Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 048 (Jesus and his brothers)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

a) యేసు మరియు అతని సహోదరులు (యోహాను 7:1-13)


యోహాను 7:1-5
1 అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. 2 యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక 3 ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము. 4 బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కన బరచుకొనుమని చెప్పిరి. 5 ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

యేసు సాక్ష్యమును vininappudu అక్కడున్న గుంపు చాలా ఆశ్చర్యానికి లోనైనారు. గాలీలయాలో చాలామంది అతనిని విడిచినతరువాత యెరూషలేములో కొంతమంది అతనిని వెంబడించారు. అక్కడున్న వారు ఈ యువకుడు మృతిని జయించి ఈ లోకమునకు తీర్పు తీర్చును అని నమ్మలేకపోయిరి. మరియు వారందరు అతని శరీరమును మరియు రక్తమును తిని త్రాగుట వారికి నచ్చలేదు. అయితే ఇవన్నియు ప్రభురాత్రి భోజనమునకు సూచన అని అర్థము చేసుకోలేకపోయిరి.

యెరూషలేములో ఉన్న కొందరు క్రీస్తును చంపుటకు పూనుకొనిరి. వారు వంతుల ప్రకారము వేసుకొని క్రీస్తును పట్టుకొని అతనిని వెంబడించువారికి కూడా తగిన శిక్ష వేయాలని తలంచిరి. అప్పుడు అక్కడున్న వారు గాలీలయా చుట్టూ తిరిగి యేసును కనుగొనుటకు ప్రయత్నించిరి. అయితే వారి ఉద్దేశములు అక్కడున్న వారిని అనగా యేసును వెంబడించువారిని శ్రమలలోనికి వేయాలని చూసిరి.

యేసు సహోదరులు ఆ దేశములో ఉన్న నిబంధనలను బట్టి భయము చెందిన వారైరి. అందుకే ప్రత్యక్షగుడారమునకు వ్యతిరేకముగా చేయూతను ఒప్పుకొనలేదు (మార్క్ 6 :3 ). మరియు అతనిని గాలీలయాను విడిచి వెళ్లుమని చెప్పిరి. అతనితో ఎన్నో సంవత్సరములు కలిసి ఉన్నపటికీ అతని మహోన్నతమును తెలుసుకొనలేక పోయిరి. మరియు అతని ప్రేమను కృపను జాలు దయను కూడా తెలుసుకోలేక పోయిరి. అయితే అక్కడున్న విశ్వాసులు అనేకులు అతని ప్రేమను తెలుసుకొని అతని సత్యములను అంగీకరించిరి.

యేసు సహోదరులు అతని అద్భుతములను చూసిరి. అయితే అతనే తిరిగి వచ్చు మెస్సయ్య అని అతని ముందే ప్రతి మోకాలు వంగునని నమ్మలేకపోయిరి. వారు అక్కడున్న గుంపు అంత అతని నుంచి వేరుగా ఉండెనని బాధ కలిగి ఉండిరి. వారు సాతాను ఏవిధముగా అయితే యేసును శోధించాడో అదేవిధముగా యేసును వారు కూడా శోదించిరి ఎందుకంటె అప్పుడే యేసు తన మహిమను దేవాలయములో ఉన్న ఆరాధికులకు తాను ఎవరో తెలుసుకొను నట్లు ఆశకలిగి ఉండిరి. అయితే యేసు ఎప్పుడు కూడా ఘనతను లేదా బలహీనమును బట్టి అతిశయించలేదు అయితే ఆయన ఎప్పుడు తగ్గింపునకు ఇష్టపడి ఉండెను.

యోహాను 7:6-9
6 యేసు నా సమయ మింకను రాలేదు;మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. 7 లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని,దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 8 మీరు పండుగకు వెళ్లుడి;నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను. 9 ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

అక్కడున్న అనేకులను దెయ్యపు ఆత్మ చెడగొట్టినది. గర్వము అనునది ప్రాణమునకు ఒక విధమైన అనారోగ్యము మరియు ఒక విధమైన సూచన. సత్యములో ప్రతి ఒక్కరు దేవునికి ప్రతి చిన్న విషయములో కూడా భయముకలిగి ఉంటారు లేకపోతే వారు బలహీనమై చనిపోవచ్చు. తన బలహీనతను ఆయన మూసుకొంటున్నాడు. గర్వము కలిగిన మనిషి తనకు తాను ఒక చిన్న దేవుని గా భావించి అతను ఏ మైన చేయగలడు అని అనుకొంటాడు కానీ ఏమి చేయలేడు. అతని ఆలోచనలు దేవునికి విరుద్ధముగా ఉంటాయి అందుకే అతను దేవుడిని లక్ష్యపెట్టడు. అతను దేవునికి వ్యతిరేకముగా ఉంటాడు. అందుకే దేవుని కంటే ఎక్కువగా మనిషి తననే ప్రేమిస్తాడు; తనను తాను మహిమపరచుకొంటాడు కానీ క్రీస్తు నామమును ఎన్నటికీ ఘనపరచడు. మనుషుల ఆలోచనలు మాత్రమే చెడిపోలేదు అయితే వాడి క్రియలు కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్నవి. అయితే ఎవరైతే క్రీస్తు లేకుండా జీవించెదరో వారు క్రీస్తును వ్యతిరేకమైనవారు.వారిలో ఉన్న ప్రతి విధమైన అనగా ఈ లోక ప్రతి భావన కూడా వారి మరణమునకు దారి తీయును.

క్రీస్తును ఈ లోకము ద్వేషిస్తున్నాడని అందరికి తెలియపరచెను , ఎందుకంటె అతను ఈ లోకములో తన తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చుటకు వచ్చెను కానీ తన ప్రణాళికలను చేయుటకు రాలేదు , మరియు తన తండ్రతో తనకు ఉన్న సంబంధమును తెలియపరచెను. అక్కడున్న ప్రజలు కూడా తన ప్రేమను బట్టి ఆలోచన చేసిరి, అతని ప్రేమ ఈ లోక సంబంధమైనది కాదని అయితే అది పరలోక సంబంధమైన ప్రేమని వారు తెలిసికొనిరి. అతని సన్నిధిని బట్టి అతనిని ద్వేషించిరి.

యేసు సహోదరులు పరిశుద్ధాత్మను వ్యతిరేకించిరి, ఎందుకంటె వారు ఈ లోక ఆత్మలచేత నింపబడి పరిసయ్యులు చెప్పు ప్రతి విషయమును వారు అంగీకరించిరి. వారి అవిశ్వాసములు దేవుని యందు వారు నమ్మకములేక మరియు దేవుని ప్రేమను తెలిసికొనలేకపాయిరి అని అర్థము ఐనది; అయితే వారు వేరే ఆత్మ చేత నింపబడిరి, ఆ ఆత్మ చేతనే వారు దేవునికి విరుద్ధముగా మరియు వ్యతిరేకముగా ఉండిరి. వారు వారి కార్యములను నమ్మి వారికి వారు మోసపుచ్చుకొనిరి.

యోహాను 7:10-13
10 అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. 11 పండుగలో యూదులుఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. 12 మరియు జనసమూహము లలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి;మరికొందరుకాడు,ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; 13 అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.

ప్రతి సంవత్సరము యూదులు ప్రత్యక్ష గుడారపు పండుగలను ఆనందముతో జరుపుకుంటారు. చెట్టు కొమ్మలచేత వారు ఒక రకమైన పరికరమును తయారుచేసి వారి ఇంటి పైకప్పుకు లేకా దారి ప్రక్కన వాటిని ఉంచుతారు. ప్రజలు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వండిన ప్రతి పదార్థమును కూడా తింటారు, ఇదే వారికి దేవుడు దయచేసి ఒక పండుగ అని భావించెదరు. ఆ తయారుచేయబడిన పరికరములు వారు అరణ్య మార్గములో కూడా తీసుకొని పోతారు. అందుకే వారికి ఈ లోకములో దాచిపెట్టిన స్థలము లేదు.

యేసు ఆ పండుగలో ఆనందము కలిగి లేదు ఎందుకంటే అతను శిష్యులతో పాటు శ్రమపొందియున్నాడు కనుక. అందుకే అతని సొంత సహోదరులు కూడా అతనిని వదిలి వెళ్ళిపోయినారు. తరువాత అతను గాలీలయాకు వెళ్లి అక్కడ ఉండి తిరిగి యెరూషలేమునకు వెళ్లెను. అప్పుడు మోసము అనునది ప్రారంభమై మన రక్షణను బట్టి మరణము కరమైన ఉగ్రత వచ్చెను.

యూదులకు క్రీస్తును గురించిన ఆలోచనలు రాకరకములుగా ఉండెను. కొందరు అతను దేవుని నుంచి వచ్చాడని. వేరే వారు అతను తన ప్రజలను విడిచివేసి వారు మరణమునకు పాత్రులుగా చేస్తాడు అని ; మరియు అతని సన్నిధి ద్వారా దేవుని ఉగ్రతను వచ్చుటకు మరియు వారి పండుగలను కూడా నాశనము చేయుటకు వచ్చెను అని. సంహేద్రిన్ అనువారు యేసును తన శిస్యులు వ్యతిరేకించిరి అని చెప్పిరి. అయితే తరువాత ఎవరు కూడా యేసును గురించి మాట్లాడలేదు.

ప్రార్థన: ప్రభువా దేవునికి నీ తగ్గింపును బట్టి నీకు కృతఙ్ఞతలు. మమ్ములను ఈ లోక ప్రవర్తననుంచి కాపాడు, అప్పుడు నీ ఆత్మ మమ్ములను నింపును. మమ్ములను చేదు మార్గములనుంచి కాపాడు, మరియు మా అంతరంగములను స్వస్థతపరచి నిన్ను మేము సేవించునట్లుగా చేయుము.

ప్రశ్న:

  1. ఈ లోకము యేసును ఎందుకు ద్వేషిస్తున్నది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:53 AM | powered by PmWiki (pmwiki-2.3.3)