Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 028 (Revival and many Healings)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

15. పునరుజ్జీవ మరియు స్వస్థత కార్యములు (అపొస్తలుల 5:12-16)


అపొస్తలుల 5:12-16
12 ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి. 13 కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని 14 ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. 15 అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి. 16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. 

సమాజములో పరిశుద్ధులు స్వార్థముగా లేరు, అయితే వారికొరకు మాత్రమే జీవిస్తారు. వారు ఒకరితో ఒకరు వేషధారణ కలిగి ఘనపరచుకొనరు. అయితే, వారు కనికరము కలిగి ఉంటారు, ఎందుకంటె వారి దేశము కొరకు వారు కూడా శ్రమపొంది ఉంటారు. వారు ప్రకటించుట మాత్రమే కాక, స్వస్థపరచబడి, దేవుని సహాయమును కూడా అడుగుతారు. వారు కేవలము స్వరముతో మాత్రమే కాక చేతులతో మరియు ఖండారములతో దేవునిని సేవించెదరు.

పరిశుద్ధులు ఎప్పుడు కూడా వారి వ్యక్తిగత శక్తిని బట్టి నమ్మకము కలిగి ఉండలేదు, లేక ఏ సంస్థను స్థాపించి బీదలకు సహకారమును అందించలేదు. అయితే వారికి ఇయ్యబడిన దేవుని శక్తిని వారు ఇతరులకు పంచిరి. దానికి ఫలితముగా వారి పరిచర్య యేసుకు మహిమకరముగా ఉండెను. రక్షకుడు వారి ద్వారా అనేక అద్భుతములను చేసి ఉన్నాడు. దేవుని హస్తము శ్రమలలో ఉన్న అపొస్తలుల మీదికి చాచి వారిని దెయ్యముల నుంచి, వ్యాధులనుంచి కాపాడెను. కనుక అతని రాజ్యము తప్పక వచ్చును.

విశ్వాసులు చేతులతో కట్టబడిన సంఘమును చేయలేదు. వారికి పరిశుద్ధ దేవుని గృహము అవసమై ఉండలేదు, ఎందుకంటె దేవుడు నివాసము చేయుటకు వారి హృదయాలు ఉండెను. ఇంతకు ముందు యేసు బోధించిన స్థలమందు వారు కూడుకొనుచు ఉండిరి. కనుక వారి స్థలము అందరికీ తెలిసినదిగా ఉండెను. వారు ప్రేమించబడి మరియు గౌరవము కలిగిన వారైరి, ఎందుకంటె ఎవ్వరు కూడా వారికి వ్యతిరేకముగా పిర్యాదు చేయలేదు. పరిశుద్దాత్మ ద్వారా ఒకరికి ఒకరు తెలుసు, కనుక ఎల్లప్పుడూ కూడుకొనుటకు ఎదురుచూసారు.

అపొస్తలుల దగ్గర అవసరంలో ఉన్న సభ్యులకు ఇచ్చుటకు వారితో చాలినంత డబ్బు ఉండెనని ఎవ్వరు వారి దగ్గరకు పరిగెత్తలేదు. లేదా దేవుని శక్తిని విచారించుటకు వెళ్ళలేదు. దేవుడు ఈ విశ్వాసులలో ఉన్నాడని వారు భావించిరి కనుక చూస్తూ ఉండిరి. ఎవరైతే వ్యక్తిగత స్వభావంలో చనిపోకున్నట్లైతే వారు పరిశుద్దులలో ఉండరు. అయితే ఎవరైతే అతని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు క్రైస్తవుల సంఘములోనికి మార్చబడెదరు. వారు నూతన పరచబడి ప్రభువు శక్తి పొందుకొని ఉండిరి.

హెబెరీయులు పురుషులను మాత్రమే సాంప్రదాయకంగా లెక్కపెట్టిరి. తక్కిన స్త్రీలు క్రీస్తు అపొస్తలులును వెంబడించిరని సువార్తీకుడైన లూకా చెప్పెను, పరిశుద్దాత్మ రక్షణను అనుభవించుకొని. వారి విశ్వాసము తాత్వికముగా ఉండలేదు, అయితే నిజమైన దేవుని రక్షణ మరియు అతని శక్తిలో నివాసము కలిగి ఉండిరి.

ఆ దినాలలో అనేక అద్భుత కార్యములు జరుగునట్లు పరి శుద్దాత్మ శక్తి ఎంతగానో కార్యము చేసెను, అది యేసు దినములలో జరిగినట్లుగా (మార్క్ 6:56), అక్కడ యేసు ఆ వీధుల గుండా వెళ్తున్నప్పుడు అనేకులు అతని వస్త్రములు తాకిరి. అక్కడ యేసు మీద విశ్వాసముచేత అనేకులు స్వస్థత పొందిరి. దానికి ప్రతిగా పేతురు నీడ కూడా పరిశుద్దాత్మ శక్తి మాదిరి వారికి శక్తిని ఇచ్చెను. కనుక మనిషి ప్రాణము స్వస్థత కలిగి ఉండాలంటే అతనిలో క్రీస్తు ప్రేమ ఉండాలి.

ఈ విధమైన సంఘటనలు యూదులకు తెలియకుండా ఆ పట్టణములలో మరియు గ్రామాలలో జరగలేదు. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వారికి కలిగిన సాతాను ఆత్మల ద్వారా మరియు వ్యాధుల నుంచి విడుదల పొందుటకు అపొస్తలుల దగ్గరకు వచ్చిరి. అప్పుడు క్రీస్తు రెండవ గొప్ప ఆజ్ఞ బయలుపడెను. అపొస్తలులు యెరూషలేములో ప్రకటించాక యూదయలో ప్రకటించలేదు. రోగులందరినీ వారు క్రీస్తు శక్తి చేత స్వస్థత పరచిరి. "అన్ని" అను పదము యాజకుల ద్వారా ఇవ్వబడినది కాదు, లేదా బిస్షోప్ ద్వారా ఇవ్వబడినది కాదు, అయితే అనుభవము కలిగిన సువార్తీకుని ద్వారా మనుషులకున్న ప్రతి విధమైన బలహీనతలనుంచి పొందుటకు ఇవ్వబడెను. మృతులను లేపిన శక్తి అనగా సంఘములలో జీవము కలిగిన యేసు నాశనములన్నిటి మీద అధికారము చేయబడెను. కనుక శిష్యులు విజయశీలుడైన యేసును వెంబడించిరి. ఈ దినము కూడా ప్రభువు అనేకులను వారి పాపముల నుంచి, సాతాను బంధకముల నుంచి, మరియు నొప్పికరమైన వ్యాధుల నుంచి విడిపించును. విశ్వాసులకు దేవుని సన్నిధిలో అందరు కూడా ఐక్యం కలిగి దేవుని ఆలయములో అతనిని మహిమపరచుచు ఉండిరి. ప్రియా సహోదర, క్రైస్తవ సంఘము నీలో బయలుపరచి ఉన్నదా? యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా ఉన్నాడు కనుక అపొస్తలుల కార్యములను నీవు చదివినట్లయితే నీవు నీ విశ్వాసముతో బలపరచబడి ఉండెదవు.

ప్రార్థన: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు ¸°వనమువలె నీ ¸°వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

ప్రశ్న:

  1. ప్రారంభపు సంఘములో ఉన్న స్వచ్ఛంద రహస్యము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:55 PM | powered by PmWiki (pmwiki-2.3.3)