Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 010 (Outpouring of the Holy Spirit at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

5. పెంతేకొస్తు దినమందు పరిశుద్దాత్మ వచ్చుట (అపొస్తలుల 2:1-13)


అపొస్తలుల 2:5-13
5 ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. 6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. 7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడిఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? 8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? 9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు, 10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగావచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, 11 క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. 12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 13 కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. 

అగ్ని నాలుకలచేత శిష్యులు ఏమి మాట్లాడారో నీవు తెలుసుకోవాలనుకున్నావా? 12 వ వచనము చదివినట్లయితే, వారు దేవుని ఆశ్చర్య కార్యములను బట్టి మాట్లాడినారని తెలుసుకొనెదవు. ఈ సృష్టిని బట్టి వారు సృష్టికర్తకు కుతజ్ఞత చెప్పి, అతనిని ఘనపరచి, అతని ధర్మశాస్త్రమును ఘనపరచి, మరియు ప్రవక్తల ద్వారా అతని ఆలోచనలను బయలు చేసినందుకు కృతజ్ఞత చెప్పిరి. వారు కుమారుని యొక్క పరిశుద్ధ పుట్టుకను బట్టి తండ్రికి కృతజ్ఞత చెప్పి, మరియు వారు చూసిన కార్యములను బట్టి అతనిని మహిమపరచిరి. క్రీస్తుతో వారికి కలిగిన సమావేశమును బట్టి వారు దేవునికి ఘనపరచిరి. అతని స్వర్గారోహణ మును బట్టి వారు ఆనందించిరి, మరియు వారి కొరకు ఎదురుచూసిన ప్రవచనమును బట్టి ఆనందించిరి. ఈ లోకమునకు అవసరమైన సువార్తను బట్టి మరియు రక్షణను బట్టి వారు విశ్వసించిరి. దేవుని ఆశ్చర్య కార్యములను బట్టి ఘనపరచుటకు నీవు సామరస్యముగా ఉన్నావా సహోదరుడా? నీ కృతజ్ఞత ఎక్కడున్నది? నిన్ను నీవు గౌరవించుకుంటున్నావా, లేక దేవునిని ఘనపరచుచున్నావా? నిన్ను నీవు మరచిపోయి పరలోకమందున్న తండ్రిని మహిమపరచు.

ఆ వాతావరణములో వారందరుడూ ఘనపరచి, ప్రార్థనలో మొనముగా ఉండిరి, మరియు పరిశుద్ధతలో నిలకడకలిగి ఉండిరి, ఎందుకంటె ఎవరతే ప్రభువు కొరకు ఎదురుచూసిరో వారందరూ కూడా ఆ శబ్దమును వినిరి, మరియు ఆ తుఫాను పడినచోటికి వెళ్లిరి. అక్కడ వారు కలవరపడిరి, ఎందుకంటె వారు ఇతర దేశములకు వెళ్ళాక పోయినను, అక్కడ గాలీలయులు ఇతర భాషలలో మాట్లాడుట వినిరి. పర్యవసానంగా పెంతేకొస్తు ఆత్మ దినమందు దేవుని ఉగ్రతను వారు జయించిరి, ఎప్పుడైతే వారి ఇతర భాషలలో మాట్లాడినప్పుడు, మరియు వారిని రక రకాల దేశములలోనికి చెదరగొట్టబడిరి, కనుక వీటి ద్వారా వారు ఒకరికి ఒకరు అర్థము చేసుకోలేకపోయిరి. బాబెలు పర్వతమును వారు దేవునికి సమానముగా నిర్మించుటకు ప్రయత్నము చేసిరి, అది దేవుని యొద్దకు చేరువరకు పెద్దదై ఉండెను. ఇప్పుడు, క్రీస్తు తనను వెంబడించు వారి పాపముల గర్వము నుంచి క్షమించెను, మరియు క్రీస్తు ఆత్మ ఎవరైతే తగ్గింపు కలిగి ప్రార్థన యందు యెడతెగక ఉంటారో వారి హృదయములో ఉండును. ఏ ఒక్కరు కూడా ఒకరి కంటే ఇంకొకరు గొప్పవారని ఆలోచనకలిగి ఉండలేదు. బలవంతుడు బలహీనునికి సమర్పించుకొని అందరిలో చివరివానిగా భావించెను. పరిశుద్ధాత్ముడు ప్రేమకలిగి ఉంది చెదిరిపోయిన వారినందరినీ దేవునిలో ఐక్యతను చేసెను. పెంతేకొస్తు దినమందు వచ్చిన భాషలను తిరిగి ఐక్యంచేనట్లుగా ఉండెను. ఆ పెంతేకొస్తు దినమునుంచి వారి సరిహద్దులను, తేడాలను మరియు వారి సూత్రములను ఐక్యం చేసెను. అక్కడ మేధావుల మందకు ఏవిధమైన డిగ్రీలు కానీ లేవు. అందరూ దేవునిలో ఒకటే, ఎందుకంటె దేవుని గొప్ప బహుమానము ఏమిటంటే సామాన్యమైన మనిషిని కూడా దేవుడు నిత్యమైన తండ్రితో ఉంచాడు. అతను వారిని తన రక్షముతో పరిశుద్ధపరచాడు, కనుక వారు అతని ముందర ఏ దోషములేక పరిశుద్ధముగా ఉండునట్లు.

మొదటి పెంతేకొస్తు దినమందు గొప్ప జన సమూహము యెరూషలేములో కలుసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పిరి. పర్షియా, మెసొపొటేమియా, ఆసియా ఖండం, ఉత్తర ఆఫ్రికా, ఇటలీ నుండి యూదులందరు కూడా యెరూషలేమునకు వచ్చిరి. దేవుడు గాలీలయా భాషలలో మాట్లాడుట వారందరు కూడా వినిరి. పెంతేకొస్తు దినమందు మూడు విధములుగా అద్భుతములు జరిగినవి: మొదటిది, వారు తుఫానును వినిరి. రెండవది, వారు అగ్ని నాలుకలు చూసిరి. మూడవది, గలీలాయుల భాషను వారు అర్థము చేసుకొనిరి, అయితే ఆ దినమందు దేవుడే ఆ భాషలకు ఒక అనువాదకుడుగా ఉండెను.

ఐగుప్తునకు మరియు అరబ్బులకు ప్రతినిధులు ఉన్నారని వినువారికి చెప్పుటకు సంతోషించుచున్నాము. పరిశుద్ధాత్ముడు ప్రారంభము నుంచే అతను కనిపించునది మరియు రక్షణకు సంబంధించిన దానికి బయలుచేసెను. ఈ భాషలు వారికి కష్టముగాను మరియు వింతగాన్ ఉండెను. అతను వారిని అతని ప్రేమతో తృప్తిపరచి, అతని పరిశుద్ధత చేత వారికి అర్థమును చెప్పెను. నీ సొంత భాషతో నీ దేవుడిని ఘనపరచెదవా? నీ నాలుకను, హృదయమును, నిర్ణయమును మరియు నీ బలమును అతనికి సమర్పించుకో, అప్పుడు నీవు దేవునిని ఘనపరచుటలో కొనసాగి ఉంటావు.

పోటీపడిన వారు తొందరగా రెండు గుంపులుగా మార్చబడినారు. చూసిన దానిని విశ్వాసులు ఒక విధమైన తమాషాగా తీసుకొనిరి. మొదటి వానికి పరిశుద్దాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానము కావాలని అనుకొనెను, మరియు ఇతరులు దానిని ఒక త్రాగుబోతు పలికిన మాటలుగా అనుకొనిరి. అపరిశుద్దతను వారు అనుభవించి అపొస్తలులును నిందించిరి. అయినప్పటికీ వారికి దేవుని ఆనందము తెలియకపోయెను, మరియు నిత్యమైన ప్రేమ వారిలో దాగుకొనెను. వారి హృదయములు ద్వేషముతో మరియి ఎక్కువ కఠినమై పోయెను.

ప్రార్థన: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు ¸°వనమువలె నీ ¸°వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు (కీర్తన 103:1-5)

ప్రశ్న:

  1. అపొస్తలులు ఏ విధముగా మాట్లాడాలో అని పరిశుద్ధాత్ముడు ఏమి బోధించెను?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:43 PM | powered by PmWiki (pmwiki-2.3.3)