Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 06 (Rejoice in the LORD Always!)
This page in: -- Armenian -- Burmese -- Chinese -- Dagbani? -- English -- German? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Nepali? -- Peul? -- Somali -- TELUGU -- Thai -- Turkish? -- Twi -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 6 -- ప్రభువు నందు ఆనందించుడి! (ఫిలిప్పి 4:4)


మనము ప్రతి దినము టీవీ లు చొసేటప్పుడు , యెవ్వనస్తులు వారి ఆనందం కోసం పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడం, గాలిలో తేలడం చేస్తూఉంటారు.

మరి కొన్ని గ్రూపు కు సంబందించిన వారు వారికున్న బాధలు మరిచి వారి జీవితాలను వారికి తోచినట్టు పాపములో బ్రతుకుతుంటారు. మరికొంతమంది కక్షసాధింపు కొరకు వారి ప్రాంతాలను వాడుకొంటారు.

అయితే వీరిలో కొంతమంది మాత్రమే ,"మేము రక్షణ పొందుటకు ఏమి చేయాలి?" "మేము ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?" అని దేవునిని అడుగుతుంటారు. అయితే దేవునియొక్క కృప ఎవరైతే మార్పుకలిగిన హృదయము కలిగిఉంటారో వారికి పరలోకమందున్న దేవుని దయ ఉంటుంది.

కనుక మనము నిరీక్షణ లేని వారముగా ఉన్నామా ? చాలామంది ఈ విధమైన పరిస్థితులలో ఉంటారు . కనుక మనమందరము న్యూక్లీర్ అను అణుబాంబు కి భయపడుతున్నామా ?


ఆదరించు ప్రకటన

నెహ్మయా తనకున్న చింతలలో మరియు యుధములయందు దేవుని ప్రకటనను తన ప్రార్థనకు జవాబుగా ఈ విధముగా పొందియున్నారు "మీరు దుఃఖ పడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు". (నెహ్మయా 8:10)

కనుక మనమందరము జీవముకలిగిన ప్రభువును గొప్పచేద్దాం, ఎందుకంటె ఆటను మాత్రమే మనకు సమాధానము , నిరీక్షణ, మరియు విశ్రాన్తిని ఇవ్వగలడు.

ఏ విధమైన ఆదరణను ప్రవక్త పొందియున్నారు? ప్రభువు ఈ లాగున చెప్తూఉన్నాడు, నీకు నీవే ఆనందము, సంతోషము చేత నింపబడియున్నవని. ఆయన బుద్ధుడు మాదిరి ఊరికెనే కూర్చోలేదు. అయితే మన ప్రభువు రక్షణకరమైన ఆనందముతో నింపబడియున్నాడు. మనుష్యులందరికి ఆయన విమోచనము తెచ్చియున్నాడు. మంచిచేయు వారు ఎవ్వరు లేరు అని తనకు తెలుసు, అందరు చెడిపోయి ఉన్నారని వారి హృదయములు ఖాళీ అయి ఉన్నాయని తెలిసికొని ఉన్నాడు. అయితే ప్రభువు పాపులకు నిరీక్షణ ఇచ్చుటకు ఉద్దేశము కలిగిఉంన్నాడు. కనుక దేవుని పరిశుద్ధ ఆనందము నీకు బలము అని మరువవద్దు! ఎవరైతే తనను అంగీకరిస్తారో వారికి తన బలమును తన ధైర్యమును కలుగచేస్తాడని మరువవద్దు. ప్రభువు మాత్రమే ఉపసమానమును మరియు ఆత్మీయా రాజ్యమును తన చేతిలో ఉన్నవి.


విమోచకుడు పుట్టియున్నాడు

ఒక రోజు రాత్రి బెత్లెము అను పట్టాన పర్వతముల యందు కొంతమంది గొర్రెలకాపరులకు ప్రభువు దూత ప్రత్యక్షమైనప్పుడు. వారు నెల మీద పారిపోయిరి , అప్పుడు వారి చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు వచ్చినప్పుడు , దేవుని తీర్పు దినము ముందే చెప్పకనే వచ్చియున్నది అని అనుకొనిరి. కనుక వారి పాపములు వారి కన్నులయెదుటున తేటగా కనపడినప్పుడు వారు చాల భయాక్రాంతులైరి. అప్పుడు దేవుని తీర్పు నుంచి తప్పించుకొనుటకు ప్రయత్నమూ చేసిరి కానీ వారు దేవుని ద్వారా బంధింపబడియుండిరి.

అయితే ప్రభువు దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు వారిని గద్దించాక, భయపెట్టక పోయెను అయితే వారిని ఉత్తేజపరచెను, "భయపడకుడి; ఇదిగో ప్రజలందరిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు" (లూకా 2:8-11)

ఈ ప్రత్యక్షముద్వారా దేవుని దూత ఒక క్రొత్త కృపానందమును ప్రారంభించెను. దేవుని యొక్క ప్రణాళిక ఒక విమోచనా సత్యముగా ఉండదు. దేవుని దూత ప్రజలందరికి దేవుని సమాధానమును అఆనందమును స్వీకరించుమని ఆహ్వానించింది. దేవుడు తన కృపను పరిశుద్ధులకు, నీతిమంతులకు మాత్రమే ఇవ్వక పాపులకు, చెడిపోయిన వారికి కూడా ఇవ్వడము జరిగింది. దేవుని దూత వర్తమానమును జ్ఞానులకు , పండితులకు మొదటగా ఇవ్వలేదు అయితే అజ్ఞానులైనటువంటి వారికి చదువు లేనివారికి వర్తమానమును తెలియజేయడమైనది. అదేవిధముగా విలువైన అవకాశమును పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకూ మరియు పిల్లలకు అలాగునే రోగులకు కూడా ఇవ్వడము జరిగింది. కనుక దేవుని ఆనందము అందరికి రావడము జరిగింది. అయితే ప్రభువు దూత ఎందుకు ఆనందమును అందరికి ఇవ్వడము జరిగింది ? విమోచకుడు జన్మించాడు కనుక .

అయితే చాలా మంది ప్రజలు దేవుని ఆనందమును తిరస్కరించడము జరిగింది. ఎందుకంటే వారి మనసును మార్చలేక వారి యొక్క ఆశయాలు, డబ్బు మరియు వారి జీవనవిధానం వారికి ఇష్టంవచ్చినట్టు ఉండాలని అనుకొన్నారు కనుక. వారి శత్రువులను మారణాయుధాలద్వారా ఎదిరించి వారి ప్రభుత్వమును విజయపంతములో నిలబెట్టుకోవాలని అనుకొన్నారు


క్రీస్తు యొక్క గొప్ప భాగ్యము

క్రీస్తు పశ్చాత్తాప పడినవారందరిని దేవుని వైపుకు తీసుకువస్చాడు. కనుక వారిని స్వస్థపరిచి, వారి పాపములనుండి వారిని క్షమించి, వారినుండి దెయ్యములను వెళ్లగొట్టి, వారి ఆకలిని తీర్చి వారిని సముదాయించాడు, "మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ స్నాగతులను మీతో చెప్పుచున్నాను" (యోహాను 15:11; 16:24 ).

క్రీస్తు తన మధ్యవర్తిత్వము ద్వారా తన రహస్యములను తన ప్రియమైనవారికి వెల్లడించెను (యోహాను 17:13)

మరియా కుమారుడు తన ప్రేమను తనను వెంబడించు వారికి మాత్రమే ఇవ్వక, తనను ద్వేషించు వారికి తనకు విరోధముగా ఉండు వారికి కూడా తన ప్రేమను వెల్లడి పరచియున్నాడు. వారి పాపములను తొలగించి వారి దోషములనుబట్టి వారిని క్షమించెను. కనుక ఎవరైతే తనను వెంబడించెదరో వారిని తన పిల్లలుగా అంగీకరించి వారికి తన నిత్యజీవమును అందించి యున్నాడు.

ఎప్పుడైతే మరియా కుమారుడు పరలోకమునకు ఏతెంచెనో అప్పుడు తన పరిశుద్ధాత్మను ప్రజలందరికొరకు పంపినాడు (అపోస్త 2:16-21) ఎవరైతే వారి పాపములను క్రీస్తు దగ్గర ఒప్పుకొంటారో వారు క్రీస్తు యొక్క ప్రేమను, ఆనందమును, సమాధానమును, దీర్ఘశాంతమును, పొందుకొంటారు (గలఁతి 5:22-23). గొప్ప కార్యాలు సంపూర్ణముగా మార్పుకలిగిన విశ్వాసుల జీవితాలలో జరుగును, అది కూడా క్రీస్తు యొక్క పరిశుద్దాత్మ ద్వారా . విలపించు వారికి ధైర్యమును, బలహీనులకు నిరీక్షణకు, మరణమునకు వెళ్లువారికి నిత్యజీవమును వారికి దయచేయును.

అపొస్తలుడు అయినా పౌలు ఈ లాగున వ్రాసాడు "దేవుని యందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి" (ఫిలిపీ 4:4)

దేవుని ఆనందము ఆయనయందు నిలిచియుండి ఆయన మాటలు వారి హృదయములో ఉండువారిలో నిత్యముగా ఉందును. "మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నట్లుగా ఆనందించుడు" (లూకా 10:20) అని క్రీస్తు తనను వెంబడించువారిని బట్టి సెలవిస్తున్నారు

ప్రియా చదువరి,
నీవు ఒంటరిగా ఉన్నావా , లేక వెలివేయబడ్డవా ? లేక జీవముగల క్రీస్తులో నిలిచియున్నావా? ఎవరైతే మరియా కుమారుడైన క్రీస్తు యందు నిలిచియున్నట్లైతే వారు ఆయన ఆనందమును ఆయన శక్తిని పొందియుంటారు. కనుక నిన్ను నీవే క్రీస్తుకు సమార్పుంచుకొని ఆయన నిత్యజీవములో సంతోషముగా హృదయమందు పాలుపంచుకో.

నీవు క్రీస్తు యొక్క ఆనందంలో నియమించబడ్డావా? మేము నిన్ను క్రీస్తు శక్తి యందు నింపబడులాగున , ఆయన వాక్యము యందు ధ్యానము చేయబడులాగున మీ కొరకు దేవుని సువార్త పత్రికలను పంపుటకు సిద్ధముగా ఉన్నాము. కనుక బైబిల్ గ్రంధమును చదివినట్లయితే ఆయన ఇస్చ్చు నీటిని పొందుకొనియుండెదవు.
ప్రభువు యొక్క ఆనందమును నీ మిత్రులదగ్గర పంచుకో: ఈ లోకములో నిజమైన దేవుణ్ణి కనుగొనక లోకమందు తప్పిపోయిన వారికి, వారి జీవితములో పడిపోయినవారికి ఈ ప్రతులను నీవు వారికి ఇవ్వాలనుకుంటే నీకు కావలసినన్ని పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము .

మీ ఉత్తరముల కొరకు ఎదురుచూస్తుంటాము. మీ చిరునామా వ్రాయడము దయవుంచి మరవవద్దు . ప్రభువు తన ఆనందముతో మీహృదయములను నింపులాగున ప్రార్థించెదము

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 01:17 PM | powered by PmWiki (pmwiki-2.2.109)