Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 024 (Peter and John Imprisoned; The Common Prayer)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

11. పేతురు మరియు యోహాను మొదటిసారిగా బంధించబడి కోర్టుకు కొనిపోబడుట (అపొస్తలుల 4:1-22)


అపొస్తలుల 4:19-22
19 అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; 20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి; 21 ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి. 22 స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

అపొస్తలులు మరియు స్వస్థత కలిగిన వాడు యేసు నామములో ప్రసంఘములు చేయకూడదని ప్రధాన సమాజము వారు నిర్ణయించిరి. ఈ ఇద్దరు సాక్షులు, దేవుని చిత్తమును మరియు మనుషుల ఆజ్ఞలను లోబడాలని అనుకున్నప్పుడు వారు దేవునికే లోబడి ఉండాలని నిర్ణయించిరి. ఈ వ్యతిరేకమైన భావన వారికి ఒక విప్లవాత్మకమైన ఆత్మద్వారా వచ్చినది కాదు, అయితే ఇది కేవలము పరిశుద్దాత్మునికి లోబడి స్వభావము ద్వారా వచ్చినది, ఇది విశ్వాసులను విప్లవములోనికి నడిపించాడు, అయితే యేసును బట్టి ధైర్యముగా సాక్ష్యమిచ్చునట్లు చేయును.

ఆ ఇద్దరు సాక్ష్యులు ఒకటిగా సమాధానము చెప్పిరి: " మేము ఏదైతే చూసామో, దానిగురించి చెప్పకుండా ఉండలేము". మరణము నుంచి లేచిన వాని గురించి వారి హృదయములు మరియు జీవితములు క్రీస్తుచేత సంపూర్ణ అనుభవంతో నిండియున్నవి. కనుక హృదయములో ఏమున్నదో అదే నోరు మాట్లాడును. కనుక ప్రియా సహోదరుడా ప్రతి దినము నీవు ఏవిధముగా మాట్లాడుతున్నావు? ఎన్ని మారులు నీవు యేసు నామమును ఉచ్చరించుచున్నావు? ప్రభువు ఆత్మ నీలో నివసించుచున్నదా? లేకా ధనము, పరిశుద్ధతలేని ఆత్మ చేత నింపబడి ఉన్నావా? నీవు ఏమి మాట్లాడతావో అదే నీవు. నీవు మౌనముగా ఉన్నట్లుగా లేవు. యేసు పరిశుద్ధత నిన్ను జీవము కలిగిన ప్రభువును ఘనపరచుటకు సహాయపడదు, ఎందుకంటె వారు పరిశుద్ధాత్మను పొందుకొన్నారు, మరియు అతను వారు యేసుకు సాక్షులుగా ఉండునట్లు చేసెను. ఇదే వారి బాధ్యత, ఉద్యోగమూ మరియు చేతనత్వం. దేవుని శక్తి అనునది క్రీస్తు కార్యములలో మరియు మాటలలో జతచేయబడి ఉన్నది. కనుక మౌనముగా ఉండక మాట్లాడు. మాటలాడుటకు ముందు ప్రార్థించు.

ప్రజలలో ఉన్న నాయకులూ క్రీస్తు సాక్షులను ప్రవేశపెట్టలేకపోయిరి, ఎందుకంటె వారు వారి అధికారమును బట్టి వీరి యెడల అపాయముకలిగి ఉండిరి. కాబట్టి క్రీస్తు యొక్క కదలికలను బట్టి వారిని బెదిరించి హెచ్చరించాడు. ఈ విధముగా యెరూషలేములో ఈ అద్భుతములతో దేవునికి స్తోత్రములచేత నిండిపోయెను. మరియు దాని పైన విశ్వాసులందరు వెంటనే గ్రహించి దానికి ఉన్న ఉన్నతిని బట్టి వారు విడిచిపెట్టలేదు, కనుక రక్షణ యొక్క శక్తి క్రీస్తు ద్వారా కార్యము చేయబడిఉండెను.


12. సంఘము యొక్క సహజమైన ప్రార్థన (అపొస్తలుల 4:23-31)


అపొస్తలుల 4:23-31
23 వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి. 24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. 25 అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? 26 ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను3 భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. 27 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, 28 వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి 30 రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము. 31 వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరి శుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 

వారు బంధీ నుంచి విముక్తులైన తరువాత, ఆ ఇద్దరు అపొస్తలులు కూడా మీద గది మీదికి పోయిరి, అక్కడ తక్కిన సహోదరులు అందరు చేరి ప్రార్థించుచుండిరి. ఎప్పుడైతే వారిలో ఒక్కడు బంధించబడునో తక్కినవారందరూ ఒకరితరువాత ఒకరు ప్రార్థించుచు ఉండిరి, జ్ఞానముతో, ధైర్యముతో మరియు కాపుదలను బట్టి ప్రార్థించిరి. ఎప్పుడైతే పేతురు మరియు యోహాను వారిదగ్గరకు వెళ్లి ప్రభువైన యేసు ఐవిధముగా ఆ నాయకుల ఎదురుగా కార్యములు చేసెనో అని చెప్పినప్పుడు వారందరూ సంతోషముతో దేవునికి కృతజ్ఞతలు చెప్పిరి. అదేసమయములో సమాజపు పెద్దలు యేసు నామములో ప్రకటించకూడదని ఆజ్ఞాపించిన విషయమును బట్టి వారు బాధపడిరి, ఎందుకంటె వారందరూ ఈ విషయమై నిర్ణయము కలిగి ఉండిరి కనుక. పాలించువారు పచ్చాత్తాపము చెందుతారని వారు అనుకొనిరి. అయినప్పటికీ వారు యేసు యెడల ఇంకా ఖఠినము కలిగి ఉండిరి. కనుక వారు ఆ నాయకుల రక్షణను బట్టి మరియు వారి పెద్దల రక్షణను బట్టి ప్రార్థించిరి; అయితే ఫలితము వ్యతిరేకముగా వచ్చెను.

ఇద్దరు అపొస్తలులు విడిపించబడినతరువాత వేరొక అద్భుతము జరిగెను. సంఘము మంచి నిర్ణయాలు తీసుకొనునట్లుగా చర్చించలేలేదు, ఎందుకంటె యేసు నామములో మాటలాడుటకు వారికి నిరోధించడము జరిగెను. దాని సభ్యులు రాజి పడునట్లు లేదా అనుకూలమైన సమయము కొరకు ఎదురుచూచుట. దానికి బదులు వారు సర్వశక్తిగలిగిన దేవుని ముందర అనగా ఈ భూమిని ఆకాశమును మరియు సమస్తమును సృష్టించిన వాని ముందర మోకాళ్లూని ప్రార్థించిరి. వారు మనుషులనుంచి సత్యము నుంచి మరియు అధికారమునుంచి తిరిగిరి. అయితే వారికి గొప్పవాడు మాత్రమూ వారి తండ్రి. అతని తోనే వారు వారి ప్రశ్నలన్నింటినీ వేసి మరియు సమాజ స్థలమందు నిలుచుంది యేసు ముందర కన్నీరు కార్చెదరు.

కీర్తన 2 లో చెప్పిన ప్రకారము ఈ కుటుంబమంతటినీ పరిశుద్ధాత్ముడు దేవునికి ప్రార్థన చేయుటకు నడిపించును అని. కనుక ఈ ఘనపరచు కీర్తనలు వారి హృదయములను నింపెను. వారందరు కూడా ఆత్మీయ ప్రవచనము కలిగిన ప్రవక్తలైరి. వారు వారి రోమా చక్రవర్తి ప్రభుత్వములో దేవునికి మరియు క్రీస్తుకు వ్యతిరేకమైన వారిని చూసిరి. కనుక మనకు ఒకవేళ ప్రవచించు అంతర్దృష్టి ఉన్నట్లయితే అప్పుడు మనము మన సొంత పరిస్థితులను జ్ఞాపకము చేసుకొంటాము, మరియు మన మతసంబంధమైన వాటిని కూడా బలపరచుకొంటాము! కనుక ఈ లోకమంతా కూడా అంతేక్రీస్తు కొరకు తమ సమయములను వెచ్చించి దేవునికి మరియు క్రీస్తుకు వ్యతిరేకమైన యుద్ధమును జరుగులాగునట్లు చేయుచున్నది.

ఈ సమయములో యెరూషలేములో సాతాను ఆత్మచేత నడిపించబడుట జరిగెను, అక్కడ దేవుని శత్రువులు యేసును కలిసి చంపాలని చూసిరి. రోమీయులు మరియు యూదులు వారి మధ్యన ఉన్న అంతర్భేధం ను వదిలి అందరు కూడా ప్రభువైన క్రీస్తుకు వ్యతిరేకమైరి. అయితే పిలాతు, హేరోదు, కైపస్సు అందరు కూడా విఫలమైరి. సిలువవేయబడిన వాడు సమాధిలో లేకపోయెను కనుక వారి తీర్పు జరిగించబడలేదు. కనుక ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారికి సమస్తము మంచి జరుగును. సర్వాష్కతుని ప్రణాళికలు ఎప్పుడు గొప్పననే ఉంటాయి. కనుక దేవుని శత్రువులు కూడా అతనికి సేవచేయాలి, ఎందుకంటె ఈ లోకములో పరలోకమందున్న తండ్రి లేకుండా ఏమి కూడా జరగవు. మరియు అతను మనలను మరణపు అంచులలోనికి తీసుకొనివెళ్లడు.

ఈ ప్రార్థన ద్వారా వారందరు ధైర్యాము కలిగి పాలిచ్చువారిని దేవుని హస్తములకు సమర్పించుకొనిరి. వారు ఎక్కువగా మాట్లాడక అయితే అనయముగా క్రీస్తు గురించి మాట్లాడువారిని దేవుని అగ్నాలోనికి సమర్పించిరి. వారు నజరేయుడైన యేసు ఈ లోక రక్షకుడనే విషయమును బట్టి ధైర్యము కలిగి చెప్పుటకు తగిన శక్తిని దయచేయుమని శక్తికలిగిన దేవుడిని అడిగిరి. ఎవరైతే క్రీస్తును బట్టి సశ్యముగా ప్రవచించువారిని దేవుడి వారితో నేరుగా మాట్లాడేను. అందరు కూడా విమోచించబడాలని పరిశుద్ధుడు అందరిని కూడా అతని సిలువచెంతకు పిలిచెను. కనుక ప్రియా విశ్వాసి నీ నోరును దేవుని కొరకు మాట్లాడినట్లు తెరచి ఉన్నావా లేక నీవు ఇంకనూ భయము కలిగి ఉన్నావా? నీవు పరిశుద్దాత్మ శక్తి కలిగి మాట్లాడినట్లు మరియు అతని నడిపింపులో దిర్యము కలిగి ఉండునట్లు అతని వరమును పొందుకున్నావా?.

ఎవరైతే ప్రార్థన కొరకు కలుసుకొన్నారో వారు దేవుని శక్తిని కలిగి ఉండుటకు అతన్ని అడిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవుని శక్తిని అడిగినరో అప్పుడు వారు అతని శక్తిని వారి మధ్యలో కార్యము చేయుట చూసిరి. వారు వారి విశ్వాసములను బలపరచుటకు సూచనలను బట్టి వెతకలేదు. సంఘమంత కూడా క్రీస్తు నామము మహిమపరచబడాలని అద్భుతములు చేయుమని దేవునిని ప్రాధేయపడిరి. పరలోకమునకు వెళ్ళుటకు మరియు పరలోక తాళపు చెవి మరియు నరకపు తాళపు చెవి కూడా అతని చేతులలోనే ఉన్నవని వారు అనుమానము లేకుండా నమ్మిరి.

ధైర్యము కలిగిన ప్రార్థనను దేవుడు ఆలకించి వాటికి సమాధానమును ఇచ్చెను. ఈ ప్రార్థనను మాత్రమే మేము ప్రారంభ సంఘములో ఉంచాము. స్థలము మరియు కుర్చీలు కదల్చబడునట్లు దేవుడు తన హస్తములను చాపి తన ఆశీర్వాదములను అక్కడ ఉన్నవారికి ఇచ్చెను. పెంతేకొస్తు దినము ప్రకారముగా వారందరు పరిశుద్దాత్మునిచేత నింపబడిరి. ఎప్పుడైతే మనము సాత్వికము కలిగి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు వారి ప్రార్థనకు తగిన జవాబును త్వరగా ఇచ్చి వారి విశ్వాసములను మరియు నిరీక్షణకు బలపరచును. తన శక్తి కలిగిన ప్రేమచేత వారిని నింపును.

ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము ఏమిటి? పాలించువారు యేసు నామములో మాట్లాడకూడదని ఆజ్ఞాపించినప్పటికీ వారు ధైర్యముగా మరియు బహిరంగముగా రక్షకుని గూర్చి ప్రకటించిరి. వారు ప్రతి ఇంటికి వెళ్లి, వీధులలో మరియు బహిరంగ ప్రదేశములలో మరియు దేవాలయములో కూడా ప్రకటించిరి. ప్రభువు వారిని తన ఆత్మచేత నింపి వారిని అతని సాక్ష్యము కొరకు బలపరచెను. ప్రారంభపు సంఘము చేసిన ప్రార్థనను జాగ్రత్తగా ఆలోచనచేసిరి. కనుక ప్రియమైన విశ్వాసి నీవు కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రకటించుటలో పాలుపంచుకో.

ప్రార్థన: ఓ మహిమగల తండ్రి నీవు సృష్టికర్తవు, రక్షకుడవు మరియు మా దినములను ముగించువాడవు. ఈ లోకము మనుషులందరినీ నీవు వ్యతిరేకముగా కలుపుచున్నది. కనుక ప్రభువా నీ సేవకులను ధైర్యము కలిగి వారితో మాట్లాడినట్లు చేయుము. నీ పరిశుద్దుడైన కుమారుని నామములో అద్భుతములను మరియు కార్యములను చేయుము.

ప్రశ్న:

  1. పరిశుద్ధాత్ముడు కార్యము చేయునట్లు దేవుని వాక్యము ప్రకటించుట ఎందుకు అవసరము?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:52 PM | powered by PmWiki (pmwiki-2.3.3)