Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 004 (Introduction to the Book)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

1. పుస్తక పరిచయము మరియు క్రీస్తు వాగ్దానము (అపొస్తలుల 1:1-8)


అపొస్తలుల 1:6-8
6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడుప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన 7 కాల ములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. 8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును

శిష్యులు ఈ భూమి మీద రాజకీయముగా యేసుకు ప్రశ్నలు వేసేటప్పుడు వారు పరిశుద్ధాత్మను ఇంకనూ పొందలేదు. వారు ఇంకా ఆ సమయములో యూదుల దేశభక్తిని బట్టి మరియు యెరూషలేములో వారి స్థానమును బట్టి ఆలోచించుచుండిరి. రాజు అయిన క్రీస్తు ఎవరైతే మృతిని జయించి లేచాడో తన మహిమ ద్వారా యెరూషలేములో ఉన్న అందరినీ యేలునని వారు ఊహించుకొనిరి. క్రీస్తు ఈ ప్రశ్నలను తిరస్కరించలేదని వారు ఆశ్చర్యపోయిరి, అయితే దేవుని రాజ్యము ఎప్పటికైనా వచ్చునని నమ్మిరి. అయితే పరలోక రాజ్యము మనుషుల ఆలోచనలప్రకారము కాక మరియు ఈ లోక సంబంధమైనదిగా కాక ఉండునని వారికి క్లుప్తముగా చెప్పెను.

దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాలిక ఉంటుంది. నిత్య భూత కాలములో ప్రజల యొక్క చరిత్రను చూసి, ప్రతి దేశమునకు మరియు ప్రతి గోత్రమునకు కూడా పశ్చాత్తాప పడుటకు మరియు జీవముకలిగిన విశ్వాసముతో ఉండుటకు సమయమును యిచ్చియున్నాడు. ఈ చరిత్రను భయంకరమైన విధిగా ఉండలేదు, ఎందుకంటె మన తండ్రి తంగిన సమయమందు నిర్వచించినాడు. అతని ప్రేమ ఈ లోకమునకు మంచి కార్యములను తీసుకొనివచ్చునని మనకు తెలుసు. ఎందుకంటె అతని ప్రేమ సమయమును కలిగి ఉండును, కనుక మనము భయపడవలసిన అవసరము లేదు. మన తండ్రి నిజమైన అధికారము కలిగిన పాలకుడు. అన్ని చర్యలు ఒక విప్లవం లాగ ఆయుధాలతో తన ప్రణాళికలను మార్పుతో అమలు చేయును, ఎందుకంటె అతని రాజ్యము ఆత్మీయముగా మాత్రమే రాక, ఎలాంటి తప్పు లేకుండా, మహిమకరముగా, మరియు ఘనత కారముగా ఉండును. దేవుని యొక్క అధికారము ప్రేమ మీద, మరియు సత్యము మీద కట్టబడినది, అయితే ఉదాసీనతద్వారా మరియు అన్యాయము ద్వారా కాదు. ఎవరైతే దేవుడిని తన తండ్రి అని తెలుసుకొన్నాడో వారు భవిష్యత్తులో ఆనందముతో ఉండెదరు.

క్రీస్తు తన శిష్యుల మనసులో ఉన్న అన్ని రాజకీయ ఆలోచనలన్నిటినీ తీసివేసెను, మరియు తనను వెంబడించువారికి తండ్రి యొక్క వాగ్దానములను కనబడునట్లు సిద్ధపరచెను. " శక్తిని పొందుకొనుట" అను నెరవేర్చబడునట్లు చేసెను. కనుక ప్రియా సహోదరుడా నీవు కూడా అందరి వాలే మరణమైపోతావని తెలుసుకొన్నావా? దేవుని మహిమకు మరియు అతని పరిశుద్ధతకు మరియు ఆయన జ్ఞానమునకు నీవు పోల్చుకొంటే నీవు బుద్ధిలేనివాడవు, అందవికారము కలవాడవు, చెడ్డవాడవు, మరియు నైతికము కలవాడవు. అతని శక్తి సహజమైన మనిషి మీద దిగిరాలేదు. నిన్ను నీవు నీ శక్తి చేత సంస్కరణము చేయజాలవు, ఎందుకంటె నీవు బలహీనుడవు కనుక, మరియు పాపమునకు బానిసవు కనుక. క్రీస్తు తన రాజ్య స్థాపనలో తన మొదటి కార్యము యేదనగా అతనిని వెంబడించు వారికి తన శక్తిచేత నింపుట. గ్రీకు భాషలో శక్తి అను మాటను "డైనమైట్" అని అర్థము. దేవుని శక్తి మన రాతి హృదయమును మర్చి, తన కనికరముగల హృదయముచేత నింపును, మరియు రాతి కలిగిన మన హృదయములను ఇచ్చును కనుక అప్పుడు మనము దేవుని ఆలోచనలు కలిగి ఉండగలము. క్రీస్తు యందు విశ్వాసము కలిగిన వారికి దేవుడు ఇచ్చు బహుమానము ఈ లోకమునకు శక్తిని ఇవ్వడమే. ఈ శక్తి యేసులో స్పష్టముగా కనబడుచున్నది.

నీవు దేవుని శక్తిని పొందుకొన్నావా లేక ఇంకనూ నీ పాపములో మరణము కలిగి ఉన్నావా? నీవు తండ్రి ప్రేమలో ఉన్నావా? నిన్ను రక్షించిన ఆయన యందు అన్ని చేయగలవా? ఎందుకంటె నీ బలహీనతతో అతని బలము నిజమై ఉన్నది. తీక్ష్ణమైన మనిషి ప్రార్థన నీతిమంతునికి ఉపయోగకరంగా ఉండునని?

దేవుని శక్తి ఒక రహస్యముగా లేదు. ఇది నిత్యమూ నుంచి నిత్యములోనికి ఉన్న పరిశుద్ధ శక్తి, త్రిత్వములో ఉన్న ఒకే దేవుడు మాత్రమే ఆరాధనకు మరియు సమర్పణకు యోగ్యుడు. కనుక మనము ఈ మహిమ కలిగిన ఆత్మను ఆనందముతో మరియు సంతోషముతో ఆరాధించెదము, మరియు తండ్రి అయినా కుమారుడైన వారిని వెలుగుతో మహిమపరచెదము. అతను నిజముగా బీదలైన మనలో ఉన్నాడు, క్రీస్తులో మన రక్షణను బలపరచి మన అంతరంగమును దేవుని సత్యమునకు తెరచి ఉన్నాడు. అతను మన పరలోకమందున్న తండ్రి. కనుక ఏ సహజమనిషి కూడా ఈ విధముగా చేయలేదు. ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో వారికి ఈ లోకము వెలుపల నుండి వచ్చినది, అతని జీవము నుంచి ప్రేమ నుంచి మరియు సమాధానము నుంచి వచ్చినది.

ఆత్మ చేత నడిపించబడిన వారు తప్ప ఎవ్వరు కూడా క్రీస్తును "ప్రభువు" అని పిలువలేరు. ఎందుకంటె అతను మాత్రమే మనలో విశ్వాసమును స్థాపించాడు కనుక. కుమారుని యొక్క ఆత్మ మనము పరలోక భాషను మాటలాడుటకు నోటిని తెరచును. అతను మనలను " పరలోకమందున్న మాతండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందు నీ చిత్తము జరుగునట్లు ఈ భూమి మీద కూడా జరుగును గాక " అని చెప్పువాడు. ఈ మంచి ఆత్మ కొరకు నీ హృదయమును తెరచినవా? అతను నిన్ను నింపుటకు నిర్ణయించి అతని సన్నిధి నీకు ఉంచాడని నీకు తెలుసా?

క్రీస్తు యొక్క గొప్పతనమును శిష్యులు కనుగొనునట్లు పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించెను. అతని సత్యమును తెలుసుకొనునట్లు వారిని విశ్వాసముతో స్థిరపరచెను, మరియు అతని చిత్తమును చేయునట్లు తన శక్తిచేత నింపెను. పరిశుద్ధాత్ముడు మనలను అతని కొరకు సాక్ష్యముగా ఉండునట్లు చేసెను. మన వ్యక్ట్గ్తిగత పునరుద్ధరణ తీసుకొనిరావడము అవసరమై ఉన్నది, లేదా మన రెండవ జన్మము ద్వారా ఘనపరచబడడము. మనము మన రక్షకుడిని పునరుద్ధరించి,అతని ఎదుట మన అవినీతిని బట్టి ఒప్పుకోవాలి, మరియు మన పాపములు క్షమించబడునట్లు అతనిని గురించి సాక్ష్యము చెప్పాలి, మరియు ఎవరైతే దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మచేత జన్మించబడినాడని చూపించాలి. మనలను తన రక్తము ద్వారా పరిశుద్ధపరచి అతని ఆత్మ చేత బలపరచాడు. ప్రభువైన యేసు అతని ఆత్మీయ సువార్త ద్వారా మార్చగలదని విశాసించి ఇతరులకు బోధించాలి. అతని వాక్యముద్వారా చెడ్డ వారి నుంచి చేదు ఆత్మను తొలగించును, మరియు అతని రాజ్యమును విరిగిన హృదయములలో కట్టును. "షాహిద్" అనే అరబిక్ పదమునకు అర్థము "సాక్ష్యము" మరియు "అమరుడు" అని. ఈ లోక ఆత్మ మన మీద లేచినట్లైతే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు, ఎందుకంటె అది నీ ప్రభువును సిలువవేయుటకు లేచిఉన్నది కనుక.

యెరూషలేములో దేవుని ఆత్మ పైకి లేచుటకు మొదలుపెట్టేను. అది ఒక అగ్గి వాలే, యూదయ, సమారియా, మరియు అంతియోక్ అను ఆసియా ఖండము వరకూ వెళ్లెను. అదే సమయములో ఉత్తర ఆఫ్రికా, ఇథియోపియా మరియు ఇరాక్ ద్వారా గ్రీస్ లోనికి ప్రవేశించెను, మరియు రోమా రాజధానిని స్వాధీనము చేసుకొనెను. సువార్తీకుడైన లూకా దేవుని ప్రేమను గుర్తుకు చేసుకొని, మరియు దానిని అతని పుస్తకములో వ్రాసిపెట్టెను. కనుక వెలుగైనా సువార్త నీ చేతిలో ఉంచబడినది, ప్రియా విశ్వాసి నీతో మేము చెప్తున్నాము: " దేవుని కుమారుడైన ప్రేమచేత నీ పరిసరాలన్నిటినీ వెలిగించు, ఎందుకంటె నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు". అయితే మొదటగా నిన్ను నీవే పరిశీలించుకో: నీవు దేవుని శక్తిని పొందుకొన్నావా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? లేనియెడల, తండ్రి వాగ్ధానముకొరకు ప్రార్థనాపూర్వకముగా అది నీకు దయచేయునట్లు సహనము కలిగి ఉండు. నీవు ఈ సువార్తను చదువుతుండగా నీకు తండ్రి నీ ముందర తెరువబడునట్లు ఆయన వాగ్దానమును కనుగొందువు.

ప్రార్థన: తండ్రి మేము నీకు ఆరాధన ప్రేమతో చేసెదము, ఎందుకంటె నీ కుమారుని మరణముతో మమ్ములను నీ పిల్లలుగా చేసి ఉన్నావు. నీ పరిశుద్దాత్మ చేత నీ మహిమ కనబడినది. నీవు మా తండ్రివి కనుక మమ్ములను నీ ప్రేమలో ఉంచుకో. కృతజ్ఞతతో మమ్ములను మేము నీకు సమర్పించుకొనుచున్నాము, కనుక మాకు నీ పరిశుద్దటంచేత నింపుమని నిన్ను అడుగుతున్నాము, అప్పుడు క్రీస్తు అను నామములో మా పరిసరాలన్నీ వెలిగించబడును.

ప్రశ్న:

  1. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన రూపకల్పన ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:39 PM | powered by PmWiki (pmwiki-2.3.3)