Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Acts - 025 (Church Members having all Things in Common)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

13. అన్ని విషయాలలో సంఘ సభ్యులు ఉమ్మడిగా ఉండుట (అపొస్తలుల 4:32-37)


అపొస్తలుల 4:32-37
32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 33 ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. 34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమి్మ, అమి్మన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. 35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. 36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమి్మ 37 దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

ప్రారంభ సంఘము అన్ని కార్యములను ఏవిధముగా చేసి ఉన్నదో అని సువార్తీకుడైన లూకా పెంతేకొస్తు దినమందు పేతురు చెప్పిన ప్రసంగమును మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. కృంటి వాడిని స్వస్థపరచిన తరువాత మరియు వారికి అపొస్తలుల సాక్ష్యములను పాలకులకు చెప్పిన తరువాత సంఘము యొక్క నిత్యజీవమును బట్టి వారు చెప్పిరి. అపొస్తలులు మాత్రమే పరిశుద్ధాత్మచేత నింపబడలేదు, అయితే విశ్వాసులందరు కూడా ఐక్యత కలిగి ఈ సమావేశములో కలుసుకొనిరి. ఎప్పుడైతే మనము ఈ విధముగా ఐక్యత కలిగి ఉంటామో అప్పుడు ఎన్నో సమస్యలు తీరిపోతాయి.

ప్రారంభ సంఘము యొక్క రహస్యము చెప్పినది నిజముగా ఇది ప్రేమ కలిగినది అని, మరియు ఇది ఒక సామాన్యమైన అంశము కాదని. ఇది పరిశుద్దాత్మయొక్క ఫలము. క్రీస్తు మీద వారికున్న విశ్వాసము వారిని ఒక్కటిగా చేసి, వారి ప్రార్థనల ద్వారా వారిని ప్రభువుకు దగ్గరగా చేసి యున్నది, మరియు సఙ్గహములో మధ్యలోకి చేర్చియున్నది. ప్రార్థన ద్వారా వారు హృదయమందు మరియు మనసు యందు ఒక్కటై ఉండిరి. ఒకరి అవసరమును ఒకరు తీర్చుకొనుచు మరియు శ్రమలలో ఆనందంలో ఒక్కటై ఉండిరి. అనగా వారి హృదయములు వేరే వారి ఎదలలో ఉన్నట్లు మరియు వారి ఇతరుల ప్రాణము వేరే వారి శరీరములో ఉన్నట్లుగా ఐక్యం కలిగి ఉండిరి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ వారిని వారు ఖండించుకొనిరి. కనుక ఈ విధముగా సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నూతన వొరవడికను అవలంభించుకొనిరి.

క్రైస్తవులలో సహోదరప్రేమ అనునకి గొప్పది రహస్యము. ఇది ఒకవిధమైన ఐశ్వర్యముగా ఉండలేదు, అయితే పరిస్థితులను బట్టి ఇది కార్యము చేయబడెను. ప్రతి ఒక్కరు ఇతరులకు సహాయకరంగా ఉండిరి కనుక ఎవ్వరు కూడా ఇతరుల సహాయము కొరకు ఎదురుచూచుటకు అవసరము లేకపోయెను. ఇచ్చుట అనునది ఒక మంచి కార్యము కనుక వారు ధనమును ప్రేమించువారుగా ఉండలేదు. ఎవ్వరు కూడా వారికొరకు పనిచేయలేదు, అయితే ప్రతి ఒక్కరు కూడా వారికున్న వరములను, ధనమును ఒకరితో ఒకరు పంచుకొనిరి. ప్రభువు వారిని ధనాపేక్ష నుండి మరియు పిసినారితనం నుండి వారిని విడిపించెను. సువార్తీకుడైన లూకా వారిని ధనాపేక్ష ఎంత అపాయమో అని వారికి హెచ్చరించెను. కనుక ప్రతి కార్యము కూడా సహోదర ప్రేమకలిగి జరిగెను.

ప్రతి ఒక్కరు కూడా అతని రాకడను బట్టి ఎదురుచూసి, వారిని వారు పరిశుద్ధపరచుకొనిరి. కనుకనే అపొస్తలులు ఇచ్చుటలో, మరియు శక్తికలిగిన ఆనందముతో అతని రక్షణను బయలుచేసిరి. క్రీస్తులో వారికున్న జీవముగల విశ్వాసము వారి యొక్క శక్తి అయి ఉన్నది, విశ్వాసము ద్వారానే వారు అతనితో మరణమును జయించి లేచారు. దేవుని జీవము వారిలో ఉండెనని వారు చెప్తున్నారు. వారు ఖాళీ అయినా సిద్ధాంతమును ప్రకటించలేదు, అయితే జీవము కలిగిన శక్తిని వారు పొందుకొన్నారు.

ప్రభువు వారి సాక్ష్యములను ఒప్పుకొని, అతని నామమును తెలుసుకొనినవారికి తన కృపను బయలుచేసెను. అతని శక్తి వారికి ఒక వరంగా ఉండెను. మరియు ఎవరైతే హృదయమందు అతని కొరకు తెరచి ఉన్నారో వారిలో అతని త్యాగము కలిగిన ఆత్మ ఉండెను. "గొప్ప" అను మాటను లూకా రెండు సార్లు జ్ఞాపకము చేసెను, మరియు ఈ శక్తి కలిగిన కృప విశ్వాసులలో గొప్పగా ఉన్నది. ఈ మాటను మనము సువార్తలలో అప్పుడప్పుడు చదువము, అయితే ఎక్కడైతే ప్రభువు సంపూర్ణత మరియు వారములు ఉన్నవో అక్కడ మనము చూడగలము. అయితే మనము అపొస్తలుల సాక్ష్యమును మరియు సంఘములో వారికున్న ఐక్యత మరియు సాత్వికమును మనము గమనించవచ్చు.

ఈ విధముగా మనము ఆలోచనచేసినట్లైతే ఇక్కడ ఎవ్వరు కూడా ఏవిధమైన అవసరతలో మరియు బీదవారిగా ఉండలేదు. వారందరు కూడా ఆనందము కలిగి ప్రార్థన యందు మరియు దేవుని శక్తి యందు కలిసి అనుభవము పొందినవారైరి. సంఘములో శ్రమలను వారు ప్రార్థన ద్వారా జయించిరి. మరియు పరలోక సన్నిధి పరిశుద్దాత్ముని ద్వారా ఈ భూమి మీద ఉండెను. అపొస్తలులు వేలమంది అవసరతలను బట్టి స్వచ్ఛంద సంస్థను కనుగొనలేదు, అయితే వారి ప్రేమను సంఘ సభ్యులతో పంచుకొనిరి. వారందరు కూడా ఒకే కుటుంబమునకు చెందినవారని అనుకొనిరి కనుక వారు శ్రమలకు అవకాశము ఇవ్వకపోయిరి.

క్రీస్తులో ఉన్న ఈ విశ్వాసులకు వారి గృహము పరలోకము అని తెలుసు. వారికున్న వాటిని వారు పిలువలేదు, ఎందుకంటె వాటినన్నిటినీ వారు దేవుని కొరకు వదిలివేసిరి. సృష్టికర్త అయినా దేవుడు, వారి ప్రతి అవసమును కూడా తీర్చువాడని వారికీ తెలుసు.కనుక సంఘములో ధనము అధికారము చేయలేదు అయితే పరిశుద్ధాత్ముడు మాత్రమే కార్యము చేసెను. కనుక ఈ విధమైన స్థితి నుంచి యూదులు సాతాను నుంచి గొప్పగా విమోచించబడిరి: "ఎవ్వరు కూడా ఇద్దరినీ సేవించలేరు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించెదరు" కనుక నీవు దేవుడిని మరియు సాతానును ఒకేసారి సేవించలేవు ". (మత్తయి 6:24)

సంఘమునకు వచ్చిన డబ్బును సంఘము వ్యర్థము చేయలేదు. ఒక ఆస్తి ద్వారా వచ్చిన డబ్బును అపొస్తలులు పారవేసారు. వారు క్రీస్తు కొరకు సమస్తమును విడిచి అతనిని బీదరికం ద్వారానే వెంబడించిరి. సంఘములో ఉన్న సభ్యులు ఎవ్వరు కూడా ఈ డబ్బును వారి వైకథగాథ అవసరములకు వాడుకొనలేదు. అయితే పరిశుద్ధాత్ముడు అవినీతి జరుగునట్లు నడిపించలేదు. అతను వారిని మహిమలోనికి నడిపించెను.

ఆ సమయములో సంఘ సభ్యులు గొప్పగా ఎదిగిరి. కనుక అపొస్తలులు వారందరికంటే ఎత్తైన స్థలములో కూర్చోవలసి వచ్చెను, ఎందుకంటే వారందరికి కనపడాలి కనుక. బోధనల ద్వారా, ప్రసంఘముల ద్వారా వచ్చిన సొమ్మును అపొస్తలుల పాదముల దగ్గర పెట్టిరి. దేవుని బహుమానమును వారు కృతజ్ఞతకలిగి అందరికీ ఇచ్చిరి. ప్రియమైన విశ్వాసి నీవు ఏవిధముగా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నావు?

అపొస్తలులు డబ్బును సంఘము యొక్క భవిష్యత్తును బట్టి నిండుగా ఉంచుకొనలేదు. వారు వచ్చిన సొమ్మును ఒక విరాళముగా ఇచ్చిరి. పేతురు చెప్పినట్లు డబ్బు అధికముగా వచ్చినట్లే అదేవిధముగా విరాళము కూడా జరిగెను: " వెండి బంగారాలు మాతో లేవు ". ఈ విధముగా వారు అవసరంలో ఉన్నవారికి ఎప్పుడు ఇచ్చువారు, వచ్చిన డబ్బును వారు అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు, కనుక దేవుడు వారి చేతులలో డబ్బును ఉంచడము లేదని అనుకొనిరి.

లూకా మనకు చానా సందర్భాలలో అపొస్తలుల కార్యములలో వ్రాసిన బర్నబాస్ గురించి వ్రాసినాడు, (9:27; 11:22-30; 13:1-2; 14:12-28; 15:2). అతను "ఓదార్చు కుమారుడు ", దానికి నిజమైన అర్థము "ఉత్సాహపరచు కుమారుడు" అని. అతను ఆదరణ కర్త అయినా పరిశుద్దాత్మునిచేత సంపూర్ణముగా నిండియున్నాడు. కనుకనే అతను ప్రభువును సేవించుమని మనుషులను ఉత్సాహపరచెను. ఈ మనిషి ఐలాండ్ లో ఉన్న లేవీయులకు సంబంధించినవాడు. అతను మరియు అతని తండ్రి యెరూషలేములో ఖానాను ప్రదేశమును తీసుకొన్నారు, కనుకనే వారు క్రీస్తు రాకడను బట్టి ఎదురుచూసిరి. వారు అతనిని అందరికంటే మొదటనే కలవాలని ఆశపడిరి. బర్నాబాస్ కు క్రెస్స్తు గురించి తెలుసు మరియు అతను పరిశుద్ధాత్మచేత నింపబడి ఉండెను. అతను యూదుల ఆచారములు ఆచరించలేదు కనుక అతను ఆ స్థలమును అమ్మివేసెను. కనుక ఈ విధముగా అతను చేసినతరువాత క్రీస్తు రాకడను బట్టి అతను ఎదురుచూసేను. అయితే ఈ భూమి మీద అతను ఏవిధమైన ఆస్తిని కూడబెట్టలేదు. అయితే ఆయన అమ్మిన సొమ్మును అపొస్తలుల పాదములచెంతకు ఎంతో మౌనముగా మరియు తగ్గింపు కలిగి తెచ్చెను.

ప్రార్థన: ఓ ప్రభువా నీ ప్రేమ పరలోకముకంటె వెడల్పయినది, మరియు నీ సత్యము మా హృదయములను మార్చును. నా ధనమును అంగీకరించి, నీ రాకడవచ్చువరకు నా విశ్వాసమును బలపరుచు, అప్పుడు సంఘములో ఉన్న వారి అక్కరలను నేను తీర్చునట్లు నాకు సహయాము చేయుము.

ప్రశ్న:

  1. నీ జీవితములో నీవు నేర్చుకొనుటకు ఏ ప్రారంభ సంఘము యొక్క లక్షణాలను నీవు వెంబడిస్తావు?

www.Waters-of-Life.net

Page last modified on April 11, 2020, at 08:49 AM | powered by PmWiki (pmwiki-2.3.3)