Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Romans - 068 (Be Obedient to your Authorities)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 3 - క్రీస్తును వెంబడించు వారిలో దేవుని యొక్క నీతి కనబడుట (రోమీయులకు 12:1 - 15:13)

5. నీ అధికారులకు లోబడి ఉండుడి (రోమీయులకు 13:1-6)


రోమీయులకు 13:1-6
1 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. 2 కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. 3 ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందు దువు. 4 నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు. 5 కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. 6 ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. 

వివాదములద్వారా చాల మంది ఇబ్బంది పడ్డారు, కొందరి మంత్రులద్వారా, ప్రభుత్వాల ద్వారా మరియు గ్రుడ్డివారి ద్వారా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటె ఈ లోకములో నిజమైన ప్రభుత్వము లేదు, ఎందుకంటె ఈ లోకములో పాపము లేని మానవుడు లేదు. కనుక దేవుడు నీతో మరియు నీ కుటుంబముతో ఓర్చుకొన్నట్లు నీవు కూడా ఈ లోకముతో ఓర్చుకొని ఉండు.

దేవిని యొక్క చిత్తములో ఉన్న ఏ ప్రభుత్వమును కూడా ఈ లోకములో ఉండు ఎవ్వరు కూడా జయించలేరని అపొస్తలుడు చెప్పియున్నాడు. కనుక నిత్యా తీర్పునకు ఇది కూడా వెలకట్టినది. చెడు స్వభావము కలిగిన మనిషి చెడు ప్రభుత్వమునే కోరుకుంటాడు.

నీవు ఒకవేళ అన్యులైన అపొస్తలుల మాటలు జాగ్రత్తగా చదివినట్లయితే అప్పుడు నీవు కొన్ని అంశాలను కనుగొంటావు:

a) ప్రతి ప్రభుత్వము కూడా దేవుని చిత్తము పకారముగానే ఉన్నవి, అతని జ్ఞానము లేనిదే ఏది కూడా జరుగదు.
b) ఎవరైతే తమ ప్రభుత్వమును లోబడక ఉంటారో వారు దేవునికి కూడా లోబడక ఉంటారు.
c) అధికారమునకు ఎవరైతే వ్యతిరేకముగా ఉంటారో వారికి శిక్ష వస్తుంది.
d) దోషులకు మరియు మోసగాళ్లకు భయపడుటకు సేవకులను మరియు అధికారులను పిలిచి ఉన్నాడు, అయితే మనకు నీతి కలిగిన చాకు మరియు జ్ఞానమును యిచ్చియున్నాడు.
e) మంచిది ఏదైతే చేస్తారో వారికి భయము అనునది అవసరము లేదు. వారికి ప్రభుత్వము మాత్రమే కావాలి, అది దేవుని యొక్క అధికారము అని పిలువబడుతుంది, మరియు నీతి మంతులను నీతిమంతునిగా ఉండులాగున ఉత్సాహపరచును.

అపొస్తలుడైన పౌలు ప్రభుత్వమును "దేవుని సేవ" అని రెండు సార్లు పిలిచాడు. కనుక ఇది ఒకవేళ నీతి మీద పునాది వేయబడినట్లైతే, దేవుడు దీనిని ఆశీర్వదించి ప్రజలకు బహుమానములు ఇచ్చును. అయితే లంచము ఒకవేళ పుచ్చుకొన్నట్లైతే దేవుని శిక్ష వస్తుంది. దేవుని సేవకులు వారి ప్రభుత్వ ఉద్యోగములో పిలువబడినారు, కనుక వారు దేవుని కాపుదల లేదా అతని తీర్పును అనుభవించారు.

యేసు ఈ విషయాలను బట్టి గుత్తేదారులకు మరియు వాటికి సంబంధించు వారికి ఈ లాగున చెప్పాడు: "అందుకాయనఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను" (మత్తయి22:21). కనుక ఈ భాగము ద్వారా దేవుడు మనుషుల భాద్యతలను ఏవిధముగా చేయాలో అని చెప్పెను; అదేసమయములో ప్రభుత్వ అధికారమును కూడా పరిధిలో ఉంచాడు.కనుక ఒకవేళ నిజమైన దేవునికి ఆరాధన చేయడములో కానీ అతని ఆజ్ఞలను గైకొనడములో కానీ ఉండక విగ్రహములను దేవుళ్లుగా భావించినట్లైతే వాటిని ఖండించాలి, "మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా" (అపోస్త5:29). మెడిటరేనియన్ అను స్థలము చుట్టూ మనుషుల రక్తముతో నిందబడినది, ఎందుకంటె వారు తమ ప్రభుత్వముల కొరకు ప్రార్థన చేసినారు కనుక వారిని అధికారులు చంపారు, అయితే వారు క్రీస్తు యొక్క ఆత్మకు సంబంధించిన తీర్పులను వ్యతిరేకించారు.

పరిశుద్ధ గ్రంధము చెప్పునట్లు చివరి దినాలలో ఈ లోకములో అంత్యక్రీస్తు తన అధికారమును చెలాయిస్తాడని చెప్పబడినది, మరియు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, కుమారా మరియు పరిశుద్ధాత్మకు కాక తననే ఆరాధించామని వారికి ఆజ్ఞ ఇస్తాడు. మరియు ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారు అంత్యక్రీస్తుకు వ్యతిరేకి అని పిలువబడతాడు, కనుక అలాంటి వారు నొప్పి కలిగిన చావుచేత చస్తారని చెప్పబడినది. అయితే మనిషి కొద్దీ సమయమందు శ్రమపడుట మేలు ఎందుకంటె నిత్యమూ నాశనములో ఉండుటకంటె.

మన ప్రథమ బాధ్యత కూడా మన ప్రభుత్వాల కొరకు మరియు అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి, ఎందుకంటె అవి దేవుని చిట్టా ప్రకారముగా ఎలబడాలి కనుక, ఎందుకంటె దేవుని యొక్క కృప లేనిదే ఏ అధికారి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకొనలేదు.

ప్రార్థన: ప్రభువైన యేసు, నీవు మనుషులకంటే నీ తండ్రికే లోబడి ఉన్నావు, కనుకనే నీవు సిలువవేయబడినావు. మేము మా మంచి ప్రభుత్వములకొరకు ప్రార్థన చేయునట్లు మాకు సహాయము చేయుము, ఒకవేళ అవి మమ్ములను అబద్ధమునకు లోబడుమని ఆజ్ఞాపించినట్లైతే మేము నీ జ్ఞానము కలిగి నడుచుకొనుటకు నీ నడిపింపు మాకు దయచేయుము.

ప్రశ్నలు:

  1. ప్రతి ప్రభుత్వము యొక్క అధికార పరిధి ఎంత, మరియు మనుషులకు కాక మనము దేవునికే ఎందుకు లోబడి ఉండాలి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:39 AM | powered by PmWiki (pmwiki-2.3.3)