Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 101 (Jesus intercedes for his apostles)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)

3. యేసు తన అపొస్తలుల గురించి మధ్యవరహిత్వము చేయుట (యోహాను 17:6-19)


యోహాను 17:6
6 లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు.

తన తండ్రి క్రీస్తును విమోచనమును చేయుటకు బలపరచిన తరువాత, అనేకమంది నూతనముగా జన్మించుట ద్వారా తన తండ్రి మహిమ పరచబడతాడని విస్వసించెను. కనుకనే అతను ఈ లోకమునుంచి ఎన్నుకొనిన పన్నెండు మంది శిష్యులను ఐక్యతలోనికి నడిపించెను.

క్రీస్తు తన శిష్యులకు దేవుని నూతన నామమును పరిచయము చేసెను: " తండ్రి" . దీనిని చెప్పినప్పుడు, వారు ఈ లోకమునుంచి పిలువబడి అతని పిల్లలయిరి. ఇది సంఘమునకు ఒక రహస్యమైనది, కనుక విశ్వాసులు ఇక ఎన్నటికీ నశించిపోరు అయితే దేవునిలో తమ జీవితములను ముందుకు వెళ్ళెదరు. ఎవరైతే దేవునిలో జన్మించినట్లైతే వారు దేవునికి సంబంధించినవారు , మరియు అతని స్వాస్థ్యము, ఎందుకంటె అతను వారికి జన్మము ఇచ్చాడు కనుక. తన కుమారుడిని వారికొరకు సమర్పించి అతని రక్తముద్వారా వారిని కొన్నాడు. కనుక నీవు క్రీస్తును విశ్వసించినట్లైతే నీవు అతని స్వాస్థ్యమే.

శిష్యులు సువార్తను విశ్వసించుట ద్వారా తండ్రిత్వము తన విశ్వాసులు ఆయన పిల్లలగుటలో నెరవేర్చెను, మరియు దేవుని విలువైన వాక్యములు వారి హృదయములలో ఉంచుకొనిరి. ఈ వాక్య భగములు నలుపు రంగులతో వ్రాయబడినందున వి వ్యర్థమైనవి కాదు. అవి దేవుని మాటలు మరియు సృష్టి చేయబడినవి. ఎవరైతే తండ్రి మాటలను తాం హృదయములో ఉంచుకొనునో వారు అతని మహిమతో జీవించును.

యోహాను 17:7-8
7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి,నీవు నన్ను పంపితివని నమి్మరి గనుక 8 నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.

దేవుని వాక్యము క్రీస్తు పెదవులనుంచి వచ్చినప్పుడు చెడ్డ వారిని జ్ఞానముకలిగిన జీవితములోనికి నడిపించును. క్రీస్తు తన సొంత మాటలను విడిచి శక్తికలిగిన వాక్యమును తీసుకొచ్చాడు. అతని శాక్త్ కలిగిన తండ్రి మాటను ఒక ఆశీర్వాదముగా మనకు వచ్చి ఉన్నవి. కుమారుడు తన సొంత అధికారమును కానీ శక్తిని కానీ ప్రదర్శించలేదు అయితే తన తండ్రి జ్ఞానము కలిగి దేవుని కార్యములను చేసెను.

క్రీస్తు తన మాటలచేత గొప్ప ప్రాముఖ్యమైన అనుభవమును యిచ్చియున్నాడు. ఇది తండ్రి నుంచి వచ్చినది కనుక కుమారుడు దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యంలో శక్తి ఉన్నది. కనుక మనము ఆ శక్తి కలిగిన వాక్యమును అనుభవించి దానిద్వారా మనము వెలిగించబడినాము. ఈ సూచనలను మరియు వాక్యములను సంతోషముతో స్వీకరించినాము. కనుక ఈ సువార్త వాక్యములు తండ్రిని కుమారుడిని మరియు పరిశుద్ధాత్మను బయలుపరచినాయి.

ఇక్కడ క్రీస్తు తన ప్రార్థన ద్వారా శిష్యులకు అతని వాక్యములను వివరించెను. ఎందుకంటె వారి హృదయాలలో క్రీస్తు విశ్వాసము అనే విత్తనములు చూపెను. వారు ఈ మాటలను ఆనందముతో స్వీకరించిరి. అప్పుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించెను: అప్పుడు ఆ వాక్యము వారిని దేవుని ఫలములోనికి నడిపించెను. ఈ విషయములన్నిటిని బట్టి క్రీస్తు ముందుగానే ప్రవచించెను.

షిహాయులలో క్రీస్తు మాటలు జ్ఞానము కలిగిన విశ్వాసమును పుట్టించెను. ఆ విశ్వాసము ఏమిటి ? ఆ కుమారుడు తండ్రినుంచి వచ్చి, నిత్యజీవమును తగిన సమయములో ఇచ్చి, అతని మహిమ మనుషులలో ఉండి, అతని ప్రేమ ద్వేషమును పారద్రోలుట, బలహీనతతో శక్తిని ఇచ్చి, అతని దైవత్వము దేవునికి ఆ సిలువలో ప్రత్యేకించి, మరియు అతని జీవము మరణమునకు ఎక్కువ. పరిశుద్దముడు వారి హృదయములలో విమోచించెను, అప్పుడు వారు అతని శరీరములో సభ్యులుగా ఉండిరి. వారు ఈ ఆలోచనలో ఎంతో దూరములో ఉండలేదు, అయితే ఆత్మాయ ద్వారా హృదయపూర్వకముగా వారిలో నిలిచి ఉండెను. అప్పుడు వారు ఆత్మ ద్వారా క్రీస్తు దైవత్వము యొక్క క్రయములో ఉండిరి.

క్రీస్తు జీవితములో శిష్యులు " ఆత్మచేత జన్మించిన వాడు ఆత్మ అగును " అనే మాటకు అర్థము తెలుసుకొనిరి. ఈ ఆశీర్వాదమైన శక్తి శిష్యుల జీవితములలో గొప్పదిగా ఉండెను. అతను క్రీస్తు మాటలద్వారా వచ్చును.

ప్రార్థన: ప్రభువైన యేసు నీ తండ్రి వాక్యములను మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు-ఆ మాటలు పూర్తి జీవమును , శక్తిని మరియు కలిగి ఉన్నాయి. నీవు మాలో జ్ఞానమును మరియు విశ్వాసమును చూపి ఉన్నావు. నీవు శక్తి కలిగిన వాడవు కనుక నిన్ను మాకు ఇచ్చిన తండ్రిని మేము మహిమపరచుచున్నాము.

ప్రశ్న:

  1. యేసు ద్వారా తండ్రి నామమును బయలుపరచుట అనగా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:16 PM | powered by PmWiki (pmwiki-2.3.3)