Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 082 (Paul’s Doxology)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

8. పౌలు యొక్క పత్రికలో ముగింపు ధ్యానము ఏమి (రోమీయులకు 16:25-27)


రోమీయులకు 16:25-27
25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, 26 యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును 27 అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

దేవునికి ఆరాధన చేస్తూ పౌలు తన పత్రికను రోమా సంఘములో ముగించాడు, ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి. పౌలు అతనిని శక్తిని బలమును ఇచ్చువానిగా గుర్తించాడు, మరియు అతను మాత్రమే నిత్యమైన శక్తిని ఇచ్చువాడని, మరియు సంఘములను స్థాపించి ఆత్మీయ శక్తిలో ఉంచువాడని చెప్పెను.

పౌలు తన పత్రికను ప్రారంభపు సూచనగా ముగించెను (రోమా). పాపములో మరణించినవారికి తిరిగి జీవమును ఇచ్చుట. నాలుగు సువార్తలు మాత్రమే లేవు: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను; అయితే ప్రతి మంచి మాట, మరియు పౌలు ప్రకటించు వాటన్నిటిలో కూడా యేసు రక్షణను ప్రకటించి ఉన్నది. మరియు అపొస్తలుడు తనకు దమస్కు అను పట్టణమందు కనపడిన యేసు, నిజమైన రక్షకుడని మరియు అతనే ఈ పత్రికను వ్రాయుటకు సహకరించెనని చెప్పెను. కనుక పౌలు ఈ పత్రికలో ప్రతి ఒక్కరి రహస్యమును కూడా బయలుపరచెను, అయితే అప్పటివరకు ఇది రహస్యముగానే ఉన్నది, అయితే ప్రవక్తలద్వారా ఇది పాతనిబంధనలో బయలుపరచబడెను, మరియు ఇది నిత్యా దేవుని ద్వారా ఆజ్ఞాపించునదిగా.

దేవునికి అపరిశుద్దమైన మనుషులు మరియు దేశములు విశ్వాసమందు నూతన నిబంధన ప్రకారము లోబడి ఉండాలని కోరుకుంటున్నాడు. కనువైకా ప్రభువు అందరికీ తన క్షమాపణను మరియు కృపను ఇస్తున్నాడు, కనుక ఎవరైతే అతని పిలుపును విని అతని బహుమానమును అంగీకరించునో వారు రక్షింపబడుదురు. అయితే ఎవరైతే లోబడక ఉండరో వారు ఖండించబడతారు.

పౌలు ఒంటరిగా తెలివితో దేవుడిని ఆరాధించెను. దేవునికే సమస్త మహిమ ఘనత మరియు కృతజ్ఞత కలిగి ఉన్నాడని చెప్పెను, ఎందుకంటె యేసు తండ్రితో ఐక్యత కలిగి పరిశుద్దాత్మ ద్వారా నిత్యమూ జీవించువాడై ఉన్నాడు. "ఆమెన్" అను చివరి మాట ద్వారా పౌలు తన పత్రికను ముగించాడు, అంటే ఇది నిజమైన మరియు నెరవేర్చు మాట అని చెప్పెను.

ప్రార్థన: అన్యులకు రక్షణను ఇచ్చుటకు నీవు పౌలును ఎన్నుకున్నందుకు తండ్రి నీకు కృతజ్ఞతలు, అనగా వారి విమోచనమును బట్టి నీవు పౌలును పిలిచి ఉన్నావు. మేము ఆత్మ యందు స్వార్థముగా ఉండక సహాయము చేయుము, అయితే ఎవరైతే రక్షణ కొరకు ఆశకలిగి ఉన్నారో వారిని నీయొద్దకు నడిపించి నీ పరిశుద్దాత్మ సన్నిధిలోనికి తెచ్చుటకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. పౌలు కు దేవుడు బయలుపరచిన రహస్యము ఏమిటి?

క్విజ్ - 4

ప్రియా చదువరి,
ఈ పుస్తకములో రోమీయులకు చెప్పిన వ్యాఖ్యలను నీవు చదివి ఉండగా, నీవు ప్రశ్నలకు సమాధానములు చెప్పుటకు సమర్థుడవు. ఒకవేళ నీవు 90% సమాధానములు చెప్పినట్లైతే నీకు ఈ లాంటి పత్రికలూ నిన్ను బలపరచుటకు పంపుటకు సిద్ధముగా ఉన్నాము. మీ చిరునామాను వ్రాయుట దయచేసి మరచిపోవద్దు.

  1. నిన్ను నీవు క్రీస్తుకు అనగా రక్షకునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఉన్నావా, లేక నీవు ఇంకా నీ కొరకే జీవించుచున్నావా?
  2. క్రీస్తును వెంబడించువారు ఏవిధముగా ఆత్మీయతతో జీవించగలరు?
  3. ఈ దినము ఏ పరిచర్యను నీవు ప్రాముఖ్యముగా భావించుచున్నావు?
  4. నీ సహవాసములో ఏవిధమైన దేవుని ప్రేమ ఎంతో ప్రాముఖ్యముగా నీ జీవితములో ఎంచుకొనెదవు?
  5. మనము మన శత్రువులను ద్వేషించక మరియు కక్ష తీర్చక ఏవిధముగా క్షమించుచున్నాము?
  6. ప్రతి ప్రభుత్వము యొక్క అధికార పరిధి ఎంత, మరియు మనుషులకు కాక మనము దేవునికే ఎందుకు లోబడి ఉండాలి?
  7. "నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను" అను ఈ ఆజ్ఞను పౌలు ఏవిధముగా వివరించాడు?
  8. రాబోవు క్రీస్తు కొరకు మనలను నడిపించు జ్ఞానమునకు చెందిన ధర్మమూ ఏమిటి?
  9. ప్రతి విశ్వాసి జీవితములో రెండవ విషయమందు వారికున్న వ్యత్యాసములను బట్టి మనము ఏవిధముగా ఆలోచన చేస్తాము?
  10. "దేవుని రాజ్యము భోజన మును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది " ఈ వాక్యమునకు గల అర్థము ఏమిటి?
  11. రోమా 15:5-6 గల అర్థము ఏమిటి?
  12. రోమా సంఘములో ఉన్న వ్యత్యాసములను పౌలు ఏవిధముగా జయించాడు?
  13. భాగమును బట్టి పౌలు తన పత్రికలో యేమని వ్రాసాడు?
  14. అపొస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ఉన్న రహస్యము ఏమిటి?
  15. స్పెయిన్ కు వెళ్ళుటకు ముందు పౌలు ఎందుకు యెరూషలేమునకు వెళ్లాలనుకొనెను, ఎందుకంటె అక్కడ అతనికి శ్రమలు మరియు ఇబ్బందులు ఉన్నాయి కనుక?
  16. రోమా సంఘములో ఉన్న సంఘ సభ్యుల పేర్లను బట్టి మనము ఏమి నేర్చుకోగలము?
  17. జాబితాలో వ్రాయబడిన పరిశుద్దాల నుంచి మనము ఏమి నేర్చుకోగలము?
  18. సాతాను యొక్క శ్రమల ద్రుష్టి ఏమిటి?
  19. రోమా లో ఉండు ఏ మనిషికి పౌలు అతని పత్రికను చెప్పాడు?
  20. పౌలు కు దేవుడు బయలుపరచిన రహస్యము ఏమిటి?

నీవు ఒకవేళ ఈ పత్రికను చదువుట ముగించినట్లైతే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములు పంపగలరు, అప్పుడు మేము నీకు క్రీస్తు పరిచర్యలో నీవు ముందుకు వెళ్ళుటకు కొన్ని పత్రికలను పంపగలము.

అప్పుడు మేము మీకు సర్టిఫికెట్ ను బహుమానంగా ఇచ్చెదము అప్పుడు నీవు ఈ పత్రికను అర్థము చేసుకొన్నట్లని యెరుగుదుము

నీవు నిత్యా ధనమును పొందునట్లు పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక యొక్క పరీక్షను వ్రాయునట్లు మేము నీకు ఉత్సాహపరచుచున్నాము. నీ సమాధానములు కొరకు మేము ఎదురు చూస్తున్నాము:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:48 AM | powered by PmWiki (pmwiki-2.3.3)