Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 119 (Jesus appears to the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

2. యేసు శిష్యులకు మీద గదిలో ప్రత్యక్షమగుట (యోహాను 20:19-23)


యోహాను 20:19
19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

ఆదివారము జరిగిన సంఘటనలను బట్టి శిష్యులు ఒక గదిలో కూర్చుంది తలుపులు మూసుకొని భయముచేత చర్చించుకొనిరి. యోహాను మరియు పేతురు నుంచి ఆ సమాధి ఖాళీగా ఉన్నాడని చెప్పుట వినిరి. మరియు ఆ స్త్రీ ద్వారా మరియు దూతల ద్వారా యేసు పునరుత్తానుడై తిరిగి లేచెనని వినిరి. మరియు మగ్దలేనే మరియు ఆమె చూసిన దానిని వారికి వివరించెను. కనుక చనిపోయిన యేసు తిరిగి లేచి జీవించెనని తెలుసుకొని చాల ఆశ్చర్యము కలిగి ఉండిరి అయితే అతను వారికి ఇంకను కనపడక పోయెను. అయితే యేసును పట్టుకొనినప్పుడు వారందరు అక్కడనుంచి తిరిగి వెళ్లిరి; పేతురు అతను ఎవరో నాకు తెలియదని చెప్పెను మరియు యేసుకు ఎన్నో హింసలు వారు పెట్టిరి, ఎవ్వరు కూడా యేసు దగ్గర లేకపోయిరి కేవలము ఆమె మాత్రమే ఉండెను. వారు యూదులను బట్టి చాల భయము కలిగి ఉండిరి, ఎందుకంటె ఆ పండుగ అయిపోగానే వారికి వారి ద్వారా హింసలు వస్తాయని అనుకొనిరి. ఈ కారణము " మేము యేసును వెంబడించాము, మమ్ములను అతని సేవకులుగా చేయుమని అడిగాము. మనము ఇక్కడ విఫలమే చెందాము కనుక మనలను వారు పెట్టుకొంటారు " అని ఒకరికి ఒకరు చెప్పుకొనిరి.

ఈ విధమైన పరిస్థితులలో యేసు వారి మధ్యన ప్రత్యక్షమాయెను. వారి నిరీక్షణకు బట్టి మరియు ప్రేమను బట్టి వారిదగ్గరకు రాలేదు అయితే దాయకలిగి వారికి తన కృపను చూపి వారి విశ్వాసమును బలపరచెను.

యేసు వారి మధ్యలో అనుకోకుండా ప్రత్యక్షమగుట వారికి ఒక అద్భుతముగా ఉండెను. ఎందుకంటె మరణించిన వాడు లేచెను , తిరస్కరించిన వాడు లేచెను. ఏ సమాధి , ఏ రాయి మరియు ఏ ద్వారము కూడా అతనిని తన ప్రియమైన వారికి ప్రత్యక్షమగుటను ఆపలేకపోయెను. ఇక్కడ యేసు మనుషుల వలెనె మాట్లాడి విని కనపడి ఉన్నాడు. మరియు అదే సమయములో అతను ఆత్మా కలిగి గోడల ద్వారా తలుపుల ద్వారా వెల్లువాడుగా ఉండెను. మనము అతనిలో ఉన్నట్లయితే అతని సన్నిధిని మనము పొందవచ్చు. కనుక అతని పునరుత్థాన శరీరము మన నిరీక్షణగా ఉన్నది.

పునరుత్థానుడైన యేసు మరణమును జయించి తిరిగి లేచి, శిష్యుల బాధలలో వారికి ధైర్యము ఇచ్చి వారికి ఆదివారము మంచి సమాధానమును అనగా, " మీకు సమాధానము కలుగును గాక" అని చెప్పెను. దీని ద్వారా అతను మనకు చెప్పినదేమనగా అతని సిలువ మరణము ద్వారా ఈ లోకమునకు విమోచనము దొరికినది. ఆ సమాధానము పరలోకమునుంచి ఈ భూలోకమంతటికి వ్యాపించి ఉన్నది. కనుక ఎవరైతే యేసును అంగీకరిస్తారా వారికి నూతన జీవితము కలిగి ఉన్నది. కనుక అతనిని అంగీకరించుట మరియు తిరస్కరించుట నీ వశమే. ఎందుకంటె రక్షణకు మనిషే బాధ్యుడు కాబట్టి. ఎవరైతే అతని దగ్గర పసచ్చత్తాపము కలిగి ఉంది యేసును విశ్వసిస్తారో వారు ఆశీర్వదించబడుతారు. కనుక అతని సమాధానంలో మనము ఉండాలి,పౌలు అన్నట్లు , " మనము విశ్వాసము చేత తీర్చబడినాము కనుక, మనకు దేవునితో సమాధానము కలిగినది అది కేవలము ప్రభువైన యేసు ద్వారా ఉండెను ".

ప్రార్థన: ప్రభువా నీవు ఈ లోకమునకు వచ్చినది మా పాపములను బట్టి మా దోషములను బట్టి మా తప్పిదములను బట్టి మాకు శిక్ష విధించుటకు రాలేదు అయితే నీ దాయకలిగిన కృప చేత నీ ప్రేమ చేత మరియు నీ రక్షణ చేత మమ్ములను నింపుటకు ఈ లోకమునకు వచ్చియున్నావు. మేము దేవునితో సహవాసము కలిగి ఉండునట్లు మమ్ములను నీవు మార్చినావు. మీ రక్షణ మాకు మా కార్యముల చేత వచ్చినది కావు అయితే అది కృపచేత కలిగిన నీ బహుమానమే. మా స్నేహితులకు కూడా బోధించినట్లైతే వారు కూడా నీ పరిశుద్ధాత్మను పొందుకొనునట్లు నీ యందు విశ్వాసము ఉంచుకొని నీ రక్షణను కలిగి ఉందురు.

ప్రశ్న:

  1. పునరుత్థానము తరువాత యేసు చెప్పిన మొదటి మాట ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:39 PM | powered by PmWiki (pmwiki-2.3.3)