Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Romans - 029 (The Faith of Abraham is our Example)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
భాగము 1 - దేవుని నీతి ప్రతి పాపిని ఖండించి క్రీస్తులో ప్రతి విశ్వాసిని పరిశుద్ధపరచి వారిని నిర్దోషముగా చేయుట (రోమీయులకు 1:18 - 8:39)
B - విశ్వాసము ద్వారా దేవుని నీతి నూతనముగా అందరికీ చేయబడుట (రోమీయులకు 3:21 - 4:22)
3. అబ్రాహాము మరియు దావీదు విశ్వాసము ద్వారా విమోచనము అను దానికి ఒక ఉదాహరణ (రోమీయులకు 4:1-24)

d) ధైర్యము గల అబ్రాహాము యొక్క విశ్వాసము మనకు ఒక ఉదాహరణ (రోమీయులకు 4:19-25)


రోమీయులకు 4:19-22
19 మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భéమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, 20 అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. 22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 

అబ్రాహాము భవిష్యత్తులో అనేకమందికి తండ్రిగా ఉంటాడని విన్నాడు. ఈ ప్రక్కన అబ్రాహామునకు ఆశర్యముగా ఉంటుంది, ఎందుకంటె అప్పటికి అతనికి కుమారుడు లేదు అయితే విశ్వాసము చేత అతను ఈ మాటను అంగీకరించెను. మనుషులందరూ తమ నిరీక్షణకు పోగొట్టుకున్నప్పుడు దేవుండు తన నిరీక్షణకు ఇస్తాడని నమ్మెను. ఎందుకంటె ఇగుప్త స్త్రీ ద్వారా కలిగిన కుమారుడైన ఇస్మాయేలు ద్వారా తన విశ్వాసమునందు ఓడిపోయెను. అయితే ఇప్పుడు తాను ముసలి వయసులో ఉన్నప్పటికీ మరియు అతని భార్య కూడా ముసలితనంలో ఉన్నప్పటికీ ఈ లోక సహజత్వమును నమ్మక కేవలము దేవుని వాగ్దానమందు నమ్మకము కలిగి ఉండెను. ఎందుకంటె సారా ద్వారా తనకు కుమారుడు కలగదు అను ఆలోచనచేత అబ్రాహాము తనకు తాను మోసపరచుకొనలేదు. దానికి బదులుగా అతను తన విశ్వాసమును ఉత్సాహపరచుకొని దేవుని వాక్యమందు నమ్మకము కలిగి ఉంది, ఆ నిత్యా సత్యమును బట్టి ఆధారము కలిగి ఉండి దేవుడు అబద్ధికుడు కాదని ఎండి అతని వాగ్దానమందు విశ్వాసము కలిగి ఉండెను.

ఇది అబ్రాహాము యొక్క విశ్వాసముతో శ్రమ పొందెననుటకు ఒక సూచనగా ఉండెను (ఆదికాండము 15:1-6; 17:1-8).

నీవు అబ్రాహాము యొక్క విశ్వాసమును పంచుకోవాలని నిన్ను ఈ దినము పిలుచుచున్నాడు. మనము ఈ దిన సంఘములను మరియు సమాజములను చూసినట్లయితే ఆత్మీయముగా మనము అలసిపోయి మరణమే ఉన్నాము. అయితే క్రీస్తు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాసము చొప్పును నిత్యజీవమును యిచ్చియున్నాడు. మన సాక్ష్యములు ఆకాశమందు నక్షత్రములవలె వెలిగించబడాలని మనలను ఆశీర్వదించాడు. నీవు నీ విశ్వాసము చేత దేవుని వాక్యము ద్వారా అతని కుమారునిగా పిలువబడుచున్నావని నీవు విశ్వసిస్తున్నావా? దేవుడు నీ అసమర్థతను బట్టి జయించాడని, మరియు నీ కాస్త సమయములో ఉన్న హృదయముద్వారా నిన్ను తన ఆత్మీయ కుమారునిగా చేసి, దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లు అరణ్యములో ఉన్న రాళ్ళ ద్వారా దేవుడు పిల్లలను చేయును అని విశ్వసిస్తున్నావా? నీవు నిజముగా దేవుడిని గౌరవిస్తున్నావా? నీవు ప్రభువు మహిమాపైన ఆధారపడి ఉన్నావా, మరియు అతని మీద నమ్మకము కలిగి ఉన్నావా? అతను తన శక్తి కలిగిన జీవితమును నీవు తీసుకొని వెళ్ళుటకు సమర్థుడు. కనుక అబ్రాహాము దేవుడు, పౌలు దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకేవిధముగా ఉన్నాడు. అతను నీ విశ్వాసమును చూస్తున్నాడు, ఎందుకంటె అదే ఈ లోకమును జయించింది కాబట్టి. కనుక నిద్రించవద్దు! నిరీక్షణకు వదులుకోవద్దు, ఎందుకంటె అబ్రాహాము తన జీవితములో ఎన్నో కష్టాలో పడినప్పటికీ తన విశ్వాసమును కోల్పోలేదు కనుకనే కేవలము ఒక కుమారుడైన ఇస్సాకు ద్వారా ఈ లోకములో ఆశీర్వాదమును వచ్చుటకు పాత్రుడైనాడు. దేవుడు అబ్రాహాము యొక్క కష్టములను బట్టి అతని ఆత్మను బలపరచెను. కనుకనే అతనిని ప్రవక్తలకు తండ్రినిగా చేసెను. నీ దేవుడు జీవము కలిగిన వాడు కనుక నీ విశ్వాసము ద్వారా నీకు విమోచన కలుగ చేయాలనీ అనుకొన్నాడు. కనుక నీ హృదయమును పైకి లేపు, నీ చేతులను బలపరచుకో, మరియు నీ మోకాళ్ళను కూడా లేపు ఎందుకంటె నీ ఆత్మీయ యుద్దముకంటె అతనే ముందు ఉన్నాడు.

రోమీయులకు 4:23-25
23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని 24 మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయ బడెను. 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

మన యొక్క విశ్వాస జ్ఞానము ఒక సంపూర్ణ నమ్మకము ఇచ్చి ఉన్నది, అది అబ్రాహామునకు కలిగిన ప్రకటనద్వారా. దేవుడు మనకు ఒక సర్వశక్తునిగా మాత్రమే కనపరచుకోలేదు, అయితే గొప్పవాడిలా కనపడి తన కుమారుడైన యేసును మన కొరకు పంపి తండ్రి అయినా దేవుని ప్రేమను మనము తెలుసుకొనేలాగున సహాయము చేసినాడు. ఒక ఆశాధ్యమైనది సంఘటన ఏమిటంటే పరిశుద్దుడైన దేవుని కుమారుడు మన పాపముల కొరకు చనిపోయి మన పాపములను తుడుచుట. పరిశుద్దుడైన దేవుడు పాపుల దోషములను బట్టి నాశనము చేయలేదు, అయితే మనలను కాపాడుటకు తనను తాను నాశనపరచుకొనెను. కనుక ఈ విధమైన ప్రేమం కలిగిన, దయకలిగిన, త్యాగము కలిగిన ఓర్పు కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు.

ఎప్పుడైతే యేసు మృతి నుంచి లేచెనో అప్పుడు అతని త్యాగము మనకు కనపడెను. ఎప్పుడైతే అతను సిలువలో ఒక గొర్రెపిల్ల మాదిరి త్యాగము చేసినప్పుడు తన తండ్రి అతనిని చేయి విడువలేదు, అయితే అతను తన కుమారుడిని లేపి, తన చిత్తము సంపూర్ణముగా యేసు మరణించాలని తెలియపరచెను. అయినప్పటికీ క్రీస్తు పునరుత్తనము మన విమోచనను చూపెను. ఎందుకంటె సమాధి చేయబడక పరలోకమునకు వెళ్ళుట అనునది సాధ్యం కాదు కాబట్టి, కనుక దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండెను. కాదు! దేవుడు తన కుమారుడిని మరణమునుంచి లేపినది ఎందుకంటె ఈ లోకము దేవునితో సమాధానము కలిగి ఉండి మరియు తన సిలువ మరణముతో ఈ లోక కార్యమును దేవుడు సంపూర్ణముగా చేయుట.

ఈ రోజు మన రాయబారి దేవుని కుడి పార్శ్యమున కూర్చొని ఉన్నాడు. అతను మనకు మరియు పరిశుద్ధునికి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉన్నాడు, అతని త్యాగమైన ఫలములను తీసుకొని వెళ్తున్నాడు,అప్పుడు మనము విశ్రాంతి లేకుండా ఉండకుండా మన విశ్వాసముతో స్థిరముగా ఉండి ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారిని తన కుమారుడైన యేసు ద్వారా దగ్గరకు తీసుకోనున్నాయి చెప్పెను, ఎందుకంటె అతను మనకు నిత్యుడైన మధ్యవర్తిగా ఉన్నాడు కనుక.

కనుక కష్టాలలో, శ్రమలలో మరియు భయాలతో నీ విశ్వాసము ఎక్కడ? దేవుని రాజ్యము వచ్చుటకు గల నీ విశ్వాసము ఈ దినము ఏవిధముగా ఉన్నది, ఎందుకంటె రెండవ జన్మము ఎక్కడ? క్రీస్తు మనకు మరియు దేవునికి సమాధానపరచి ఉన్నాడు, మరియి ఈ దినము తన మధ్యవర్తిత్వము ద్వారా తన విమోచనమును మనలో నివసిస్తున్నాడు. జీవ జలము నీ లోతైన విశ్వాసముతో నుంచి మరియు నీ హృదయములోనుంచి వచ్చునని విశ్వసించు. విశ్వసించు కానీ అనుమానించకు ఎందుకంటె క్రీస్తు ఎన్నడూ జీవముకలిగిన వాడు కనుక.

ప్రార్థన: ఓ ప్రభువా నీవు జీవము కలిగిన దేవుడవు కనుక మమ్ములను ఈ లోకములోనికి నీ దుర్వార్తను ప్రచురించుటకు పంపుచున్నావు. నీ సేవకుడైన అబ్రాహాము మరియు అతని భార్య అయినా సారా అంతటి ముసలి తనములో నీవు వారికి కుమారుడిని ఇచ్చి అతని ద్వారా తన సంతతినంతటినీ ఆశీర్వదించెదవని అతను విశ్వసించి ఉన్నాడు. మా ప్రతి బలహీనతతో మేము బలము పొందుకొనునట్లు మమ్ములను నీ శక్తి ద్వారా నింపి మా ప్రతి శ్రమ దినమునుంచి మేము విడిపించబడులాగున నీ నడిపింపును మాకు దయచేయుము. ఈ దినములలో కూడా అనేకులు నీ జీవము గల మార్గములలో నడుచుటకు జన్మించబడెదరని నీ యెడల మాకు నమ్మకమును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్నలు:

  1. అబ్రాహాము యొక్క విశ్వాస శ్రమల నుంచి మనము ఏమి నేర్చుకొనుచున్నాము?

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన
యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
(రోమీయులకు 5:1)

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 10:53 AM | powered by PmWiki (pmwiki-2.3.3)