Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 121 (Jesus appears to the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

2. యేసు శిష్యులకు మీద గదిలో ప్రత్యక్షమగుట (యోహాను 20:19-23)


యోహాను 20:21
21 అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

" మీకు సమాధానము కలుగును గాక" అనే పదమును క్రీస్తు చెప్పినప్పుడు, వారి పాపములను క్షమించు ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఈ లోకములో అందరి యెడల సమాధానము కలిగి ఉండుమని చెప్పుటకు ఈ మాటను యేసు పదే పదే చెప్పెను. సిలువ మీద యేసు మనుషులందరి పాపములను క్షమించెను. కనుక ఇది దోషులకు ఒక వాగ్దానముగా, విశ్వాసులకు ఒక న్యాయముగా, మరియు నశించిపోతున్నవారికి ఒక నిరీక్షణగా ఉన్నది. కనుకనే యేసు ఈ లోకమునకు సమాధాన సువార్తను పంపుటకు తన శిష్యులను పంపెను .

ఎవరైతే దేవుని కృపచేత రక్షింపబడినారో వారు సంపూర్ణముగా మార్చబడి ఇతరులను దేవుడు ఏవిధముగా క్షమించాడా అలాగునే మనము కూడా క్షమించాలి. అందుకే యేసు ఈ విధమైన స్వభావమును ఇచ్చుటకు మనలను మార్చ గలడు. అప్పుడు అతను తన పరలోక సన్నిధిని మన మధ్యన ఉంచును, " సమాధాన పరచు వారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు". మన ముఖ్య సువార్త ఉద్దేశము ఈ లోక పరిస్థితులను మార్చుటకు కాదు; అయితే జీవితములు మార్చబడునట్లు ప్రార్థించి, రాతిలాంటి గుండె మెత్తని గుండె లాగ మార్చ బడుటకు సువార్త చెప్తున్నాము. కనుక ఈ విధమైన మార్పు ద్వారా ఈ లోకమును మనము స్వాధీనపరచుకోగలము.

యేసు తన పరిచర్యలు ద్వారా శిష్యులను బలపరచెను, " నా తండ్రి నన్ను పంపినట్లు , నేను మిమ్ములను పంపుదును." కనుక దేవుడు తన కుమారుడిని ఏవిధముగా పంపెను ? మొదటిది, ఒక కుమారునిగా , రెండవది, దేవుని తండ్రిత్వముం ప్రకటించుటకు, మరియు అతని పరిశుద్దతను కార్యముల ద్వారా మరియు ప్రార్థన ద్వారా . మూడవది, యేసు దేవుని వాక్యమై ఉన్నాడు, నిత్యా ప్రేమను బయలు పరచువాడై ఉన్నాడు. కనుక ఈ ఉద్దేశములలో మనము యేసు యొక్క సువార్త గురిని కనుగొనగలం. కనుక యేసు తన మరణముతో మనలను పరిశుద్ధులునుగా చేసి నిందారహితులుగా చేసి ప్రేమచేత తన పిల్లలుగా చేసెను.

క్రైస్తవులు నీతికి, ప్రేమకు మరియు మార్పుకు, పరలోకపు తండ్రికి క్రీస్తు రాయబారులుగా ఉన్నారు. కనుక తండ్రి కుమారుని మరణము ద్వారా మనలను అతని పిల్లలుగా చేసి ఉన్నాడు. సిలువ ఒక నూతన క్రియకు మరియు విశ్వాసము ఒక దత్తతకు సాదృశ్యముగా ఉన్నది.

యేసు ఏవిధముగా అయితే త్యాగమైన మరణము పొందుటకు జన్మించినాడో అదేవిధముగా తన శిష్యులు కూడా త్యాగము చేయుటకు జీవించి ఉన్నారు. వారు సర్వశక్తుడైన యేసుకు శిష్యులుగా ఉండుటకు ఉద్దేశించారు తప్ప వారికి వారి ఘనత కొరకు జీవించలేదు. కనుక వారు వారి ప్రభువును ఉన్నతమైన స్థలములలో ఉండునట్లు గా అతని యెడల ప్రేమ కలిగి ఉన్నారు.

ప్రార్థన: ప్రభువా మమ్ములను మీ మహిమార్థముగా నిన్ను ఘనపరచుటకు సేవించుటకు మరియు కృపాకలిగి ఉండుటకు పిలిచి ఉన్నావు. మా పాపములకు క్షమించి నందుకు నీకు కృతజ్ఞతలు. మమ్ములను ఇతరులకు ఒక వెలుగుగా ఉంచి వారిని కూడా వెలిగించుటకు మమ్ములను పిలిచి ఉన్నావు. ప్రభువా మమ్ములను నీవు ప్రేమ కలిగిన పిల్లలుగా చేసి మేము కూడా ఇతరుల పట్ల ప్రేమకలిగి ఉండునట్లు చేసి నావు.

ప్రశ్న:

  1. శిష్యులను పంపుటలో ఉన్న వింత ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:40 PM | powered by PmWiki (pmwiki-2.3.3)