Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 05 (Prepare The Way of the LORD!)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean -- Lingala -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 5 -- దేవుని రాజమార్గము సరాళము చేయుడి! (యెషయా 40:3)


ప్రస్తుత కాలములో మనుష్యులు ప్రతి దిన ఆహారముకొరకు ఒక ప్రణాళిక అనునది లేకుండా ఎవరికి తోచినది వారు చేస్తూ వారి జీవితములను ఈ లోక యాత్రలో లోక సంభందమైన సంతోషముచేత బ్రతుకుచున్నారు. అయితే దేవుని యందలి భయము భక్తి కలిగిఉండినట్లైతే , దేవుడు వారికి తోడై ఉండి వారిని సర్వసత్యములోనికి నడిపించును.

సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త తన సృష్టిని మరువడు. ఆయన వారిని ప్రేమించి,వారితో మాట్లాడి,వారి కొరకు ఆలోచన కలిగి,వారి హృదయములను వెదకును. కనుక మనిషి వారి పాపములను బట్టి పశ్చాత్తాప పడి దేవుని తట్టు తిరిగినట్లైతే వారిని తన శక్తి చేత నింపును.


ప్రభు మనదగ్గరకు వచ్చును

ఎప్ప్పుడైతే ఆదాము హవ్వ దేవునికి లోబడక ఉన్నప్పుడు , పాపము వారిని చుట్టిఉన్నప్పుడు, వారు సిగ్గుపడి దేవుని నుంచి దాచుకున్నారు,ఎందుకంటె వారు పాపము చేసిఉన్నామని ఎరిగిరి గనుక దేవుని నుంచి దాగుకొన్నారు.అయినప్పటికిని దేవుడు వారికి దూరముకాలేదు, అయితే వారిని వాదకుతూ "ఆదాము నీవు ఎక్కడఉన్నావు?" (ఆది 3:9). సృష్టికర్త ప్రతి ఒక్కరిని చూస్తూ," నీవు ఎక్కడ ఉన్నావు? అంటున్నాడు. కనుక నీవు నీ జీవితములో ఎక్కడివరకు వచ్చ్చావు?"

దేవుడు ఆదామును మెసపొటేమియా అను ఒక చెడిపోయిన వ్యవస్థ నుంచి పిలిచి , నిమ్మళము లేని ప్రయాణికుడిగా చేసి నిత్యగృహము కొరకు వెదకువాడినిగా మార్చెను. కనుక ప్రియా చదువరి నీవు కూడా నీతి అను నిత్యగృహము కొరకు వెదకుచున్నావా?

యాకోబు చాలా తెలివైనవాడు. కాబట్టి దూరదేశమునకు వెళ్లి అక్కడ వివాహము చేసికొనెను. కొన్ని సంవత్సరాలు అయిన తరువాత తన సొంత ప్రదేశమునకు వచిస్తున్నప్పుడు . దేవుని దూత తన మార్గమధ్యలో నిలుచుంది తన గత తప్పులను బట్టి శిక్షించుటకు ఉండెను. అయినప్పటికిని యాకోబు దేవుని కృపనుబట్టి ఆయనయందు విశ్వాసముంచెను. "నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను!" (ఆది 32:26) దేవుడు నిన్ను రక్షించు వరకు ఎదురుచూస్తున్నావా?

మోషే ఒక హెబ్రీయుడిని ఐగుప్తియుదీని కొట్టినప్పుడు అతనిని చంపి దేశమునుంచి అరణ్యములోనికి పారిపోయెను . 40 సంవత్సరముల తరువాత దేవుడు మండుచున్న పొడ నుంచి మోషే కు తన స్వరమును వినిపించి "నేను నేనే" అని చెప్పెను. నేను మారని వాడను. నమ్మకమైన వాడిని అని చెప్పెను. నిన్ను కూడా అరణ్యము అను నీ జీవితములో నుండి దేవుడు నిన్ను పిలిచియున్నాడా? నీ హృదయము ఆయన స్వరమును నిత్యమూ వింటున్నదా? అదేవిధముగా మార్పు లేని ఒక నమ్మకమైన వాడిని చూస్తున్నావా ?

సమూయేలు యవ్వనకాలములో ఉన్న్డప్పుడు దేవుడు పిలిచి, తన దేశమునకు ఒక న్యాయాధిపతిగా నియమించాడు. దేవుడు పెద్దవారిని మాత్రమే కాక యవ్వనస్తులనుకూడా పిలుచుచున్నాడు. మన చుట్టూ ఉన్నపిల్లలకు వారికి అర్థమైన భాషలో వారికి దేవుని గురించి చెప్పాలి. కనుక దేవుడు నీమాదిరిగా ఉన్న యెవ్వనస్తులదగ్గరకు వచ్చుటకు ఇష్టపడుతున్నాడు.

దావీదు పాపముచేసిఉన్నప్పుడు, తాను ఎవరితో శయనించాడో ఆమె భర్తను చంపమని ఆజ్ఞ ఇచ్చెను. అయితే దేవుడు ఆ పనిని చేయుటకు అవకాశము ఇవ్వలేదు. కానీ దేవుడు దావీదు నొద్దకు ఒక ప్రవక్తను పంపి తన పాపమును తెలిపెను. అప్పుడు దావీదు తన తప్పును తెలిసుకొని దేవుని తట్టు తిరిగి తనలాగా పాపము చేసినవారిని కూడా దేవునివైపు నడిపించెను. దావీదు దేవుని యెడల కృపపొందిన వాడుఆయెను కనుక దేవునిద్వారా క్షమాపణ పొందెను. కీర్త 51 చదివి పఠించి దేవుని యొక్క క్షమాపణను పొందుకో.

యెషయా, దేవుని మహిమను చూసి ఈ విధముగా అంటున్నాడు "నేను అయ్యో , నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని". (యెషయా 6:5).

ప్రభువు యొక్క వెలుగు ప్రజల పట్ల మరియు యెషయా పట్ల ఈ విధముగా తెలియపరుచుచున్నది. నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మహిమను చూడగోరుచున్నావా? అయితే నీ పాపములు దేవుని మహిమ నుంచి వేరుచేయబడ్డాయని అర్థంచేసుకో. నీ పాపములు దేవుని యొద్దకు రావడానికి అడ్డుగా ఉన్నాయని మరియు వాటిని తొలగించుకోవాలని నీకు అర్థము అయినదా? "సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచోన్నాము" (2 కొరింతి 5:20)


దేవుని మార్గమును సిద్ధపరచు!

దేవుణ్ణి తృప్తిపరచాలని అనుకున్నవారు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. ఎవరైతే దేవునికి లోబడక పాపముచేసినట్లైతే వారు దేవుని దగ్గర పాప క్షమాపణ పొందబడాలి, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును". (1 యోహాను 1:9). ఎవరైతే ఆపేద్దాం చెప్పాడో వాడు ప్రభువు దగ్గరకు వెళ్లి ఒప్పుకోవాలి. అతని గృహములో ఎవరిదైనా వస్తువు దొరికినట్లైతే, దాని యజమానుడికి ఇవ్వాలి. ఎవరైతే ఇతరుల దగ్గర శయనించినట్లైతే వాడు దేవుని దగ్గరకు వచ్చి తన పాపమును ఒప్పుకొని తిరిగి ఆ పాపమును చేయకుండునట్లు ఉండాలి. ఒకవేళ తన పొరుగువారు అణచివేయబడిఉన్నట్లైతే వాడికి సహాయము చేసి వారికి సహకారంగా ఉండాలి.

బాప్తీస్మమిచ్చు యోహాను యెషయా యొక్క వాగ్దానమును నెరవేర్చి , ఆయన పొందిన ప్రకటనను తెలియపరుచుచున్నాడు, "ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు : ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ద పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు". (యెషయా 40:3-5; లూకా3:4-6)

బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటించునట్లుగా మనలో ఎవరమూ నీతిమంతులము కాము. మనమందరము శుద్ధముగా కడగబడి తగ్గింపుస్వభావము కలిగి ఉండులాగున మార్చబడివుండాలి. ఎవరైతే దుఖ్ఖముగా ఉంటారో వారు ధైర్యపరచబడాలి. ఇతరులను మోసముచేసినట్లైతే వాడు వారికి క్షమాపణ కోరి వారియెడల నీతికలిగి ఉండాలి.

ఈ వాక్యము దేవుని ఆజ్ఞను తెలియపరుస్తున్నది: "నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను". (ద్వితీ 6:5), మరియు "నిన్ను వాలే నీ పొరుగువానిని ప్రేమింపవలెను" (లేవి 19:18). నీవు దేవునిని ప్రేమించాలనుకుంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుము. నీ దగ్గరకు దేవుడు ఏ విధముగా రావాలో నీవు ఆయన కొరకు మార్గమును సిద్ధపరచుకో.


ప్రభువు నీకొరకు మార్గమును సిద్ధపరచును

మరియాకుమారుడు జన్మ ఒక వింత, అయితే దేవుని ఆత్మా ఆయనమీదికి వచ్చినప్పుడు ఆటను మానవుడాయెను. చెడిపోయిన మనిషి పాపపు లోకములోనికి క్రీస్తు పంపబడియున్నాడు.తనవద్దకు వచ్చిన రోగులందరిని స్వస్థపరచి తన ప్రేమను వారియెడల చూపించియున్నాడు. దెయ్యములుపట్టినవారిని కూడా విడిపించియున్నాడు. అయితే ఎక్కువ మంది తన మహిమకరమైన ప్రేమను తెలిసికొనలేదు.

దాయకలిగిన దేవుడు తన రాకకోరకు మార్గము సిద్ధపరచు ప్రతి హృదయమును తెరచుచున్నాడు. కనుకనే మరియా కుమారుడైన క్రీస్తు లోకపాపములను తీసుకొని, మనకొరకు ప్రాయశ్చిత్తము చేసికొని, మనపాపములనుండి మనలను కడిగి, మనలను పరిశుద్దులనుగా చేసెను. కనుక మన కొరకు పరలోక ద్వారములను తెరిచినా క్రీస్తుకి మనము కృతజ్ఞతకలిగి ఉండాలి.

క్రీస్తు యొక్క రాకడ ఈ లోకములో ఉండు మనుష్యులకు చాలా రహస్యమయి యున్నది. దేవుడు ఈ లోకమునకు వచ్చినది కేవలము ఈ లోకము అతని తట్టు తిరుగుటకు. దేవుని తట్టు తిరుగు ప్రతి వారిని ఆయన క్షమించును. కనుక దేవుని రహస్యము తెలిసికొన్నవారు దేవుని జ్ఞానము పొందబడిన వారీగా ఉందురు.


వ్యక్తిగతముగా దేవుడు నీ దగ్గరకు వచ్చును

క్రీస్తు మరణమునుంచి తిరిగి లేచియున్నాడు ఎందుకంటె ఆటను మృతిని గెలిచియున్నాడు కనుక. తరువాత పరలోకమునకు కొనిపోబడి పరిశుడుడైన దేవుని దగ్గర ఉన్నాడు. తన యెడల ప్రేమకలిగిన వారియెడల ఆయన కనికరముకలిగి యున్నాడు. ఎందుకనగా వారి యొక్క నిరీక్షనా బలహీనములు ఆయనకు తెలుసు కనుక. కనుకనే తన పరిశుద్ధాత్మను వారికొరకు పంపించియున్నాడు, "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆధారణకర్త మీయొద్దకు రాదు;నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును" (యోహాను 16:7). దేవుడు తనను వెంబడించు వారియెడల పరిశుద్దాత్మునిద్వారా వచ్చును.

క్రీస్తు యొక్క ఆత్మా కొరకు నీ హృదయము తెరిచావా? ఎందుకంటె ఆయన నిన్ను మార్చి నీ హృదయమును ప్రేమ,సమాధానము,ఆనందము,దీర్ఘశాంతము చేత నింపును (మత్త 11:29; గలఁతి 5:22-23). దేవుడు నీ హృదయము అనే తలుపునొద్ద నిలుచున్నాడు, కనుక క్రీస్తు కొరకు తలుపు తీయగలవా? నీ హృదయమును బండలా చేసికొనక నీకొరకు క్రీస్తు వచ్చులాగున మార్గము సిద్ధపరచుము.

"నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములకు కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది". (యెషయా 60:1-2)


దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చును

క్రీస్తు యొక్క ప్రేమ ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చును, అనగా ఎవరైతే క్రీస్తును తెలుసుకొని అతని గురించి ఇతరులకు తెలియపరచిన ప్రతి ఒక్కరిదగ్గరకు వచ్చును. కునుకు నీవు మాత్రమే అతనితట్టు తిరిగాక, చెడిన ప్రతి ఒక్కరిని క్రీస్తు వైపు నీవు వారిని పిలుచుకురావాలి.

క్రీస్తు సేవ చేయడము నీకు తెలియకపోతే నీవు క్రీస్తుని అడిగినట్లైతే, ఆటను నీకు తగు విధముగా నేర్పించి ఇతరులను తన వైపు ఏ విధముగా నీవు నడిపించాలో నీకు నేర్పించును. దేవుని యొక్క మాటలు నీవు ఇతరుల దగ్గర మాటలాడుటకు దేవుడు నీ నోటిని తెరిచి వారికి ఆయన పరిశుద్దతను తన ప్రేమను నీ ద్వారా తెలియపరచెను. దేవుడు నిన్ను బలపరచి నిన్ను ఆదుకొని నీతో పాటుగా వచ్చును. నీ జీవిత చక్రము అనునది దేవునికి నీవు అప్పగించినట్లయితే అప్పుడు నీ జీవితమును తన చిత్తప్రకారముగా నడిపించును. నిన్ను ఆశీర్వదించి నీకు కావలసిన ఆత్మీయులను నీకొరకు సిద్ధపరచును.


క్రీస్తు రాకడను తెలుపు రహస్యమును బట్టి ధ్యానించుము

క్రీస్తు గురించి ఆయన రాకడను గురించి స్త్రీ పురుషులైన మీరు మరి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే , దయ చేసి మాకు వ్రాసినట్లైతే మేము మీకు ఈ పత్రికలను పంపుటకు సిద్ధముగా ఉన్నాము. మీ కొరకు మేము ప్రార్థించి మీరు బలమునొందినవారగునట్లు, మీ విశ్వసజీవితములో దేవుని ప్రేమచేత నింపబడాలని ఆశిస్తున్నాము.

మీ ఉత్తరములకొరకు మేము ఎదురుచూస్తుంటాము, దయవుంచి మీ చిరునామా వ్రాయుట మరవద్దు.

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 12:13 PM | powered by PmWiki (pmwiki-2.3.3)