Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 026 (The Death of Ananias and Sapphira)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

14. అననీ మరియు సప్పీరా యొక్క మరణము (అపొస్తలుల 5:1-11)


అపొస్తలుల 5:1-6
1 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. 2 భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. 3 అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయ మును ప్రేరేపించెను.? 4 అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమి్మన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమా 5 అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను; 6 అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. 

ప్రతి సమర్పణ కలిగిన పాపము తప్పుకాదు, అయితే అది ధర్మశాస్త్రమునకు నేరం. మరియు ప్రతి నేరం కేవలము అజాగ్రత్త కలిగినదే కాదు, అయితే అది నేరుగా దేవుని మహిమకు అతిక్రమము. ఎవరైతే తనను తాను ఇతరులతో పోల్చుకొని తీర్పు తీర్చుకొనునో అతను పైపైన మనిషిలా ఉంటాడు. "మేమంతా బలహీనులమని" అతను క్షమించి చెప్పును. ఎవరైతే దేవునిని యెరిగి ఉంటాడో, అతను పరిశుద్దాత్మ శక్తిలో ఉంది, ప్రతి పాపమును తెలుసుకొని, అది చిన్నదైనా, పెద్దదయినా దానికి ప్రతిగా మరణమును పొందును. అనానిమస్ మరియు సాప్హిర విషయములో కూడా ఇలాగే జరిగింది. దేవుడు విశ్వాసులను ఏవిధముగా నాశనము చేయుటకు అధికారము కలిగి ఉండునో అని చూపించును.

"పరిశుద్ధాత్ముడు మనలను ఎందుకు భరిస్తున్నాడో, మరియు మనలను అప్పటికప్పుడు నాశనము చేయలేదు," అని మనము అడగవచ్చు? మనకు దేవుని రహస్య తీర్పు తెలియదు. 2 వ వచనంలో మనము చదివినట్లయితే ఇద్దరు అజాగ్రత్త కలిగి పాపము చేయలేదు, అయితే అపొస్తలులును మోసము చేసిరి. పేతురులో సర్వశక్తుడు ఉన్నదని వారు నమ్మలేదు. పరిశుద్ధుడు విశ్వాసులలో నివాసము చేసి వారి హృదయములను తెలుసుకొనును.

వారు ఒకవేళ డబ్బుతో వారి భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలని అనుకోని ఉండవచ్చు. "అననియాస్" అను పేరుకు "దేవుడు కృపాకలిగినవాడు" అని, అయితే వారు దేవుని యందు మాత్రమే నమ్మకము ఉంచలేదు. వారు ఇద్దరు సేవకులను పరిచర్య చేయుటకు ప్రయత్నించిరి, అది సాధ్యమైనది కాదు. అయితే చివరకు వారు దేవుని కంటే ఎక్కువగా డబ్బునే ప్రేమించిరి.

అననియాస్ మరియు అతని భార్య వారికున్న ఆస్థినతటినీ సంఘముకొరకు త్యాగము చేయుటకు మొహమాటపడలేదు, ఎందుకంటె సహకారం అనునది స్వచ్ఛందంగా చేసేది. కొంతమంది వారికున్న కొంతను వారితో ఉంచుకొని మిగతా దాని బట్టి బహిరంగముగా మాట్లాడిరి. అననియాస్ మరియు అతని భార్య విషయములో వారు దేవుని విషయములో అనాలోచన కలిగి సంఘములో వారే పెద్దవారని ఆలోచించేవారు. సంఘములో వారు అన్ని ఇచ్చినట్లుగా కనపడువారు, అయితే వారు ఇచ్చినది మాత్రమూ కొద్దిగే. అననియాస్ సభకు భక్తి కలిగి వచ్చెను. అతను అపొస్తలుల బలిపీఠము యొద్దకు వచ్చి డబ్బు సహకారము అందించెను, అంటే అతను సంపూర్ణముగా దేవునికి త్యాగము చేసినవానిగా. అయితే అతను కొంత భాగపు డబ్బును దాచిపెట్టుకొనెను. ఆలాంటి వారిని యేసు "వేషధారణ" అని పిలిచాడు, అదే సంఘములో అతి పెద్ద పాపము. అది నేరుగా సాతాను నుంచి వచ్చును.

మనకందరికీ మన పాపములు తెలిసేయున్నవి కనుక మనమందరము కూడా వేషధారణ కలిగిన వారమే, అయినప్పటికీ ఈ లోకములో మనమే మంచివారమని ప్రవర్తిస్తాము. కనుకనే మనము మన సమాజము కానీ సంఘము కానీ మనలను ఎల్లప్పుడూ పొగడాలని అనుకుంటాము. మనమందరము మరణకరమైన విషముచేత నింపబడి ఉన్నాను మనము ఒక గర్వము కలిగిన వారుగా ప్రవర్తిస్తాము. కనుక ప్రియా సహోదర దేవుని తీర్పులో నీ సత్యమును జ్ఞాపకం చూసుకున్నావా?

అననియాస్ మరియు అతని భార్య దేవుని కంటే డబ్బును మాత్రమే ప్రేమించలేదు, అయితే వారు వేషధారణ కలిగి అందరి వాలే ఉండిరి. క్రీస్తు కృపలోనుంచి అనుదినము బయటకు వచ్చుచుఉండిరి. సాతానుడు యూదాను ఏవిధముగా అయితే తన చెడు ఆత్మ చేత నింపాడో అదేవిధముగా వారి హృదయములను కూడా నింపెను. ఎవరైతే డబ్బును ప్రేమించెదరో వారు సాతాను ద్వారా పట్టుకొనబడతారు. కనుక ఆ ఆత్మ దేవుని రాజ్యము నుంచి వారిని దూరముగా చేయును. కనుక అప్పటివరకు పరిశుద్ధుల హృదయములు మరియు మనసులు ఒక్కటిగా ఉండెను. కనుక ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరి ఉండి, పరలోకమందున్న తండ్రికి అనుకూలముగా ఉండిరి. వారు పరిశుద్ధాత్మచేత నింపబడి, వారిని వారు దేవునికి బాలియాగమైన వారుగా ఉండిరి.

ఈ లోకములో క్రీస్తు శరీరము ద్వారా సాతాను శ్రమలనుంచి క్రీస్తు తన అధికారమును జయించాడు. ఈ విధమైన ఆత్మలద్వారా పేతురు అననియా యొక్క అబద్ధమును చూసాడు. అతని మొఖమునుంచి వస్త్రమును తీసివేసి అతను పరిశుద్దాత్మునికి అబద్ధము చెప్పుట చూసేను, దాని అర్థము దేవునితో వారు అబద్ధము చెప్పినట్లే. అయితే ఇంతకు మునుపే అననీ అంతరంగమందు క్రీస్తు రక్షణను అనుభవించాడు. మరియు అతను పరిశుద్దాత్మునికి వ్యతిరేకముగా పాపము చేయుట ప్రారంభించెను.

ఈ ఆత్మ అపొస్తలుల మాటలను నిర్ధారించి దేవుని మరణమును తెచ్చెను. దీని ద్వారా సత్యమైన ఆత్మ అపొస్తలుల నేరమును వారి మతాల ద్వారా క్షమించలేదు, అయితే పచ్చాత్తాపము లేని ఆత్మలను ఖండించెను. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, అయితే పరిశుద్ధుడు కూడా. అతను క్షమించుటను ప్రేమించును.అయినప్పటికీ ఎవరైతే ఈ సత్యమైన స్వరమునకు వారి హృదయములను ఖఠినపరచుకొంటారో వారికి వారు సాతానునికి సమర్పించుకొంటారు. అతని యెడల కనికరము అనునది చూపదు.

మొదటి సంఘము క్రీస్తుకు దగ్గరగా జీవించెను. దీని మధ్యలో సాతాను మతబ్రస్టు వారిని ఖండించెను. ఈ విధమైన తీర్పు పాపమువలన వచ్చు జీతము మరణముగా ఉన్నది.

ప్రార్థన: ఓ ప్రభువా, నన్ను ఖండించవద్దు. నేను వేషధారణ కలిగిన పాపము చేసినవాడను మరియు డబ్బు మీద ఆధారపడిన వాడను. నా అబద్ధములు బట్టి క్షమించి, నా వేషధారణను బట్టి నన్ను మార్చుము, అప్పుడు నేను మోసము చేయువాడను కాను. నీ సహనంతో మా సంఘములను పరిశుద్ధపరచుము అప్పుడు ఎవరు కూడా గర్వముతో ఉండక ఉందురు.

ప్రశ్న:

  1. అననీ యొక్క మరణమును పరిశుద్ధాత్ముడు ఎందుకు తొందరగా తెచ్చెను?

www.Waters-of-Life.net

Page last modified on April 11, 2020, at 08:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)