Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 017 (Spiritual Life in the Early Church)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

8. ప్రారంభపు సంఘములో ఉన్న ఆత్మీయ జీవితము (అపొస్తలుల 2:42-47)


అపొస్తలుల 2:42-47
42 వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. 43 అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. 44 విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి. 45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమి్మ, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46 మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

ముందు నివేదికలో, యేసు పరిశుద్ధాత్మను ఏవిధముగా అంతరంగమందు ఉండుటకు ఎలా సిద్దము చేసాడు అని లూకా వివరించాడు, మరియు తండ్రి ఆత్మ ఏవిధముగా నింపబడుతుందని, అనగా ప్రేమతో,ఆనందముతో, సత్యముతో మరియు ప్రేమకలిగిన పరిశుద్ధతతో. ఇప్పుడు నుంచి లూకా మనకు ఎలాగూ మరియు ఎందుకు పరిశుద్ధాత్ముడు కార్యము చేయునని చూపిస్తాడు. తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చబడినది; క్రీస్తు శక్తి జరిగించబడినది, అతని విజయోత్సవం ఈ దినము వరకు కార్యము చేస్తున్నది. ఈ లోకములో క్రొత్త తరము ప్రవేశించినది. క్రీస్తు యందు విశ్వసించినవారికి దేవుని ప్రేమ గొప్పవానిగా చేసినది. వారి విశ్వాసము ద్వారా దేవుని మంచితనముచేత నింపబడినారు.

ఆచరణలో పరిశుద్దాత్మ కార్యము ఏవిధముగా కనపడును? లూకా మనకు ఈ విషయమును బట్టి మరియు పరిశుద్దాత్ముడ్ని బట్టి క్లుప్తమైన వివరణ ఇస్తున్నాడు. ప్రాముఖ్యముగా అతను విశ్వాసులను దేవుని సంపూర్ణ వాక్యంలో నడిపించును,ముఖ్యముగా అపొస్తలుల బోధయందు. ఆత్మకు సువార్త యందు కొనసాగింపుగా లేకపతే దానికి జీవము లేదు, ఎందుకంటె దాని ద్వారానే క్రీస్తు తన విద్యార్థులకు ప్రతిదినము బోధించునది. కనుక అపొస్తలుల సిద్ధాంతాలు లేకుండా విశ్వాసమునకు పునాది లేదు.

లోతుగా వ్యాపించిన దేవుని చిత్తము, దేవుని వాక్యము ద్వారా ప్రతి దినము ఆత్మీయ పోషణను ఒక తెలియని విధముగా ఉండదు. ప్రారంభపు సంఘము వారు ప్రేమలో అందరు కూడా మంచి సహవాసము కలిగి జీవించిరి, ప్రతి ఒక్కరు కూడా తమకు కంటే ఇతరులు ఎక్కువ అనే భావన కలిగి ఉండిరి. సహవాసములేనిదే దేవుని ఆత్మీయమైన ప్రేమలో క్రైస్తవ్యం లేదు.

మొదటి క్రైస్తవులు రక్షణకలిగిన సహవాసములో మాత్రమే కలిసి ఉండలేదు, అయితే రొట్టెవిరుచుట యందు కూడా కలిసి ఉండిరి. రొట్టె ద్వారా మరియు పానము ద్వారా ప్రభువైన యేసు వారి శరీరములో ఉన్నాడని విశ్వసించిరి. కనుక వారు బలము కలిగి కృతజ్ఞతకలిగి ఉండిరి.

ఈ విధమైన కార్యముల ద్వారా అక్కడ ప్రార్థనయందూ, కీర్తనలతో ఘనపరచి, మానవులు, పాపపు అప్పుడలా మరియు అన్నిటిలో వారు నేర్పు కలిగిన వారైరి. ఈ విధమైన సమావేశముల ద్వారా వారు ఈ లోక సంబంధముగా ఉండక దేవునితో సంబంధము కలిగి ఉండిరి, మరియు తండ్రితో కూడా మంచి సహవాసము కలిగి ఉండిరి. నీవు కూడా సహోదరుడా, విశ్వాసులతో కలిసి ప్రార్థన యందు యెడతెగక ఉన్నావా?

ఆత్మ ద్వారా నింపబడిన వారు దేవుని పరిశుద్దతను మహిమతో అనుభవించారు. అతని ఎదుట వారు వణికిరి. వారి సంపూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించి అతని యందు విశ్వాసముంచిరి. సాత్వికము, గౌరవము మరియు భయముకలిగిన గొప్పతనము వారిలో ఉండెను. పరిశుద్దాత్మ మనలో భయమును మరియు దేవుని ప్రేమను కలిగించినది, అదే మన విశ్వాసమునకు ఒక మంచి పునాదిగా ఉన్నది.

ఎవరైతే ఆ విధముగా నింపబడతారో ఆలాంటి వారిలో పరిశుద్ధ త్రిత్వము పరలోక పరిశుద్ధుల సహవాసముచేత అనుభవము కలిగి ఉంటారు, మరియు రక్షణద్వారా కాపుదల ద్వారా, స్వస్థత ద్వారా, పరిశుద్ధత ద్వారా, మరియు నడిపింపు ద్వారా అతని సంపూర్ణ కనికరము ద్వారా ఆశీర్వదించబడతారు.

పరిశుద్ధుల ప్రేమ ఫుర్స్ ద్వారా ముగించబడదు, ఎందుకంటె పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా ఇవ్వమని చెప్పెను. ప్రభువు చెప్పినట్లు, " పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము.' మొదటి క్రైస్తవులు వారికున్న అంతటినీ అమ్మివేసి ధనాపేక్ష లేనివారుగా ఉండిరి,మరియు వారు రాబడిని సంఘమునకు ఇచ్చిరి. కనుక వారందరు కూడా దేవుని కుటుంబముగా ఉండి ఒకరికి ఒకరు సహాయపడుచు ఉండిరి, అక్కడ క్రీస్తు అధిపతిగా ఉండెను. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని పీసినారితనము నుంచి మరియు అసూయానుంచి, మరియు దురాశనుంచి కాపాడి, ప్రేమ కలిగి ఉండునట్లు నడిపించెను.

వారందరు కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసి, వారు జీవించి ఉండగానే అతని మహిమను చూడాలని ఆశపడిరి.వారు రాత్రి పగలు ఏవిధముగా అయితే రక్షకుని గురించి ఆలోచించిరో అదేవిధముగానే అతనిని ప్రేమించి, అతని మహిమ రాజ్యము కొరకు ఎదురుచూసిరి. వారి విశ్వాసము సత్యమో కాదో, ప్రేమ బలముగా ఉన్నదో లేదో, మరియు వారి నిరీక్షణ జీవము కలిగి ఉన్నదో లేదో అని చర్చించలేదు. బదులుగా, వారి హృదయ సరళతను బట్టి సంతోషించిరి. పరిశుద్దాత్మ సత్యమును బట్టి వారు ఆనందించిరి, మరియు అలసి పోక దేవునిని ఎల్లప్పుడూ ఘనపరచిరి.

కృప ప్రారంభమైనప్పుడు వారు ఇంటిలో సమావేశమును విడువలేదు. ప్రతి దినము వారు కూడుకొనుచు అపొస్తలుల సిద్ధాంతాలను వినుచు సహజమైన ప్రార్థన చేస్తూ ఉండిరి. చేతులద్వారా కట్టబడిన దేవాలయమును వారు ద్వేషించలేదు, అయితే చేతులద్వారా కాక ఆత్మ ద్వారా చేయబడిన దేవాలయముగా మార్చబడిరి.

ఆ విధమైన సంఘము ఎప్పుడు సంతోషముగా ఉంటుంది. ఈ విధమైన ప్రేమచేత నింపబడిన వారు ఈ విధముగా అడగబడిరి: "నీవు ఏవిధముగా మార్పుచెందావు?" "ఇది ఎలా అయినది?" సజీవుడైన యేసు మాకు పరిశుద్దాత్మ వరమును ఇచ్చాడని చెప్పిరి. ఈ సాక్ష్యమును బట్టి సంఘము అభివృద్ధి చెంది, అనేకమంది సంఘములో చేర్చబడి ఆత్మీయ పునరుజ్జేవము కలిగెను.

ఈ వాక్యములను మనము చదువుతుండగా "సంఘము" అను పదమును ఈ అపొస్తలుల కార్యములలో వ్రాయబడెను. ఈ క్లుప్తమైన సమాచారం మనకు జీవము కలిగిన సంఘముగా ఉన్నది. పరిశుద్దాత్ముని కార్యములు ముగింపులో కేవలము వ్యక్తిగతముగా లేక పరిశుద్ధుల సహవాసములో ఉన్నవి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక, అతని ప్రేమ కేవలము సహోదరులలో మాత్రమూ కనపడును.

ప్రార్థన: ఓ పరలోకనాడున్న తండ్రి నీ పరిశుద్దాత్మ మనుషులను ఐక్యపరచినందుకు నీకు కృతజ్ఞతలు. నీప్రేమ ఒకరికొకరు క్షమించబడునట్లు చేయును, మరియు తమ కంటే ఇతరులు గొప్పవారని చెప్పును. మమ్ములను సంఘముతో పునరుత్తరించు. నీ ఆత్మ మా ప్రతి సమస్యనుంచి కాపాడి, మరియు మేము ధనాపేక్షలేకుండా మమ్ములను నీ ప్రేమ ద్వారా విడిపించు. ఆమెన్

ప్రశ్న:

  1. మేము జ్ఞాపకము చేసిన ప్రతి పదమును మరియు జీవము కలిగిన సంఘము యొక్క ప్రతి అంశం సారాంశమును గుర్తుచేయండి?

క్విజ్ - 1

ప్రియా చదువరి,
నీవు ఈ ఆపోసలుల కార్యముల వ్యాఖ్యలు చదివి ఉండగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములు చెప్పుటకు సమర్థులు. మీరు 90 % ప్రశ్నలకు సమాధానములు వ్రాసినట్లతే మీకు ఈ విధమైన పత్రికను పంపుటకు సిద్ధముగా ఉన్నాము. మీ పూర్తి చిరునామా ఈ సమాధాన పత్రము చివరలో వ్రాయుట మరచిపోవద్దు.

  1. అపొస్తలుల కార్యములను పౌలు వ్రాయటకు గల ఉద్దేశము ఏమిటి? థియోఫిలస్ గురించి నీకు ఏమి తెలుసు?
  2. లూకా వ్రాసిన మొదటి పుస్తకము యొక్క ఉద్దేశము ఏమిటి? మరియు రెండవ పుస్తకము యొక్క ఉద్దేశము ఏమిటి?
  3. తండ్రి వాగ్దానము ఏమిటి?
  4. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన రూపకల్పన ఏమిటి?
  5. దూతలు ఇచ్చిన సమాచారం ప్రకారముగా క్రీస్తు ఎలా వస్తాడు?
  6. యెడతెగక ప్రార్థన చేయుటకు వచ్చిన పురుషులు స్త్రీలు ఎవరు?
  7. యూదా మరణమును బట్టి నీవు ఏమి నేర్చుకున్నావు?
  8. క్రీస్తు పరిచర్యలో పాల్గొనుటకు గల షరతులు ఏమిటి?
  9. పెంతేకొస్తు దినమందు పరిశుద్దాత్ముడ్ని ఏవిధముగా వాడిరి?
  10. అపొస్తలులు ఏ విధముగా మాట్లాడాలో అని పరిశుద్ధాత్ముడు ఏమి బోధించెను?
  11. పేతురు యొక్క మొదటి ప్రసంగము యొక్క ముఖ్య మైన అంశములు ఏమిటి?
  12. యూదులు యేసును చంపినా హంతకులను పేతురు వారికి ఎందుకు చెప్పెను?
  13. దావీదు ప్రవచనమును జ్ఞాపకము చేయడము ద్వారా పేతురు వినువారికి ఏమి చూపాలను కున్నాడు?
  14. క్రీస్తు పరలోకమునకు ఎందుకు కొనిపోబడెను?
  15. పరిశుద్దాత్ముని మనము ఏవిధముగా పొందుకుంటాము? మనలో అతను నివాసము చేయుటకు గల షరతులు ఏమిటి?
  16. పరిశుద్దాత్ముడ్ని పొందుకొనుటకు ఎవరు అర్హుడు? ఎందుకు?
  17. మేము జ్ఞాపకము చేసిన ప్రతి పదమును మరియు జీవము కలిగిన సంఘము యొక్క ప్రతి అంశం సారాంశమును గుర్తుచేయండి?

మీరు అపొస్తలుల కార్యముల పరీక్షను ముగించుమని మిమ్ములను మేము ఉత్సాహపరచుచున్నాము, అప్పుడు మీరు నిత్యమైన ఐశ్వర్యమును పొందుకుంటారు. మేము మీ సమాఘనముల కొరకు ఎదురుచూసి మీ కొరకు ప్రార్థన చేస్తాము.

మా చిరునామా:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:47 PM | powered by PmWiki (pmwiki-2.3.3)