Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 006 (The Select Group)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

3. పరిశుద్దాత్మ కొరకు ఎన్నుకొనబడిన గుంపు ఎదురు చూచుట (అపొస్తలుల 1:13-14)


అపొస్తలుల 1:13-14
13 వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు. 14 వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి. 

యేసు తన శిష్యులను ఈ లోకమంతటికి వెళ్ళమని ఆజ్ఞాపించియున్నాడు. వారి శోథ శక్తి మీద వారు ఆధారపడి లేకుండుట ఎంత ఆశ్చర్యముగా ఉన్నది. లేదా వారు మనుషుల వాగ్దాటి ఖాళీ అయినా మాటలచేత వెళ్ళలేదు. బదులుగా, ఏకాంతముగా ప్రార్థనలో ఉండి క్రీస్తు రెండవ ఆజ్ఞను తండ్రి వాగ్దానము వచ్చువరకు ముందుకు తీసుకువెళ్లిరి. ఈ లోక బాధ చాల భయంకరమైనది, మరియు ఎవరైతే పాపములో చనిపోయిఉన్నారో వాయు ఒక వరదవాలె విస్తారముగా తలపించెదరు. ఈ లోకమునకు తమ సొంత జ్ఞానముచేత బోధించువారికి శ్రమ. వారు సమయమునందు పడిపోయి అందులో మునిగిపోవుదురు. కనుక నీ సొంత జ్ఞానముతో మరియు నైపుణ్యముతో క్రీస్తు దగ్గరకు నడిపించగలనని అనుకొనవద్దు. దేవుని కార్యము జరుగునట్లు మౌనముగా ఉండి ప్రార్థన చేయుము. అపొస్తలుల చరిత్ర ప్రార్థనల ద్వారా మరియు వాక్యము ద్వారా ప్రారంభించబడినదని జాగ్రత్త కలిగి ఉండు. క్రీస్తు మొదటి అపొస్తలుల పని ఏమిటంటే ప్రార్థించి ఎదురుచూచుట. ఎందుకంటె మనుషులందరూ చెదిరిపోతారు కనుక వారు నైపుణ్యము వ్యర్థమైనదని తెలుసుకొంటారు. అయితే దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వాడు మనకొరకు కృషి చేస్తాడు. విజయశీలుగు ఎవరని నీవు అడిగినవా? అతని పేరే యేసు క్రీస్తు. అతను మాత్రమే రక్షించి, విమోచించి మరియు విజయమును ఇచ్చువాడు. అతని అడుగులను బెంబడించి అతని విజయమును బట్టి సాక్ష్యము చెప్పగలము.

శిష్యులు గుహలోనుంచి లేదా అరణ్యములోనుంచి రాలేదు, లేక ఈ లోక రహస్యములను నిరాశాజనకంగా ధ్యానం చేయలేదు, లేదా ఈ లోక ద్వేషము కలిగిన రోతను చూడలేదు. వారు ప్రార్థించుటకు కలుసుకొనిరి. వారు తమకు తాము విన్నపములకు మరియు సమాజము కొరకు సమర్పించుకొనిరి. వారి ప్రార్థన అవసరతలు ఒకటిగానే ఉన్నవి. వారు యేసు కార్యములను బట్టి దేవునిని ఘనపరచిరి, వాటినే వారు అనుభవించిరి కనుక. వారి విఫలములను బట్టి నిజాయితీగా ప్రార్థించి అనుభవం కలిగి ఆశతో ఉండిరి. వారి జీవితములను బట్టి పరలోకమందున్న తండ్రితో మాట్లాడి, కృతజ్ఞత కలిగి ఉండిరి. ప్రార్థన అనునది వారి ముఖ్య వ్యాపారము, బాధ్యత మరియు ప్రయత్నమే ఉన్నది.

ఎగువ గది వారికి ఒక ప్రార్థన స్థలముగా ఉండెను. మరియు ఇది చివరి భోజనము చేయు స్థలముగా కూడా ఉండెను, అక్కడే యేసు శిష్యులతో కలిసి పస్కాపండుగ భోజనమును చేసెను. ఒక రొట్టె ముక్క ఏవిధముగా అయితే వారి కడుపులోకి వెళ్లేనా అదేవిధముగా అతను వారితో ఉండెను, ద్రాక్ష రసము వారి నరములలోనికి ఏవిధముగా అయితే వెళ్లేనా అదేవిధముగా అతని రక్తము వారిని సంపూర్ణముగా పరిశుద్ధపరచెను. కనుక అతను వారిలో సంపూర్ణముగా ఉండెను కనుక వారు విమోచించబడిరి.

నూతన నిబంధనలో మరియు నిత్యమూ అతని పరిశుద్ధ స్థలములో ఎవరు ఉండగలరు? మొదటగా, మనము చేపల పెట్టె ఒకవిధమైన పేతురును బట్టి అనగా ఆ సముద్రములో ఉన్న ఒడ్డున క్రీస్తుతో కలిసి ఉండిన మరియు క్రీస్తును ఖండించి తిరిగి క్షమాపణ పొందిన వాని గురించి. అపొస్తలులందరి కంటే అతని పేరే మొదటగా గుర్తించబడినది, మరియు అతనిని తక్కిన అపొస్తలులందరిని మాటలాడుటకు నడిపించుటకు ప్రభువే అతనిని నియమించి ఉన్నాడు. తరువాత మనము యోహానును చూడవచ్చు, అతను యవ్వనస్తుడు, సాధువైన శిష్యుడు, ఎల్లప్పుడూ యేసు మీద ఆధారము కలిగిన వాడు. అతను ప్రభువు మహిమను చూసి వాటిని బట్టి అందరికంటే ఎక్కువగా చెప్పినటువంటి వాడు. తరువాత దేవుని కుమారుని రాజ్యములో అతని కుడి పార్శ్యమున కూర్చోవాలని ఆశ కలిగిన యాకోబును మనము చూడవచ్చు. తరువాత అతను క్రీస్తు మహిమ కొరకు సాక్షిగా తన ప్రాణమును పెట్టినవాడాయెను. యాకోవు అంద్రెయ స్నేహితుడు మరియు అందరికంటే మొదటగా క్రీస్తు నందు విశ్వాసము కలిగి, తన సహోదరుడైన పేతురును రక్షకుని యొద్దకు నడిపించిన వాడు (యోహాను 1:40-41). మరియు ఫిలిప్పు అందరితో పాటు ప్రార్థనలో ఉండేది వాడు మరియు ప్రారంభపు దినాలలో క్రీస్తు కనుగొని, పిలిచి ఈ విధముగా చెప్పినవాడు: "నన్ను వెంబడించు" అని (యోహాను 1:43-45). అప్పుడు అతను తన స్నేహితుడైన "నాతనియేలు" ను చూసి ఆ సమయములో అతను అత్థి పండు చెట్టు క్రింద కూర్చొని ఉండెను అప్పుడు దేవుడు తన హృదయమును అతని మీద కుమ్మరించెను. క్రీస్తు అతనిని దూరము నుంచి చూసి ప్రార్థనలో యెడతెగక ఉండుమని పిలిచెను. అతను మరియు అతని స్నేహితులు కూడా పరలోకము తెరువబడుట చూసి, దూతలు పైకి క్రిందకు ఎక్కుచూ దిగుచూ ఉండుట చూసిరి.

గాలీలయాలోని బేతెస్ద నుంచి ఈ ఆరు మంది శిష్యులలో తోమా శ్రమలనుంచి క్రింద కూర్చొండుట మనము కనుగొనవచ్చు. దేవుని లోతైన జ్ఞానమును పొందిన ఈ శంషాయవాది, తరువాత " నా ప్రభువా నా దేవా!" అని మత్తయి, పరిశుద్ధాత్మచేత ఆరాధించిరి. అతను క్రీస్తు పిలుపునకు తగ్గింపు కలిగి సమాధానము చెప్పెను. మనకు ఇతర ముగ్గురు శిష్యుల జీవితములు గురించి తెలియదు. వారు కూడా ఇతరులవలె దెయ్యములను వెళ్లగొట్టె శక్తిని మరియు రోగులకు స్వస్థతను చేసే శక్తిని పొందుకొన్నారు. వారి పేర్లు పరలోకములో వ్రాసి ఉండుటను బట్టి మరియు యేసు రక్షణ సన్నిధి వారి చుట్టూ ఉండుటను బట్టి వారు ఎంతో ఆనందముతో ఉండిరి. లూకా వారి గురించిన సమాచారమును మనకు ఇవ్వలేదు కనుక వారి జీవితములను బట్టి మనకు ఎక్కువగా తెలియదు. అతని ఆశ, జీవము కలిగిన క్రీస్తు పనిని చేసి పరిశుద్దాత్మ చేత నింపబడి అతని నడిపింపులో ఉండాలని.

ఈ విధమైన సమాజములో స్త్రీలు ఉండుట ఎంత అద్భుతము. వీరే క్రీస్తు సిలువ వేయబడినప్పుడు అతని దగ్గర నిలబడి, క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచిన తరువాత తన ఆజ్ఞను మొదటగా స్వీకరించి క్రీస్తు పునరుత్తనమును ఆ మొదటి వారములో ప్రకటించిన వారు. కనుక పురుషులకు మాత్రమే కాక స్త్రీలకూ కూడా అదే సమానముగా వచ్చు పరిశుద్దాత్మ కొరకు ఎదురు చూసిన వారైరి.

యేసు తల్లి అయినా మరియు కూడా తండ్రి వాగ్దానము కొరకు ఎదురు చూసిన సమాజములో ఒకతిగా ఉండెను. క్రొత్త నిబంధనలో ఇదే చివరి సారి ఆమె గురించి గుర్తుచేసినది. ఆమె పరలోక రాణిగా కనపడలేదు, అయితే తగ్గింపు కలిగిన స్త్రీనిగా మరియు పరిశుద్దటమే శక్తి అవసరమైన స్త్రీనిగా ఉండెను.

సువార్తీకుడైన లూకా కు యేసు తల్లి తెలుసు కనుక అతను ఆమె కుమారుని గురించి విచారించాడు. కనుకనే యేసుకు సహోదరులు ఉన్నారు వారు రక్షకుడైన కార్యములను చేయుటకు ఆటంకపరచిరి అని చెప్పెను, (మత్తయి 13:55; మార్కు3:21; 31-35; 6:3; యోహాను 7:3-8). అతని పునరుత్తనము తారువాత యేసు తన సహోదరుడైన యాకోబుకు కనపడెను (1 కొరింతి 15:7), అతను యేసు యొక్క దైవత్వమును బట్టి వణికేను, కనుకనే తన సహోదరులందరినీ అపొస్తలులనుగా చేసెను. వారితో పాటు ప్రార్థన చేసెను కనుక వారు మార్పు పొందిరి. తరువాత వారు కూడా తండ్రి వాగ్దానము కొరకు ఎదురుచూసిరి. తరువాత యాకోబు కూడా పరిశుద్ధాత్మను పొంది ప్రార్థనకు ఒక మాదిరిగా ఉండి, మరియు క్రీస్తు ప్రారంభ సంఘములో ఒక మూలస్తంభముగా ఉండెను (అపోస్త 12:17; 15:13; గలఁతి2:9).

ఎవరైతే మరణము నుండి తిరిగి లేచాడో అతను తనను వెంబడించువారికి, నమ్మకమైన స్త్రీలకూ మరియు ఈ లోక కుటుంబములకు ఒక ప్రార్థన చేయు సంఘముగా ఐక్యపరచెను. వారందరు కూడా ఒకే ఆత్మ ఒకే ప్రాణము కలిగి కష్టాలలో కలిసి ఉండి ప్రార్థించిరి. నీవు కూడా, ప్రియా విశ్వాసి సమాజములో ఉన్న సహోదరులు మరియు సహోదరులందరితో కలిసి దేవుని చిత్తము నిర్ణయించబడులాగున ప్రార్థన చేస్తున్నావా? లేక నీవు ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నావా? ఈ ఐక్యత కలిగిన ప్రార్థన అపొస్తలుల సంఘమునకు ప్రారంభముగా ఉండెను.

ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు, నీ రాజ్యమును అపొస్తలులు వారి సొంత శక్తి చేత మరియు బలము చేత నిర్మింపక, అయితే కలిసి ప్రార్థన చేసి తండ్రి వాగ్దానముల కొరకు ఎదురుచూసి మరియు నీ అధికార శక్తికొరకు ఎదురుచూసిరి. నీకు మేము సంపూర్ణముగా సమర్పించుకొని నీ శక్తి కొరకు నమ్మకము కలిగి ఎదురుచూసినట్లు మాకు బోధింపుము.

ప్రశ్న:

  1. యెడతెగక ప్రార్థన చేయుటకు వచ్చిన పురుషులు స్త్రీలు ఎవరు?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:40 PM | powered by PmWiki (pmwiki-2.3.3)