Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Tracts -- Tract 07 (The LORD comforts you!)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Lingala -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai? -- Turkish -- Twi -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 7 -- దేవుడు ఓదార్చును!


మన జీవిత గమనంలో మన ప్రతి దుఖ్ఖమును, బాధను, కన్నీటిని జ్ఞాపకము చేసుకుంటే , మనకు చాలా భయము మరియు షాక్ కు గురి అవుతాము. అయితే సువార్త పత్రికలూ మరియు కీర్తనలు మనలను ధైర్యపరుస్తున్నాయి . కనికరము కలిగిన దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాటలు "ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను" (యెషయా 66:13) కనికరముగల దేవుడు ఒక తల్లి ప్రేమను ఉదాహరణముగా చేసి తన కనికరం ప్రేమను చూపించాడు. ఎవరైతే దేవుని ప్రేమను తెలిసికోవాలని అనుకున్నాడో , తన తల్లి ప్రేమను తెలిసికొనువాడుగా ఉన్నట్లయితే తప్పక దేవుని ప్రేమను తెలిసికొనును .

ఒక తల్లి తన పిల్లలను తన కడుపులో ఉంచుకొని, ప్రసవించినతరువాత తన పిల్లలు తన జీవితములో భాగమై ఉంటారు . తన పిల్లలను మంచిగా చూసుకొని, వారికొరకు ఎన్నో త్యాగములను చేసి వారితో ఎల్లప్పుడు మాట్లాడును. వారిని ఎప్పుడు ఒంటరిగా చేయక వారిని ప్రేమించి వారికొరకు ప్రార్థించును ఎందుకంటె వారు తనకు దేవుడు దయచేసి పిల్లలు కాబట్టి.

ఎప్పుడైతే తన పిల్లలు పెద్దవాళ్లు అయినప్పుడు వారికొరకు మంచి బట్టలు కొని వారికి మంచి చెప్పులు కొని వారికొరకు మంచి స్కూల్ చేర్పించి వారు స్కూల్ నుంచి రాగానే వారి హోంవర్క్ ని సహాయముచేసి , ఒకవేళ వారు ఏదైనా పొరపాటు చేసియున్నట్లైతే వారికొరకు ప్రార్థన చేసి వారిని మందలించి వారికొరకు మంచి స్నేహితులను వెతుకును, కనుక తల్లి ఒక మంచి ఉదాహరణ.

పిల్లలకు తెలుసు వాళ తల్లి వారిపట్ల జాలికలిగి ఉంటుంది అని అందుకే , వారి ప్రతి తప్పిదమును తల్లికి తప్పక వివరించి తన ద్వారా మంచి సలహాలను తీసుకొంటారు, అయితే ఇక్కడ తల్లి ఏ విషయమందు కూడా అలసినట్లు కనపడదు.


కనికరముగల దేవుని ఓదార్పు

తల్లి యొక్క ఓదార్పు తన కనికరము కలిగిన ప్రేమ , తాను చూపించే త్యాగము మనకు దేవుని ప్రేమకు ఆయన ఓదార్పుకు సాదృశ్యముగా ఉన్నది . "నేను నేనే మిమ్మును ఓదార్చువాడను" (యెషయా 51:12) దేవుడు ఈ మాటలను తన ప్రియులను బట్టి వారి యొక్క పాడైన బ్రతుకులను బట్టి వారికి ఈ విధముగా చెపేను. కావునా నీ జీవితములో కూడా నీవు పాడై పోయి ఉన్నట్లయితే సర్వ శక్తి కలిగిన దేవుడు నిన్ను ఓదార్చుటకు సిద్ధముగా ఉన్నాడు.

దేవుడు మనలను సృష్టించి , జీవితమునిచ్చి , బలపరచి, జ్ఞానమిచ్చి, ప్రాణాత్మ శరీరములనిచ్చి, మనకు స్వతర్యమును ఇచ్చాడు .తనకు మన టాలెంట్ మరియు మన బలహీనత తెలిసి , మనము ఏ విధమైన మార్గములో నడవాలో అని మనకు ఒక మార్గమును సిద్దము చేసియున్నాడు (ఎఫెసీ 2:10). ఆటను నీ తల్లి తండ్రులకంటే ఎక్కువగా నీకొరకు చూస్తున్నాడు .

దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరినిగా చేయక నిన్ను తన హస్తములో ఉంచుకొని నీకు ప్రార్థన నేర్పించును , "మా అనుదిన ఆహారము మాకు దయచేయుము" (మత్త 6:11). దేవుడు నీ నిమిత్తము ద్వారము తెరిచి నీకొరకు మంచి చదువును మంచి జీవిత భాగస్వామిని ఉంచియున్నాడని మరువకుము. మరియు తన దృష్టిని నీమీద నిలిపి నిన్ను సాతాను నుండి రక్షించి నిన్ను తండ్రియైన దేవుని యెడల భయముకలిగి నడుచుకొనునంట్లు నిన్ను నిలబెట్టును .

ఈ చెందిన లోకమునకు దేవుని తీర్పు చాలా అవసరము అయియున్నది.ఏది ఏమైనా దేవుని ఆత్మా మనలను నాశనములోనికి పంపక మనలను కాపాడుటకు మరియా కుమారుడైన యేసు మనకొరకు వచ్చ్చియున్నాడు. కనుక పాపము చేసిన ప్రతి ఒక్కరు తమ పాపములను ఒప్పుకొని క్రీస్తును నమ్మినట్లైతే ఈ లోక పాపమునుండి మనలను కాపాడును.

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16)

ఒక తల్లి తన పిల్లలను ప్రతి దినము ఏ విధముగా శుభ్రపరచునో అదేవిధముగా పరిశుద్దుడైన దేవుడు తన పిల్లలను శుద్ధులునిగా చేయును. దాయకలిగిన దేవుడు నీకు సహాయముచేయుటకు సిద్ధముగా ఉన్నాడు, నీ ప్రతి క్లిష్టమైన పారిశ్తిథి నుంచి కూడా నిన్ను తప్పించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రతి రహస్య పాపమును నీవు ఒప్పుకొనినట్లైతే వాటిని కూడా క్షమించుటకు సిద్ధముగాఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరకువచ్చుటకు సిద్ధముగాఉన్నాడు. కనుక నీ ప్రతి రహస్య పాపమజ్ను ఒప్పుకొని నిన్ను నీవు శుద్ధునిగా చేసుకో , అప్పుడు నిన్ను తన చేతులతో ఎత్తిపట్టుకొనుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు.

దేవుని ప్రణాళిక నీవిషయములో ముందుకు కూడా ఉన్నది. నిన్ను తన కుమారుడు లేదా కుమార్తెగా చేసికొని తనకు స్వాస్థ్యముగా నిన్ను ఉంచుకొని నీకొరకు తన ఆత్మను నింపి నిన్ను తన ఆత్మీయ బిడ్డగా నిన్ను చేసికొనియున్నాడు. దేవుని ప్రేమ మన తలంపుకంటే గొప్పది. తన నిత్యజీవమును నీజీవితమునకు ఇచ్చ్హి నిన్ను తన రాజ్యములో వారసునిగా చేసికొనును. "మీరు నన్ను వెదకిన యెడల. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు" (యిర్మీయా 29:13)


క్రీస్తు ఆదరణ

"దుఖ్ఖ పడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు" (మత్త5:4) కష్టాలు కలిగినటువంటి ఈ లోకమునకు ప్రేమకలిగి క్రీస్తు వచ్చ్చియున్నాడు. చెదిరిపోయిన మనలను చూసి చలించి మనలను కాపాడుటకు వచ్చ్చియున్నాడు. (మత్తయి) యేసు తన శిష్యులను పిలిచినప్పుడు వారు ఆయనను వంబడించి ఆయనను వారికి మాదిరిగా చేసికొనియున్నారు. యోహాను మరియు తన సహోదరుడు పరలోకమునుంచి అగ్ని కురిపించుటకు ప్రయత్నించినప్పుడు క్రీస్తు ఈ విధముగా చెప్పియున్నాడు, "ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను". (లూకా 9:55).

పేతురు ఎప్పుడైతే తన గురువును వ్యతిరేకించాడో అప్పుడు క్రీస్తు గద్దించినప్పుడు బహుగా ఏడ్చెను. అయితే మరియా కుమారుడైన యేసు ఆయనికి ప్రేమించి తన తప్పిదమును క్షమించి తిరిగి తనను సేవించుటకు అవకాశము ఇచ్చ్చేను.

ఎప్పుడైతే క్రీస్తును యూదాఇస్కారియోతు తన ప్రభువును ఒక ముద్దుచేత పట్టించేటప్పుడు క్రీస్తు అతని వైపు చూస్తూ ఈ విధముగా పలికినాడు. "నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా ?" (లూకా 22:48; మత్తయి 26:50)

క్రీస్తు తన తండ్రి అయిన దేవుడు ఎలాగైతే కనికరము కలిగి యున్నాడో ఆటను కూడా కనికరముకలిగి యున్నాడు. (లూకా 6:36) . తన స్వస్తకార్యములచేత ఆయన ప్రజలయెడల ఎంత కనికరము కలిగి ఉన్నదో తెలిసికొనవచ్చ్చు . ఒక తల్లి తన కొడుకు మృతిని తట్టుకోలేక దుక్ఖహించునప్పుడు క్రీస్తు చనిపోయిన తన కొడుకును బ్రతికించి తనకు ఇచ్చ్హాడు.

కుష్ఠరోగముకలిగిన పది మంది తమ రోగమును బాగుచేసుకోవాలని , తమ ప్రాంతమునకు యేసు వచ్చ్చినప్పుడు , బిగ్గరగా కేకలువేస్తూ , మమ్ములను కరుణించి మాకు స్వస్థత దయచేయుమని వేడుకొనినపుడు క్రీస్తు తన శక్తి ద్వారా వారిని స్వస్థత పరిచేను. మరియు దురాత్మా చేత పీడింపబడినవారిని కూడా బాగుచేసియున్నాడు.

యేసు అయిదు వేలమందికి అయిదు రొట్టెల రెండు చేపల ద్వారా వారి ఆకలిని తీర్చి , అక్కడున్న పక్షవాత మనిషిని బాగుచేసి , చిన్నపిల్లలను ఆశీర్వదించి , లాజరు సహోదరిని ఉత్సాహ పరిచేను, "అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు". (యోహాను 11:40)

క్రీస్తు అందరిని ప్రేమించెను కనుక పాపము చేసిన ప్రతి ఒక్కరు తమ పాపమునుండి విముక్తి పొందలేరు కనుక క్రీస్తు వారి పాపములకొరకు తన రక్తమును కార్చి వారికి మంచి జీవితమును దయచేసెను. "నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మెత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మానమతనిని ఎంచితిమి. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు రోలిగెను యెహోవా మనఅందరి దోషమును అతనిమీద మోపెను" (యెషయా 53:4-6)

మరియా కుమారుడైన క్రీస్తు ఈ లోక పాపమును తీసి దేవునికి అనుకూలముగా చేసెను. తన ప్రాణ త్యాగమునుంచి మనలను తన ఆత్మచేత దేవుని పిల్లలుగా మార్చెను.



క్రీస్తును వెంబడించు వారికి ఆయన ఆత్మా వచ్చును

ఎవరైతే తమ హృదయములను క్రీస్తు కొరకు తెరచి తన రక్తము ద్వారా తమ పాపములను కడుగుకొని తన పిల్లలుగా పిలువబడినారో వారికి క్రీస్తు తన ఆత్మా చేత నింపి వారికి తన ఆధారణకర్తను పంపెను. "నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను , అనగా సత్యస్వరూపి అగు ఆత్మను మీకానుగ్రహించును" (యోహాను 14:16-26; 15:26-27; 16:7-14) ఆధారణకర్త అయిన తండ్రి తనను వెంబడించు వారికి క్రీస్తు దయచేయు ఆత్మ (లూకా 11:13)

ఆధారణకర్త మనకు దేవుని చిత్తమును, సత్యమును మరియు మన భవిష్యత్తును కూడా తెలియపరుచును. మన హృదయమును తలుపును తెరిచి మనలను సర్వసత్యములోనికి నడిపించి తన నిత్యజీవములోనికి మనలను నడిపించును. తీర్పుదినమందు మనలను క్రీస్తు ముందర నిలబెట్టుటకు కూడా ఆధారణకర్త మనకు సహాయము చేయును.

సత్యమైన ఆత్మ మనలను అన్ని విధాలుగా సహకరించును: "దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరు దేవుని కుమారులైయుందురు". (రోమా 8:14)

ఈ ఆధారణకర్త అయిన ఆత్మ మన ప్రతి విషయములో మానాలకు సహాయపరచి మన ప్రతి పనిలో తోడుగా ఉందును. మన ప్రతి భయమునుంచి కాపాడి ప్రతి విధమైన మరణమునుండి మనలను కాపాడును. మనము మన పాపములను ఒప్పుకొని వాటిని మనము ద్వేషించినయెడల ఈ ఆత్మ వాటినుంచి మనలను రక్షించును. ఎందుకంటె దేవుని ఆత్మ మనలను శుద్ధులనుగా చేసి దేవుని ముందర దోషులుగా నిలబెట్టును.

నిజమైన ఆధారణకర్త తనకు తానుగా ఘనపరచక మరియా కుమారుడైన యేసును ఘనపరచును. దేవుని ప్రేమను మనకు వెల్లడిపరచెను. దేవుని ఆత్మ మనకు నిత్యజీవమునిచ్చ్హి మనకు ఆయన శక్తి ద్వారా మనలను నింపి మృతిని జయించు శక్తిని మనకు ఇచ్చును.

ఆదరణకర్త ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తున్నారో , అలాగే తీర్పుదినమునుబట్టి జ్ఞానముకలిగి ఆయనయందు ప్రేమకలిగి వారియెడల క్రీస్తు కనికరముకలిగి ఉన్నారు. కృపాకలిగిన దేవుడు తన శక్తిని మనకు నింపి మనలను మార్చి తన నూతన కీర్తనలతో పౌలు ఏ విధముగా దేవునికి ప్రార్థించాడో అదేవిధముగా మనకు నేర్పించును. "కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక" (2 కొరింతి 1:3-4) క్రీస్తు ఆత్మా మన చోటు ఉన్న పరిస్థితులను మార్చదు , అయితే ముందుగా మనలను క్రీస్తుకు అనుకూలముగా చేసి మనకు విమోచన కలిగించును. ఎందుకనగా మన క్రీస్తు ప్రేమకలిగి మనకు తన కృపను అనుదినము దయచేయువాడుగా ఉన్నాడు . ఎవరైతే ఈ మాటలను నమ్ముతారో వారు క్రీస్తు ప్రేమలో నిలిచి యుండెదరు.

నీవు దేవుని ఆదరణను అనుభవించినావా? ఒక వేళా నీవు ఆధారణకర్త అయినటువంటి క్రీస్తును ఇంకా ఎక్కువగా తెలిసికోవాలనుకుంటే నీకొరకు ఈ విధమైన పార్టికలు మరియు నీవు ప్రార్థించునాట్లు నేర్పు పత్రికలూ పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము.

నీ చుట్టూ ఉన్నవారికి నీవు ఆధారణకర్త ఉండు : నీవు ఈ పత్రికద్వారా ఆధారణను పొందియున్నట్లైతే , నీ చుటూ ఉన్నవారికి ఈ పత్రికను వారికి చేరవేయాలనే ఆశ నీకు ఉన్నట్లయితే దయచేసి ఈ క్రింది చిరునామాకు నీవు వ్రాసినట్లైతే మేము నీకొరకు ఈ పత్రికలను పంపుటకు సిద్ధముగా ఉన్నాము

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 21, 2018, at 12:27 PM | powered by PmWiki (pmwiki-2.3.3)