Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Tracts -- Tract 10 (Do not be afraid, for I have redeemed you, I have called you by name; you are Mine!)
This page in: -- Armenian -- Baoule? -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula? -- English -- French? -- German -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Lingala? -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai? -- Turkish? -- Twi? -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 10 -- నేను నిన్ను విమోచించియూన్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు! (యెషయా 43:1)


ప్రస్తుత దినాలలో ప్రమాదాలను బట్టి , సమస్యలను బట్టి చాలమంది ప్రజలు భయము కలిగి ఉంటారు. ఒక వేళా వారి పక్కన అనుకోని అపాయము కలిగినట్లైతే వారు చాలా భయపడతారు. యుద్ధాలను బట్టి రక్తపు గొడవలను బట్టి కూడా చాలా బెదురూ కలిగి ఉంటారు. కొంతమంది చాలా వణుకుతూ ఉంటారు, అయితే దేవుడు సెలవిస్తున్నారు, భయపడకుము అని, ఎందుకంటె అతను సజీవుడు కాబట్టి, అదేవిధముగా నిన్ను ఇబ్బంది పెట్టు ప్రతి సమస్యనుంచి కాపాడుటకు అయన సమర్థుడు. అయన నీ వేదన కంటే జ్ఞానము కలవాడు.


భయపడకుము!

దేవుడు నిన్ను అపవిత్రాత్మలనుంచి, దెయ్యములనుంచి భయపడకుము అని సెలవిచ్చుచున్నాడు. చెడు దృష్టి నుంచి నువ్వు విడిపించబడాలని అయన కోరుకుంటున్నాడు. చాలామంది తమ తమ ఇంటి గుమ్మములకు ఒక లాడాము కట్టి దాని ద్వారా తమకు వచ్చు అపవిత్రాత్మల నుంచి అవి కాపాడుతాయి అని నమ్ముతారు. అయితే దేవుడు వాటన్నిటికంటే శక్తి కలిగిన వాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, కనుక నిన్ను రక్షించుటకు అన్ని ఆత్మలకంటే ఘనమైన వాడు.

దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ భవిష్యత్తు పరమైన భయమునుంచి నిన్ను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. యుద్ధములనుంచి ,న్యూ క్లియర్ పరికరములనుంచి భయపడకు, అదేవిధముగా హానికలిగించు చెడు పొగ ద్వారా నిన్ను కాపాడును. భవిష్యత్తులో మనిషి ద్వారా రక్షణ అనేది లోకానికి దొరకదు. దేవుని కంటే మనకు ఈ లోకములో ఏ విధమైన పరిష్కారము లేదు. కాబట్టి దేవిపై సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండు.

నీ సృష్టి కర్త నిన్ను , పరీక్షలనుంచి , నిరుద్యోగంనుంచి, ధుఖంనుంచి నీవు అధిగమించుమని కోరుచున్నాడు. నీకు సహాయము చేయుటకు ,నిన్ను తన బంధకములో ఉంచుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ బాధ్యతలవిషయములో , నీ పనులవిషయములో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించుట నీవు చూసెదవు. కాబట్టి తనవైపు నీ దృష్టి ఉంచిన యెడల అయన నీ ప్రతి అపాయమునుంచి నిన్ను కాపాడును.

సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నీ ప్రతి విరోధి నుంచి ,నీకు వ్వతిరేకముగా ఉండువారినుంచి ,మోసపరుచు దొంగనుంచి ఆయన నిన్ను కాపాడును. నీవు ఆయనయందు నిలిచిఉన్నట్లైతే నిన్ను కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ప్రవాహము చేత నీవు బంధింపబడి ఉన్నాను సర్వశక్తిగల దేవుడు నిన్ను విడిపించును. కనుక ఆయన నుంచి వేరుగా ఉండకుము ; తన నామములో నిన్ను ఉంచుకొనును.

నిత్యజీవము కలిగిన దేవుడు మృతినిబట్టి, సమాధినిబట్టి, నిత్యమూ మండుచున్న నరకమునుంచి నిన్ను నిషేధించాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, ఆయన సమర్థుడు. వ్యాస్యమాడు వారు చెప్పినట్టు ఆయన చనిపోలేదు,అయితే తనలో జీవముకలిగిన జీవితము ఉన్నది. కనుక ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చినట్లైతే నీకు తన సమాధానము చేత నీ మరణ జీవితములో అయన ఉండును.

దేవుడు నీతిమంతుడు కనుక నీ ప్రతి పాప విషయములో తీర్పు తీర్చు వాడుగా ఉన్నాడు. అయన మాత్రమే నీ ప్రతి చెడు పనులలోనుంచి నిన్ను పవిత్రపరచును. తన తీర్పు దినమునందు నిన్ను నాశనము చేయాలనీ తలంచలేదు. నీ మంచి పనులద్వారా నీవు రక్షించ బడుతావు అని అనుకొనవద్దు. అయితే దేవుడే నిన్ను ప్రేమించి నీకొరకు ద్వారము తెరచి నీకు నిత్యజీవితమును దయచేయుటకు సిద్ధముగా ఉన్నాడు.

సంపూర్ణ నిత్యజీవముకలిగిన ప్రేమించు వాడు నిన్ను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ అపవిత్రమైన హృదయమునుంచి నిన్ను కాపాడును, మరియు నీ ప్రతి గర్వమునుంచి కూడా నిన్ను కాపాడును. అదేవిధముగా నీ ప్రతి శోధననుంచి,నీ నోటి ద్వారా వచ్చు ప్రతి బద్ధము నుంచి నిన్ను కాపాడును. కనుక నీ హృదయమును నీవు దేవునికొరకు తెరచి ఉన్నట్లైతే, పరిశుద్ధత కలిగిన దేవుడు తన పరిశుదాత్మ ద్వారా నిన్ను పవిత్రపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటె ఆయన పరిశుద్ధుడు కనుక.

నీజీవితమంతటిలో నీవు సమాధానము కలిగి ఉండుమని నిన్ను ఆయన ఉత్తేజపరుచుచున్నాడు. భయపడకుము అనే మాటను దాదాపుగా 365 మార్లు బైబిల్ లో వ్రాయడం జరిగింది. ప్రతి మనిషికి , కుటుంబమునకు ఈ మాటలు వర్తించబడును. నీ ప్రతి దినమందు ఈ మాటలను నీజీవిత కాలమంతటిలో వర్తింపచేసినయెడల , నీ ప్రతి భయమునుంచి దేవుడు నిన్ను తన శక్తి ద్వారా నిన్ను స్వాథీనపరుచుకొనును. కనుక నీ జీవితమును , నీ ప్రణాళికలను మరియు నీ భవిష్యత్ అనే చక్రమును నీవు క్రీస్తు కు అప్పగించినట్లయితే, ఆయన నిన్ను కాపాడి , నిన్ను అధికముగా రక్షించును.

నీవెప్పుడైతే ఆయన యందు భయముకలిగిన నీ హృదయమును ఆయన కొరకు తెరిచి అయన యందు ప్రేమ కలిగి అయన యందు సంపూర్ణ నమ్మకము ఉంచినట్లయితే, అప్పుడు ఆయన నీకు మంచి నిరీక్షణ కలిగిన భవిష్యత్తును నీకు దయచేయగలడు.


నిన్ను విమోచించియున్నాను

దేవుడు ఇగుప్త దేశము నుండి యాకోబు జనాంగమును వారి శ్రమలనుంచి , వారి కష్టములనుంచి , వారి బానిసత్వమునుంచి , ఫరో సైన్యుమునుంచి , విడిపించియున్నాడు. ప్రతి కుటుంబమును ప్రతి గొర్రెను , తన రక్తము క్రింద ఉంచుమని దేవుడు ఆజ్ఞాపించియున్నాడు, ఆలా చేసినయెడల దేవుని ఉగ్రతనుంచి వారు తప్పించుకొనినవారై యుందురు. ఒక వేళా దేవుడు చెప్పినట్టు వారు చేయని పక్షంలో వారు దేవుని గతద్వారా , వారి పాపమును బట్టి నశించువారుగా ఉండెదరు. కనుక యాకోబు సంతానము దేవుని మాట యందు నమ్మకముంచి దేవుని మాటకు కట్టుబడి యుండిరి. కాబట్టి దేవుడు పస్కా పండుగ దినమందు వారినందరిని తన రక్తము ద్వారా వారిని విమోచించియున్నాడు.

అబ్రాహాముకుడా తన ఒక్కగానొక్క కొడుకును దేవునికి బలిగా అర్పించడానికి సిద్దమైనప్పుడు, దేవుని విమోచనను అనుభవించాడు. అయితే దేవుడు ఆ విషయములో అబ్రాహాము కుమారుడిని కాపాడియున్నాడు, ఎందుకంటే, దేవుడే తనను తానూ బలిగా అర్పించియున్నాడు కనుక (సుర ఆల్-సాఫ్ఫాట్ 37:107). ఈ విధముగా దేవుడు అబ్రాహాము సంతానమును కాపాడి, వారిని విమోచించియున్నాడు.

"నిన్ను విమోచించియున్నాను", అను వాగ్ధానము ఈ దినాలలో ప్రజల చెంతకు చేరింది. ఈ వాగ్ధానము భూత కాలములో కూడా వ్రాయబడియున్నది, ఎందుకనగా ఈ వాగ్ధానము నెరవేర్చబడియున్నది కనుక. నీ రక్షణ కొరకు సమస్తము చేయబడియున్నది, మరల రక్షణ కొరకు ఏమి చేయడం అవసరంలేదు. కాబట్టి నీకొరకు ఆయన అన్ని చేసియున్నాడు కనుక నన్ను విమోచించడానికి ఆయన కార్యము చేయగలడు అని చెప్పనవసరంలేదు. తీర్పు దినమునుండి ఆయన నిన్ను విమోచించియున్నాడు, మోసపరచు సాతాను నుంచి కూడా ఆయన నిన్ను విమోచించియున్నాడు, అదేవిధముగా నీలో ఉండు నీ పాపములకొరకునుండి కూడా నిన్ను విమోచించియున్నాడు. విమోచన కొరకు నీవు ఉపవాసముండి ప్రార్థించుట, కానుకలు సమర్పిచుట, పరిశుద్ధ యాత్ర చేయుట ద్వారా నీవు పొందలేదు కానీ దేవుడే నీ రక్షణ కొరకు నిన్ను విమోచించియున్నాడు. తన కృపను నీ కొరకు ఉచితముగా దయచేసియున్నాడు. కాబట్టి నీ విమోచనమును బట్టి దేవునియందు నమ్మకము కలిగి , దేవుడిచ్చు ప్రతి సమయమును ఆయన వాఖ్యధ్యానము కొరకు వేచించు. విమోచన అనే ఆయుధము చేత నీ విశ్వాసమును వృద్హి చేసుకో.

"నేను నిన్ను మునుపే విమోచించియున్నాను ," అను ఈ వాగ్దానము నిన్ను ఆశ్చర్యపరచవచ్చు,ముఖ్యముగా బబులోనుకు చెరపట్టబడిన మనుష్యుల రాతి హృదయము కలిగిన వారిని. వారు వారి కుటుంబములనుంచి దాదాపుగా ౮౦౦ కిలోమీటర్ల దూరముగా ఉండు ఆలయమునకు వారు పట్టబడియుండిరి. వారు అనారోగ్యము కలిగి ,భయము కలిగి ఉండిరి కొందరు మాత్రమే వారి పాపములను జ్ఞాపకము చేసికొనిరి. వారికి ఏ విధమైన ఆయుధాలు లేక ,ధనము లేక ఉండిరి. దేవుడు తప్ప వారికి ఎవ్వరు లేకపోయిరి. ఈ విధమైన పరిస్థితులలో దేవుడు " నా మీద నమ్మకముంచుము" అని ,నేనే నిన్ను విమోచించి ,నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు బానిసత్వమునిచ్చు శక్తి నుంచి విమోచించి యున్నాను అని సెలవిచ్చియున్నాడు".

ఏ పరిస్థితిలో నీవున్న , దయ కలిగిన దేవుడు నీ ప్రతి భయమునుంచి , ప్రతి మరణకరమైన అపాయములనుంచి నిన్ను విమోచించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీకు ప్రత్యామ్నాయము కలిగిన మరణము ద్వారా నిన్ను విమోచించియున్నాడు - ఇప్పుడు మరియు సర్వకాలము. మరియా కుమారుడైన దేవుని గొర్రెపిల్ల నీ పాపమునకు ప్రతిగా సిలువ మరణమును పొందియున్నాడు. కనుక నీ సృష్టికర్త , నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించి తీర్పు దినమునుంచి నిన్ను విడిపించి నీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు.


పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను

ప్రేమకలిగిన దేవుడు నిన్ను నిజముగా విమోచించి యున్నాడు అని మరువకు! దేవుని అద్భుతము అనుభవించావా లేదా ? దయాకలిగిన దేవుడు నీ పాపములనుంచి నీకు స్వాతంత్ర్యమునుండి ,సాతాను నుంచి నిన్ను విడిపించాడు. వీటికంటే మరీ ఎక్కువగా నీదేవుడు నీ కొరకు కార్యము చేయగలడు. ఆయన నిన్ను వ్యక్తిగతముగా పిలుచుచున్నాడు. నీవు రక్తము చిందించిన యేసువైపు తిరిగినట్లైతే , ఆయా తన తీర్పు దినమునుండి నిన్ను విడిపించి నిన్ను కనికరమోతో పిలుచుచున్నాడు. దేవునికి నీ పేరు తెలుసు , నీవు ఎవరో తెలుసు , నీకు నీగురించి తెలిసినదానికంటే ఆయనకే నీగురించి బాగా తెలుసు. నీ ప్రతి రహస్యము ఆయనకు తెలుసు, అవి ఆయనకు మరుగై ఉండలేదు. వీటన్నిటికంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.

ఎంత అద్భుతమైన కథ ఇది! నువ్వు సామాన్యమైన మనిషివి అయిఉన్నప్పటికీ దేవుడు నిన్ను పేరుపెట్టి పిలిచియున్నాడు. నీవు అతనికి ముఖ్యుడవు,నీగురించి ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు. తన ఉచిత బహుమానముల చేత నిన్ను నింపి నీ ప్రతి బంధకములనుంచి నిన్ను విడిపిస్తున్నాడు. ఎప్పుడైతే తల్లి లేదా తండ్రి తమ పిల్లలను పిలిచెదరో వారు ప్రమాదంలో ఉన్నాము అని గ్రహించెదరు. కాబట్టి నీ విమోచకుడు , నీ ఆధారణకర్త, నీ సృష్టికర్త పిలుచుచున్నాడు అని గ్రహించు. తన సమాంతరంగా నిన్ను ఉంచాలని నిన్ను జీవముకలిగిన దేవుని బిడ్డగా ఉండాలని నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాడు. కనుక దేవుని పిలుపును మరువకు , ఆయన కృపచేప్పున నీకు కలుగచేసియున్నాడు .

యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు,సమాధి చేయబడిన మూడవ దినమున తన మిత్రుడైన లాజరునొద్దకు వచ్చినప్పుడు. అక్కడున్న ప్రజలను సమాధి మీద ఉంచబడిన రాయిని తీయమని చెప్పినప్పుడు , ఎవ్వరు ముందుకు రాలేదు , ఎందుకంటె అప్పటికే లాజరు చనిపోయి మూడు దినములు గడిచియున్నాయి కాబట్టి . అయితే ఆ రాయీ తీయబడినతరువాత , లాజరూ బయటికి రమ్ము అని యేసు బిగ్గరగా కేక వేయగానే , బట్టలతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చెను. యేసు యొక్క పిలుపు మృతిని కూడా లేపగలదు.(యోహాను 11:34-44; సుర ఆల్ ఇమ్రాన్ 3:49). యేసు యొక్క పిలుపులో సమస్త అధికారము శక్తి ఉన్నది .

క్రీస్తు దేవునితో కలిసి ఉండి,తన స్వరమును వినువారికి ఆయన పిలుచుచున్నాడు. ఈ దినము పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాడు . కనుక నీ గర్వమును అణచి తన పునరుత్తనము ద్వారా నీ పాపమును క్షమించి , నిన్ను జీవింప చేసి ,నీకు తన రక్షణ చేత కాపాడును. కనుక ఈ దినమందే ఆయన పిలుపును స్వీకరించుటకు సిద్దపడు.

"ఎక్కలేసియా” అను గ్రీకు పదమునకు , తెలుగులో సంఘము అని అర్థం , అనగా ప్రతి పట్టణము తమ యొక్క బాధ్యతలను సక్రమంగా చేయాలని. అనగా పట్టణములో ఉండు ప్రతి ఒక్కరూ , యుద్ధమును గూర్చి, సమాధానము గూర్చి, టాక్స్ గూర్చి అలాగే తమ ధర్మశాస్త్రమును బట్టి బాధ్యత కలిగి ఉండుట. క్రీస్తు ఈ భాధ్యతను అక్కడున్న వారికి సంఘమునకు గూర్చిన రహస్యమును తెలియచేసెను. అనగా ప్రతి ఆత్మీయసంభంధమైన వారు క్రీస్తు ద్వారా పేరుపెట్టి పిలువబడ్డారు. పాపమునుండి విడిపించబడి ,క్రీస్తు కృపద్వారా మృతిని జయించుమని వారికి చెప్పి వారి యొక్క బాధ్యతలను ఇతరులపట్ల నెరవేర్చుమని చెప్పుట.

నీవు ఇతరుల కొరకు బాధ్యత కలిగిఉండుటకు పిలువబడినవా ?లేక శోధన , పాపముచేత జయించబడినవా ?నీవు క్రీస్తు చేత పేరుపెట్టి పిలువబడ్డావని తెలుసుకో. కనుక నిన్ను నీవే పరిశీలించుకో . నీ జవావు ఏమి ?


నీవు నా సొత్తు

పరిశుద్ధమైన దేవుడు నిన్ను బట్టి "నీవు నా సొత్తు అని, నిన్ను సృష్టించినదే కాక , నిన్ను విమోచించి, నిన్ను పరిశుద్ధ పరిచి, నీ యొక్క ప్రవర్తనంతటినిబట్టి,నీవు నాయందు నమ్మకముంచిన వాడని నిన్ను అంగీకరించియున్నాను". ఈ మాటను బట్టి నీవు ఇతరులకంటే గొప్పవాడని కాదుకానీ నీవు దేవునిచే విమోచించబడ్డావని అర్థము.

"నీవు ఇక నీసొత్తు కాదు కానీ నా అమూల్యమైన సొత్తు ",అని నీ దేవుడు సెలవిస్తున్నాడు. నా కనుదృష్టిలో నీవు చాలా విలువకలవారు, నిన్ను ఒంటరిని చేయక, నిన్ను నా ప్రక్కలో ఉంచుకొండెదనని, దేవుడు అంటున్నాడు. నా ప్రేమలో బంధివి అయి నా రాజ్యములో నీవు పాలివానిగా చేసియున్నాను,కనుక నిన్ను మరువక ఈ ప్రతి విషయములో నీకు తోడైఉండేదని దేవుడు నీకు గ్యారంటీ ఇస్తున్నాడు. నిన్ను నా చేతులలోనుంచి నిన్ను ఎవ్వరు వేరుచెయ్యలేరు. నీవు బ్రతికి ఉన్న మరణమైన నిన్ను మరువక , నిన్ను నీ పేరు పెట్టి నీకు శుభము కలుగునట్లు నిన్ను పిలిచియున్నాను".

ఒక యవ్వనస్తుడు కస్టపడి సంపాదించినా ప్రతి పైసాను దాచుకొని తన సంపాదనలోనుంచి ఒక క్రొత్త కారుని కొని,దానికి కావలసిన ఇంధనం వేయించి ,తాను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి తిరిగి రాత్రి సమయములో మంచిగా ఒక షెడ్డులో ఏ విధముగైతే దానిని భద్రపరుచుకుంటాడో,అదేవిధముగా పరలోకమందు ఉన్న దేవుడు కూడా తన పిలుపునకు లోబడినటువంటి వారిపట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు.

ఎవరైతే దేవుని స్వరము విని,వారి హృదయమును క్రీస్తు కొరకు తెరచి, పరిశుద్దాత్మ శక్తిని పండుకొని ఉంటారో వారు నూతన సృష్టిగా చేయబడతారు. దేవుని ఆత్మా అతనియందు ఉండినప్పుడు దేవుడు అతనిని మంచి జీవితమును దయచేసి , ఆయనకు కృతజ్ఞతా కలిగి ఉండునట్లు వానిని నడిపించును. దేవునిచే పిలువబడినవారి పట్ల దేవుని కార్యాలు మెండుగా జరుగును. కనుక నీవు దేవునికి ఆయన ఆత్మీయ కుమారునిగా సమర్పించుకోగలవా? లేక నిన్ను సృష్టించి, నిన్ను విమోచించిన నీ సృష్టికర్తకు దూరముగా ఉండెదవా?


నీ విమోచన గురించి అర్థమైనదా ?

దేవుని యొక్క ప్రేమను గూర్చి ,ఆయన యొక్క విమోచనము గూర్చి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, మీకు ఈ పత్రికలూ పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము.


దేవుడు మానవులకొరకు విమోచనను సిద్ధముచేసియున్నాడు

దేవుడు తన ప్రేమను ప్రతి మానవునికి దయచేసియున్నాడు , వారు మంచి వార లేక చెడ్డ వార అని చూడక. వారికి తన విమోచనను సంపూర్ణముగా ఇవ్వాలని ఉద్దేశించియున్నాడు. అయితే చాలామందికి ఈ భాగ్యము తెలియక ఉన్నారు. ఒకవేళ మీ స్నేహితులకు ఈ మాటలు నీవు పంచుకోవాలనుకుంటే , ఈ పత్రికలను వారికి ఇచ్చుటకు మీకు తగినన్ని ఇవ్వగలము. నిన్ను విమోచించినటువంటి నీ దేవుడిని సేవించు.

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 12:23 PM | powered by PmWiki (pmwiki-2.3.3)