Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 077 (Paul’s Expectations in his Journeys)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

3. పౌలు తన ప్రయాణములో వేసిన అంచనాలు (రోమీయులకు 15:22-33)


రోమీయులకు 15:22-33
22 ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. 23 ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, 24 నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. 25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను. 26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. 27 అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరి 28 ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. 29 నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద5 సంపూర్ణముతో వత్తునని యెరుగుదును. 30 సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధే యుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర మగునట్లును, 31 నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, 32 మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను. 33 సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్‌.

మనిషి ఆలోచన కలిగి ఉంటె దేవుడు నడిపిస్తాడు. పౌలు తన ప్రయాణముల గురించి తన హృదయములో అనుకొనెను, అతని కోరికలను చూపి గౌరవముతో ప్రార్థించెను. అతను ఉత్తర మరియు తూర్పు దిక్కు మెడిటేరానియన్ బుక్కులో ఉన్న దేశములలో ప్రకటించెను, అక్కడ అతను కొన్ని సంఘములను స్థాపించెను, తనకు కలిగిన శ్రమలకు బదులుగా ఇక్కడ సంఘములను స్థాపించెను. ఇప్పుడు అతను పడమర వైపున రోమా రాష్ట్రములో ప్రకటించాలని కోరుకొనెను, మరియు ఉత్తర ఐరోపాలో కూడా ప్రకటించి, ఎందుకంటె ఈ లోకమంతాకూడా దేవుని కుమారుని పాదముల క్రిందనే ఉన్నాడని చెప్పుటకు.

పౌలు రోమా లో ఉన్న సంఘమును అప్పుడప్పుడు దర్శించి వారిని వారి విశ్వాసముతో స్థిరపరచాలని అంగీకారాయించాడు, వారి విశ్వాసములను బలపరచి, ప్రేమను మరియు నిరీక్షణకు స్థిరపరచునట్లు, అయితే ఆసియా ఖండములో మరియు గ్రీసులో తన ప్రయాణమును బట్టి అతను విసుగు చెందాడు.

కొన్ని సంవత్సరముల ముందు అతను రోమా సంఘమును దర్శించాలని మరియు పరిచయము చేసుకోవాలని ఆశపడ్డాడు, అక్కడ వారు అతని సహాయము లేకుండా బలపడినారు. అతని స్పెయిన్ ప్రయాణములో కూడా అక్కడున్న రకరకాల సంఘ సభ్యులను కలవాలని అనుకొనెను. స్పెయిన్లో తన నూతన పరిచర్యను బట్టి రోమా సంఘము మద్దతు పలకాలని ఆశించెను, ప్రార్థనలో, సహకారముతో మరియు ఆచరణాత్మక సేవలో కూడా సహకరించి, ఎందుకంటె అతని ప్రసంగము భవిష్యత్తులో తన సొంత అవకాశముగా ఉండక, అయితే రోమా లో ఉండు పరిశుద్ధులకు ఉద్భవించునట్లుగా ఉండాలని. పౌలు యెరూషలేమునకు మొదటగా ప్రయాణము చేసి అక్కడ గ్రీసు సంఘము ద్వారా ఇతర సంఘములో ఉండు బీద వారికి సహకారమును అందించుమని ఒత్తిడి చేసెను, దానికి ఫలితముగా అతను ఆకలితో అలమటించెను. పట్టుదలతో, పరితాపముతో వారు అతని కొరకు విశ్వాసముతో ప్రార్థించుమని అనటోలియా లో మరియు గ్రీసు లో ఉండు విశ్వాసులు ప్రార్థిస్తారని అనుకొనెను. వారు తమ వ్యాపారములలో కూడా శ్రద్దగలవారి ఉండాలని అనుకొనెను, ఎందుకంటె వారి జీవనాధారములో వారు ఉపసంహరణ మరియు తరుగుదల లేకుండా ఉండాలని ఎదురుచూసేను. పౌలు థెస్సలొనీయులకు వ్రాసిన పత్రికలో చెప్పినట్లు, మనిషి పని చేయకపోతే, ఆహారము కూడా తినకూడదని (2 థెస్స). ఏదేమైనా, యెరూషలేము సంఘములో ఉన్న విశ్వాసులకు వారి చికిత్సల కొరకు ఆర్థికపరమైన అవసరం ఉండెను, ఎందుకంటె అన్యుల క్రైస్తవులకు వారి విశ్వాసముతో త్యాగముచేయుటకు సిద్దపడి ఉండిరి కనుక.

యెరూషలేము సంఘస్తులు యూదులు మరియు అన్యుల విశ్వాసులతో కూడా కలిసి ఉండిరి కనుక వారికి కూడా అది అవసరమై ఉన్నాడని పౌలు చెప్పెను, ఎందుకంటె ప్రతి ఒక్కరికీ కూడా ఆత్మీయ జ్ఞానము బహుమానంగా ఇవ్వబడినది. కనుక యెరూషలేము సంఘములో ఉన్న వారి అవసరంలో అన్యులల సంఘములో ఎవరైతే నూతన జన్మమును పొందిఉన్నారో వారు మొహమాటం లేకుండా, నైతికంగా సహాయపడమని పౌలు వ్రాసెను. కనుక పౌలు వ్రాసినట్లు ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి మొహమాటం లేకుండా సహాయము చేయడము అన్ని సమయాలలో మంచిది.

ఎప్పుడైతే యెరూషలేమునకు ద్రవ్య సహాయము తీసుకున్నాడో, అప్పుడు పౌలు రోమా ద్వారా స్పెయిన్ సంఘమును కూడా దర్శించి వారికి ఆత్మీయ ఆశీర్వాదములను సంపూర్ణము ఇవ్వాలని ఆశపడెను. యెరూషలేము యొక్క ప్రయాణము చాల తీవ్రమైనదని అనుకొనెను, ఎందుకంటె అక్కడ అతను కొన్ని సంఘాలలో ఉండెను అక్కడ వారు మోషే ధర్మశాస్త్రమును పాటించి క్రీస్తు ఏవిధముగా అన్య విశ్వాసులను కలిగినదో అని చూచెను. యూదుల విశ్వాలు ఈ సహకారాలను తిరస్కరించారు, ఎందుకంటె వారు యూదులు కానీ వారినుంచి పంపబడినారు కాబట్టి. పరిసయ్యులు శత్రుత్వమును పౌలుకు బహిరంగముగానే చూపి అతనిని చంపుటకు నిర్ణయించుకొనిరి. కనుక, రోమా లో ఉన్నవారిని యేసు నామములో ప్రార్థించుమని చెప్పెను, అప్పుడు అతను ఆత్మీయమైన మద్దతుతో మరియు సత్యమైన శ్రమలలో కూడా కృప ద్వారా సమాధానపడుటకు, అయితే ఇది ధర్మశాస్త్రప్రకారము కాదు. ఎవరైతే యేసుకు దూరముగా ఉన్న యూదులను తనను చంపుతాను ఖండించుటకు పిలిచెను.

పౌలు తన ప్రణాళికలను మరియు అంచనాలను వాడుకున్నాడు, దేవుని చిత్తముతో అతను రోమా సంఘము దగ్గరకు ఆనందముతో వస్తానని. వారితోనే సమాధానము కలిగి ఉంటానని అతను సమాధాన కర్త అగు దేవునికి ప్రార్థనతో తన పత్రికను ముగించెను, ఒకవేళ వారు ఆహారము విషయములో కానీ, సున్నతి విషయములో కానీ మరియు ఇతర విషయాలలో కానీ ఒప్పుకున్నప్పటికీ.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రి, మీ కుమారుడైన యేసు ద్వారా అపొస్తలుడైన పౌలు ద్వారా సువార్తను ప్రజలందరికీ వచ్చుటకు అవకాశము కలిగెను, మరియు అన్యులు కూడా నీ యొద్దకు వచ్చుటకు అవకాశము వచ్చెను, అయితే అతను రోమా వారికి అవమానంగా మరియు ద్వేషణగా వచ్చెను. అతని పత్రికలను, ప్రార్థనను, విశ్వాసమును మరియు నిరీక్షణకు బట్టి నీకు కృతజ్ఞతలు. నీయందు ప్రేమను తొలగక పోవునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. స్పెయిన్ కు వెళ్ళుటకు ముందు పౌలు ఎందుకు యెరూషలేమునకు వెళ్లాలనుకొనెను, ఎందుకంటె అక్కడ అతనికి శ్రమలు మరియు ఇబ్బందులు ఉన్నాయి కనుక?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:44 AM | powered by PmWiki (pmwiki-2.3.3)