Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 021 (The Privilege of the Jews does not Save them)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
A - సాతాను అధికారంలో ఈ లోకమంతా అబద్ధము చెప్పును, అయితే దేవుడు అందరిని తన నీతి ద్వారా తీర్పు తీర్చును (రోమీయులకు 1:18 - 3:20)
2. యూదులకు దేవుని ఉగ్రత బయలుపరచుట (రోమీయులకు 2:1 - 3:20)

e) యూదుల అవకాశము కోపము నుంచి రక్షించదు (రోమీయులకు 3:1-8)


రోమీయులకు 3:1-5
1 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? 2 ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. 3 కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. 4 నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునునీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. 5 మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; 

పౌలు తన పత్రికను రోమా సంఘమునకు వ్రాసే ముందు, ఆ సంఘములో ఉండు వారికి నానా విధములైన ప్రశ్నలు ఉన్నవి. ఎందుకంటె విశ్వాసులైన అనుకులస్తులకు యూదులు అవకాశము కలిగిన వారని మరియు మర్యాద కలిగినవారిని లెక్కచేయలేదు. అనుకూ ఎప్పుడైతే పౌలు ధర్మ శాస్త్రమును మరియు సున్నతిని ఖండించునని చెప్పినప్పుడు వారు సంతోషించిరి.

అయితే యుధులైన క్రైస్తవులు ధర్మశాస్త్రమునకు లోబడి దాని నీతికి విశ్వాసము చేత కట్టుబడిరి. కనుకనే వారు పౌలు యొక్క సారాంశమును బట్టి సంతోషించలేదు, మరియు పౌలు వారి ధర్మశాస్త్రమును మరియు నిబంధనను వ్యతిరేకించేనని అనుకొనెను.

పౌలుకు తన సువార్త ప్రయాణాలలో ఈ రకరకాల ప్రవర్తనలు గమనించెను, కనుక అతను తన రోమా పత్రికలో వారి ప్రశ్నలకు తగిన సమాధానములను ఇచ్చెను. కొంతమంది చెప్పారని చెప్పి: "పౌలు నీవు చెప్పునది కరెక్ట్, ఎందుకంటె యూదులు మనకంటే గొప్పవారు కాదు." అప్పుడు పౌలు వారికి నవ్వుతు సమాధానము ఇచ్చెను: "నా ప్రియా సహోదరుడా, నీవు తప్పు, ఎందుకంటె యూదులకు ఇంకా గొప్ప అవకాశము ఉన్నది. అది వారి వ్యక్తి గత కార్యము కాదు వారి మంచి తనము కాదు. అయితే దేవుని వాక్యము వారి చేతులలో ఉన్నది కనుక వారికి ఇంకనూ అవకాశము కలదు. కనుక వారి ప్రకటన నిత్యమూ నిలుచును.

మరియు వేరే మనిషి ఈ విధముగా చెప్పెను: "అయితే వారు ధర్మశాస్త్రమునకు మరియు నిబంధనకు నమ్మకస్తులు కారు" అని చెప్పిరి. పౌలు ఈ విషయమును బట్టి ఈ విధముగా సమాధానము చెప్పెను: "మనుషుల తప్పిదాలు, దేవుని వాగ్దానాలను మరియు నమ్మకమును నిరర్థకముగా మరియు శూన్యము చేస్తాయని అనుకొంటున్నావా? దేవుడు విడువడు లేదా అబద్ధము చెప్పువాడు కాదు. అతని మాటలు ఒక నిత్యమైన సత్యము మరియు లోకము. అయితే ఇది మనుషుల ముందర దేవుని కృప అయి ఉన్నది, కనుక ప్రతి ఒక్కరు నమ్మకము కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మన పాపములను బట్టి పాత నిబంధనను తీసివేయలేదు, ఒకవేళ తీసివేసినట్లైతే ఆ నిబంధన ముందుకు కొనసాగేది కాదు. అయితే నూతన నిబంధన ప్రకారము మనము పాత తరము కంటే మరి ఎక్కువ పాపములు చేస్తున్నాము, ఒకవేళ మనము మనకు ఇవ్వబడిన బహుమానములను బేరీజు చేసుకుంటే. కనుక మనము మన సొంతముగా నిరీక్షణకు చేసుకోలేము, అయితే కేవలము దేవుని కృప చేతనే మనము నిరీక్షణ కలిగి ఉంటాము. మనము అందరి వాలే అబద్ధికులమని మరియు తప్పు చేయువారమని చెప్తున్నాము, మరియు దేవుడు మాత్రమే సత్యమైనవాడని చెప్పగలము. కనుక అతని వాగ్దానములు మరియు అతని నమ్మకత్వము ఎన్నడూ విఫలము కాదు.

రోమీయులకు 3:6-8
6 అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? 7 దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? 8 మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. 

దేవుని నమ్మకత్వము మీద ఆధారపడిన నిరీక్షణకు బట్టి పౌలు చెప్పెను, అతను దురాత్మలు యేడ్చుట తన ఆత్మయందు వినెను " మన పాపములో ఒకవేళ దేవుడు బయలుపరచినట్లైతే అతను నీతిమంతుడుగా ఏవిధముగా ఉండగలడు? ఒకవేళ అతను నమ్మతగినవాడుగా ఉన్నట్లయితే మన పాపములను బట్టి మన దోషములను బట్టి అతను మనకు శిక్షను ఎలా ఇవ్వగలడు? అయితే, పాపముచేత అతనిని ఘనపరచుటకు రావాలి!"

పౌలు ఈ సందర్భములో మౌనముగా ఉండలేదు, అయితెహ్ వాటిని అతను పరిస్కారం చేసెను, మరియు అతను వాటిని ఒక అపొస్తలలుగా పెట్టలేదని చెప్పెను, అయితే ఒక సహజమైన మనిషిగా పెట్టెను. అందుకే అతను: ఒకవేళ దేవుడు మన పాపములను బట్టి ఎరిగినవాడైతే అతను ఈ లోకమునకు తీర్పు తీర్చలేడు. మరియు సత్యమును బట్టి ఈ లోకమును ఖండించుటకు అతనికి ఏ అధికారము కూడా ఉండదు. ఒకవేళ అయితే మనము అప్పుడప్పుడు పాపము చేయుటకు అవకాశము కలిగినవారుగా ఉండెదము.

పౌలు ఈ విషయాలను బట్టి చర్చించలేదు, మరియు వారి ప్రశ్నలకు కూడా సమాధానములు ఇవ్వలేదు, అయితే వాటిని బట్టి విశదీకరించి వారి ప్రశ్నలను బట్టి వారి ఆత్మీయతను పెంపొందించెను. అప్పుడు అతను రెండు విధాలుగా సమాధానమును ఇచ్చెను: మొదటిది, " ఖచ్చితంగా లేదు!". ఎందుకంటె నా హృదయమందు దేవునికి వ్యతిరేకమైన భావన నేను కలిగి ఉండను. రెండవది: దేవుని యొక్క తీర్పు ఎవరైతే దేవుడిని దూషిస్తారో వారి మీద పడును, అప్పుడు వారు అతని ఉగ్రతనుంచి తప్పించుకోలేరు, అప్పుడు అతను వారిని నాశనము చేయును. కనుక ఈ విధముగా మనము నేర్చుకొంటే మనము ఎన్నడూ కూడా క్రీస్తుకు శత్రువులుగా ఉండకూడదు ఒకవేళ అయితే అదే దూషణ. కనుక మనము ఎక్కువసేపు చర్చలలో ఉండక సమస్తమును బట్టి దేవునికి ఇచ్చి ఆ సమస్యను ముగింపు పలకాలి అప్పుడు కృప కలిగిన దేవుడు మహిమపరచబడతాడు.

ప్రార్థన: ప్రభువా మా ప్రతి లోబడని స్వభావమును బట్టి మమ్ములను క్షమించు. నీ పరిశుద్ధాత్మను వినుటకు మాకు అవకాశమును ఇచ్చి, మా దోషములను మరియు మా తప్పిదములను నీవు జ్ఞాపకము చేసికొనక మాకు నీ క్షమాపణను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నీ ప్రేమ కలిగిన ప్రణాళికలను బట్టి మేము అధిక ప్రశ్నలు కలిగి ఉండక నీతో మేము సమాధానము కలిగి ఉండునట్లు సహాయము చేయుము. కనుక మాకు నీ సాత్వికమును మరియు నీ కుమారుని పట్ల ప్రేమ కలిగిఉండునట్లు నేర్పుము, మరియు మమ్ములను నీ జ్ఞానము చేత నింపుము. మరియు మా చర్చలలో నిన్ను ఉంచుకొని నీ ఆత్మ చేత నింపబడి వాటిని పరిస్కారం చేయునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్నలు:

  1. రోమీయులకు వేసిన ప్రశ్నలు ఏమి, మరియు వారి సమాధానములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:40 AM | powered by PmWiki (pmwiki-2.3.3)