Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 075 (The Jewish council sentences Jesus to death)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
4. లాజరును లేపుట (యోహాను 10:40 - 11:54)

d) యూదుల సంఘము యేసును చంపుమని చెప్పిన తీర్పు (యోహాను 11:45-54)


యోహాను 11:45
45 కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని

లాజరు తన మరణము తరువాత తినుటను గూర్చి త్రాగుటను గూర్చి మాట్లాడినాడు. ప్రజలు లాజరును అతను వేళ్ళు మార్గములో మరియు అతని ఇంటిలో కలుసుకున్నారు. ఈ కార్యము ద్వారా వ్హాలమంది ఆశ్చర్యపడి యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసము కలిగి ఉండిరి. అప్పడు శిష్యులు అధికమై మరియా దగ్గరకు పరిగెత్తి యేసును లాజరుతో సాక్ష్యము చెప్పిరి. వారు లాజరును చూచుటకు వచ్చిరి కానీ యేసును నమ్మక తిరిగి వెళ్లిరి.

యోహాను 11:46-48
46 వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. 47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. 48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

వారిలో ఉన్న కొందరు ఈ కార్యమును చూసి పరిసయ్యులదగ్గరకు పరుగెత్తికొని వెళ్లి యేసు ద్వారా జరిగిన కార్యమును చెప్పిరి. వారు ఆ సమయములో ఇంకను అవిశ్వాసులుగా ఉండిరి కనుక వారికి " ధనవంతుడు" అనే ఉపమానము సరిపోయెను, ఎందుకంటె వారు అబ్రాహాము చెప్పినట్లు, " ఒక వేళా వారు మోషేను వినక మరియు ప్రవక్తలను కూడా వినరు " (లూకా 16:31). బండలాంటి హృదయము కలిగిన వారు దేవుని ఆత్మను నమ్ముటలో చాలా కష్టము కలుగును అలాంటి వారికి ఏవిధమైన అద్భుతములు చేసినను విశ్వాసములోనికి రారు.

పరిసయ్యులు మతసంబంధమైన విషయములలో అధిక విశ్వాసము కలదు. యాజకులు వారికి బలవంతపు జీవితము ఇచ్చిరి. కనుకనే దాదాపుగా 70 మంది ఈ విషయమై చర్చించుటకు పూనుకొనిరి. క్రీస్తు పునరుత్థానమును వ్యతిరేకించిన సద్దూకయ్యులు ఆ సంఘపు పెద్దలను ఆహ్వానించిరి. ఆ సంఘపు సభ్యలు యేసును పట్టుకొనుటకు సందేహించిరి, ఎందుకంటె క్రీస్తులో వారు ఏ దోషమును కూడా చూడలేదు కనుక. అయితే ఆ సమయములో పస్కాపండుగ వచ్చెను కనుక ఆ పండుగకు అనేకమంది ఆ పట్టణమునకు వచ్చిరి. ఆ సందర్భములో వారు క్రీస్తును ఒక సభ్యునిగా లేకా దేవుని కుమారునిక్గా లేక ప్రవక్తగా కూడా సంబోదించలేదు. మరియు వారు అతని అద్భుతములను కూడా నమ్మక పోయిరి.

ఈ సమయములో అక్కడ పరిస్థితి ఆ సంఘపువారికి ఈ విషయము ఒక బలము కలిగి ఉండెను. అక్కడున్న అనేకులా మధ్యలో అద్భుతములు చేసిన యేసు ఒక మెస్సయ్యగా ఉంది కూడా వ్యతిరేకుల మధ్యన ఉండెను. ఆ సమయములో రోమీయులు దేవుని నివాస స్థలమును పాలముచేసిరి. అప్పుడు ఆ దేవాలయములో ప్రార్థనలు మరియు త్యాగములు మరియు ఆశీర్వాదములు ప్రారంభమాయెను.

యోహాను 11:49-52
49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు. 50 మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. 51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక 52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.

ఆ సమయములో సంఘములో గందరగోళం ఉన్నప్పుడు ఖైపాస్ అనే యాజకుడు నిలిచి ఆ దేశపు పెద్దల మీద పడెను, వారి అజ్ఞానమును బట్టి అనాలోచనను బట్టి వారిమీద పడెను. అతను చెప్పిన దానిలో కొంత మేరకు నిజాము ఉన్నది, ఎందుకంటె అతను ఆ సంఘమునకు నాయకునిగా ఉండెను కనుక. అతను పరిశుద్ధతకు సాదృశ్యమైన నూనెతో అభిషేకించబడ్డాడు అయితే అతను అంత్యక్రీస్రు. అతను పరిశుద్దాత్మ చేత నింపబడి మరియు దేవుడు అతని ద్వారా ఆ దేశమునకు తన స్వరమును వినిపించునని అనుకొనెను. అయితే అతను అసత్యంలో నడిచినవాడుగా ఉండెను.

ఖైపాస్ మాట్లాడిన మాటలు అప్పటికప్పుడు కనపడెను, ఎందుకంటె సాతానుడే అతని ద్వారా మాట్లాడేను కనుక అయితే ఉద్దేశముగా దేవుని ఆజ్ఞచేత మాట్లాడాలి అయితే సాతాను ద్వారా మాట్లాడేను. యేసు గొర్రెపిల్ల వారికి బదులుగా చనిపోవుట మేలు, ఎందుకంటె వారు దేవుని ఉగ్రతనుంచి తప్పించుకొనబడి నిత్యజీవమును పొందుకొంటారు కనుక. అయితే సాతాను ఆత్మకలవారు ఈవిధమైన స్వరమును కలిగి ఉంటారు, " రోమీయులనుంచి మనలను రక్షించుటకు యేసు చనిపోవుట మంచిది " అని. ఈ విధమైన మాటలకూ క్రీస్తు నిజాన్ని చూపెను, ఎందుకంటె సాతానుడు మోసమునకు మరియు అబద్ధమునకు తండ్రి అయినాడు కనుక .

ఈ విధమైన సాతాను ఆత్మను యోహాను చూసినతర్వాత కైపస్సు చెడును చూపి సత్యమును పరిపూర్ణముగా తెలుసుకొనలేక పోయెను.కైపస్సు యేసు మరణము అందరిని విమోచిస్తున్నాడని చెప్పుటకు ఉండెను అయితే అతని "అధికారపు" మాటలను పట్టించుకొనలేదు. ఎందుకంటె అతను యేసును విశ్వసించలేదు కనుక అజ్ఞానము కలిగినవానిగా ఉండెను పరిశుద్ధాత్ముడు క్రీస్తు మరణమును అర్థము చేసుకోనున్నట్లు చేసెను.

యోహాను ఈ లోకములో రక్షణను గూర్చిన అర్థమును కనుగొనియుండెను.యేసు అతని విశ్వాసుల కొరకు మాత్రమే చనిపోలేదు అయితే లోకములో ఉండు ప్రతి ఒక్కరికొరకు చనిపోయెను. ఎవరైతే అతని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు అతని పిల్లలు, కనుక ఆ విశ్వాసము ద్వారా వారు నిత్యజీవమును పొందుకుంటారు.

మన విశ్వాసము యొక్క గురి కేవలము రక్షణను బట్టి మాత్రమే కాదు అయితే దేవుని పిల్లలతో మంచి ఐక్యత కలిగి ఉండటమే. అతని ప్రేమ క్రైస్తత్వమునకు ఒక బలము. అతని నామము ఐక్యతను ఇస్తున్నది. ఎప్పుడైతే ఒకరు ఐక్యత కలిగి ఉండాలని అనుకొంటారో అప్పుడు అందరు కూడా ఐక్యత కలిగి ఉండెదరు. కనుక మనము లేచి అందరమూ సహోదర ప్రేమకలిగి ఉంది దేవుని కుటుంబములో ఉందాము.

యోహాను 11:53-54
53 ​కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి. 54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

సంఘములో ఉన్న కొందరు సభ్యలు కైపసు యొక్క మాటలను బట్టి తొందరపడ్డారు, అయితే చాల మంది అతనిని అభినందించారు. ఎందుకంటె దేవుడే అతని ద్వారా అందరితో మాట్లాడినాడని విశ్వసించిరి. కనుక సంఘములో ఉన్నవారు కైపసు యొక్క మాటలను సమర్థించి యేసును విడిచిపెట్టిరి. అయితే ఎంతో మందికి ఎన్నో విధాలా అనుమానాలు ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా వ్యతిరేకముగా మాట్లాడలేదు. కైపసు వారిని క్రీస్తును చంపుటలో వ్యతిరేకమైన భావనలోనికి నడిపించి ప్రజలందరినీ భంగములోనికి వెళ్లకుండా కాపాడెను. Jesus heard of this plot, and perhaps was aware of it by divine insight. He left the area of the Council’s jurisdiction and went to the area of the Jordan valley east of Nablus, waiting there with his disciples for the hour of his sacrifice and rising.

అప్పుడు యుద్ధ ప్రదేశము ఖాళీ ఆయెను. అతని చర్చ యాజకులతో , దేవాలయములో చేసినది, మరియు సబ్బాతు దినమందు స్వస్థత చేసినది మరియు చనిపోయిన లాజరును లేపినది ఇవన్నీ కూడా యేసును చంపుటకు అవకాశమును ఇవ్వలేక పోయినవి.

వెలుగు చీకటిలో ప్రకాశించెను, చీకటి దానిని జయించలేక పోయెను.

ప్రియా సహోదరుడా , నీవు క్రీస్తు వెలుగుని చూసావా ? అతని సువార్త నీ మనసుని మరియు నీ హృదయమును కాంతివంతముగా చేసి ఉన్నదా ? అతని నిత్యజీవము నీమీద వచ్చి, అతని ఆత్మ నిన్ను పసచ్చత్తాపములోనికి నడిపించి, నిన్ను పరిశుద్ధునిగా చేయుటకు ఆశీర్వదించినదా ? నిన్ను నీవు తెరచినట్లైతే పరిశుద్ధాత్ముడు వచ్చి, నీ జీవితమును అతని కొరకు మార్చును, అప్పుడు నీవు క్రీస్తు షత్రువులతో పాటు తీర్పులోనికి రావు. బదులుగా అతని శిష్యులతో కలిసి అతని పరిశుద్దతను పొంది " మేము అతని మహిమను చూసి, మరియు అతని ఏకైక కుమారుని మహిమను చూసాము, అది సంపూర్ణ కృపతో మరియు సత్యముతో నింపబడి ఉన్నది. "

ప్రార్థన: ప్రభువా కష్టములొ సత్యమును విడువక ఉన్నందుకు కృతజ్ఞతలు ; నీవు ఎల్లప్పుడూ నీ పరలోక తండ్రిని ఘనపరచినావు. మా బలహీనతను మరియు నిర్లక్ష్యమును క్షమించు. నిన్ను విడువక సేవుంచునట్లు మాకు దగ్గరగా వచ్చి నిత్యజీవమును దయచేయుము. నీ ఘనత కొరకు మమ్ములను స్వీకరించు.

ప్రశ్న:

  1. యూదుల సంఘము క్రీస్తును ఎందుకు చంపాలనుకొన్నారు ?

క్విజ్ - 4

ప్రియా చదువరి 15 మరియు 17 వ ప్రశ్నలకు సరి అయినా సమాధానములను పంపుము. అప్పుడు మేము ఈ పత్రికలను మీకు పంపెదము

  1. అబ్రాహాము పిల్లలు కాదని యూదులను బట్టి ఏవిధముగా క్రీస్తు చెప్పెను ?
  2. సాతాను యొక్క గుణములను యేసు ఎలా చెప్పెను ?
  3. యూదులు క్రీస్తును ఎందుకు రాళ్లతో కొట్టాలనుకొన్నారు ?
  4. పుట్టు గ్రుడ్డివానిని యేసు ఎందుకు స్వస్థత పరచెను ?
  5. పుట్టుకతో గ్రుడ్డివాడిని స్వస్థ పరచుట యూదులు ఎందుకు తిరస్కరించిరి ?
  6. యెవ్వనస్తుడు చర్చల సమయములో ఎందుకు తెలుసుకొన్నాడు ?
  7. యేసు ముందర తలను దింపుతా దేనికి సాదృశ్యము ?
  8. యేసు తన గొర్రెలకు ఏవిధమైన ఆశీర్వాదమును కుమ్మరించును ?
  9. యేసు ఎలా మంచి కాపరి అయ్యాడు ?
  10. క్రీస్తు తన గొర్రెలను ఎలా నడిపించును ?
  11. యేసు ఏవిధముగా అతని దైవత్వమును చూపెను ?
  12. లాజరు చనిపోయినను యేసు దేవుని మహిమను ఎందుకు మాట్లాడినాడు ?
  13. లాజరును కాపాడుటకు యేసు ఎందుకు ముందుకు వచ్చాడు ?
  14. ఈ దినాలలో మనము ఏవిధముగా మరణము నుండి లేవగలము ?
  15. యేసు ఎందుకు తొందరపడి ఏడ్చాడు ?
  16. లాజరు తిరిగి లేచుటలో క్రీస్తు మహిమ ఏవిధముగా కనపడినది ?
  17. యూదుల సంఘము క్రీస్తును ఎందుకు చంపాలనుకొన్నారు ?

నీ పూర్తి పేరును మరియు చిరునామాను వ్రాయడము జ్ఞాపకము చేసుకొని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము. ఈ క్రింది చిరునామాకు పంపగలరు:

Waters of Life
P.O.Box 600 513
70305 Stuttgart
Germany

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:28 AM | powered by PmWiki (pmwiki-2.3.3)