Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 030 (Peace, Hope, and Love Dwell in the Believer)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
C - విమోచన అనగా దేవునికి మనిషికి ఒక నూతన బంధము అని అర్థము (రోమీయులకు 5:1-21)

1. సమాధానము, నిరీక్షణ మరియు ప్రేమ అనునవి విశ్వాసులలో ఉండును (రోమీయులకు 5:1-5)


రోమీయులకు 5:1-2
1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము 2 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. 

సహజసంబంధమైన మనిషి దేవునితో కలహముతో జీవించును. ఎందుకంటె మనిషి యొక్క దోషములు మరియు తప్పిదములు పరిశుద్ధునికి వ్యతిరేకములుగా ఉన్నవి కనుక. కనుకనే దేవుని యొక్క ఉగ్రత ప్రతి భక్తిలేనివారికి మరియి నీతి లేనివారికి వచ్చును.

క్రీస్తు సిలువలో మరణించి దేవునితో మనిషికి సమాధానమును ఇచ్చెను, మనము సమాధానములోనికి ప్రవేశించెదము ఎందుకంటె మన పాపములను కుమారుడు తీసుకొని దేవుని కృపాకలిగిన రక్షణ ద్వారా అందరికి కనపడి ఉన్నాడు కనుక. కనుక ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారికి దేవుని అశీయేర్వాదము ఒక గొప్ప దీవెనగా ఉండును! చేదు చేయువారిలో దేవుని సమాధానము ఉండదు, మరియు ప్రాణమునకు విశ్రాంతి ఉండదు, అయితే కేవలము సిలువ వేయబడిన వాని ద్వారానే కలుగును.

క్రీస్తు నూతన నిబంధన ప్రకారముగా అతని యొద్దకు వచ్చు ప్రతి విశ్వాసిని కూడా పరిశుద్ధపరచి వారిని అంగీకరించును, అయితే ఈ విధమైన భాగ్యము పాత నిబంధనలో కేవలము యాజకులకు మాత్రమే ఉండెను, ఎందుకేనట వారు ఇశ్రాయేలీయుల పాపముల కొరకు సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి వారి పాపములను బట్టి పరిహారము పొందునట్లు వారు తెచ్చిన బాలి ద్వారా కలిగించు వాడు. అయితే పరిశుద్దుడైన క్రీస్తు మరణమౌ ద్వారా ఆ స్థలములో ఉన్న తేరా రెండుగా చినిగెను కనుక మనకు పరిశుద్దుడైన వాని ముందు నిలబడుటకు ఒక భాగ్యము వచ్చిఉండేను. కనుక అతను ప్రతి ఒక్కరు కూడా అతని యొద్దకు విశ్వాసము కలిగి రావాలని ఆహ్వానించుచున్నాడు, ఎందుకనగా అతను ఒక నాశనము చేయువాడు కాదని, మన పాపములను బట్టి మనలను దూరముగా చేయువాడు కాదని, అయితే అతను ఒక దయకలిగిన రక్షకుడని మరియు కనికరము గల ప్రేమ గల వాడని చెప్పుటకు వచ్చెను. అతను మన ప్రార్థనలను, సమాధానములను మరియు మానవులను బట్టి ఎదురుచూసి, త్యాగము కలిగిన యేసు సువార్తను ప్రకటించువారిగా చేసి ప్రాణముల యందు విశ్రాంతి కొరకు ఎదురు చూచు వారికి తన వాక్యమును ప్రకటించుటకు మాలను ఏర్పాటు చేసి ఉన్నాడు.

ఎప్పుడైతే క్రీస్తు మరణము నుంచి లేచాడో, అప్పుడు తన శిష్యులకు ఈ విధముగా చెప్పెను: "మీకు సమాధానము కలుగును గాక", దానికి రెండు అర్థములు కలవు:

  1. క్రీస్తు శ్రమలచేత దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు.
  2. లేచి, వెళ్లి యేసు నీకు ఆజ్ఞాపించినట్లు వెళ్లి సువార్త ప్రకటించుము". ఎవరైతే యేసును విశ్వసిస్తారో వారు సమాధానపరచబడతారు, వారు మాత్రమే కాదు అయితే ఎవరైతే క్రీస్తు ద్వారా సమాధాన పరచబడి మరియు దేవునిచేత తన పిల్లలని పిలువబడతారో వారందరు కూడా.

మన విమోచనమునకు తోడుగా పరిశుద్దుడైన వాని యొక్కకృప సువార్తను ప్రకటించి, ఎందుకంటె పౌలు చెప్పినట్లు మనకు అర్థము చేసుకోను నిరీక్షణ ఉన్నాడని: దేవుడు మనలో తన రూపమును చేసి ఉన్నాడు, అయితే మన పాపముల ప్రకారము దేవుని మహిమను మనము కోల్పోయిఉన్నాము. కనుక ఇప్పుడు ఆ నిరీక్షణ మనహృదయములో పరిశుద్ధాత్మచేత నిండినది, దేవుడు అదే మహిమను మనకు తన కుమారుడైన యేసు ఏవిధముగా వెలుగై ఉన్నదో అదేవిధముగా ఇచ్చును. నీవు దేవుని మహిమను బట్టి గర్విస్తున్నావా? నీ ముందర ఉంచిన నిరీక్షణకు బట్టి సహనము కలిగి ఉన్నావా? మన యొక్క భవిష్యత్తు మన ఆలోచన ప్రకారముగా లేదు; అయితే అది పరిశుద్దాత్మ శక్తి చేత నిర్దేశించబడినది, అది కూడా మనకు తన మహిమను బయలుచేయు దేవుని ద్వారా వచ్చినది.

రోమీయులకు 5:3-5
3 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి 4 శ్రమలయందును అతిశయపడు దము. 5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. 

మనము పరలోకములో నివాసముగా లేము, అయితే ఈ భూమి మీద ఉన్నాము. యేసు ఏవిధముగా అయితే శ్రమలను కష్టములను అనుభవించి ఉన్నదో అదేవిధముగా మనకు కూడా వచ్చును, అవి కూడా మన విశ్వాసమందు మనము ఏడుగునప్పుడు కలుగును. అయితే పౌలు ఈ సత్యములను బట్టి వ్రాయలేదు అయితే కన్నీళ్లతో ఈ విధముగా వ్రాసెను: మనము కూడా మన ఉపద్రవముచేత నడిపింపబడుచున్నాము ఎందుకంటె మనము క్రీస్తును వెంబడిస్తున్నాము కనుక. మనము ఏవిధముగా అయితే అతని ఉపద్రవమును వెంబడిస్తున్నామో అదేవిధముగా అతని మహిమను కూడా వెంబడించెదము. కనుక ప్రతి కార్యమును కూడా అనుమానముచేత చేయక అన్ని కూడా క్రీస్తు చేత చేయుము ఎందుకంటె అతను లేకుండా ఏదియు కూడా జరగదు.

ఒకవేళ మనము ఈ లోక సంబంధమైన భారములు మోసుకొనునట్లైతే మనము మన సొంత కార్యములను ఖండించునట్లు, ఎందుకంటె మనము దేవుని కాపుదలలోనికి రావాలంటే మనలను మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోంవాలి. సహనము మనలో ఎదిగి, నిరీక్షణలో మనము క్రీస్తు వైపు ఉండెదము. అబ్రాహామును దేవుడు తన విఫలములలో కూడా ఆడుకొని ఏవిధంగా అయితే ఆశీర్వాదముగా ఉంచాడో అదేవిధముగా మనలను కూడా ఉంచును.

మన శ్రమలనును బట్టి మనకు ఒక అవకాశము కలిగి ఉన్నది, అదేదనగా అబ్రాహాము యొక్క అనుభవము చేత మనకు కృప కలిగిన దేవుని ప్రేమలోకి మరియు తన జీవమును మనకు దయచేసి పరిశుద్దుడైన నిజమైన దేవునికి దగ్గరగా వచ్చుటకు మనకు అవకాశం కలిగెను. ౫ వ అధ్యములో ౫ వ వచనంలో మనము చూసినట్లయితే చాల అందమైన దానిని మనము పొందుకొనగలము. ఈ వచనమును ఖంఠాష్ఠము చేయుము ఎందుకనగా ఇది బైబిల్ కి ఒక ప్రాముఖ్యమైనదిగా ఉండును. మనలో ఏ మనిషి ప్రేమ కూడా మన హృదయాలలో నింపబడలేదు, అయితే నిత్యుడగు, ప్రేమ కలిగిన దేవుని ప్రేమ మాత్రమే మన హృదయములలో ఉంచి ఉన్నాడు. ఎందుకంటె క్రీస్తు రక్తము మన పాపములను కడిగివేసెను కనుక. కనుకనే పరిశుద్ధాత్ముడు మన హృదయములలో నివాసము చేస్తున్నాడు, కనుక మన హృదయములను దేవుని ఆలయముగా మార్చుచున్నాడు. ఈ పరలోక ఈ మూలము దేవుని పరిశుద్ధ శక్తి అయి ఉన్నది, కనుకనే దీనిని క్రీస్తు అందరికి అనగా విశ్వాసులందరికి ఇచ్చును. ఎవరైతే దేవుని ఆత్మీయ శక్తిని పొందుకుంటారో వారు దేవుని ప్రేమను అనుభవిస్తారు కనుక వారు రెండవ జన్మమును పొందుకుంటారు,నూతన జీవితమును మరియు నిత్యజీవమును పొందుకుంటారు. ఏదేమైనప్పటికీ మనలో ఉన్న పరిశుద్దాత్మ మనకు సమాధానమును మాత్రమే ఇచ్చునది కాక, అయితే మనము సంతోషముచేత నిరీక్షణకు పొందునట్లు మనలను బలపరచి మనము మన శత్రువులను ప్రేమించునట్లుగా చేయును. క్రీస్తు మనలను అనాధలుగా వాడివలేదు అయితే తన శక్తిచేత నింపి తన ప్రేమను తన మహిమను మనయెడల బయలుపరచెను.

ప్రార్థన: పరిశుద్దుడైన దేవా మేము నిన్ను ఆరాధిస్తున్నాము, ఎందుకంటె నీవు మమ్ములను తిరస్కరించలేదు, అయితే మా శరీరంలోనికి నీ ప్రేమను నింపి, నీ శక్తిని బట్టి నిన్ను ప్రేమించి నీ కనికరమును బట్టి నిన్ను నమ్ముటకు, నీ నడిపింపును దయచేయుము. మా హృదయమందు నిన్ను బట్టి ఘనపరచుటకు మరియు మహిమపరచుటకు ఆనందించుచున్నాము. నీ ప్రేమను బట్టి మేము నడుచుకొనుటకు నీ సహాయమును దయచేయుము.

ప్రశ్నలు:

  1. మన జీవితములో దేవుని సమాధానము ఏవిధముగా నెరవేర్చబడినది?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:53 AM | powered by PmWiki (pmwiki-2.3.3)