కలిగిన సంఘములో చెప్పెను: "మా దగ్గ వెండి కానీ బంగారము కానీ లేవు, ఒకవేళ మాతో ఉన్నట్లయితే మేము బీదలను వాటిద్వారా సహాయము చేయగలము." డబ్బు మా సంఘములో ఒక సహజముగానే ఉన్నది. కనుకనే దేవుని యొక్క శక్తి సంఘాలలో దహనము విషయములో బలముగా లేదు, అయితే ధనముతో ఖాళీగా ఉంది విశ్వాసముతో ధనికముగా ఉన్నది, ఎందుకంటె క్రీస్తు ప్రేమ చేత నింపబడియున్నది కనుక. కనుక సహోదరుడా నీకు ఏమి కావాలి, శక్తి కావాలా లేక ధనము కావాలా? క్రీస్తు కావాలా లేక ఈ లోకము కావాలా? ఈ రెండు కలిగి ఎన్నటికీ వెళ్ళలేవు.

అపొస్తలులు పుట్టకతో కృంటివాడైన వాని ప్రక్క రెప్పవేయక చూసిరి. వీరిద్దరూ అతని యెడల కనికరము చూపిరి అని ఈ కృంటి వాని అంతరంగము చెప్పెను. వారు అతనిని విడువలేదు, లేదా అతనిని ఒక రాజకీయ నాయకునిగా అధికారముచేయలేదు. మొదటిగా అతను వారి నుంచి డబ్బును ఆశించాడు, అయితే ఎప్పుడైతే వారు కూడా అతనివలె బీదవారు అని చెప్పినప్పుడు అతను ఏమి ఆశించలేదు.

ఎప్పుడైతే పేతురు "యేసు" అను నామమును జ్ఞాపకము చేసారో అతను జాగరత్తగా వినెను. ఈ పేరును ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వలేదని అనుకొనెను, దాని అర్థము "దేవుడు సహాయము చేయును" అని. క్రీస్తు మాత్రమే రక్షకునిగా, సహాయము చేయువాడు, స్వస్థత చేయువాడు, అని పేతురు చెప్పెను. ఈ కృంటి వాడు సిలువవేయబడిన వాని గురించి ఇంతకు ముందే విని ఉండెను. ఈ పేరును బట్టి అతను ఎంతగానో ఆనందించి ఉంటాడు. కనుక ఈ పరిశుద్దుడైన దేవుడిని మరియు, సిలువ వేయబడిన వానిని తిరిగి లేపుట మరియు యెరూషలేము వీధులలో సంచరించువాడిని అతను జ్ఞాపకము చేసుకొనెను.

కృంటి వాడు యేసు నామములో నడువుమని ఆజ్ఞపొందెను. అతని మణికట్టుకు పేతురు పట్టుకొని లేపును అని అనుకొన్నాడు, మరియు అతని శరీరము ద్వారా ఒక విధమైన ప్రేమ కలిగి ఉన్నట్లుగా అనుకొనెను. అప్పుడు అనుకోకుండా అతని కండరములు మరియు అతని ఎముకలు శక్తి పొందుట చూసిరి. అప్పుడు అతను "యేసు క్రీస్తు నామములో లేచి నడువుము" అను స్వరమును వినిరి. అప్పుడు అతను ఒక గొప్ప ఆశ్చర్యము ద్వారా లేచి నడుచుట చూసేను.

కృంటి వాడు తన జీవితములో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పుడు అతను ఒక జింకవలె యెగిరి పిల్లవానివలె పరిగెత్తి పోయెను. అతను సంపూర్ణ ఆనందముచేత నింపబడినాడు. అతను అపొస్తలులును ఘనపరచక దేవునిదిని మహిమపరచెను. యేసు అతనిని స్వస్థపరచాడని అతనికి తెలుసు కనుక అతను నేరుగా తన ఇంటికి వెళ్ళలేదు. అయితే, ప్రార్థన చేయుటకు వచ్చిన అపొస్తలుల వెంట దేవాలయములోనికి వెళ్లి దేవుడిని ఘనపరచెను. అతని ఆనందకరమైన స్థితిలో అతను కుడి ప్రక్కన మరియు ఎడమ ప్రక్కన పరిగెత్తి పోయెను. మనము అనుదినము ఏదైతే అనుభవిస్తున్నామో దానినే అతని మొదటిసారిగా అనుభవించెను, మనము అనుదినము నడుచునట్లు దేవుడు మనకు తన కృపను దయచేసి ఉన్నాడు. ఈ అవకాశమును బట్టి దేవునికి నీవు కృతజ్ఞత చెప్పవా?

అక్కడ మధ్యాహ్నము మూడు గంటలు అయినది కనుక అనేకులు దేవాలయములోరికి ఆరాధించుటకు వచ్చియుండిరి. అక్కడ ఆ కృంటి వాడు సంతోషముతో అటు ఇటు తిరుగుతున్నా వాడిని వారందరూ ముందుగానే చూసారు. అతను క్రీస్తు యొక్క శక్తిగా మారాడు. అతనిలో కలిగిన ఈ క్రొత్త శక్తిని బట్టి వారు ఆశ్చర్యపడిరి.

ప్రియా సహోదరుడా నీవిషయము ఏమి? నీవు కూడా ఈ కృంటి వాని వాలే దేవాలయము తలుపుదగ్గర కూర్చొని లోపలి బయటకు వచ్చువారితో ఏదైనా ఆశకలిగి ఉన్నావా? లేదా నీవు నడచి అతనివలె యెగిరి అతని నామమును ఘనపరచునట్లు యేసు తన శక్తి చేత నింపినదా? నీ ప్రవర్తన ద్వారా రాత్రి మరియు పగలు అతనిని ఘనపరచుచున్నావా?

ప్రార్థన: అపొస్తలుల విశ్వాసము ద్వారా నీవు కృంటి వాడిని స్వస్థ పరచినందుకు నీకు మేము కృతఙఞతలు చెల్లించుకుంటున్నాము. మా విశ్వాసము ద్వారా కూడా నీ నామము ఘనపరచబడును గాక. మేము బీదలను ప్రేమించి ధనమును ఆశించకుండా ఉండునట్లు మమ్ములను నీ కనికరం చేత నింపుము. నీ నామమును ఘనపరచునట్లు మరియు నిన్ను మహిమపరచునట్లు మమ్ములను నీ శక్తి కలిగిన స్వస్థతచేత నింపుము.

ప్రశ్న:

  1. "నజరేయుడైన యేసు క్రీస్తు నామము" అను ప్రకటనకు గల అర్థము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:48 PM | powered by PmWiki (pmwiki-2.3.3)