Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 014 (Peter’s Sermon at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

6. పెంతేకొస్తు దినమందు పేతురు యొక్క ప్రసంగము (అపొస్తలుల 2:14-36)


అపొస్తలుల 2:33-36
33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. 34 దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ 35 ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. 

రక్షణ యొక్క సూత్రాల పరిచయము మరియు వివరణ తరువాత, పేతురు వినువారికి క్రీస్తు అనగా సిలువ వేయబడి మరియు దేవునిచేత లేపబడినవానికీ మరియు నింపబడిన పరిశుద్దాత్మ మధ్యన ఉన్న సంబంధము గూర్చి వారికి చూపెను. క్రొత్త తరము వారికి అతని మరణము మరియు పునర్తనము ఎంతో అవసరమై ఉన్నది, ఎందుకంటె సిలువ లేనిది మరియు పునరుత్తనము లేనిది పరిశుద్ధాత్ముడు రాదు కనుక.

యేసు అధిరోహించి తండ్రి కుడి పార్శ్యమున కూర్చుంది అతనితో సంపూర్ణ ఐక్యత కలిగి ఉండెను. యూదుల ద్వారా తృణీకరింపబడి తిరస్కరింపబడిన వానిని దేవుడు మహిమ పరచాడు. కనుకనే అతను కుమారునికి పరలోకమందును భూమియందును సంస్థ అధికారములను మరియు తండ్రికి ఉన్న వాగ్దానములన్నిటినీ అతనికి యిచ్చియున్నాడు. క్రీస్తు తన పరిశుద్ధాత్మను ఎవరైతే నమ్మకముగా ప్రార్థనయందు ఉన్నారో వారికి పంపెను. మనలను దేవునితో సమాధానపరచాడు కనుక క్రీస్తు పరిశుద్ధాత్మను మనకొరకు పంపెను. అతను మనకొరకు పరిశుద్ధముగా బతిమాలుకొనుచున్నాడు, ఎందుకంటె అతను పరిశుద్ధుడు కావున. కనుక అతని బతిమాలుటకు సాదృశ్యముగా మనకొరకు పరిశుద్ధాత్మను పంపియున్నాడు.

నజరేయుడైన యేసు తప్ప మరియు ఎవరును మనకొరకు దేవునితో బతిమాలు కొనలేరు. ప్రవక్తలు, రాజులు, మరియు మత స్థాపకులు చనిపోయి సమాధిచేయబడినారు లేదా పరలోకములో అబ్రాహాము, మోషే, మరియు ఏలీయా ప్రకారముగా విశ్రాంతిలో ఉన్నారు. అయితే క్రీస్తు మాత్రమే దేవునికి సమీపముగా తీసుకొనబడి అతనితో ఐక్యత కలిగి ఉన్నాడు. అతను తండ్రిలో మరియు తండ్రి అతనిలో ఉన్నారు. పరిశుద్దాత్మ ప్రవచనంలో దావీదు ప్రవక్త తండ్రి మరియు కుమారుని ఐక్యతను చూసాడు. దేవునికి మరియు క్రీస్తు యొక్క మాటలను అతను విన్నాడు. క్రీస్తు పరలోకమునకు వచ్చిన తరువాత తండ్రి అతనికి ఏమి చెప్పాడో కూడా అతను విన్నాడు,అప్పుడు అతను దూతలు అతని చుట్టూ చేరి అతనిని మహిమపరచుచుండిరి. " నీవు మనిషి శరీరమందు శ్రమలను ముగించావు కనుక కూర్చొని విశ్రాంతి తీసుకో. నీవు రక్షణను ముగించావు. ఇప్పుడినుంచి నేను పరిశుద్దాత్మ శక్తిచేత కార్యమును చేయుదును. అతను నా రక్షణను ఎవరైతే ఎదురుచూస్తారో వారికి నింపి మరియు వారికి అన్యాయమును బట్టి తీర్పు తీర్చును.

తీర్పు మనిషీమీదికి పరిశుద్దాత్మ సంతతి ద్వారా రావడము ప్రారంభమైనది. పేతురు ఆత్మ చేత నడిపింపబడి, యూదులను అనగా ఎవరైతే అతనిముందర పాపాలను ఒప్పుకొనక విశ్వసిస్తారో వారిని క్రీస్తు పాదముల క్రింద పడవేయును. ఎవరైతే కన్నీటితో దేవుని కుమారుడిని అంగీకరించారో వారిని ఖండించును. ఈ భయంకరమైన సమాచారం అన్ని దేశస్థులకు కూడా చేనుడును. రకాలైన మతస్థులకు, గుంపులు ఈ తీర్పు చెందును. ఎవరైతే కుమారుడిని స్వీకరించలేదు వారు ఎల్లప్పుడును క్రీస్తు పాదముల క్రింద ఉంటారు.

పేతురు తన ప్రజలకు చెప్పినట్లు, పెంతేకొస్తు దినమునుంచి పరిశుద్దాత్మ ఏ విధమైన ఆటంకము లేకుండా ఈ లోకములో ఉన్న ప్రతి భాగములో ఉండును. క్రీస్తు దేవునికి మరియు మనిషికి ఉన్న విభజనను తీసివేయును. మరియు దైవత్వము కలిగిన ప్రేమ కొనసాగును. కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారిలో రక్షణ అనునది ఈ దినాన తెలుసుకొనును.

బాధ కలిగించే విషయము ఏమిటంటే ఎక్కువమంది యూదులలో నిజమైన ఆత్మ నివాసము చేయబడడము లేదు, ఎందుకంటె పాత నిబంధన గ్రంథమందు వారు మరియు క్రీస్తును చంపి అతని మరణము తరువాత కూడా వారు అతనిని తిరస్కరించి వారి పాపములను ఒప్పుకొంటాము లేదు కనుక ఆత్మ వారిలో ఉండడము లేదు. కనుక పరిశుద్దాత్మ వారితో ఈ విధముగా చెప్తున్నది: " నజరేయుడైన యేసు నూటికి నూరుషార్ధము ప్రభువై ఉన్నాడు, అతను పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి హస్తము దగ్గర కూర్చున్నాడు. అతను నిజమైన దేవుని యొక్క దేవుడై ఉన్నాడు. అభిషేకించబడిన క్రీస్తును మీరు సిలువ వేసిరి. ఈ మాటల ద్వారా అపొస్తలులు యూదులకు చెప్పినది ఏమనగా మీరు వారి చరిత్రను లాగుటలో విఫలము చెందిరి అని. వారు దేవునితో ఉన్న నిబంధనను అపార్థము చేసుకొనిరి. సర్వశక్తుని నామములో పేతురు ఆ దేశస్థులను గాయపరచెను. వారు మనుషుల ద్వారా ఖండించబడలేదు, అయితే నిత్యుడగు వాని ద్వారా ఖండించబడిరి, మరియు వారి మనసులను లోతుగా పొడుచుకొనిరి.

పేతురు యొక్క ప్రారంభపు ప్రసంఘములో కొంత మంది యూదులు శిష్యులను పరిశుద్దాత్మ మత్తులో ఉన్నారని వెక్కిరించిరి. వారికి పేతురు పరిశుద్దాత్మ ద్వారా వివరణ ఇచ్చెను. వారికి పరిశుద్దాత్మ ఎవరు, ఎక్కడినుంచి వచ్చాడు, మరియు రావడానికి గల కారణాలను వారికి వివరించెను. చివరిగా క్రీస్తును చంపుట అనునది వారి దేశమునకు ఒక గొప్ప దోషమని చెప్పెను. ఉదాహరణగా, మనము పరిశుద్దాత్మ రాజీ పాడుతా చూడము, లేకా అసత్యమును సత్యములో ఉండుటకు ఒప్పుకోదు. అతను మన అవిధేయతను ఖండించి, మరియు మన అహంకారమును అణచివేయును. ఒకవేళ నీవు ఈ దినము అతని స్వరము వినినట్లైతే నీ హృదయమును ఖఠినపరచుకోకు.

ప్రార్థన: ఓ తండ్రి నీకు వ్యతిరేకముగా పాపము చేసి నీ కుమారుడిని సిలువ వేసాము. నా పాపముల ద్వారా నేను ఆ సిలువలో నీ చేతులకు మేకులు కొట్టి ఉన్నాను. నా పాపములను క్షమించి నన్ను నీ పరిశుద్దాత్మ చేత పరిశుద్ధ పరచు, అప్పుడు నేను శోధనలోనికి వెళ్ళాక ప్రతి పాపమును తిరస్కరించెదను. యేసు క్రీస్తును నేను ప్రభువుగా మరియు రక్షకునిగా ఒప్పుకొంటాను, మరియు అతని శక్తి కలిగిన ప్రేమ ద్వారా అతని చిత్తమును చేసెదను. ఓ ప్రభువా కఠినమైన ప్రతి హృదయమును కూడా ఎన్నుకొని నీ వైపుకు త్రిప్పి ఒప్పుకొనునట్లు చేయుము. అప్పుడు వారి నలిగినా హృదయము ద్వారా స్వస్థత కలిగి ఉండెదరు.

ప్రశ్న:

  1. క్రీస్తు పరలోకమునకు ఎందుకు కొనిపోబడెను?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:45 PM | powered by PmWiki (pmwiki-2.3.3)