Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 030 (Jesus leads his disciples to see the ready harvest)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
4. సమారియాలో క్రీస్తు (యోహాను 4:1-42)

b) సిద్ధముగా ఉన్న పంటను చూచుటకు క్రీస్తు తన శిష్యులను నడిపించుట (యోహాను 4:27-38)


యోహాను 4:27-30
27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమి కావలె ననియైనను,ఈమెతో ఎందుకు మాటలాడు చున్నావని యైనను ఎవడును అడుగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి 29 మీరు వచ్చి,నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి;ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా 30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

ఇంకను చర్చ జరుగుతుండగా శిష్యులు గ్రామములోనుంచి వారితో తెచ్చిన తిండిని తెచ్చిరి. వారు ఎప్పుడైతే క్రీస్తు ఆ సమారియా స్త్రీతో ఉండడము చూచి ఆశ్చర్యపోయిరి. వారిలో ఎవరును ఆయనతో మాటలాడుటకు సాహసించకపోయిరి, ఎందుకంటె ఆత్మ సన్నిధి అక్కడ ఉన్నది కనుక. అక్కడ క్రీస్తు యొక్క గొప్ప అద్భుతము జరగడాన్ని చూచిరి, ఎందుకంటె అక్కడున్న స్త్రీ మోహము కూడా మార్పుకలిగి క్రీస్తు బోధనలను విని తన మాటలను బట్టి ఉండినది. రక్షకుడైన యేసు ఆనందము ఆమెలో కనబడివున్నది.

క్రీస్తు అడిగినట్లు ఆమె త్రాగుటకు నీళ్లను ఇవ్వలేదు అయితే తన కుండను ఖాళీగానే ఉంచుకొన్నది,అయితే క్రీస్తు మాత్రము ఆమెకు ఆత్మీయ సంబంధమైన దాహమునకు తగిన క్షమాపణ యిచ్చియున్నాడు. ఆమె అనేకమందికి జీవజాలముగా అయినది. తన ఊరిలోకి పరుగెత్తి వెళ్లి అక్కడున్న వారికి క్రీస్తుగురింగ్చి చెప్పియున్నది. ఒకప్పుడు ఆమె నోరు ఒక చెడ్డమాటలు పలుకునట్లు ఉండెను అయితే జీవ జలమును పొందినప్పుడు ఆమె మాటలు మార్చబడి తన నోటిని క్రీస్తు కొరకు ఉపయోగించెను. తన పాపములను క్రీస్తు ఏ విధముగా క్షమించియున్నాడో అని అందరికి తెలియపరచి ఎంతో మందిని క్రీస్తు వైపునకు నడిపించింది. గ్రామస్తులందరూ ఈ స్త్రీ లో జరిగిన ఈ మార్పును చూసిరి. అప్పుడు వారందరు యేసు ఉన్న బావి దగ్గరకు వెళ్లిరి.

క్రీస్తును వెంబడించువారికి ఏ విధమైన జీవితము కలిగిఉంటుందో దానికి ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది. మేము కూడా క్రీస్తు వచ్చాడని మా స్నేహితులకు మరియు పొరుగువారికి కూడా వివరించెదము. అప్పుడు జీవజాలములు ఇచ్చు పరిశుద్ధాత్ముడు వారిని కూడా పైకి లేపును. నీవు ఇతరులకు జీవ జలముగా ఉన్నావా? ఒకవేళ లేనియెడల, నీ పాపములను యేసుకు ఒప్పుకొని ఉన్నట్లయితే ఆటను నిన్ను కడిగి నిన్ను అనేకులకు అనగా మార్పు కలిగిన ఈ స్త్రీ వాలే అనేకులకు ఆశీర్వాదముగా నిలబెట్టును.

ప్రార్థన: యేసు ప్రభువా నన్ను వెదికి,కనుగొనినందుకు నీకు కృతఙ్ఞతలు. నేను ఈ సమరయ స్త్రీ కంటే మంచివాడను కాను. నా పాపములను క్షమించు. సత్యము కొరకు దప్పిగొనునట్లు నీ బహుమానము చేత నన్ను నింపుము,నా జీవితమును శుద్దము చేయుము. పరలోకమందున్న తండ్రిని చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను ఉపయోగకరమైన వాడిగా ఉండునట్లు నన్ను నీ పరిశుద్ధాత్మచేత నింపు, అప్పుడు నేను నిజమైన ఆరాధన చేయువాడిగా ఉండునట్లు మార్చుము. అనేకులు నీ యొద్దకు వచ్చునట్లు అనేకులను నీవు రక్షించు.

ప్రశ్న:

  1. జీవ జలముచేత మనము ఎలా వేయబడతాము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:37 AM | powered by PmWiki (pmwiki-2.3.3)