Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 080 (Men harden themselves)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 – 12:50)

5. తీర్పును బట్టి మనిషులు తమ హృదయములను కఠిన పరచుకొనుట (యోహాను12:37-50)


యోహాను 12:37-41
37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. 38 ప్రభువా, మా వర్తమానము నమి్మనవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 39 ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా 40 వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. 41 యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.

యురూషలేములో క్రీస్తు ఎన్నో అద్భుతములను చేసెను. ఎవరైతే వీటిని బట్టి ఇష్టపడ్డారో వారు అతని శక్తిని బట్టి జాగ్రత్తకలిగి ఉన్నారు, అయితే ఇతరులు జరిగిన సంఘటనలను బట్టి యేసును అర్థము చేసుకొనుటలో విఫలము అయ్యారు, ఎందుకంటె వారు యేసును మతపరమైన వాడిగా యెంచిరి .

చాల మంది వారి సొంత ఆలోచన ప్రకారమే ఉన్నారు కాబట్టి దేవుని స్వరమును వినలేదు. అయితే పరిశుద్ధాత్ముడు ప్రతి హృదయమును సమాధానముగా వినుటకు సహకరించును.

అయితే వ్యతిరేకస్తులు చాల మంది పరిశుద్ధాత్మను తిరస్కరించి దేవుని సువార్తను వినక వారి హృదయములని కఠిన పరచుకొనెదరు, కనుక వారిని క్రీస్తు తీర్పు దినమందు వారి విషయములలో కఠినముగా ఉండును. కనుక వారు వారి అవసరమును బట్టి తెలియక ఉందురు. దేవుడే రక్షణకు మరియు తీర్పుకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు.

మనము గమనించినట్లయితే చాల కుటుంబాలు మరియు మనుషులు దేవుని ఉగ్రతలో ఉన్నట్లుగా చూస్తున్నాము. దేవుడు ఎవరికైతే పదే పదే నిజమైన మార్గము గురించి చెప్పి వినక ఉన్నవారిని బట్టి పట్టించుకొనువాడుగా ఉండదు. ఎవరైతే పరిశుద్ధాత్మను వినక పోతారో వారి హృదయములను దేవుడు కఠిన పరచును.అయితే క్రీస్తు ప్రేమను మైర్యు అతని చిత్తము ప్రకారముగా నడుచుకొనక ఉంటారో వారిని దేవుడు ఖండించును. కనుక అతని కొరకు వారి హృదయములను ఖఠినము చేయును.

ఎవరైతే దేవునికి వినక ఉంటారో వారి హృదయములను కఠిన పరచుటలో ఇది వారి జ్ఞానమునకు సంబంధించినది కాదు అయితే ఇది దేవుని మహిమను బట్టి కలుగునది. కనుకనే యెషయాను దేవుడు ప్రజల దగ్గరకు వారి హృదయములను ఖఠినము చేయుటకు అతడిని పంపినప్పుడు అతను దీనిని అర్థము చేసుకొన్నాడు (యెషయా 6:1-13). ప్రేమను గూర్చి ప్రకటించుట దేవుని ఉగ్రతను మరియు అతని కోపమును వివరించుట కంటే సులువు. కనుక ఏ చేదు కూడా అతని సన్నిధిలో నిలువదు అయితే అతని మహిమతో అన్నీకూడా వెళ్లిపోవును. యేసు పరిశుద్దుడుగా ఉన్నాడు కనుక అతని ప్రజలను ప్రత్యేకించును. యోహాను చెప్పినట్లు ఆ సింహాసనము మీద కూర్చుండు వాడు యేసు అని యెషయా చూసినట్లు ఉండెను, ఎందుకంటె పరిశుద్ధతలో తండ్రి మరియు కుమారుడు ఒకేవిధముగా ఉన్నారు కాబట్టి.

యోహాను 12:42-43
42 అయినను అధికారులలో కూడ అనే కులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయ పడి వారు ఒప్పుకొనలేదు. 43 వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

యోహాను గొప్ప యాజకుల కుటుంబమునుంచి వచ్చాడని మనకు తెలుసును (యోహాను 18:15). కొంత మంది ప్రజలు అతనిని అలక్ష్యము చేసి, కేవలము గొప్పవారు మాత్రమే విశ్వసించిరి అని చెప్పెను. దేవుడు అతనితో ఉన్నాడు కనుకనే అతని మాటలు శక్తి కలిగి ఉన్నాయని తెలుసుకొనిరి అయితే వారు యేసును బట్టి సాక్ష్యము చెప్పకపోయిరి.

ఎందుకు వారి వివేకమునుబట్టి ఆ మనుషులు పంచాయతీ చేయమని ఒప్పుకొనిరి ? వారు పరిసయ్యులును బట్టి భయపడిరి, సత్యమునకు మరియు జాగ్రత్తను బట్టి. యేసుకు ఎవరైతే మద్దతు తెలిపారో వారిని పరిసయ్యులు అసహ్యించుకున్నారు. కనుక వీరు ప్రతినిధిగా వ్యవహరించినందుకు , వారికి శ్రమలు కలిగించిరి. ఎవరైతే ఆ దేశము నుంచి వెలివేయబడ్డారో వారు ఏమి కూడా కొనలేరు మరియు అమ్మలేరు మరియు ఎవ్వరితో పాటు ప్రార్థన చేయలేరు.

ప్రత్యామ్నాయముగా వచ్చిన వారు వారి రహస్య పాపమును బట్టి ఎందుకు ఆలస్యము చేస్తారు ? వారు దేవుని కంటే ఎక్కువగా మనుషులనే ఘనపరచాలని కోరుకుంటారు. అయితే పరిశుద్దుడైన దేవుడిని ఘనపరచుట వారి గురి కాదు ; వారు ప్రభువుకంటే ఎక్కువగా వారిని వారే ఎక్కువగా ప్రేమించిరి.

ఎవరైతే రహస్యముగా విశ్వాసము కలిగి క్రీస్తు ఎవరో నాకు తెలియదు అను చెప్పువారికి శ్రమ. ఆ లాంటి మనిషి కాస్త సమయములో క్రీస్తును విడిచిపెడతాడు. అలాంటి వ్యక్తి కీర్తిని మరియు దేవుని ఘనతను మరియు సంరక్షణను కోరుకుంటాడు. కనుక నీ ప్రభువుకు మరియు రక్షకుని నిన్ను నీవు సమర్పించుకొని, అతను నిన్ను నిజమైన మార్గములో నడిపించునని విశ్వసించు.

యోహాను 12:44-45
44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. 45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.

యేసు తన శిష్యులను పసచ్చత్తాపపడి న్యాయమైన బోధనకు మరియు ఆత్మీయమైన మాటలకు చెవియొగ్గుమని చెప్పెను. ఇది మొదటగా క్రీస్తు , " ఎవరైతే నన్ను విశ్వసిస్తున్నారో వారు నన్ను నమ్మడము లేదు" అనే విషయమును కాదనలేక పోయెను"! యేసు ఏమనిషిహి కూడా అతనితో కట్టలేదు, అయితే కుమారుడు అందరికి నేరుగా తన తండ్రి దగ్గరకు నడిపించును. మరియు ఒకడు ఏమిలేకుండా అతడిని విశ్వసించుమని చెప్పలేదు. కుమారుడు మనుషుల విశ్వాసము దేవునికి అందకుండా చేయలేదు; మరియు దేవుని ఘనత కూడా అక్కడినుంచి తీసివేయలేదు, అయితే దీనిని నిత్యమూ నిరూపించి దేవుడిని మహిమపరచుచు ఉండెను.

విరుద్ధమైనది కూడా నిజమే: కుమారుని ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి దగ్గరకు రారు; కుమారునితో తప్ప దేవునికి నిజమైన విశ్వాసము ఎక్కడ కూడా లేదు. తండ్రి ప్రతి విశ్వాసిని కూడా క్రీస్తుకు ఒక బహుమానంగా ఇచ్చి వారు అతని చూస్తూ ఉండి అతని విలువలను పొందుకోవాలనే చెప్పెను.కనుక లోబడి కుమారుడు దురహంకారముచేత ఉన్నాడు. " ఎవరైతే నన్ను చూసారో, వారు నన్ను పంపినవానిని చూసారు ". యేసు దేవుని యొక్క నిజమైన అపొస్తలుడై ఉన్నాడు. ఎందుకంటె అతను దేవుని మహిమను లోబడి పొందుకున్నవాడుగా ఉన్నాడు. యేసు నిజమైన జీవమును మరియు వెలుగును చూపువాడుగా వచ్చెను. మనకు వేరే ఏ ఇతర దేవుళ్లను చూడలేదు అయితే యేసు క్రీస్తు ద్వారా నిజమైన దేవుడిని అతని పునరుతానముద్వారా మాత్రమే మనము చూసి నాము. అతని అణుకువ మనము తండ్రితో సమానముగా ఉండుట మనము చూసాము. నిజముగా యెషయా చూసిన యేసు, తన తండ్రి కి తనకు ఎటువంటి వ్యత్యాసమును చూడలేదు.

యోహాను 12:46-48
6 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈలోకమునకువెలుగుగావచ్చియున్నాను. 47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకేవచ్చితిని. 48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.

ఆఫ్రికా దేశములో కొన్ని భయంకరమైన తెగులు ఉన్నాయి. వారికి వచ్చినటువంటి జ్వరమును బట్టి వారు వారి నివాస స్థలములను పైకి ఎగురకొట్టువారు. అయితే ఎప్పుడైతే వైద్యుడు ఆ గ్రామములోనికి వస్తాడో ఆ అనారోగ్యము కలిగిన వ్యక్తి ఒకవేళ సూర్య రశ్మిలో నడుస్తే అతనికి కలిగిన జ్వరము వెళ్తుందని నమ్మేవారు. అందుకే అతను , " మీరు మీ గుడిసెలలోనఁచి వచ్చి స్వస్థత పొందుడి " అని చెప్పెను. కనుక అందులో చాల మంది ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు సంపూర్ణముగా స్వస్థత పొందిరి. అయితే వేరే వారు ఆ వ్యాద్యుడు చెప్పినదానిని వారు నమ్మలేదు, కనుక వారు లోపలనే ఉండి మరణించిరి. అప్పుడు ఆ వైద్యుడు మరియు స్వస్థత కలిగిన వారు ఆ చనిపోయిన వారిని చూసి, ఈ విధముగా అడిగిరి, " మీరు వెలుగుకొరకు బయటకు ఎందుకు వెళ్ళలేదు ?" అందుకు వారు ," మేము నీ మాటలు నమ్మలేదు కనుక మాకు శ్రమ, కనుకనే మేము అనారోగ్యము కలిగి ఉన్నాము." అందుకు ఆ వైద్యుడు , " అంటే మీరు మీ అనారోగ్యమును బట్టి చనిపోక , కేవలము నా మాట వినలేదు కనుకనే చనిపోయారా."

ఈ ఉపమానము క్రీస్తు శక్తిని మనకు తెలియపరుస్తున్నది. అతను నీతికలిగిన కుమారుడు కనుక పాపము అనబడిన చీకటిలో ఇది వెలుగుతుంది, మరియు అతను దురాత్మల మీద విజయము కలవాడు. కనుక అతని అద్భుతమైన వెలుగులోనికి వేళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుదురు. కనుక అతనికి మనుషులను వారి పాపములనుంచి రక్షించుట కంటే ఏది కూడా ప్రాముఖ్యము కాదు. అతని మాటలు మనలను ప్రతి విధమైన ఇబ్బందులనుండి కాపాడును. ఎవరైతే అతని మాటలు విని వాటిని విశ్వసించి అతని దగ్గరకు తగ్గింపు స్వభావము కలియుగీ ఉంటారో వారు నిత్యమూ జీవము కలిగి ఉండెదరు. కనుక అతనిమీద మరణమునకు ఏవిధమైన అధికారము ఉండదు.

ఎవరైతే అతని మాటలు విని వాటిని వారు హృదయములో దాచుకొనరో వారు పాపము అనే ఈ లోకములో మునిగి తీర్పు అను చీకటిలోకి వెళ్లుదురు. అయినప్పటికీ సువార్త అనునది అవిశ్వాసులకు ఒక నాశనముగా మరియు గుమాస్తాగా ఉన్నది. నీవు యేసును నీ రక్షకునిగా అంగీకరించావా ? అతని వాక్యములను నేర్చుకొని వాటి ప్రకారముగా ఉన్నావా?

యోహాను 12:49-50
49 ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. 50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.

యేసు దేవుని వాక్యమై ఉన్నాడు. దేవుడు ఏదైతే ఆలోచనకలిగి ఉండి తన ఇష్టమును మనము యేసు మాట్లాడినప్పుడు తెలుసుకొనవచ్చు. క్రీస్తు మనకు నేరుగా దేవుని మాట అయి ఉన్నాడు. కుమారుడు తన తండ్రికి లోబడి అతని మాటలను విని ఆ మాటలను మనకు తన నాలుక ద్వారా చేరవేయును. దేవుడు ఈ పాపపు లోకమునకు తన కుమారుని ద్వారా మాట్లాడి , " నేను నిత్యములో ఉన్నవాడిని మరియు నీ తండ్రి అయి ఉన్నాడు; కృప ద్వారా మీకు నిత్యజీవమును ఇచ్చెదను. నీవు దేవుని ఉగ్రతను మరియు అతని నాశనమును కోరుకొనవచ్చు అయితే నేను మిమ్ములను ప్రేమించుచున్నాను; మీ స్థానములో నా పరిశుద్ధమైన కుమారుడిని త్యాగము చేసియున్నాను, అప్పుడు మీరు నిర్దోషమైన వారీగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకొనుడి. కనుక మీరు మరణించరు. ఎవరైతే పరదేశును మరియు నిత్యజీవమును చూడక ఉన్నారో వారు మెస్సయ్య చేతులనుంచి నిత్యజీవము పొందుకొనునట్లు నేను ఆశ కలిగి ఉన్నాను. " ఈ మాటల ద్వారా క్రీస్తు ఈ లోకమునకు రక్షణను దయచేసి ఉన్నాడు. అయితే ఎవరైతే దీనిని వినక వెంబడించక ఉంటారో వారు క్రీస్తు ద్వారా వ్యతిరేకతను పండుకొని ఉంటారు, ఎందుకంటె వారు దేవుడు ఇచ్చు నిత్యజీవమును తిరస్కరించారు కాబట్టి.

ప్రార్థన: ప్రభువా మాకు నిత్యజీవమును దయచేసి నందుకు నీకు కృతజ్ఞతలు. మేము నిన్ను ఆనందముతో నిన్ను ఘనపరచెదము. నీవు మమ్ములను మరణము నుంచి జీవములోనికి నడిపించియున్నావు, మరియు పాపములోనుంచి ప్రేమలోకి నడిపించియున్నావు. నీ కుమారుని మాటలను మా హృదయములో ఉంచుకొని వాటి ప్రకారముగా మేము మంచి ఫలములు ఫలించులాగున ఈ నడిపింపు దయచేయుము.నీ వాక్యముద్వారా నీ ఆలోచనలను మాకు బయలుపరచుము. నీ వాక్యమును మేము ఇతరులకు తెలియపరచునట్లు మరియు మరణమునుండి జీవములోనికి వచ్చునట్లు నీ సహాయమును దయచేయుము.

ప్రశ్న:

  1. క్రీస్తులో అందరికీ దేవుని ఆజ్ఞ ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:51 AM | powered by PmWiki (pmwiki-2.3.3)