Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 043 (Jesus offers people the choice)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

4. అంగీకరించు లేదా తిరస్కరించు " అనే అవకాశమును యేసు వారికి కల్పించెను !" (యోహాను 6:22-59)


యోహాను 6:34-35
34 కావున వారు ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి. 35 అందుకు యేసు వారితో ఇట్లనెను - ''జీవాహారము నేనే;నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

యేసు వారు దేవుని కొరకు ఆకలిగొనినట్లుగా చూసి , వారి కార్యములను బట్టి వారిని విడిపించెను. వారు రక్షింపబడునట్లు వారిని సిద్ధపరచి, దేవుని బహుమానమును కూడా పొందుటకు సిద్ధపరచెను; విశ్వాసమునకు ఏది అవసరమో కూడా వారికి వివరించెను.

అప్పుడు అక్కడున్న వారు అంగీకరించి, " ఈ నరకమునుంచి మమ్ములను రక్షించుటకు నీ విలువైన రొట్టెను మాకు దయచేసి నీ బహుమానములను ఎల్లప్పుడూ మాకు దయచేయుము. మేము నీ మీద ఆధారపడినట్లుగా మాకు నీ నిత్యజీవముతో నింపుము, నీ శక్తిని మాకు దయచేయుము" అప్పటికీ వారు ఇంకనూ ఈ లోక ఆహారమును బట్టియే ఆలోచన చేసిరి అయితే తరువాత ఇది దేవుని బహుమానమని అంగీకరించిరి.

యేసు తన దగ్గరకి రావాలని అనుకొనలేదు అయితే అతనే ఈ లోకమునకు దేవుని గొప్ప బహుమానమైన ఆహారమని వారికి క్లుప్తముగా చెప్పెను, అయితే ఈ లోక మిచ్చే ఆహారము కాదు. అయితే అతని యందె మనకు నిత్యా జీవమును దయచేసియున్నాడు. " నా ద్వారా కాక నీవు నిత్యజీవమును పొందుకొనలేవు. నేను నీకు దేవుని బహుమానమై ఉన్నాను; నేను లేకపోతే నీవు మరణమునకు వెళ్లుదువు".

నీవు శక్తి కలిగి ఉండునట్లు నా ఆహారమును నీవు పొందుకున్నప్పుడు నీ హృదయము మరియు నీ మనసు మరి నీవు ఆత్మీయముగా జీవించెదవు. ఎందుకంటె నేను లేక నీవు ఏమి చేయలేవు కాబట్టి. నేను నీకు ప్రతి దినము అవసర కనుక నన్ను నేను నీకు ఉచితముగా ఇచ్చుకొందును. అయితే దీనికి నీవు ఏమి ఇవ్వనవసరము లేదు అయితే నేను నీ హృదయములోనికి వచ్చుటకు నీవు నీ హృదయమును తెరువుము." సహోదరుడా, నీకు క్రీస్తు అవసరము. ఆయన వాక్యము చదువుట మాత్రమే నీకు మంచిది కాదు అయితే నీ జీవితములోనికి ఆయన వ్యక్తిగతముగా రావాలి. నీకు ప్రతి దినము ఆహారము మరియు నీరు ఎలా అవసరమో అదేవిధముగా ఆయన కూడా నీకు అనుదినము అవసరమై ఉన్నాడు, ఎందుకంటె అతను లేకుంటే నీవు నశించి పోతావు కనుక.

నీవు అనుకొనవచ్చు అతను నా లోనికి ఏవిధముగా ప్రవేశిస్తాడు అని ? అందుకే : నీ హృదయము నా కొరకు ఆశకలిగి ఉండనిమ్ము, నా దగ్గరకు వచ్చి నన్ను కృతజ్ఞతతో తీసుకో, నన్ను నమ్ము. క్రీస్తు మన హృదయములోనికి రావడము అనునది విశ్వాసము ద్వారా జరుగునదిగా ఉన్నది. యేసు నీకు దేవుని బహుమానంగా ఉన్నాడు కనుక దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉండు, ఎందుకంటె తన్నుతాను నీ కొరకు ఉచితముగా సమర్పించుకున్నాడు కనుక. ఎందుకంటె అతను నీలో ఉండుటకు సిద్ధముగా ఉన్నాడు. నీలో నిత్యమూ అతను ఉండాలని నీవు ఆశించినట్లైతే అతను వచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు.

అప్పుడు యేసు నీకు , " నీవు నన్ను పొందుకొనియున్నావు కనుక నేను నీలో ఉండి, నీ ఆకలిని తీర్చెదను. ఈ లోక మతాలను గూర్చి చర్చించాక సత్యముగా ఉండుము. ప్రతి ఒక్కరు త్రాగునట్లుగా ఉండక , అయితే నేను నీకు శక్తిని మరియు సమాధానమును నీకు దయచేసెదను."

యోహాను 6:36-40
36 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. 37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు;నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును. 38 నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు;నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. 39 "ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది." 40 కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
''

యేసు గలీలాయులకు ఉచితముగా ఆహారమును యిచ్చియున్నాడు. వారు ఆయన ప్రతి అధికారమును బట్టి తెలుసుకొన్నారు. అయితే వారి మార్పు వారిని విశ్వాసములోనికి మార్చలేదు. అందుకే వారు ఇంకా మునుపటివలెనే ఉండిరి. వారు యేసును ఆహార ప్రభువని యెంచిరి , అయితే అతని మీద విససముంచుటకు వెనకాడిరి. అతనిని కృతజ్ఞతతో అంగీకరించలేదు.

వారు క్రీస్తు నుంచి వేరుపరచడము బట్టి యేసు వారికి క్లుప్తముగా బోధించెను. ఎందుకంటె అనేకులు ఆయనయందు విశ్వసించలేదు ? అయితే యేసు ," ఇది నీ తప్పిదమే " అయితే విశ్వాసం ఏవిధముగా కట్టబెడుతుందో వారికి వివరించెను.

యేసు ఏ ఒక్కరిని కూడా ఏదో ఒక మాయ చేత లేదా చర్చలచేత మార్చాలను కోలేదు; అయితే ఇది కేవలము దేవుని బహుమానము పాపులను సర్వసత్యములోనికి పిలిచి వారిని పశ్చత్తాపములోనికి నడిపించేది.ఎవరిఅతే ఆత్మద్వారా నింపబడతారో వారు మాత్రమే క్రీస్తును మహిమపరచగలరు. యేసు అబద్ధికులను బట్టి లేదా వేశ్యలను బట్టి అసహ్య పడలేదు అయితే వారు క్రీస్తు కొరకు ఆశకలిగి ఉన్నారు. ఎవరైతే అయన దగ్గరకు వచ్చారో వారిని క్రీస్తు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు మరియు శత్రువులను కూడా వ్యతిరేకించలేదు. వారి పట్ల కనికరము కలిగి ఉంది వారికి తన రక్షణను దయచేసియున్నాడు.

క్రీస్తు తన కొరకు ఎన్నడూకూడా జీవించలేడు మరియు అతను ఎప్పుడు కూడా తన ఆలోచన ప్రకారముగా లేడు. అయితే అతను ఈ లోకమునకు వచ్చినది తన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు చేయుటకు మరియు తన ఉద్దేశము యొక్క ప్రేమను కనపరచుటకు వచ్చియున్నాడు. అందుకే అతని రక్షించే గుణము గొప్పది. కనుక పాపము, సాతాను, మరియు మరణము అతని హస్తములనుంచి వేరుపరచదు. క్రీస్తు కృపలో ఉన్నవారిని తీర్పుదినమునుండి వారిని నిత్యజీవములోనికి నడిపించును .

దేవుని చిత్తము నీకు తెలుసా ? ఎందుకంటె నీవు అతని కుమారుని వైపు చూడాలని ఆశకలిగి ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలని కోరుతున్నాడు. అతను ఆత్మ ద్వారా జన్మించి కృప ద్వారా మరియు సత్యము ద్వారా హింపబడి ఉన్నాడు. నిత్యమూ ఉండునట్లు నీవు రక్షకునితో కలిసి నీతోటి విశ్వాసులను కూడా నిత్యజీవములోనికి వచ్చునట్లు నీవు పాటుపడాలి. అప్పుడు నీ విషయములో దేవుని గురి జరిగించబడుతుంది. నిత్యజీవము అనునది ఒకనికి కేవలము పరిశుద్దాత్మ ద్వారానే కలుగుతుంది. అయితే ఈ నిత్యజీవములో నీకు సమాధానము, ఆనందము, ప్రేమ మరియు తగ్గింపుస్వభావము నీకు కలుగుతుంది. దేవుని ప్రేమ నీలో ముగింపు లేనిది. దేవుని చిత్తము నీ చివరి విషయములో అనునది నిన్ను మరణము నుంచి తిరిగి లేపుటే. ఇదే విశ్వాసుల యొక్క ప్రథమ కర్తవ్యము మరియు వారు కుమారుడైన యేసు ప్రేమలో నిత్యమూ ఉండుటే.

ప్రార్థన: తండ్రి కుమారుడు పరిశుద్దాత్ముడైన దేవుడా మిమ్ములను మేము ఆరాధిస్తున్నాము. నీవు మా నుంచి దూరముగా లేవు అయితే నిన్ను అనేకులు ద్వేషించినపుడు మా కొరకు వచ్చియున్నావు. మేము నిన్ను చూచుటకు మరియు నీవిచ్చు రొట్టెను తినుటకు నీవు మాకు దయచేసి కృపను బట్టి నీకు కృతఙ్ఞతలు. మమ్ములను తిరస్కరించనందుకు నీకు కృతఙ్ఞతలు. నీవు ఆకలిగొనినీ మా ప్రాణములను తృప్తిపరచి మమ్ములను నిత్యజీవములోనికి వచ్చుటకు పైకి పెనినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్న:

  1. "జీవాహారము" అనగా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)