Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 124 (Jesus appears to the disciples with Thomas)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

3. తోమాతో కలిసి యేసు తన శిష్యులకు ప్రత్యక్షమగుట (యోహాను 20:24-29)


యోహాను 20:29
29 యేసు నీవు నన్ను చూచి నమి్మతివి, చూడక నమి్మనవారు ధన్యులని అతనితో చెప్పెను.

తోమా యేసు గాయములను ముట్టుకోన్నాడో లేదా వాటి ఆనవాళ్లు చూసాడా మనకు తెలియదు . ఒకవేళ అతను తన అపనమ్మకమును బట్టి అతని అధైర్యమును బట్టి సిగ్గుపడిన వాడుగా ఉండునేమో. యేసు తోమాను వచ్చి చూసి విశ్వసించుమని చెప్పి ఉండెను, అయితే చూడక అతని యందు విశ్వాసము కలిగి ఉండాలని యేసు ఉద్దేశమై ఉన్నది. కనుక ఎవరైతే కళలను మరియు దర్శనములను గూర్చి ఇష్టపడి అవి జరిగించబడతాయని అనుకున్నట్లైతే అతను తన విశ్వాసములో ప్రారంభ స్థానములో ఉన్నాడని అనుకోవాలి. అయినప్పటికీ క్రీస్తు తన శిష్యులకు చాలాసార్లు ప్రత్యక్షమై వారి విశ్వాసములను బలపరచుటకు ఉద్దేశించెను.

ఎవరైతే చూడక విశ్వసించారో వారు యేసు ద్వారా ఆశీర్వదించబడి సంతోషమును కనుగొనువారుగా ఉంటారు. కనుక నిమమైన విశ్వాసము గొప్ప కార్యములను చూడును. దేవుని మాటయందు మనిషి నమ్మకము చాల ప్రాముఖ్యమైనది.

క్రీస్తు ప్రత్యక్షత మరియు అతని ప్రచారమును అపొస్తలులు తీసుకొని వాటి ప్రకారము ప్రకటించి అతని శిష్యులుగా చేస్తున్నారు. యేసు యొక్క పునరుత్థానము అనునది ఈ దినాలలో విశ్వాసులకు ఒక నూతన నడిపింపుగా ఉన్నది. మన విశ్వాసము అనునది ఒక ఆలోచన మాత్రమే కాదు అయితే మన బంధము క్రీస్తుతో పాటు లేచినది. కనుక ఈ దినాలలో ఎంతో మంది క్రీస్తును చూడక అతని వాక్యము చేత విశ్వసిస్తున్నారు కనుక వారందరు కూడా నిత్యా జీవములోనికి ప్రవేశించువారుగా ఉంటారు.

చాల మంది క్రైస్తవులు తమ కార్యములను మరియు తమ బంధువులను దూరము చేసుకొంటారు. వారికి యేసు వాక్యమును బట్టి విశ్వాసము ఉంటుంది. కనుక ఎవరైతే అతని వాక్యముచేత విశ్వసించబడుతారో వారికి ఖచ్చితముగా క్రీస్తు బహుమానమును దయచేయును . కనుక విశ్వాసము అనునది మనలను క్రీస్తు దగ్గరకు నడిపించును , ఎందుకంటె అతను మన రక్షకుడు కనుక .

ప్రార్థన: యేసు మీరు నిజమైన విశ్వాసమునకు కర్త. మీరు మమ్ములను ప్రేమించుచున్నారు కనుక మీరు మమ్ములను నడిపించువారు. ఇప్పుడు మీరు నన్ను రక్షించినందుకు మరియు మా స్నేహితులను కూడా రక్షించబోతున్నందుకు మాకందరికీ నిత్యజీవమును దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్న:

  1. చూడక నమ్మినవారిని బట్టి యేసు ఎందుకు "ఆశీర్వదించబడిన" వారు అని చెప్పెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:42 PM | powered by PmWiki (pmwiki-2.3.3)