Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Romans - 071 (Problems of the Church of Rome)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

8. రోమా సంఘములో ఉన్న ఖచ్చితమైన సమస్యలు (రోమీయులకు 14:1-12)


రోమీయులకు 14:1-12
1 విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు 2 ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. 3 తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. 4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. 5 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను. 6 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. 7 మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. 8 మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. 9 తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. 10 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. 11 నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు 12 అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. 

క్రీస్తును వెంబడించువారికి ఏది నిషేధించబడినదో ఏది అనూకూలపరచినదో అని తెలుసుకొనుటలో రకరకాల భవనాలు కలిగి ఉన్నారు, ఎందుకంటె ఈ విషయములో క్రీస్తు ఏవిధమైన ధర్మశాస్త్రమును నియమించలేదు, అయితే వారికి సంపూర్ణ రక్షణను మాత్రమూ యిచ్చియున్నాడు, మరియు వారికి పరిశుద్దాత్ముని శక్తిని మరియు సమాధానమును యిచ్చియున్నాడు. అతనికి ధర్మశాస్త్రములు కేవలము అందరినీ కూడా ప్రేమించుటకు మాత్రమే ఇవ్వబడి ఉన్నాయి.

కనుకనే మనము ఒక సంఘమును వేరొక సంఘముతో వ్యత్యాసమైన మార్పును కనుగొనుచున్నాము. కొందరు పంది తినుటలో పాపము చేయబడి ఉన్నారు. అయితే యేసు చెప్పినట్లు: "మనిషి నోటిలోనికి వెళ్లునది ఆ మనిషిని పాడుచేయడు; అయితే నోటి నుంచి ఏది వచ్చునో అదే ఆ మనిషిని పాడుచేయును.... ఎందుకంటె హృదయమునుంచే చెడు ఆలోచనలు వచ్చును, హత్యలు, వ్యభిచారము, దొంగతనము, అబద్దపు సాక్ష్యము మరియు దూషణ వచ్చును. ఇవన్నీ కూడా మనిషిని పాడుచేయును". నిజముగా పంది తినుటలో మనిషి పాడుచేయబడుచున్నాడు, మరియు ఆరోగ్యమును కూడా పాడు చేసుకొనుచున్నాడు అయితే అది ఆత్మీయతను పాడు చేయదు.

కొంత మంది క్రైస్తవులు బంగాకును మరియు సిగరెట్ ను కాల్చుతారు, అయితే ఇతరులు ధూమపానం మరణించతగిన పాపము అని చెప్పును. ధూమపానం చేయువారిని అది ఆరోగ్యముగా పాడుచేయును, అయితే ధూమపానం చేయువాడు పీల్చుచున్న ఆ పొగ ద్వారా అపవిత్రమా రాదు, అయితే అది విషమును చిమ్మును, కనుక తన ఆరోగ్యమును బట్టి వాటిని అతను దూరము చేసుకోవాలి. కనుక ధూమపానం అనునది పాపము కాదు, అయితే ఎవరైతే ధూమపానం చేస్తారో వారు పాపులు.

కొంతమంది మధ్యపానమును మరియు డ్రగ్స్ ని నిషేధిస్తారు, కనుక వారు ఉత్తములు, ఎందుకంటె ఎవరైతే మధ్యపానమందు మరియు ధూమపానమందు ఇష్టపడి ఉంటారో వారు దానికి బానిసలై ఉంటారు. కనుక మేము ప్రతి ఒక్కరికీ చెప్పునది ఏమనగా ధూమపానమును మరియు మధ్యపానమును ప్రతి ఒకారు నిషేధించాలి. ఒకవేళ ఆరోగ్యకరంగా కొద్దిగా మద్యము సేవించడము అయితే తప్పులేదు. అయితే నేరుగా దేవుని ద్వారా ఇవ్వబడిన తాజా కలిగిన నీరు త్రాగుట మనిషికి ఎంతో శ్రేష్టము.

అపొస్తలుడైన పౌలు సమయములో సంఘములకు ఉన్న ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే: "విగ్రహాలకు బలిగా అర్పించింది తినుట ద్వారా పాపము వస్తున్నాడా?" అని, కొంతమంది దీనిని ఒక ఆకలిగా చూపిస్తారు, అయితే ఇతరులు దీనిని ఒక అసహ్యముగా చూస్తారు. అయితే పౌలు ఇద్దరి ఆలోచనలు కూడా కరెక్ట్ అనే చెపుతాడు, ఎందుకంటె విగ్రహాలకు సమర్పించిన మాంసము ఆత్మీయమైనది కాదు అయితే అది కండకు సంబంధించినది. ఎందుకంటె కొంతమంది చెప్పినట్లు ఇది ఒక అపవిత్రమాకు చెందినది అని. ఏదేమైనా యేసు వీటినన్నిటిని తన రక్షణలోనికి తెచ్చియున్నాడు. వారు ధర్మశాస్త్రములో లేరు అయితే వారు రెండవడిగా పిలువబడుచున్న పొరపాటుతో ఉన్నారు.

కొంతమంది సబ్బాతు దినమును శుక్రవారం, కొంతమంది ఆదివారము పెట్టుకుంటున్నారు, అయితే పౌలు చెప్పినట్లు: మీరందరు కరెక్ట్, ఎందుకంటె యేసు దినములను పరిశుద్ధపరచలేదు అయితే ప్రజలను పరిశుద్ధపరచాలని ఉద్దేశించెను. కనుక, నీవు నీ దేవుడిని ప్రతి దినము ప్రతి సమయమందు ఆరాధించు, ఎందుకంటె ప్రార్థన అనునది ఏదినము కూడా నిషేధించబడలేదు, అయితే ఇది ప్రతి దినము మరియు ప్రతి సమయమందు చేయబడవలసిన కార్యమై ఉన్నది.

సంఘములో ఉండు ప్రతి సభ్యులు కూడా ఒకరిని ఒకరు తృణీకరించుట మరియు తీర్పు తీర్చుట మంచిది కాదు, మరి ముఖ్యముగా రెండవ విషయములో. యేసు చెప్పినట్లు: "తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చబడెదరు". కనుక విశ్వాసమందు శక్తికలిగిన వారు ఇతరులను అలక్ష్యము చేయకూడదు, ఎవరైతే జ్ఞానమందును మరియు విశ్వాసమందు బలహీనులుగా ఉంటారో వారిని బలపరచి వారికి సహాయకరంగా ఉండాలి. అదేవిధముగా బలహీనులు విశ్వాసమందు బలవంతులుగా ఉన్నవారిని బట్టి అలక్ష్యము చేయరాదు, మరియు వారి గురించి చేదుగా మాట్లాడకూడదు, అయితే వారిని ప్రేమించాలి, ఎందుకంటె యేసు అందరినీ ప్రేమించుచున్నాడు కనుక.

పౌలు ప్రతి ఒక్కరికీ చెప్పినట్లు, "మనము మనకు చెందినవారము కాము, అయితే మనము మన ప్రభువైన యేసుకు సంపూర్ణముగా సమర్పించుకున్నవారమై ఉన్నాము. మనము బ్రతికితే ప్రభువు కొరకు బ్రతుకుతాము; మరియు మనము చనిపోతే ప్రభువు కొరకు చనిపోతాము. కనుక, మనము జీవించిన లేదా మరణించిన, లేక తిన్న త్రాగినా మనమందరము కూడా మనకొరకు తన జీవితమును త్యాగము చేసి మనకు నూతన జీవితమును ఇచ్చిన క్రీస్తుకు చెందినవారము.

ఖండించు ఆత్మ సంఘములోనికి త్వరగా వచ్చునట్లు, పౌలు బలహీనులను బట్టి మరియు బలవంతులను బట్టి హెచ్చరించెను: మీరందరు నిత్యుడగు తీర్పు తీర్చు వాని ముందర నిలబడతారు. కనుక ఇతరులను తీర్పు తీర్చక నిన్ను నీవు తీర్పు తీర్చుకో. నీ పాపములను ఒప్పుకో, వాటిని క్రీస్తు నామములో జయించు. నీవు ఒకవేళ ఇతరుల పాపములనుంచి వారిని విమోచించాలని అనుకున్నట్లైతే అప్పుడు నీవు వారితో సహనము, ప్రేమతో కలిగి మాట్లాడు, మరియు ప్రార్థనా పూర్వకముగా మాట్లాడు, మరియు నీవు ఇతరులకంటే ఎక్కువైనా నీతిమంతుడు కాదు అని తెలుసుకో. విశ్వాసులు తడబడకుండునట్లు వారి విశ్వాసములను గూర్చి కార్యములు చేయుము.

ప్రార్థన: పరలోకమందున్న తండ్రీ, మేము ఎప్పుడైతే నీ పరిశుద్ధత ద్వారా, నీ గొప్పతనము ద్వారా, నీ ప్రేమ ద్వారా, మరియు నీ నీతి ద్వారా కొలతచేయబడినామో అప్పుడు మేము దేనిలో కూడా సరి సాటికాము. మా యొక్క విఫలములను క్షమించుము అప్పుడు మేము ఇతరులను ఖండించము. మమ్ములను మేము తక్కువగా పోల్చుకున్నట్లు మమ్ములను నీ శక్తిచేత నింపుము.

ప్రశ్నలు:

  1. ప్రతి విశ్వాసి జీవితములో రెండవ విషయమందు వారికున్న వ్యత్యాసములను బట్టి మనము ఏవిధముగా ఆలోచన చేస్తాము?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:40 AM | powered by PmWiki (pmwiki-2.3.3)