Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 078 (The Greeks seek Jesus' acquaintance)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 – 12:50)

3. యేసుతో పరిచయమునకు గ్రీకులు వెతుకుట (యోహాను 12:20-26)


యోహాను 12:20-24
20 ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి. 21 వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 23 అందుకు యేసు వారితో ఇట్లనెనుమనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది. 24 గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.

యూదులలోనికి మార్చిబడిన గ్రీకుల యెరూషలేములోని ప్రేవేశించి; వారు అక్కడికి విమోచన దినమునుగురించి వచ్చారు. ఎప్పుడైతే యేసును అక్కడ సంతోషముతో ఆహ్వానించారా అప్పుడు గ్రీకులు కూడా చాల సంతోషించారు. కనుక వారు అతనిని తెలుసుకొనుటకు ఇష్టపడినారు. కనుక ఆ దేశములన్నీకూడా సంగ్రహించుటకు ఇష్టపడ్డారు. ఫిలిప్పు గ్రీకు వారితో మాట్లాడి అతని స్నేహితుడైన అంద్రెయతో మాటలాడుటకు ఒప్పుకొనెను. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చారు, ఎందుకంటె అవిశ్వాసులలో ఎవరు ముందు వస్తారో అని యేసు ఎదురు చూసేను. వారు గ్రీకు దేశమునుంచి బయటకు వెళ్ళుటకు ప్రయత్నమూ చేసిరి ఎందుకంటె యూదులనుంచి తప్పించుకొనుటకు.

యేసు వారి ఆలోచనలను కనుక్కొని, గ్రీకులు విన్నపము ప్రకారము దేశములన్ని కూడా కలుసుకొనుటకు. అందుకే అతను జీవనాధారము అందరికి అర్థము చేసుకొనుటకు బయటికి పంపెను, అయినాను అది విజయముగా పిలువబడి, యోహాను సువార్తకు ఒక ప్రాముఖ్యమైనదిగా ఉండెను, " మనుష్య కుమారుడు ఇప్పుడు ఘనపరచబడును ". అతను మహిమపరచబడుటకు సమయము వచ్చినది, మరియు దీనిని బట్టి పరలోకము మరియు భూమి ఎంతగానే ఎదురు చూసేను.

అయినప్పటికీ అద్భుతములు మీద అద్భుతములు మరియు యుద్ధముల మీద విజయములు వచ్చి, మరియు రాజకీయ శక్తిని పట్టుకోవదం అనునది యేసు యొక్క సాదృశ్యము కాదు. అందుకే యోహాను ఎత్తైన పర్వతములను బట్టి చూపలేదు, ఎందుకంటె అవి మహిమను గూర్చినవి కాదని అనుకొనెను. అయితే క్రీస్తు యొక్క మహిమ అతని మరణము ద్వారా కలుగుతున్నదని చెప్పెను,. కనుక మనము ఆ సిలువపైన అతని దైవత్వమును మరియు ప్రేమను చూడగలము.

యేసు తనను తాను గోదాము విత్తనముగా పిలువబడెను. కనుక పరలోకము నుంచి ఆ విత్తనము ఈ భూమి మీద పది అది నీటి న్యాయములు మహిమను ఇచ్చు పంటను ఇచ్చెను. యేసు ఎప్పుడు మహిమకలిగిన వాడు. అతని ఘనతను మనము పంచుకొనునట్లు అతని మరణము మనలను కడిగినది. గ్రీకులు వచ్చుట ఒక మంచి పిలుపుగా ఉండెను, ఎందుకంటె అది ఆయన అందరిని పిలుస్తున్నాడు అనుటకు ఒక సంకేతముగా ఉండెను. కనుక అతను వారిలో అతని నిజమైన ఘనతను పొందును . ఆ ఘనత కేవలము సిలువ త్యాగముద్వారా మాత్రమే కలుగును.

యోహాను 12:25-26
25 తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

క్రీస్తు తన మరణము మరియు తన మహిమ తన శిష్యులకు కూడా ఒక విధమైన నడిపింపును ఇచ్చునని. కుమారుడు ఏవిధముగా అయితే తన మహిమను మనకొరకు వదిలి తన దైవత్వమును మనుషులకు పంచాలనుకున్నాడో అదేవిధముగా మనము కూడా గొప్ప వారము కావాలను కుంటే మన స్థానమును విడిచి పెట్టాలి. కనుక నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే ప్రేమించుకుంటున్నావా లేక క్రీస్తును ప్రేమిస్తున్నావా ? యేసు అంటున్నాడు నిన్ను నీవే మరచిపోయి దేవుని రాజ్యము కొరకు నమ్మకముగా పనిచేస్తే అప్పుడు నీవు నిత్యా జీవమును పొందుకుంటావు . కనుక నీవు నిత్యా మరణము నుంచి నీ ప్రాణమును కాపాడుకొనగలవు. ఈ మాటలచేత యేసు తన మహిమ గుణములను నీకు తెలియపరచుచున్నాడు. కనుక నీ ఆశలను ఘనపరచవద్దు లేక గర్వము కలిగి ఉండవద్దు, అయితే దేవుని వైపు తిరిగి అతని ఆజ్ఞలను విని, అతనిని సేవించి, అతను ఏవిధముగా అయితే ఖాళీగా అయిపోయాడా అదేవిధముగా నిన్ను నీవు ఖాళీ అయి తన మహిమ కొరకు జీవించు. కనుక ఈ విధముగా దేవుని మహిమను పాపులకు తెలియపరచినట్లైతే అప్పుడు దేవుని మహిమ నీలో కనపడును. కనుక నీవు ఇతరుల కంటే గొప్పవాడివని అనుకొనవద్దు. నీ విఫలములో నిన్ను ఇతరులతో జయము కలిగిన వాడిగా నిలబెట్టును. ఈ విధమైన మార్పు కేవలము నిన్ను నీవు తిరస్కరించినపుడే వచ్చును.

యేసు తన పద్దతులను మనకొరకు వివరించి వాటిని మనము మన జీవితములో నడుచుకొని వాటినిఇతరులకు పంచుకొనునట్లు చేసెను. అయితే ఆ మార్గము మనము అనుకొనునట్లు తెలివైనది కాదు; మరియు ఈ విధమైన మార్గమును క్రైస్తవులు కోరుకొనకూడదు. వారు ఒకవేళ మరణమును , వ్యతిరేకతను మరియు ద్వేషములను కోరుకొని ఉండవచ్చు. అయితే నీవు అతని కొరకు శ్రమ పొందుటకు సిద్ధముగా ఉన్నావా ? " నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు కూడా ఉంటాడు " అని అతను వాగ్ధానము చేసియున్నాడు. యేసు నీ శ్రమలకంటే ముందుగానే వెళ్లి వాటిని నీకొరకు అనుభవించాడు. క్రైస్తవ ప్రయాణములో క్రీస్తు మహిమ వారి యొక్క అంశముగా ఉండకూడదు. మన సంతోషము మనకొరకు కోరుకొనకూడదు అయితే ఇతరుల అక్కరలను తీర్చుటలో సంతోషమును కోరుకోవాలి. క్రీస్తు నామము ఎవరైతే అతనిని త్యాగముకలిగి ఆత్మచేత నింపబడి ఉంటారో వారి ద్వారా అతని మహిమ ఘనపరచి బడుతుంది. మరియు తండ్రి మహిమ తన కుమారుని ద్వారా మహిమపరచబడుతుంది.

యేసు క్రీస్తు ఈ దినము తన తండ్రి కుడి పార్శ్యమున కూర్చుంది అతనితో గొప్ప సంబంధము కలిగి అతనితో గొప్ప ఐక్యత కలిగి ఉన్నాడు, కనుక ఎవరైతే ఈ దినాలలో క్రీస్తు కొరకు శ్రమ పది ఉంటారో వారు అతనితో పాటు పరలోక మందున్న తండ్రి దగ్గర గొప్ప సంబంధము కలిగి ఉంటారు, కనుక తన తండ్రి అయినా దేవుడు తన కుమారునికి ఏవిధమైన స్థానము కలిగించగలడు ? సృష్టిలో ఏ రూపమైతే ఉన్నదో అదే రూపమును క్రీస్తు వారికి కలిగించును. దాని కంటే ఎక్కువగా అతను పరలోకమునుంచి తన వారి కొరకు తన ఆత్మను బయలు పరచును. అప్పడు వారు అతని కుమారుని వాలే వారిని కూడా కుమారులుగా చేయును. మరియు ఎల్లప్పుడూ తన పరలోకమందుండు తండ్రి దగ్గర సదాకాలము ఉండెదరు (రోమా 8:29; ప్రకటన 21:3-4).

ప్రార్థన: ప్రభువైన యేసయ్య నీవు నీ మహిమను బట్టి ఘనపరచబడక మా కొరకు ఆ గొప్పతనమును విడిచిపెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. నీ ప్రేమను బట్టి , మరియు నీ ఆత్మను మాకు దయచేసి నిన్ను మహిమపరచునట్లు నీ ప్రేమను మాకు దయచేసినందుకు నీకు కృతఙ్ఞతలు.

ప్రశ్న:

  1. క్రీస్తు మరణము నిజమైన మహిమకు సాదృశ్యముగా ఎందుకు ఉన్నది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:31 AM | powered by PmWiki (pmwiki-2.3.3)