Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 032 (Healing of the court official's son)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?

5. సభ నాయకుడి కుమారుడు స్వస్థపరచబడుట (యోహాను 4:43-54)


యోహాను 4:43-46
43 ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను. 44 ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను. 45 గలిలయులుకూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. 46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూ ములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.

యేసు మరియు అతని శిష్యులు సమరయలో నిత్యజీవమును గూర్చి శక్తిచేత మరియు ఆనందముచేత ప్రకటించిరి. దేశములను చేరుకొనుటకు సమయము రాలేదు; ఎందుకంటె మొదటగా తన సొంత ఊరిలో చెడు ఆత్మలను తొలగించాలి కనుక. కనుక క్రీస్తు నేరుగా గలిలయకు బయలువెళ్లి వెక్కిరించువారికి శబ్దముచేయువారికి చెప్పియున్నాడు. అతని స్నేహితులు మరియు బంధువులు తన దైవత్వమును నమ్మలేదు, ఎందుకంటె ఆటను ఒక ధర్మశాస్త్ర కుటుంబమునుంచి వచ్చాడు కనుక. ఎందుకంటె వారు ఐశ్వర్యామును మరియు ఖ్యాతిని చూచి ఉన్నారు కనుక, మరియు క్రీస్తును వెటకారం చేసిరి.

క్రీస్తు కీర్తి అక్కడ వ్యాపించింది. ఆటను యెరూషలేములో చేసిన అద్భుతములు అతని కంటే ముందుగానే గలిలయకు వెళ్లెను. గలిలయలో ఉన్న చాలా మంది యెరూషలేమును సందర్శించి,అక్కడ క్రీస్తు చేసిన అద్భుత కార్యములను వారు విని ఉన్నట్లు చూచిరి, అలాగే క్రీస్తు అధికారముచేత పలికిన మాటలను వారు వినిరి. ఎప్పుడైతే క్రీస్తు గలిలయ గ్రామాలలోకి ప్రవేశించినప్పుడు వారు ఆయనకు స్వాగతము పలికి అక్కడ కూడా అద్భుతములు చేయుట చూడాలని అనుకొన్నారు. అయితే కనాలో జరుగు వివాహమునకు యేసు హాజరవుటకు వచ్చెను. తనను చూచుచున్నవారికి తన సేవను తెలుపుటకు ఇక్కడ అద్భుతము చేయుటకు పూనుకొనెను.

యోహాను 4:46-54
46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూ ములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను. 47 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. 48 యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. 49 అందుకా ప్రధానిప్రభువా,నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50 యేసు నీవు వెళ్లుము,నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమి్మ వెళ్లి పోయెను. 51 అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి,అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. 52 ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. 53 నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమి్మరి. 54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

ఒక ముఖ్యమైన సభ నాయకుడు క్రీస్తు గురించి మరియు అతని అధికారము గురించి విని అక్కడకు వచ్చెను. ఆ గ్రామములో ఒకడు క్రీస్తు రాకడను చెప్పి, " అతను వస్తున్నాడు, స్వస్థపరచుటకు తనను తానూ రాజునని పరిచయము చేసుకొనుటకు వస్తున్నాడు" అని.

అక్కడున్న కపెర్నహూము అను ఊరిలో ఒక నది దగ్గర ఉన్న అధికారులలో ఒకరి కుమారుడు అనారోగ్యము కలిగి ఉండెను. ఆటను తన కుమారుని కొరకు చాల డబ్బు ఖర్చు చేసి అనేకమంది వైద్యులను సంపాదించెను అయితే ఎక్కడ కూడా అతనికి బాగు కాలేదు. అప్పుడు చివరగా అతను క్రీస్తు దగ్గరకు వెళ్లెను; అతను సహాయము చేయగలడా లేదా ? అని. అప్పుడు ఆ తండ్రి యేసును కాన వదిలి తన కుమారుడు ఉన్న కపెర్నహూమునకు క్రీస్తును తీసుకువచ్చి ఆయన సన్నిధిలో స్వస్థత చేయబడవలెనని ఇష్టపడెను.

యేసు ఈ మనిషి చూపించు ప్రాముఖ్యతను బట్టి జాలిపడెను. ఒకడు విశ్వసించే వరకు యేసు వారికి సహాయము చేయలేదు. ఎందుకంటె అక్కడున్న అనేకులు ఈ విషయాన్నీ బట్టి ఎంతగానో ఎదురుచూచుచుండిరి. సహాయము వచ్చువరకు నిజమైన విశ్వాసి ప్రభువు కొరకు ఎదురు చూచును.

అప్పుడు ఆ అధికారి తనను తానూ తగ్గించుకొని :సర్" లేదా "ప్రభువా" అని గ్రీకు పాదములో సంబోధించెను,తాను క్రీస్తు సేవకుడని ఎంచి. తన కుమారునిపైన ప్రేమ మరియు క్రీస్తు పైన ఉన్న గౌరవముతో ఈ మాటలు మాట్లాడేను.

అప్పుడు క్రీస్తు తన ప్రభుత్వమును చూపించుటకు ఈ విధముగా , "వేళ్ళు, నీ కుమారుడు బ్రదుకును". అని చెప్పెను. అయితే క్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళుటకంటె ముందుగానే ఆ కుమారుని తండ్రి యొక్క విశ్వాసమును మరియు అతని కుమారునిపైన ఉన్న ప్రేమను పరిశీలించెను. అతనికి ఆ రోగముగల బాలుడిని స్వస్థపరచుటకు యేసుకు తగిన సామర్థ్యము ఉన్నదా ?

ఆ మాటలు జరుగుతున్నప్పుడు ఆ అధికారి యేసు గుణమును మరియు ఆయన ప్రేమను గమనించియున్నాడు. యేసు తనను వెక్కిరించడంలేదని మరియు అబద్ధము చెప్పడము లేదని నమ్మియున్నాడు. తన కుమారుని స్వస్థత అతను చూడకున్న తన కుమారుడు స్వస్థపరచబడిఉన్నాడని నమ్మెను. క్రీస్తుకు లోబడి తన ఊరికి తిరిగి వెళ్లెను. అతని తగ్గింపుస్వభావమును యేసు చూచి తన కుమారుడిని స్వస్థతపరచెను. అతని తన కుమారుని రోగమును స్వస్థపరచినట్లైతే అతను అందరికంటే గొప్పవాడు.

యేసు కూడా తన కుమారుడికి స్వస్థతకలుగుటలో అతని శిష్యులకు కూడా యేసు చెప్పెను. జరిగిన కార్యమును బట్టి అతను క్రీస్తును ఘనపరచెను. ఆశ అనునది తన కుమారునికి కలిగిన రోగము వదిలినప్పుడు తండ్రి ఎంతో ఆనందించెను. యేసు చెప్పిన సమయమునకు అతనికి స్వస్థత కలిగినది.

ఆ అధికారి జరిగిన కార్యమును తన ఇంట్లో ఉన్న అందరికీ చెప్పి, అందరూ క్రీస్తు పట్ల కృతజ్ఞతకలిగి ఉండిరి.

యోహాను ఈ అద్బుతమును రెండవడిగా తన పుస్తకములో జరిగినట్లు వ్రాసెను.అక్కడున్న వారందరు ఈ కార్యములు కేవలము ఆయన పై విశ్వాసముద్వారానే జరుగును అని తెలిసికొని ప్రతి ఒక్కరు క్రీస్తుకు అంగీకారమగు ఆరాధనను చేయుచు దేవునిని మహిమపరచిరి.

ప్రార్థన: యేసు ప్రభువా మీ రాకడను బట్టి నీకు కృతఙ్ఞతలు.మరణ పడకలో ఉన్న బాలుడిని నీవు బ్రతికించినావు. నీ యందు అతని తండ్రి విశ్వాసము ఉంచులాగున కార్యము చేసినావు. మమ్ములను నీ ప్రేమలో నిన్ను నమ్ముటకు నీ శక్తి చేత నింపుము. పాపములో ఉన్న అనేక మందిని రక్షించమని మిమ్ములను కోరుచున్నాము.

ప్రశ్న:

  1. అధికారి చూచినా విశ్వాస ఎదుగుదల ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:39 AM | powered by PmWiki (pmwiki-2.3.3)