Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 016 (Edification through the Ministry)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

7. అపొస్తలుల సేవ ద్వారా కలిగిన నిష్టీ (అపొస్తలుల 2:37-41)


అపొస్తలుల 2:39-41
39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. 41 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. 

పేతురు చెదిరిన పసచ్చత్తాపముకలిగిన గుంపుకు క్రీస్తు దగ్గరకు రమ్మని చెప్పెను. వారికి నిజమైన మార్పు మరియు విశ్వాసముతో కూడా బాప్తీస్మము అవసరమై ఉండెను, మరియు పరిశుద్దాత్ముడ్ని పొందుకొనుటకు గల షరతులు. ఈ జ్ఞానముచేత అతను వారిని బలపరచి, దేవుని గొప్ప ప్రేమను గూర్చి వారికి వివరించి ఈ లాగు చెప్పెను:

"పరిశుద్దాత్మ ఒక బహుమానము అయితే వేతనం కాదు. దేవుడు వచ్చి నివాసము చేయుటకు ఎవ్వరు కూడా యోగ్యుడు కాదు. క్రీస్తు మనలను తన స్వీయ రక్తముచేత కొన్నాడు కనుక అంతరంగమందు నివాసము చేయుట గొప్ప విషయము. ఒకవేళ క్రీస్తు సిలువలో మరణించకుండా ఉండినట్లైతే ఏ మనిషి కూడా పరిశుద్ధాత్మను పొందుకొనుటకు అర్హుడు కాదు. అయితే అతను మరణించి అందరి పాపములను తుడిచివేశాడు. కనుక ఏ సమస్య లేకుండా అందరు కూడా అతని పరిశుద్ధాత్మను పొందుకొనవచ్చు. అతని స్థాయిని దేవుని ముందర తెలుసుకొని, పసచ్చత్తాపపడి, ఒప్పుకొని, మరియు అన్ని అంగీకారములతో తన పాపములను విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు కనుక మన అంతరంగమందు పాపములను బట్టి మరియు అబద్ధములు బట్టి ఒక ఒప్పందములోనికి రాడు. ఈ నిజమైన ఆత్మ కుమారుడిని ఘనపరచి మనలోకి గర్వమును ప్రవేశింపనీయదు. ఎప్పుడైతే నీవు అతని ఉద్దేశమునకు సమర్పించుకొంటావో మరియు క్రీస్తు అనగా దేవుని కుమారుని యందు విశ్వాసము కలిగి ఉంటావో అప్పుడు నీవు ప్రాయశ్చిత్తము పొందుకుంటావు. అప్పుడు నీవు సమాధానపరచబడి పరిశుద్ధపరచబడతావు. నీవు ఎంత ఎక్కువగా క్రీస్తుకు మరియు అతని ప్రేమ కలిగిన ఆత్మకు సమర్పించుకుంటావో అంతే ఎక్కువగా దేవుని శక్తిచేత నింపబడతావు. కనుక పరిశుద్దాత్ముని స్వరమును అడ్డుకోవద్దు, ఎందుకంటె నిన్ను దేవుని స్వరూపముగా మార్చుటకు ఇష్టపడుతున్నాడు. నీవు కనికరము కలిగి ఉండాలని అనుకున్నాడు. నీవు దేవుని రూపమునందు మార్చబడుట అనునది పరిశుద్దాత్మునిచేత పవిత్రీకరించబడుట.

తండ్రి వాగ్దానము కేవలము యూదుల భాగము మాత్రమే కాదు, అయితే ఎవరైతే దేవుని పిలుపును విని,రక్షకునియందు విశ్వాసము కలిగి, మరియు వారి గత చెడును ఒప్పుకొన్నారో అందరికీ భాగమై ఉన్నది. దీనిలో రంగును బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, లేదా జీవిత అనుభవమును బట్టి కానీ లేదు. ఎందుకంటె పరిశుద్ధాత్ముడు తండ్రులను పిల్లలకు, పురుషులు, స్త్రీలు, ధనికులు లేదా బీదవారు అనే వ్యత్యాసము చూపదు. ఎవరైతే పచ్చాత్తాపపడి, క్రీస్తు సిలువను స్వీకరిస్తారో వారిని దేవుడు దత్తత తీసుకొనును. అప్పుడు అతను క్రీస్తును అనగా దేవుని కుమారుడిని సంపూర్ణముగా తెలుసుకొని అందులో పాలుపంచుకుంటారు. ఈ దినమున పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరినీ కూడా క్రీస్తు రక్షణలో రావాలని పిలుచుచున్నది. అతను నిన్ను దేవుని కుటుంబములోనికి వెళ్లుమని ఉచితముగా పిలుస్తున్నది. కనుక ఎవరు వింటున్నారు? ఎవరు వస్తున్నారు? తన పాపములను ఎవరు గుర్తుచేసుకొంటున్నారు? అది ఎవరైతే క్రీస్తు నందు విశ్వసించి అతని సంపూర్ణ శక్తి యందు నమ్మకము ఉంచగలడో?

పేతురు మరియు అపొస్తలులు అందరి కొరకు ఎక్కువగా మాట్లాడిరి, మరియు రక్షణ యొక్క మర్మములను వారికి వివరించిరి. వారి అనుమానాలను తిప్పికొట్టి, వారి చెడు హృదయములను చూపి, దేవుని గొప్ప ప్రేమను వారికి కనపరచిరి. ఈ సమాచారముచేత పరిశుద్ధాత్ముడు వారిని వెలిగించుటకు హేతుబద్ధముగా పిలిచెను. ఎవ్వరు కూడా సరిగా లేరు. అందరు కూడా వంచక మార్గములో నడిచి అంతరంగములో నైతికంగా ఉండిరి. ఈ లోకములో ఎవ్వరు కూడా మంచిగా లేరు. అందరు కూడా అబద్ధికులు,అవినీతిపరులు,మోసముచేవువారు,ద్వేషించువారు,హంతకులు,అసూయపరులు మరియు వ్యక్తిగతమైన స్వార్థపరులు.

పరిశుద్ధాత్ముడు మనలను నిరాశలనుంచి విడుదలనిచ్చును, యేసు క్రీస్తు దగ్గరకు పిలుచును, మరియు మన స్వీయాస్వభావమునుంచి కాపాడును. అతను ఈ లోకమునకు సంస్కరణ చేయదు, అయితే విశ్వాసుల యొక్క అంతరంగమును మార్చును. నీ ప్రవర్తనద్వారా నీకు సంస్కరణ అవసరము లేదు, అయితే రక్షణను బట్టి సంస్కరణ కావాలి. నీవు దేవుని ఉగ్రతకు పాటుగా ఉన్నవాడివి, ఇతరులవలె దూరమైనా వాడివి. అపొస్తలుడైన పేతురు నిన్ను " ఈ హేతుబద్దమైన తరము నుంచి రక్షించబడు" అని పిలుచుచున్నది. అంతేకానీ అతను ఈవిధముగా చెప్పలేదు " సగం రక్షించబడు, సగం హేతుబద్ధముగా ఉండు" లేదా " క్రీస్తుయందు విశ్వాసముంచు, మరియు నీ పాపములయందు కొనసాగు"అని. కాదు! పరిశుద్దాత్మ పెంతేకొస్తు దినమందు ఈ లోకమునకు వచ్చియున్నది. ఎవరైతే క్రీస్తును నిజముగా విశ్వసించి ఉంటారో వారిని క్రీస్తు తన శక్తి చేత రక్షించును. రక్షణ అనునది సిలువలోనే ముగించింది. నీవు క్రీస్తు శక్తిని మరియు అతని ప్రేమను బట్టి విశ్వసించి నిన్ను నీవు అతని కొరకు సమర్పించుకున్నట్లైతే అప్పుడు తన శక్తిచేత నిన్ను నింపును.

క్రైస్తవ సంఘ జన్మదినమందు దాదాపుగా మూడువేలమంది పరిశుద్దాత్ముని స్వరమును విని ఉన్నారు. ఈ విషయమును బట్టి ఏదైతే విద్య లేని పామరుఁడు మరియు చేపలు పట్టు జాలరైనటువంటి పేతురు దీని గురించి చెప్పినప్పుడు ఈ లోకములో ఎంతో మంది ప్రసంగీకులు ఏ విషయమును వారి సేవా పరిచర్యలలో అనుభవించారు.

ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారు త్వరగా పచ్చాత్తాపపడి యేసునందు విశ్వసించిరి, ఎందుకంటె పరిశుద్దాత్మ వారి కన్నులను తెరచి వారి హృదయములను మనసులను వెలిగించింది కనుక. అపొస్తలులు వారికి చింతించుటకు సమయము ఇవ్వకపోవడము ఎంత గొప్ప వింత. లేదా వారిని దేవుని వాక్యముచేత లోతుగా నింపబడలేదు, దానికి బదులుగా, వారు ఏదినమైతే విశ్వసించిరో అప్పుడే వారికి బాప్తీస్మము ఇచ్చిరి. ఈ విశ్వాసము ఒక డ్రామాగా లేదు. పరిశుద్దాత్మ వారి మీద తన శక్తిని కుమ్మరించి వారిమీద తన తీర్పును పెట్టెను. ఈ ప్రసంఘములో పేతురు విశ్వాసమును బట్టి సూత్రాలు చెప్పెను: క్రీస్తు జీవితము, సిలువ, పునరుత్తనము, ప్రభువు పరలోక ఆరోహణము మరియు తండ్రి కుడి చేయి ప్రక్కన కూర్చున్నాడు. పరిశుద్దాత్మ సత్యమును విశ్వాసులకు వివరించెను. ఎవరైతే వీటిని గుర్తించి వాటియందు నమ్మకము ఉంచగలడో వారు క్రీస్తు బాప్తీస్మములో వాటియందు చనిపోవును.

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు నీ పరిశుద్దాత్మ అద్భుతములను బట్టి నిన్ను మేము ఆరాధిస్తున్నాము. మా పాపములన్నిటినీ క్షమించి మమ్ములను పరిశుద్ధపరచినందుకు నీకు కృతజ్ఞతలు. మేము అందరినీ పిలిచి నిన్ను వెంబడించునట్లుగా మమ్ములను నీ సత్యముతో ప్రేమతో మరియు సాత్వికముతో నింపుము. నీవు ప్రతి ఒక్కరినీ రక్షించి నీ పరిశుద్ధాత్మను పొందుటకు అధికారమును ఇచ్చినావు. మేము సమృద్ధి విశ్వాసముచేత నింపబడి, నీలో నివసించి జీవించునట్లు మమ్ములను నడిపింపు.

ప్రశ్న:

  1. పరిశుద్దాత్ముడ్ని పొందుకొనుటకు ఎవరు అర్హుడు? ఎందుకు?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:46 PM | powered by PmWiki (pmwiki-2.3.3)