Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 023 (The Revelation of the Righteousness of God)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)

1. క్రీస్తు మరణము ద్వారా కలిగిన దేవుని నీతి (రోమీయులకు 3:21-26)


రోమీయులకు 3:21-24
21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు. 

నీవు పాపాత్ముడవా? ఈ ప్రశ్న కేవలము పాపులకు మాత్రమే వేయబడినది, ఎందుకంటె మునుపు వారి కార్యములద్వారా మరియు వారి రక్తముద్వారా మరియు వారి ప్రవర్తన ద్వారా వారు పాపులు కనుక. కనుక మీ ముందర చెప్పబడినటువంటి దేవుని తీర్పు ఇచ్చు సువర్తను వినుటకు రండి.

పాపులైన,భక్తి కలిగిన వారైనా, ఎన్నుకొనబడిన వారైనా, తప్పించుకొనబడినవారైనా, ఆచార సంబడఁదమైన, ముసలివారైనా, ప్రాయము కలిగిన వారైనా అందరు కూడా వారి వారి మనసులచేత పాపులని పౌలు వారందరికీ చెప్తున్నాడు.

ఎవరైతే దేవుని యొక్క నిజమైన మహిమతో ఆశీర్వదించబడినారో వారు ధన్యులు. మనము సృష్టిలో చేయబడిన దేవుని రూపమును కోల్పోయాము. నీ చేదు స్వభావమును బట్టి నీవు కన్నీళ్లు కార్చుచున్నావా?

దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రమును ఒకవేళ మనము నిందించినట్లైతే దాని విషయమై మనకు దేవుని సమాధానము ఏమిటి? చేదు పాపములు చేస్తున్న వారికి బట్టి దేవుని తీర్పు ఏమిటి? నీకు మరియు నాకు దేవుని నీతి కలిగిన న్యాయతీర్పు ఏమిటి?

దేవుని యొక్క మహిమ గల మాటలు ఈ భూమి మీద ఉన్న వారికి అనగా మృతులైన వారికి మరియు జీవము కలిగిన వారికి పరలోకమునుండి దేవుని మాటలు వచ్చుట: అందరు కూడా సమాధానపడి ఉన్నారు! కనుక మన మనసు చెప్పినట్టు: "అది అసాధ్యము"! అని, అప్పుడు సాతానుడు: "లేదు!" అయితే దేవుని ఆత్మ నిన్ను ఓదార్చుతుంది, మరియు ఈ లోక పాపములకు తీసివేసిన దేవుని గొర్రెపిల్ల చెప్పినట్లు. దేవుడు మనందరి బదులుగా తన కుమారుడిని శిక్షించి ఉన్నాడు. చెందిన వారిని పరిశుద్ధ పరచుటకు దేవుని తన కుమారుడిని శిక్షించి ఉన్నాడు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించునట్లుగా దేవుడు క్రీస్తు తన శరీరమును నాలుగగొట్టబడుటకు నడిపించెను. కనుక నీవు ఇప్పుడు విమోచించబడి ఉన్నావు. ఇప్పుడు నీ మీద పాపమునకు కానీ లేక సాతానుకు కానీ ఏ విధమైన అధికారాలు లేదు. నీవు ఇప్పుడు ఏమి తెలియని వాడవు మరియు దేవుని ద్వారా నిరంతరము అంగీకరించబడినవాడవు.

నీవు నిజముగా దీనిని నమ్ముతున్నావా, నీవు నమ్మకముగా దేవుని సువార్తను అంగీకరిస్తున్నావా? నీవు ఒకవేళ అద్దము ఎదురుగా నిలబడినట్లైతే నిన్ను నీవు చూసేడవు అప్పుడు క్రొత్తదనమును గమనించెదవు. అప్పుడు నీవు కృతజ్ఞత కలిగిన ఆనందమును చూసేడవు, ఎందుకంటె నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక, మరియు నీ పాపములకొరకు అతను చనిపోయి ఉన్నాడు కనుక. నీవు ఈ సత్యమును అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ లోకమునకు సంబందించిన విమోచనము క్రీస్తు ద్వారా కలిగి ఉన్నది కనుక మరల యేసు ఆ సిలువపై ఈ లోక పాప విషయమై తిరిగి మరణించవలసిన అవసరము లేదు. ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడెదరు, మరియు ఎవరైతే రక్షణ విషయమై నిర్లక్ష్యము కలిగి ఉంటారో వారు ఖండించబడతారు. అయితే నీ విశ్వాసమే నిన్ను రక్షించును.

ప్రతి ఒక్కరు తమ చెడుతనమును బట్టి ఖండించబడాలి అయితే దేవుడు వారందరికొరకు విమోచన చేసి, అతని నిత్యా జీవితములో నివసించుటకు వారందరికీ అవకాశము ఇచ్చి ఉన్నాడు. ఈ విధమైన కృప ఈ లోకములో ఎక్కడ ఏ మతములో కూడా మనకు కనపడదు. ఇది కేవలము సువార్తలో మాత్రమే మనకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ ప్రతి మనిషిని రక్షించును; పెద్దలనేమి, పిల్లలనేమి, ధనికులనేమి, దరిద్రులనేమి,అందరినీ యేసు విమోచించి ఉన్నాడు. కనుక ఎంతకాలము నీవు ఈ కృపను బట్టి మౌనముగా ఉంటావు? వచ్చి నీ స్నేహితులను పిలువు ఎందుకంటె అధికారము గల సువార్త ప్రకారముగా వారు ఉన్నారు. కనుక వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించుటకు పరిగెత్తు.

ప్రియా సహోదరుడా నీవు వ్యక్తిగతముగా క్రీస్తు రక్షణను అంగీకరించినవా? అతను నీకు ఒక కనికరము గల రక్షకుడని నీకు తెలుసా? అయితే నీవు అతని మరణము కొరకు అతని రక్షణ కొరకు, అతని పరిశుద్ధత కొరకు మరియు అతని విమోచనము కొరకు నీవు అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక నీ విశ్వాసముచేత అతనిని ఘనపరచు, మరియు యెడతెగక అతనికి కృతజ్ఞతలు తెలియపరచు. నీ జీవితమంతా అతని మహిమకరమైన కృపకు కృతజ్ఞత కలిగి ఉండు.

ప్రార్థన: మహిమ ప్రభావము కలిగిం యేసు మా పాపముల కొరకు ఆ సిలువలో మరణించినందుకు నీకు కృతజ్ఞతలు. కనికరము గల దేవా మా పాపములన్నిటిని క్షమించి మాకు బదులుగా చనిపోయావు. మాకు జ్ఞానమును దయచేసినందుకు పరిశుద్ధుడా నీకు కృతజ్ఞతలు, మాలో నీ సంపూర్ణ కృపను మరియు క్షమాపణను స్థాపించు. మా జీవితములకు ఒక అర్థమును ఇచ్చినందుకు మేము నీ త్రిత్వమునకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. మీకు కృతజ్ఞత కలిగి ఉండులాగున మాకు నేర్పుము, మరియు నీ కృపను బట్టి కూడా మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి ఉండులాగున కూడా నేర్పుము.

ప్రశ్నలు:

  1. మన విమోచన విశ్వాసముతో ఉన్న ప్రధానమైన భావము ఏమి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)