Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 038 (Four witnesses to Christ's deity)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

4. క్రీస్తు దైవత్వమునకు గల నాలుగు సాక్ష్యములు (యోహాను 5:31-40)


యోహాను 5:31-40
31 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు. 32 నన్నుగూర్చి సాక్ష్య మిచ్చు వేరొకడు కలడు;ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. 33 మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి;అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. 34 నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. 35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను,మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్ట పడితిరి. 36 అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు;అదేమనిన,నేను నెర వేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో,నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను ప 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు;మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు;ఆయన స్వరూపము చూడలేదు. 38 ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. 39 లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు,అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి. 40 అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.

వాగ్దాన మెస్సయ్య చెప్పిన అధికమైన కార్యములను యేసు తన ప్రజలకు చెప్పెను. ఈ మనిషిని వారు ద్వేషించినాను ఎందుకంటె అతను వారి సంస్థ నియమాలను పాటించలేదు కనుక. వారు క్రీస్తును కొన్ని సాక్ష్యములను అడిగిరి అయితే యేసు వారికి సాక్ష్యములు ఇచ్చెను. మనమందరము మన సామర్థ్యముకంటె గొప్పవాళ్ళని అనుకొంటాము. అయితే యేసు మనకు తన గురించిన సాక్ష్యమును మనకు చాలా క్లుప్తముగా యిచ్చియున్నాడు, " నేను నా గురించి సాక్ష్యము చెప్పినట్లైతే,నేను అబద్ధికుడను ". అతను తన గురించి చెప్పవలసిన అవసరము లేదు ఎందుకంటె అంతకు ముందే వేరే వ్యక్తి అతని గురించి చెప్పియున్నాడు కనుక. అతనే తన పరలోక మందున్న తండ్రి అతనే తన కుమారుని గురించిన సూచనలను ప్రవచనములను చెప్పియున్నాడు.

దేవుడు బాప్తీస్మమిచ్చు యోహానుని క్రీస్తును ప్రకటించుటకు ప్రజల యొద్దకు పంపియున్నాడు. ఈ మనిషి క్రీస్తు గురించి మరియు అతని సేవ గురించి మరియు ఒక తీర్పు తీర్చువాడని చెప్పియున్నాడు. ఏదిఏమైనా,అక్కడున్న అనేకులు యోహాను మాటలను వ్యతిరేకించి యేసును గూర్చిన సాక్ష్యమును వ్యతిరేకించిరి (యోహాను 1:19-28). యోహాను సాక్ష్యము క్రీస్తు గురించి ఒక గుమాస్తాను పోలి లేదు, మరియు క్రీస్తు నిత్యమూ నుంచి వచ్చాడని లేదు. అయితే ప్రజల అలక్ష్యం కోసం,యేసు యోహాను ప్రకటనలు భవిష్యత్తు కొరకు ఒప్పుకొనెను. యేసు దేవుని గొర్రెపిల్ల అని చెప్పుటలో యోహాను ఎంతమాత్రమును అతిశయింపలేదు.

యోహాను చీకటిలో ప్రకాశించే ఒక వెలుగుగా ఉండెను, అతని చుట్టూ ఉన్నవారిని కలిపి కాంతివంతులుగా చేసెను. అయితే ఎప్పుడైతే ఒక మనిషి జీవితములో మనిషి కుమారుడైన యేసు వస్తే అతనికి ఒక దీపము అవసరము లేదు. క్రీస్తు మాత్రమే ఈ లోకానికి ఒక ముగింపు లేని వెలుగుగా ఉన్నాడు. సూర్యుడు ఉదయమున ఏవిధముగా ఈ భూమికి జీవమును కలుగు చేయుటకు వచ్చునో అదేవిధముగా క్రీస్తు కూడా ప్రేమతో నింపిన జీవితమును కలుగ చేయుటకు ఉదయించువాడుగా ఉన్నాడు.

దేవుడు తన స్వరమును మన కొరకు గొప్పగా వినిపించెను, " ఇతను నా కుమారుడు, ఇతని యందు నేనానందించుచున్నాను." (మత్తయి 3:17). యేసు క్రీస్తు తప్ప నిజమైన సాక్ష్యము కలిగి ఈ లోకములో ఎవ్వరు జీవించలేదు. ఏకైక కుమారుడు మాత్రమే ప్రేమకలిగి బ్రతికినాడు.

యేసు యూదులకు మీకు దేవుడెవరో తెలియదు అని చెప్పియున్నాడు. వారు ప్రవక్తలు చెప్పినది మరియు ప్రవచించినది నమ్మలేదు ఎందుకంటె ఎవరు కూడా దేవుని రూపమును కలలో కానీ లేక దర్శనమందు కానీ చూడలేదు కనుక. ముందున్న ప్రకటనలన్నియు వారికి వర్తింపలేదు ఎందుకంటె వారి పాపములు వారిని పరిశుద్దుడై నుంచి వేరుపరచినవి కాబట్టి. యెషయా చెప్పినట్టు " నేను ఏమి చేయలేనటువంటి వాడను, నా పెదవులు శుద్ధముగా లేవు" వారి ఆత్మీయ చెవుడు మరియు అర్థము చేసుకోలేని తనము అనునది వారు క్రీస్తును వ్యతిరేకించారు కాబట్టి. ఎవరైతే దేవుని వాక్యమును అర్హముచేసుకొని, క్రీస్తు దేవుని వాఖ్యం అని వ్యతిరేకించినవారు నిజమైన దేవుని ప్రకటనను పొందినవాడు కాదు.

పాత నిబంధన ప్రజలు దేవుని వాక్యమును వెతికిరి, ఎందుకంటె వారు నిత్యజీవమును పొందవలెనని. అయితే దానికి బదులు చచ్చిన ధర్మశాస్త్రమును కనుగొన్నారు. అయితే మెడ్డయ్య కొరకు చేసిన వాగ్దానములను వారు తప్పిపోయారు, అవి పాత నిబంధన గ్రంధములో అనేకములుగా ఉన్నాను వారు వాటిని పోగొట్టుకున్నారు. అయితే దానికి బదులుగా వారి సొంత ఆలోచనలని ఆచరించి దేవుడు వాక్యము వారి మధ్యన ఉన్నాడని అర్థము చేసుకోలేదు.

వారి వ్యతిరేకతను దేవుడు వారికి చూపించెను- దేవుడు సత్యమైన వాడు కాదని యోచించిరి కనుక. వారు క్రీస్తును ద్వేషించారు కనుక నిత్యజీవమును పోగొట్టుకున్నారు, మరియు విశ్వాసముతో కృపను కూడా పోగొట్టుకున్నారు.

ప్రార్థన: ప్రభువా మీ శత్రువులను ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు, వారి అపనమ్మకమును బట్టి అంగలార్చినారు. మీ గురించిన నాలుగు సత్యమైన సాక్ష్యములను వారికి చూపించారు. మేము మిమ్ములను చూడుటకు మీ వాక్యములను మరియు సువార్తలను వెతుకుటలో మాకు సహాయము చేయుము. మరియు మిమ్ములను మాకు కనపరచి మీ నిత్యజీవమును మాకు దయచేయుము. ఈ దినాలలో మీ మాటలను వినుటలో ఎందరో చెవిటికలిగి ఉన్నారు కనుక వారి చేయూలను తెరువుము.

ప్రశ్న:

  1. నాలుగు సాక్ష్య్లు ఎవరు, వారు ఎవరి గూర్చి సాక్ష్యమిచ్చెదరు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:43 AM | powered by PmWiki (pmwiki-2.3.3)