Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 009 (The fullness of God in Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

3. క్రీస్తులో దేవుని అవతారము (యోహాను 1:14-18)


యోహాను 1:15-16
15 యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముదటివాడాయెననియు, నేను చెప్పిన వాడు అనియు ఎలుగెత్తి చెప్పెను. 16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.

యోహాను తన తరువాత వచ్చువాడు తనకంటే ముందుగా ఉన్నవాడు అని చెప్పియున్నాడు. దీనిని ప్రకటించి క్రీస్తు యొక్క నిత్యమును చెప్పినవాడుగా ఉన్నాడు. క్రీస్తును గురించిన సాక్ష్యమును కూడా ఈ విధముగా చెప్పినట్లు మనము అర్థము చేసుకోగలం.

అరణ్యములో మనుష్యుల పాపములను యోహాను చూచి ఎంతో ఏడ్చినవాడుగా ఉన్నాడు. కనుక వారి పాపములను ఒప్పుకొనుమని వారిని ప్రాధేయపడ్డాడు. అయితే క్రీస్తును చూసిన తరువాత అతని హృదయము ఆనందముతో నింపబడెను, ఎందుకంటె క్రీస్తు సత్యమైన మానవునిగా, జన్మించియున్నాడు కనుక అతనికి మరణము అనునది లేకపోయెను. కనుకనే క్రీస్తు ఆనందము ఎవరైతే ఆయనను అంగీకరిస్తారా వారికి సంపూర్ణముగా కలిగి ఉంటుంది. దీని ద్వారానే మనకు మరణము మీద విజయము కలిగియున్నది.

ఈ లోతైన కృపను యోహాను తెలుసుకొని దేవుని సంపూర్ణము క్రీస్తులో ఉన్నాడని తెలుసుకొన్నాడు. పౌలు ఒప్పుకొనినట్లు, " అతనితోనే సంపూర్ణ దేవుని శరీరము ఉన్నది" మరియు యోహాను చెప్పినట్లు "ఆయనలోనే మనకు కృప వెంబడి కృప కలుగుతున్నది".

క్రీస్తు నుంచి నీవు ఏమి పొందుకొనియున్నావు ? నీవు ఒకవేళ ముందు 14 వచనములను గ్రహించినట్లైతే అప్పుడు క్రీస్తు యొక్క గొప్ప కృపను నీవు అర్థము చేసుకోగలవు:క్రీస్తు దేవుని వాక్యమై యున్నాడు మరియు తండ్రియైన దేవుని ద్వారా వచ్చినవాడుగా ఉన్నాడు. అతడు దేవుని అంతరంగమందుండినవాడు కనుక అతని చిత్తమును నెరవేర్చువాడు. దేవుని వాక్యము మనలను మార్చినట్లు క్రీస్తు కూడా మన జీవితాలలోకి వచ్చి మన జీవితములను మార్చి యున్నాడు. ఇది గొప్ప కృప కాదా ?

క్రీస్తు దేవుని జీవమై ఉన్నాడు : శాస్త్రజ్ఞులు భావనములను, వంతెనలను, పెద్ద బాంబు లను చేయగలరు కానీ జీవితమును చేయలేరు. తల్లితండ్రులకు జీవితమును ఇచ్చిన దేవుడు మనకు కూడా కృప కలిగిన జీవితమును ఇవ్వలేడా? ఈ లోక జీవితము శాశ్వితము కాదు కనుక క్రీస్తు తన విశ్వాసులకు తన ఆత్మచేత నింపి వారికి నిత్యజీవమును దయచేసియున్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు దేవుని జీవితమును అందరితో పంచుకొని ఉన్నట్లయితే ఎవ్వరు మరణించారు. కనుక ఇది కృప కాదా ?

క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు: ఆటను చీకటిని జయించి వెలుగును సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకమునకు ఆటను ఒక నిరీక్షణకు దయచేయువాడుగా ఉండి లోకములోనికి తన శక్తిని పంపువాడుగా ఉన్నాడు. కనుక ఈ లోకమును వెలుగించుటకు క్రీస్తు తన వెలుగు ద్వారా ప్రకాశించుచున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండును. కనుక ఇది కృప వెంబడి కృప కాదా ?

క్రీస్తు ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త : అతనిలో సమస్త దేవుని శక్తి కలదు. అతని అద్భుతములు తన అధికారమును చూపిస్తున్నాయి. అతని పునరుత్థానము మరణము పైన తన శక్తిని చూపిస్తున్నది. తన శరీరముచేత నీటిమీద నడిచి తన మహిమను చూపిస్తున్నాడు. ఒక రొట్టెను విరిచి దాదాపుగా ఐదు వేలమందికి తృప్తిగా తినిపించినవాడు. మరియు నీ తలలో ఉన్న వెంట్రుకలను లెక్కించువాడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడు తన కృపకు నీవు తలొగ్గుతావు ?

క్రీస్తు గురించి నీవు ఇంకా ఎక్కువగా తెలుసుకొనగోరుచున్నావా ? ఆటను ఈ సృష్టికి అధిపతి. ప్రతి వస్తువు నీ ప్రతి నిమిషము మరియు నిన్ను నీవు కూడా అతనికి చెందినవాడవు. అతడు నిన్ను చేసి నిన్ను నిలువబెట్టినవాడు. క్రీస్తు అంతటిలో ఉండి నీకు సమస్తమును ఇచ్చి నీవు వాటిని ఏలుమని చెప్పినాడు. నీ బలము, శక్తి మరియు నీ తల్లితండ్రులు అతనికి చెందిన వారు. కనుక అతని కృపను బట్టి ఎప్పుడు నీవు కృతజ్ఞతకలిగి ఉంటావు ?

క్రిస్మస్ అనగా దేవుడు ఈ లోకములో మనిషి పోలికను శిశువుగా జన్మించడమే. ఈ మాటను 700 సంవత్సరాలక్రితమే యెషయా పరిశుద్దాత్మ సహాయముచేత ప్రవచించినాడు. " ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" (యెషయా 9:6). బాధాకరమైన విషయమేమిటంటే, మనిషిని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తన పోలికను సృష్టిని చేసినప్పుడు ఎలాగైతే చేసాడో అదేవిధముగా క్రీస్తును చేసాడు అని అర్థము చేసుకొనుటకు మానవుడు నిదానిస్తున్నాడు. యేసు మనకు ఒక మహిమ గల జ్ఞానముగలవాడని మరియు నిత్యజీవమునకు శక్తి కలిగిన కారకుడు. దేవుని ప్రతి విధమైన వ్యక్తిత్వము క్రీస్తులో కనపరచియున్నాడు. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మన మధ్యకు వచ్చి ఉన్నాడని తెలుసుకున్నావా ? ఇప్పుడు మనము దేవుడు మన మధ్యన ఉన్నాడు అని చెప్పవచ్చు!

క్రీస్తు తన విలువలను ఇక్కడ చూపించలేదు లేని యెడల పరలోకములోనే ఉండెడి వాడు. మనలను తండ్రి అయినా దేవునికి దగ్గర సంబంధము కలిగి ఉన్నట్లుగా మన లోకమునకు వచ్చి, మనలను మార్చి పరలోక రాజ్యమును దయచేయుటకు తండ్రితో బంధము చేసియున్నాడు. పౌలు చెప్పినట్లు దేవుని ఉద్దేశము సంఘములో తన సన్నిధితో ఉంచాడు అని. ఎఫెసీ 1:23; 4:10 మరియు కామోస్సి 2:10, అప్పుడు నీవు కన్నీళ్లు విడుచుచు నీ దేవుడిని ఘనపరచి క్రీస్తు కృపను పొందుకుంటావు. కనుక పాపములో ఉండక నీ హృదయమును క్రీస్తు కొరకు తెరచు. అప్పుడు నీ ప్రక్కన ఉన్నవారికి నిన్ను ఒక సూచనగా నిలువబెట్టును.

ప్రార్థను: యేసు ప్రభువా నీవు దేవుని కుమారుడవు. ప్రతి విధమైన ప్రేమ, శక్తి, సత్యములు నీలో ఉన్నవి. నీవు మా నుంచి దూరముగా ఉండలేదు కనుక మా శిరస్సులను వచుతున్నాము. నీవు మమ్ములను ప్రేమించి మాకు కృప వెంబడి కృపను దయచేసినందుకు నీకు కృతఙ్ఞతలు.

ప్రశ్న:

  1. క్రీస్తు సంపూర్ణము అనగా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:14 AM | powered by PmWiki (pmwiki-2.3.3)