Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 008 (Matthias Chosen)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

4. పాపాత్మకమైన యూదా నుంచి మత్తీయను ఎన్నుకొనుట (అపొస్తలుల 1:15-26)


అపొస్తలుల 1:21-26
21 కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, 22 ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను. 23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి 24 ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, 25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి. 26 అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.

తాత్వికంగా యూదా క్రీస్తును ఎందుకు తిరస్కరించాడో అనే కారణము శిష్యులకు తెలియదు, అయితే దేవుని తీర్పును విశ్వసించారు. వారు వెనుతిరిగి చూడలేదు, మరియు వారి భావనలో వణికి ఉండలేదు అయితే ముందుకే కొనసాగి ఉండిరి, మరియు ఈ లోకమునకు ప్రకటించుమనే బాధ్యతను కలిగి ఉండిరి. వారి ప్రార్థనలలో యేసుకు ఒక మనవి చేసు కొనిరి, అదేదనగా వారి గుంపులో ఉన్న ఏ ఒక్కరు కూడా పరిశుద్దాత్మ వారి మీద కుమ్మరించబడు సమయములో ఎవ్వరు కూడా తప్పి పోకూడదని మనవి చేసుకొనిరి.

అపొస్తలునిగా నియమించబడుటకు ఒక మనిషి యేసుతో ప్రారంభమునుంచి అతనితో ఉండాలి. మరియు అతను దేవునికి సాక్షిగా ఉంది అతని కార్యములను వ్యక్తిగతముగా అనుభవించి మరియు యేసు మృతి నుంచి తిరిగి లేచెనను వ్యక్తిగత భావన కూడా ఉండాలి. ఈ పన్నెండు మంది శిష్యులు యేసును వదిలి అక్కడక్కడా ఒంటిగా తిరుగులేదు, ఎందుకంటె వారితో పాటు అనేకమంది యేసును వెంబడించిరి కనుక. యేసు డెబ్భై మంది శిష్యులను గాలీలయాకు పంపి అక్కడ సేవ చేయుమని ఆజ్ఞాపించెను. అయితే వారు అపొస్తలుల షరతులను నిర్వచించించిరి, ఎందుకంటె ఆ సేవ కేవలము కొంతమంది ద్వారానే జరుగునట్లు, ముఖ్యముగా బాప్తీసమము ఇచ్చు యోహాను శిష్యులు దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువారుగా ఉండిరి. బాప్తీసమా మిచ్చు యోహాను యొక్క అనేక శిష్యులు క్రీస్తు స్వరమును విన్నారు.: "లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల" కనుక నీటిమూలముగా బాప్తీస్మమిచ్చువానిని వదిలి, ఆత్మ యందు బాప్తీస్మమిచ్చు వానిని వెంబడించుట ప్రారంభిచిరి.

మనము ఇక్కడ గమనించినట్లయితే, ఎవరైతే క్రీస్తును వెంబడించారో వాడు అందరికంటే ఎక్కువ జ్ఞానము కలిగి ఉంటారని తెలుసుకొనవచ్చు. ఏదేమైనా శిష్యుల ప్రవర్తన విరుద్ధముగా రుజువు చేయబడి ఉన్నది. ఎందుకంటే నిజమైన ప్రేమకు ఎవ్వరు కూడా లేరు, మరియు ప్రేమ కలిగి లేరు, అయితే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొన్నారో వారు మాత్రమే నిరీక్షణ కలిగి ఉన్నారు. శిష్యులు యేసు మాటలు విన్నప్పటికీ వారి హృదయములు మాత్రం ఖఠినంగానే ఉన్నవి. వారు అతని పునరుత్తనము తరువాత అతని మహిమను చూసి ఉన్నప్పటికీ నియముగా వారు ఖాళీగానే ఉండిరి, ఎందుకంటె పరిశుద్దాత్మ వారిలో ఉండలేదు కనుక. కొంతమంది యూదా విషయములో మనిషి కార్యము జరిగెనని, కనుకనే యేసు పౌలును తన సువార్తను ప్రకటించుటకు అన్యుల నుంచి ఎన్నుకొన్నాడని చెప్పుకొనిరి.

అయితే తక్కిన పడుకోండి మంది శిష్యులు ఈ లోకమునకు మొదటగా ప్రకటించాలని అనుకొనలేదు, అయితే పన్నెండు గోత్రముల ప్రకారము ఉన్నారు. పేతురు వారితో ఎంతో సఖ్యత కలిగి యేసును వెంబడించి మిగతా శిష్యులను ఎన్నుకొనుటలో ఉండెను. అప్పుడు వారు చివరిగా యేసుకు ఎన్నుకొనబడిన వారిని ఇచ్చెను, ఎందుకంటె హృదయమును శోధించువాడు మాత్రమే ఎన్నుకొనగలడు కనుక. ఇక్కడ పేతురు ఆధిపత్యము చూపలేదు, మరియు ఎన్నుకోవడములో ఒకనిగా లేడు, అయితే ఎక్కువమంది ప్రకారంగానే ఉన్నాడు. అయితే వారందరూ కూడా దేవుని యొద్దకు వచ్చారు, అతని తీర్పును మరియు కాపుదల కొరకు.

దేవుని స్వరమును అనుభవించాలంటే వారు పరిశుద్దాత్మ కొరకు చీట్లు వేసుకునేవారు. తరువాత ఎప్పుడైతే వారు ఏడుమంది పెద్దలను ఎన్నుకొన్నారు అప్పుడు వారికి సంఘములో కొన్ని ఎంపికలను అపొస్తలులు ఇచ్చిరి. ఈ ప్రకారము అంతియొక్క లో ఒకసారి సంఘములో ఉండు పెద్దలు ఉపవాసముండి ప్రార్థించి, వారికి దేవుని నడిపింపును వెతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బర్నబాను, మరియు పౌలు ను ఎన్నుకొన్నారు. అపొస్తలుల చరిత్ర ఒక విధముగా క్రీస్తు చరిత్రగా ఉన్నది. అతని కార్యములు దేవుని రాజ్యమును విస్తరించునట్లు చేసి ఉన్నది. మనము ఇప్పుడు పౌలు యొక్క అధికారమైన సంఘములో కానీ లేదా రాజకీయములో కానీ ఉండలేదు, అయితే కేవలము యేసు క్రీస్తు యొక్క సంఘ అధికారంలో మాత్రమే ఉన్నాము. అతని యొక్క అధికారము కేవలము ఎవరైతే పరిశుద్దాత్మ ద్వారా నింపబడి ఉండి వారి హృదయములలో కార్యములు జరుగునో వారిలోనే అతని శక్తి కనపడును.

సంఘము యొక్క బాధ్యతలను మనము సేవకులకు, పెద్దలకు మరియు సహాయకుడికి ఇవ్వడము మంచిది. మనము మన మనసులమీద, ఇష్టము మీద లేకా కుటుంబ సామర్థ్యము మీద ఆధారపడకూడదు అయితే ప్రార్థన మీద ఆధారపడాలి. ప్రారంభములో మరియు ముగిపులో దేవుడు మాత్రమే తన కొరకు సేవకులను ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇది ధనమును బట్టి, లేక సంఘ సేవను బట్టి, ఉండక అతని చిట్టాను సారముగానే జరుగును. అప్పుడు దేవుని చిత్తము జరుగును మరియు దేవుని సేవకులు పరిశుద్దాత్మ చేత నింపబడిఉందురు. విజయము అనునది ఒక మనిషి చదువును బట్టి లేదా డిగ్రీలను బట్టి కలుగునది కాదు, అయితే క్రీస్తుతో ఉన్న బంధమును బట్టి మరియు అతని వాక్యము మీద ఉన్న శ్రద్ధను బట్టి మాత్రమే జరుగును. ఎవరైతే ఈ విధముగా పిలువబడక అతని సేవ చేస్తారో వారు ప్రమాద కరమైన పరిస్థితిలో ఉండి నిత్యా నరకంలోకి వెళ్ళెదరు.

పదుకొండు మంది శిష్యులు క్రీస్తు పరిచర్యను మరియు అతని అధికారమును పంపిణి చేయుటకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఏ మనిషికి కూడా మంచి హృదయము, నైపుణ్యము మరియు నమ్మకము లేడు అని అనుకొనిరి. నూట ఇరవై మంది క్రీస్తు శక్తి కలిగి అతని పరిచర్య చేయునట్లు ప్రార్థన చేసిరి. ఒకవేళ దేవుని కుమారుడు ఆ పరిచర్యలలో ఉండకున్నట్లైతే ఆ పరిచర్య మొత్తము కూడా వ్యర్థమే.

వారు ఈ కార్యముల కొరకు ఇద్దరినీ నియమించారు అయితే వారి యొక్క స్పష్టమైన సమాచారం మంత్తో లెదు. అయితే ఎన్నుకొనబడని వాడు మత్తియా మొదటి వాడు కాదు. చాల రోజుల తరువాత క్రీస్తు అతనిలో కూడా పరిశుద్ధాత్మను నింపి అతని రాజ్యములో ఒక సభ్యునిగా చేసుకొనెను. అయితే దీనికంటే ఎక్కువగా మనకు ఏ ఇతర సమాచారం లెదు.

ప్రార్థన: ఓ ప్రభువా చదువులేని వారిని నీ పరిచర్య చేయుటకు పిలిచి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీవు వారిని తర్ఫీదు కోసము పంపి, వారిని నీ కొరకు నియమించుకున్నావు. నీ దృష్టిలో మేము కృప పొంది ఉన్నాము కనుక మమ్ములను తిరస్కరించవద్దు, అయితే మా గర్వమును తీసి, నీ శక్తిలో మేము బలము పొందునట్లు మమ్ములను ఉంచి నీ నామము మహిమపరచుట్టలు చేయుము.

ప్రశ్న:

  1. క్రీస్తు పరిచర్యలో పాల్గొనుటకు గల షరతులు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:41 PM | powered by PmWiki (pmwiki-2.3.3)